జనం మెచ్చిన రాజు – Part 3

Posted on

రాత్రంతా గురువుగారి పాదసేవలో తరించి పాదాల దగ్గరే నిద్రపోయాను . తెల్లవారుఘామున లేచిచూస్తే నాకంటే ముందుగానే గురువుగారు లేచి జోకొడుతుండటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి .
గురువుగారు వెంటనే చెమ్మను తుడుచుకున్నారు .
వెంటనే లేచి గురువుగారి పాదాలదగ్గరకు చేరాను . పాదాలను స్పృశిస్తూ గురువుగారూ ……. మహేష్ వెళ్లకు అని ఒక్కమాట చెప్పండి ఆగిపోతాను , నాకు రాజ్యంపై – ఆ అందాలరాశిపై ఎటువంటి ………
గురువుగారు : లేదు లేదు లేదు అలా కానే కాదు మహేష్ , అయినా నా ఇష్టమైన శిష్యుడి గురించి ఈ గురువుకు తెలియదా చెప్పు , ఇవి నువ్వు దూరం వెళుతున్నావన్న బాధతో వచ్చిన కన్నీళ్లే అయినా నువ్వు గొప్పస్థాయికి చేరబోతున్నావన్న ఆనందబాస్పాలు కూడా అంటూ ఆనందంతో చెప్పారు , మహేష్ ……. రాజ్యం ఎలాగో నీ పాదాల చెంతకు చేరక తప్పదు అంతటి వీరుడు నా శిష్యుడు కానీ ఆ అందాలరాశి నీకోసమే పుట్టి నీ గురించే కలలు కంటూ ఆశతో జీవిస్తోంది .
గురువుగారూ …… అంటూ సిగ్గుపడ్డాను .
గురువుగారు : అంటే నా శిష్యుడికి ఇష్టమే అన్నమాట చాలా సంతోషం – అంతటి అతిలోకసుందరి …… ఈ వీరాధి వీరుడి సొంతం కావాల్సిందే , దిగ్విజయుడివై విరాజిల్లు మహేష్ …….
మీ ఆశీర్వాదం ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధిస్తాను గురువుగారూ …….
గురువుగారు : ఆనందించి , ప్రయాణపు సమయం ఆసన్నమైనది మళ్లీ వచ్చి పరమశివుడి అనుగ్రహం పొందాలికదా అంటూ నదికి చేరుకున్నాము .

సూర్య వందనం చేసుకుని , నదీ దేవత అమ్మ ఒడిలో ప్రేమను పొందుతూ స్నానమాచరించాను .
అమ్మా …… వెళ్ళొస్తాను , అంతవరకూ గురువుగారిని జాగ్రత్తగా చూసుకుంటూ సమాచారం ఇవ్వాలి , ఇది మీ బిడ్డగా కోరుతున్న తొలి కోరిక అంటూ నీటిని త్రాగాను .
గురువుగారు ఆనందించి , నదీ దేవతా …… నీబిడ్డను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ప్రార్థించారు .
గురుకులం చేరుకున్నాము . గురువుగారూ …… కృష్ణ కూడా దేవిడి చెంతకు .
గురువుగారు : ఎంతమాట నాకు కావాల్సినది కూడా అదేకదా మహేష్ – శివుడి అనుగ్రహం ఇద్దరికీ ఉండాలి .
ప్రయాణంలో – కర్తవ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుగ్రహించమని భక్తితో ప్రార్థించాము .
గురువుగారు …… మా ఇద్దరికీ వీరతిలకం దిద్ది హారతిని అందించారు .

గురువుగారూ మహేష్ …… శుభవార్త అంటూ చిన్నగురువులు పరుగునవచ్చారు , గురుకులపై అపార నమ్మకం ఉండే ముఖ్యమంత్రి నుండి స్వయంవరం గురించిన సమాచారం సేకరించాము , ప్రయాణ దూరం 900 మైళ్ళు …… ఆ దారిని చూయించే దిక్సూచి – పటం ఇదిగో మహేష్ , అతికష్టమైన ప్రయాణం …….
గురువుగారి కోరిక తీర్చడంలో గురువుగారి ఆశీర్వాదంతో ఆ కష్టాలన్నీ సునాయాసంగా చేధించుకుంటూ గమ్యం చేరుకుంటాను .
చిన్న గురువులు : అంతటి వీరుడువని మాకు తెలుసులే …… , ఇదిగో ఇది ఆ పెద్ద రాజ్యానికి దగ్గరలో ఉన్న అతిచిన్న సామంత రాజ్యం – నువ్వు ఇక్కడ నుండే అనుకున్నది సాధించే వ్యూహాలు పన్నాలి ఎందుకంటే రాజ్యంలోకి వెళితే ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం ఉంది .
అవసరమైన గొప్ప సమాచారం గురువులూ …….
చిన్న గురువులు : అయినాకూడా జాగ్రత్తపడాల్సినవి దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఉన్నాయి మహేష్ …… , ఆ రాజ్యాన్ని ఎలాగైనా తమ గుప్పిటలోకి తీసుకోవాలని చాలా ఏళ్లుగా భయంకరమైన రాక్షసుల్లాంటి అడవి మనుషులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు వాళ్ళతో జాగ్రత్త – పరాయవ్యక్తి అని తెలిస్తే చిత్రహింసలు పెట్టి చంపేస్తారు .
అలాంటివాళ్లకు భయపడితే నేను …. గురువుగారి ప్రియతమ శిష్యుడిని ఎలా అవుతాను .
చిన్న గురువులు : ఆ ధైర్యం మాకూ ఉందిలే కానీ కాస్త జాగ్రత్త , ఇక అతిముఖ్యమైంది ఏమిటంటే ఏమిటంటే ……. ఆ రాజ్యపు రాజుకు మన రాజులలానే అహంకారం , అలా అని చెప్పలేము కానీ తన కూతురిని యువరాజుకే ఇవ్వాలని రాజులే గొప్పవారన్న నమ్మకం …….
గురువుగారు : మన శిష్యుడు అంతకన్నా గొప్పవాడు , సరైన సమయానికి వాళ్లకు తెలుస్తుందిలే , ఇక ఆలస్యం చెయ్యడం మంచిదికాదు మహేష్ …… , ఈ విషయం యువరాజులకు తెలిస్తే అపాయం .
గురువుగారూ ……. అంటూ హత్తుకుని , తప్పదు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నాను.
గురువుగారు : దిగ్విజయుడివై అతిలోకసుందరిని రాజ్యాన్ని పొందాలి అంటూ ఆశీర్వదించారు .
చిన్న గురువులు : రాజువై వచ్చి ఈ యువరాజులను ఓడించి అహంకారాన్ని అణిచివెయ్యాలి .
గురువుగారు : యువరాజులను గురుకులం పోటీలలోనే ఓడించాడు – తోటి స్నేహితుడిని పోటీలో లేకుండా చేశారు అంటే ఎంత భయపడ్డారో తెలిసిందే – మహేష్ ……. నీ గమ్యం ఈ యువరాజులు కాదు , రాజువై రాజ్యాన్ని – వీలైనంతమంది ప్రజలను సంతోషపెట్టడం అది గుర్తుపెట్టుకో …… , ఇక వెళ్లు ……
అలాగే గురువుగారూ అని ఆశీర్వాదం తీసుకుని , పరమశివుడిని మొక్కుకున్నాను . ఆయుధాలతో స్వారీకి సిద్ధంగా ఉన్న కృష్ణగాడిపైకి ఎక్కి బయలుదేరాను .

దాదాపు పద్దెనిమిది ఏళ్ల తరువాత గురుకులం – గురుకుల అరణ్యం నుండి బయట ప్రపంచానికి ప్రయాణం సాగించాను .
గురుకులానికి చుట్టూ ఉన్న రాజ్యాలలో రెండు మూడు రాజ్యాల ద్వారా కాకుండా రాజ్యం చూట్టూ కష్టమైన దారిలో జాగ్రత్తగా బయటపడ్డాను . గురువుగారి గురుదక్షిణ కోరిక తీర్చడం కోసం కాస్త తగ్గడంలో బాధ ఏమాత్రం అనిపించలేదు . కొద్దికొద్దిసమయానికే కృష్ణ నుండి కిందకుదిగి నడక సాగించాను .
అంతదానికే కృష్ణకు కోపం వచ్చేసేది , నేనున్నది ఎందుకు ఎక్కు అంటూ ఎక్కి స్వారీ చూసేంతవరకూ వదిలేవాడు కాదు , నవ్వుకుని ఇద్దరమే మాట్లాడుకుంటూ వేగంగా ముందుకువెళ్లాము .
ఆరోజుకు చీకటి పడటం – ఉదయం నుండీ దాదాపు వంద మైళ్ళకు పైగా ప్రయాణించడం వలన కృష్ణకు విశ్రాంతి కావాలి కాబట్టి అరణ్యంలో చిన్న కొలను ప్రక్కన ఆగాము .

కృష్ణతోపాటు నీటిని సేవించి , విశ్రాంతి తీసుకోమనిచెప్పి ఆహారం తీసుకొచ్చాను , కృష్ణకు తినిపించబోతే గుర్రుగా ఉన్నాడు .
ఎందుకో అర్థమై నవ్వుకున్నాను – నేనొక్కడినే వెళ్ళాను నాకేమైనా అవుతుందనా ……. నా ప్రాణ స్నేహితుడు ఉదయం నుండీ దున్నపోతులా ఉన్న నన్ను మోసాడు కదా …… ఈమాత్రం కూడా చేయకపోతే ఎలా , తినవా ……. నువ్వుమాత్రమే కాదు నేనుకూడా జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు చెప్పారుకదా అంటూ బుజ్జగించడంతో తినింది , మా మంచి కృష్ణ అంటూ ఇద్దరమూ తిన్నాము , నేలపై పడుకున్న కృష్ణపై తలవాల్చి గురువుగారిని సేవించుకునే సమయం అంటూ మాట్లాడుతూనే హాయిగా నిద్రపోయాము .

రోజూలానే సూర్యోదయానికి ముందే లేచాను .
కృష్ణ …… నాకంటే ముందుగా లేచి చుట్టూ జాగ్రత్తగా చూస్తున్నాడు .
కృష్ణా ……. అసలు నిద్రపోయావా లేదా అంటూ హత్తుకున్నాను . క్షమించు ఇకనుండీ వంతులవారీగా …….
ఊహూ ……. అంటూ స్పృశించాడు .
ఇదేమీ బాలేదు కృష్ణా ……. నేనంటే నీకు ఎంత ప్రాణమో నువ్వుకూడా నాకు అంతే ప్రాణం కదా …….
నామాటలేమీ పట్టించుకోకుండా కొలనులోకి వెళ్ళాడు .
నిన్నూ అంటూ నవ్వుకుంటూనే వెళ్లి సూర్య వందనం చేసుకుని స్నానమాచరించి , ఆయుధాలు – వస్తువులన్నింటినీ తీసుకుని ప్రయాణం సాగించాము .

నిన్నటి కంటే మరింత ఉత్సాహం వచ్చినట్లు కృష్ణ మరింత వేగం పెంచాడు . అరణ్యంలో అక్కడక్కడా ఆగి ఆగి వెళుతూ చీకటిపడ్డాక నీటి ప్రవాహం ప్రక్కన విశ్రాంతికి ఆగాము .
బరువులన్నీ దింపి కృష్ణా …… హాయిగా విశ్రాంతి తీసుకో , నేను సాధన చేసుకోవాలి అన్నాను .
మంచి ప్రాణాళికనే పన్నావు మహేష్ అన్నట్లు ఒకచూపు చూసాడు కృష్ణ …….
నవ్వుకుని బహు బాణాల విలు విద్య – కత్తిసాము …… సాధన చేసి పడుకున్నాను.

అలా దాదాపు వారం రోజులపాటు పటం సహాయంతో దట్టమైన అరణ్యాలు – కొండలు – ప్రవాహాలు – చిన్న చిన్న రాజ్యాలు దాటుకుని చిన్న గురువులు చెప్పిన సామంత రాజ్యం చేరుకున్నాము . కృష్ణా …… నీవల్లనే కేవలం నీవల్లనే అనితరసాధ్యమైన ప్రయాణాన్ని సాగించి గమ్యాన్ని చేరుకున్నాము అంటూ మెడను చుట్టేసి ముద్దుపెట్టాను .
కృష్ణ ఆనందం అవధులులేనట్లు గెంతులువెయ్యడం చూసి ముచ్చటేసింది .

దట్టమైన అరణ్యపు కొండలు – కొండల పాదాలదగ్గర ఈ సామంత రాజ్యం – రాజ్యం ముందు మైదానం – అల్లంత దూరంలో పెద్ద లోయ ……. చూడముచ్చటగా ఉంది .
రాజ్యం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ బయట అంటే మైదానంలో జనాల హడావిడి కనిపిస్తోంది – అందరూ సంబరాలు చేసుకుంటున్నారు – ఎక్కడ చూసినా పూలతో అలంకరణ కనివిందు చేస్తోంది .
ఈ ఆనందాలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని జనాల మధ్యలోకివెళ్ళాను . ఒకవైపున బుజ్జి బుజ్జి పిల్లలు సంతోషంగా ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికివెళ్ళాను . అరణ్యం నుండి ఆహారం కోసం తీసుకొచ్చిన పళ్ళను పిల్లలకు అందించాను .
ధన్యవాదాలు ధన్యవాదాలు అన్నయ్యా చాలా తియ్యగా ఉన్నాయి అంటూ ఇష్టంగా తింటున్నారు .

సంతోషించి , పిల్లలూ …… ఏమిటీ కోలాహలం – సంబరాలు ? .
పిల్లలు : అమ్మవారి జాతర అన్నయ్యా ……
అవునా ……. అందుకేనా ఇంతమంది జనం ……
ఇప్పుడేమి చూసారు సాయంత్రానికి ఇసుక వేస్తే రాలనంత జనం చేరుతారు – కోరికలు తీర్చే అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుప్రక్కల రాజ్యాల ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు , నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే జాతరను రాజుగారు అంగరంగవైభవంతో జరిపిస్తారు , నీకూ కొరికలుఉంటే వెళ్లి కోరుకో నాయనా అమ్మ తప్పకుండా తీరుస్తుంది అంటూ ఒక బామ్మ చెప్పింది .
ఉంది బామ్మా ఒకేఒక కోరిక మా గురువుగారి కోరిక – ఇప్పుడే వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటాను అంటూ జనాలను దాటుకుంటూ అమ్మవారి మందిరం చేరుకున్నాను . కృష్ణను చెట్టుకింద ఉండమని చెప్పి మందిరంలోపలికివెళ్ళాను – అందమైన రెండు కళ్ళు నన్ను గమనిస్తున్నాయని అప్పటికి నాకు తెలియదు .

ఆదిపరాశక్తి అవతారంలోని అమ్మవారిని చూడగానే ధైర్యం – పరాక్రమం – శక్తి రెండింతలు అయ్యింది , అచ్చు నదీ దేవత అమ్మనే చూసినట్లు చాలా చాలా సంతోషం వేసింది , అమ్మా …… నీ బిడ్డకు ఇలా దర్శనం ఇచ్చారా అంటూ భక్తితో మొక్కుకున్నాను , అమ్మా ……. నాకోరిక ఏమిటో తెలిసిందే కదా అతి తొందరగా తీరేలా ఆశీర్వదించండి అంటూ అమ్మ ముందు మోకరిల్లాను , అమ్మవారి హారతి – తీర్థ ప్రసాదాలు స్వీకరించాను , బయట ప్రాణ స్నేహితుడు ఉన్నాడని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాను .

బయట జనాల పరుగులు కేకలు ……. అటువైపు చూస్తే జాతరలో అమ్మవారిని ఊరేగించే ఏనుగు జనాలవైపుకు భయంకరంగా దాడిచేస్తోంది .
చాలా మంచి ఏనుగు – అమ్మవారి ప్రతిరూపంలా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది – ఎందుకు ఇలా చేస్తోంది పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కేకలువేస్తున్నారు .
చేతిలోని ప్రసాదాన్ని గుడిలోపల ఉంటూ భయంతో వనికిపోతున్న ఒకరికి ఇచ్చి , మధమెక్కిన ఏనుగును ఎలా దారిలోకి తీసుకోవాలో తెలుసుకాబట్టి పరుగులుతీస్తున్న జనాలకు వ్యతిరేకంగా మీదకు దూసుకొస్తున్న ఏనుగు దగ్గరకే వెళ్ళాను .
చేతిని ముందుకు చాచి దూరంగా వస్తున్న ఏనుగు కళ్ళల్లోకి చూస్తూ ఏనుగు బాష మాట్లాడుతూ శాంతిపచెయ్యడానికి ప్రయత్నించాను .
ఏనుగు తన తలను విధిలిస్తూ దూసుకొచ్చి నామీదకు ఎక్కేయ్యబోతుంటే ప్రక్కకు ఎగిరాను .
ఏనుగు తినరానిదేదో తిన్నదని అగ్ని గోళాలుగా మారిన కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోయింది . ఈ పరిస్థితులలో ఏనుగును నియంత్రించలేము ప్రక్కకు తప్పుకోండి ప్రక్కకు తప్పుకోండి అంటూ ఏనుగు వెంబడి పరుగులుతీస్తూ కేకలువేస్తున్నాను .

జనాలందరూ ప్రక్కకు తప్పుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు . అంతలోనే పిల్లలు పిల్లలు అంటూ తల్లులు కేకలువేస్తున్నారు .
చూస్తే నేను పళ్ళు ఇచ్చిన పిల్లలు – బుజ్జాయిలు …… ఏనుగు పరిస్థితి గురించి తెలియక భలే భలే ఏనుగు అంటూ పరుగులుతీస్తున్న ఏనుగు దారిలోనే సంతోషంతో గెంతులేస్తున్నారు .
పిల్లలూ పిల్లలూ ప్రక్కకు వెళ్ళండి అంటూ కేకలువేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో , ఏనుగు వెనుకే వేగంగా పరుగులుతీస్తూ కృష్ణా …… అంటూ కేకవేసాను .
నా ప్రక్కకు రాగానే కృష్ణపైకి – కృష్ణపై సంచీలో ఉన్న ఆయుర్వేద మూలికలు అందుకుని ఏనుగుపైకి ఎగిరాను . ఏనుగు విధిల్చడంతో పట్టుతప్పి పడిపోబోయి ఆ అమ్మవారి ఆశీస్సుల వలన ఏనుగుపైకి చేరి మూలికల రసం పిండి ముందుకు వీలైనంత వొంగి రెండు కళ్ళల్లోకి చేరేలా చేసి , ఏనుగుపై వాలి తనకు తెలిసేలా స్పృశిస్తున్నాను .
మూలికలు మరియు ఆప్యాయతకు ఏనుగు వెంటనే నియంత్రణలోకివచ్చి సరిగ్గా పిల్లల ముందు ఆగిపోయింది .

పిల్లల తల్లిదండ్రులు పరుగునవచ్చి పిల్లలను తమ గుండెలపైకి తీసుకున్నారు – నాకు దండాలు పెడుతున్నారు , జనాలంతా చుట్టూ చేరి జయజయనాదాలు చేస్తున్నారు .
ఏనుగును పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చి , అమ్మవారి దయవలన ఎవ్వరికీ ఏమీ కాలేదు అని సంతోషించి , ఏనుగుపై లేచినిలబడి అమ్మవారికి మొక్కుకున్నాను .

ఒక అపాయం తప్పింది అనుకునేంతలో రాజ్యం ప్రహరీగోడను సైతం పడగొట్టి వందల్లో దున్నపోతులు – ఆవులు ……. జనాలవైపుకు మధమెక్కిన ఏనుగులానే అగ్ని గోళాలైన కళ్ళతో అడ్డుగా ఉన్న జాతర అంగళ్లను నాశనం చేసుకుంటూ జనాలవైపుకు పరుగులుతీస్తున్నాయి .
వెంటనే అందరినీ తప్పుకోమని కేకలువేస్తూ కిందకుదిగాను . ఆ దున్నపోతుల వేగానికి భూతల్లి సైతం కంపిస్తోంది .
జనాలంతా మరింత భయంతో కేకలువేస్తున్నారు .

ఆపడానికి ఒకటీ రెండు పశువులు కాదు వందలుగా మీదకు వస్తున్నాయి . వెంటనే కృష్ణపై ఉన్న విల్లు – బాణాలను అందుకుని ఒకేసారి రెండు బాణాలను కోణంలో జాతర కోసం అమ్మవారి గుడి ముందు పెద్దమొత్తంలో ఉంచిన పసుపు కుంకుమ వైపుకు వదిలాను .
దారివెంబడి కుంకుమ పసుపు దట్టంగా కమ్ముకోవడం – అమ్మవారి తిలకమైన కుంకుమ పశువుల కళ్ళల్లో పడగానే అన్నీ ఖాళీగా ఉన్న దారిలోకి మరిలాయి , చివరగా ఉన్న నాలుగైదు దున్నపోతులకు దారి స్పష్టంగా కనిపించడంతో మావైపుకు పరుగులుతీస్తున్నాయి .
జనాలంతా కేకలువేస్తూ ప్రక్కకు తప్పుకున్నారు – ముసుగులో ఉన్న ఒక అమ్మాయి తప్ప ……..

మహీ మహీ ……. అంటూ ప్రక్కకు జరిగిన అమ్మాయిలు కేకలువేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నావైపుకే చూస్తున్నట్లు అనిపించింది .
అంతలో దున్నపోతులు కొమ్ములు విధిలిస్తూ దగ్గరికి వచ్చెయ్యడంతో మహి మహి అంటూ అమ్మాయిలు …… ఆ అమ్మాయి దగ్గరికి చేరుకోబోయారు .
వద్దు వద్దు అంటూ చేతితో సైగలుచేస్తూ పరుగునవెళ్లి ఆ అమ్మాయి చేతిని అందుకుని నామీదకు లాక్కుని ప్రక్కకు ఎగిరాను . అదృష్టవశాత్తూ గడ్డిపై పడటంతో అమ్మాయికి ఎటువంటి దెబ్బలు తగల్లేదు .
అంత జరిగినా ……. ముసుగులోపలనుండి నన్నే చూస్తున్నట్లు కదలకుండా నాపైనే ఉండిపోయింది .
క్షమించండి క్షమించండి అంటూ లేవబోయినా ప్రక్కకు కదలనే కదలకపోవడం చూసి ఆశ్చర్యపోయాను .
మహీ మహీ …… అంటూ అమ్మాయిలు వచ్చి దెబ్బలేమీ తగల్లేదు కదా అంటూ లేపారు .
లేపమని అన్నానా అంటూ చుట్టూ అమ్మాయిలను కొట్టడం చూసి నవ్వుకున్నాను .

1308410cookie-checkజనం మెచ్చిన రాజు – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *