ముందు అక్కయ్య వైట్ కార్ వెనుక రేంజ్ రోవర్లు ఆ వెనుక వాడి కార్ కాలేజ్ చేరుకున్నారు . విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న కాలేజ్ ను చూసి ఆనందిస్తూ అక్కయ్య కార్ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పూల వర్షం కురిసింది .
శృంగార స్టోరీ 139
బుజ్జిఅమ్మ – వర్షి : అక్కయ్యా అమ్మా ……… పూలవర్షం అని విండో లలోనుండి చూసి సంతోషంతో అక్కయ్య పెద్దమ్మ బుజ్జిమహేష్ బుగ్గలపై ముద్దులుపెట్టారు . అక్కయ్యా ……….. మీరు కాలేజ్ లో అడుగుపెట్టగానే కాలేజ్ మురిసిపోయి పూలవర్షం కురిపించినట్లుంది .
అక్కయ్య : పొంగిపోతూనే బుజ్జిచెల్లీ నాకు సిగ్గేస్తోంది అని బుజ్జాయిలను ప్రాణంలా హత్తుకుని లోలోపలే నవ్వుతున్నారు .
మల్లీశ్వరి వదిన లైట్స్ దారిలో నేరుగా ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్లి ఆపారు . కృష్ణగాడు చెల్లి బుజ్జిఅమ్మతోపాటు పరుగునవచ్చి అక్కయ్య డోర్ తెరిచారు .
అక్కయ్య ……… బుజ్జిఅక్కయ్య వర్షి చేతులను అందుకుని కిందకుదిగారు . ప్రిన్సిపాల్ వారి శ్రీమతితోపాటు వెనుక లేడీ లెక్చరర్లు మరియు స్టూడెంట్ కౌన్సిల్ అందరూ అక్కయ్యదగ్గరికివచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు , మేడం ప్రెసిడెంట్ పూలు అందించి స్వాగతం పలికారు .
బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య ఆశ్చర్యపోయి ………… సర్ మేమూ ……….
ప్రిన్సిపాల్ గారి మేడం : తెలుసు బుజ్జాయిలూ ………. మహే ……… మహి అమ్మ బుజ్జిఅమ్మమ్మా బుజ్జిఅమ్మ నే కదా ………… మాతరుపున కాలేజ్ తరుపున హృదయపూర్వక స్వాగతం . మీకోసమే ఎదురుచూస్తున్నాము మీరు ok అంటే ఫంక్షన్ మొదలెట్టేస్తాము .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య చిన్నగా వణుకుతుండటం తెలిసి , మాకోసం …….. మేము చెబితే ………. మేడం మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ………..
ప్రెసిడెంట్ మేడంతోపాటు నవ్వుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేసి మీరు – మహి అమ్మ అచ్చం ఒకేలా ఉన్నారు లవ్లీ ………..
బుజ్జిఅక్కయ్య : మేమిద్దరమూ ట్విన్స్ తెలుసా అక్కయ్యా ……… అని బదులివ్వడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
మేడం : వాసంతి గారూ ……….. please రండి , మీరంతా మహి ఫ్యామిలీనే కదా రండి బుజ్జాయిలూ అని అందరినీ స్వయంగా పిలుచుకువెళ్లి , స్టేజి ముందు స్పెషల్ గా ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చోబెట్టారు . కృష్ణగాడు చెల్లి బుజ్జిఅమ్మ వెనుకే కూర్చున్నారు .
ప్రిన్సిపాల్ : శ్రీమతీ – ప్రెసిడెంట్ ………… మనా అతిథులు ఎటువంటి …….
ప్రెసిడెంట్ : సర్ ………. మా కౌన్సిల్ ఉన్నదే దానికోసం అతిథులకు ఏలోటూ రానివ్వము అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై మరొకముద్దుపెట్టి అక్కయ్య ప్రక్కనే కూర్చోబెట్టింది .
ప్రిన్సిపాల్ : ప్రౌడ్ ఆఫ్ యు ప్రెసిడెంట్ అని చెప్పి వెళ్లి మిగిలిన సోఫాలలో కూర్చున్నారు .
అక్కయ్య ఇంకా వణుకుతుండటం చూసి చేతిపై ముద్దుపెట్టి , ఇంతకీ నా తమ్ముడు ఎక్కడ అని చుట్టూ చూస్తూ కృష్ణగాడిని ఇదంతా ఏమిటని సైగచేసింది .
కృష్ణ : బుజ్జిఅక్కయ్యా – తల్లీ ………. ఎంజాయ్ అని గుండెలపై చేతినివేసుకున్నాడు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ వదిలి మొత్తం అర్థమైపోయినట్లు , అక్కయ్యా ……….. ఇదంతా మహి పెరఫార్మెన్సు వల్లనే ఎంజాయ్ చెయ్యండి .
అక్కయ్య : అంతేనంటావా బుజ్జిచెల్లీ ……….. అయితే ok అని బుగ్గపై ముద్దుపెట్టి కూల్ అయ్యారు .
ఇక్కడ మహి కూచిపూడి సాంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయి బయటకువచ్చి , మావయ్యా ……… అని చూయించి , నేను కన్నార్పడం మరిచిపోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని , గుండెలపైకి చేరబోతుంటే ,
మహి నో నో నో ……… తప్పు , ఆ దుస్తులకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి . కూచిపూడి ………. మన రాష్ట్ర గౌరవం అని వెనక్కువెళ్ళాను .
మహి : నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ , అలాగే అన్నట్లు తలఊపింది .
ప్రెసిడెంట్ : మేడం – బుజ్జిమేడం ……….. వీళ్ళు మీ ప్రక్కనే ఉంటారు . ఏ అవసరం వచ్చినా పిలవండి . మీరు ok అంటే ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము .
అంతే అక్కయ్య మళ్లీ కంగారుపడటం చూసి , బుజ్జిఅక్కయ్య నవ్వుకుని అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి చుట్టేసి ,మా అక్కయ్య తరుపున ok అని ముద్దుగా బదులివ్వడంతో ,
ప్రెసిడెంట్ : yes బుజ్జితల్లీ ………. అని స్టేజీపైకివెళ్లి మైకు అందుకుని , మన అతిథులు వచ్చారు అని అక్కయ్యావాళ్లను చూపించి మరియు మనం ఉదయం నుండీ కాదు కాదు కొన్నిరోజుల నుండీ సీక్రెట్ గా ఉంచిన చీఫ్ గెస్ట్ కూడా వారే చీఫ్ గెస్ట్ అని వారికే తెలియక మనలో ఒకరిగా తిరుగుతున్నారు………..
ఎవరు ఎవరు ……….. అని స్టూడెంట్స్ మొత్తం కేకలువేస్తున్నారు .
మహి : కేకలు వేస్తున్నారు అంటే ఫంక్షన్ స్టార్ట్ కాబోతోంది – అంటే మావయ్యా ……… అమ్మావాళ్ళు వచ్చేసారు అన్నమాట అనడం ఆలస్యం .
వదినగారూ – లావణ్యా ………. జాగ్రత్త అనిచెప్పి , పరుగుపెట్టాను .
మహి తియ్యని కోపానికి లోనవ్వడం చూసి లావణ్య పద్మ వాళ్ళు నవ్వుకున్నారు .
పూర్తి వెనుకకువచ్చి ఎక్కడ ఎక్కడ నా దేవత – బుజ్జిదేవత – బుజ్జిఅమ్మ ఎక్కడ చూసి 3 గంటలవుతోంది అని మొత్తం జల్లెడపట్టి ముందువరుసలో అథితుల్లా కూర్చుని బుజ్జిఅక్కయ్య ప్రక్కనే కూర్చోబెట్టుకున్న అక్కయ్యను మరియు ప్రక్కనే నిలబడిన కౌన్సిల్ మెంబర్స్ ను చూసి మురిసిపోయి స్టూడెంట్స్ తోపాటు ఒక ప్రక్కన నిలబడ్డాను .
హలో హలో బ్రదర్ ………. తాటిచెట్టులా అడ్డునిలబడితే ఎలా అని నవ్వడంతో , sorry sorry అనిచెప్పి అందరి వెనుకకువెళ్లి నిలబడ్డాను . అధిచూసి చెల్లి – బుజ్జిఅమ్మ – కృష్ణగాడు నవ్వుకున్నారు .
ఇన్నిరోజులు ఆగారు మరొక్క 10 నిమిషాలు ఆగలేరా ఫ్రెండ్స్ , లెట్స్ స్టార్ట్ ద ఫంక్షన్ విత్ our క్లాసికల్ డాన్స్ – ప్రౌడ్ ఆఫ్ our స్టేట్ కూచిపూడి – పెర్ఫార్మెన్స్ బై our beloved ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మహి ………. అని స్టేజీపై తప్ప లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసారు .
మహి మహి మహి ………. అని ఒక ఫ్లో లో స్వాగతం పలికారు స్టూడెంట్స్ – ఆనందించి వాళ్ళతోపాటు నేనుకూడా గొంతు కలిపాను .
మహి గజ్జెల చప్పుడుకు మైకు పెట్టినట్లు స్పీకర్లలో వినిపించడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు . మహి గజ్జెల చప్పుడుకు నా హృదయం నాట్యం చేసింది .
మహి …….. వెనుకాలే వదినగారు లావణ్యవాళ్ళతోపాటువచ్చు అక్కయ్య ఆశీర్వాదం తీసుకుని , బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు స్వీకరించి , వెనుక ఉన్న చెల్లెమ్మ – బుజ్జిఅమ్మ ఆనందానికి పులకించి , కృష్ణగాడు వేలితో చూపించినవైపు చూసి నవ్వుకుని స్టేజీపైకివెళ్లి వందనం చేయగానే పాట మొదలవ్వడంతో మహి నృత్యం మొదలెట్టింది .
అక్కయ్యావాళ్ళు – స్టూడెంట్స్ – పేరెంట్స్ – స్టాఫ్ కళ్ళప్పగించి చూసేలా మహి తన అందం – అభినయం – ముఖ కవళికలతో అందరినీ 10 నిమిషాలపాటు తన నృత్యంతో కట్టిపడేసింది .
నృత్యం పూర్తవగానే ఒక్కసారిగా అందరూ లేచి స్టూడెంట్స్ మహి మహి మహి …… అంటూ – పేరెంట్స్ స్టాఫ్ చప్పట్లతో తమను ఒక అద్భుతలోకానికి తీసుకెళ్లిన ఆనందంలో మహిని అభినందించారు .
ప్రిన్సిపాల్ గారి మేడం , లేడీ స్టాఫ్ మరియు కల్చరల్ మేడం ……….. స్టేజిమీదకువెళ్లి వందనం చేస్తూ పరవశించిపోతున్న మహిని అంతులేని ఆనందంతో కౌగిలించుకుని నాట్యమయూరిని బహూకరించారు .
మహి సంతోషంతో పైకెత్తి చూపడంతో అందరూ కేరింతలు విజిల్స్ తో అభినందించారు .
మహి కిందకువచ్చి అక్కయ్య పాదాలను తాకి , మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మా ……… మీకోసం . బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ……….. అని కదపడంతో ,
ఏదో కొత్తలోకంలోకి వెళ్లినట్లు తేరుకుని , మహీ మహీ మహీ ……….. అని చేతులను అందుకొని సూపర్ ……… అని ముద్దులవర్షం కురిపించడంతో , మహి ఆనందానికి అవధులు లేవు .
షీల్డ్ అందుంచి లేచి బుజ్జిఅక్కయ్య ప్రక్కనే కూర్చుని , బుజ్జిఅక్కయ్యను తనపై కూర్చోబెట్టుకుని వదినగారిని లావణ్యవాళ్ళనూ కూర్చోమని సర్దుకున్నారు , అందరి ప్రశంసలు కంటే మీ ఆనందం నాకు ముఖ్యం …….. ok నా ………..
బుజ్జిఅమ్మ : ok ఏంటి మహీ ……… చూశావుగా నన్ను ఏదో లోకంలోకి వెళ్ళిపోయాను అద్భుతం .
మహి : మురిసిపోయి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులతో ముంచెత్తింది .
బుజ్జిఅమ్మ : మహీ ………. ఇంతకీ మీ మావయ్య ఎక్కడ కనిపించలేదు .
మహి : చిలిపినవ్వుతో అదిగో కుడివైపు స్టూడెంట్స్ వెనుక అని చూపించడంతో , బుజ్జిఅక్కయ్య కూడా నవ్వుకుంది .
బుజ్జిఅక్కయ్య : మహి నువ్వు చేస్తేనే ఇలా ఉంది మా అక్కయ్య చేస్తే – మా అక్కయ్య నువ్వు కలిసిచేస్తే ……….. ఆ అద్భుతాన్ని చూడాలని ఉంది .
అక్కయ్య సిగ్గుపడి , నా బుజ్జిచెల్లి ప్రేమతో అడిగితే కాదంటామా …….. ఎప్పుడంటే అప్పుడు రెడీ అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ముఖాన్ని చేతులతో దాచేసుకుంది .
ప్రెసిడెంట్ : మహీ ………. that was ……… వద్దులే మన సాంప్రదాయాల గురించి తెలుగులోనే మాట్లాడుకుందాము . అద్భుతం అమోఘం మా రెండుకళ్ళూ చాలలేదు – ఏమంటారు స్టూడెంట్స్ మరియు respected పేరెంట్స్ …………
కాలేజ్ మొత్తం వినిపించేలా కేరింతలు విజిల్స్ మరియు చప్పట్లతో దద్దరిల్లిపోయింది . మహీ ………. ఇంతకంటే ఎలా అభినందించగలం స్టూడెంట్స్ కౌన్సిల్ తరుపున శిరస్సు వంచి వందనం నీకోసం ………..
మళ్లీ కరతాళధ్వనులు ఆకాశాన్ని తాకాయి .
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ……… ఒకేసారి మహి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి లవ్ యు లవ్ యు చెప్పారు .
మహి : పులకించిపోయి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా – అమ్మా ……… అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి ఉమ్మా అని ఘాడమైన ముద్దుపెట్టింది .
ప్రెసిడెంట్ : లవ్ యు మహీ ………. నెక్స్ట్ అనగానే ,
చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ……….. అని కేకలువేస్తున్నారు .
Yes yes yes ………… ఇక మిమ్మల్ని మరింత ఉత్కంఠకు గురిచేయడం ఇష్టం లేదు. వారే ముఖ్యమైన అతిథి అని వారికే తెలియదు . వారు సాధించిన విజయాల గురించి ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ కు మరియు మా స్టూడెంట్ కౌన్సిల్ కు మాత్రమే తెలుసు ……..
స్టూడెంట్స్ అందరూ ఓ ఓ ఓ ……….. అని నిరాశపడుతుంటే , నవ్వుకుని ……… ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……….. డోంట్ వర్రీ అదికూడా సర్ప్రైజ్ , ఈ రోజు నుండీ రెండవరోజు ఉదయం ఫస్ట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం తెలుసుకుంటారు వారిద్వారా కాలేజ్ మొత్తం తెలుసుకుంటుంది .
Ok ok ok ………… కాస్త తికమకగా ఉన్నప్పటికీ ఒక ఛాలెంజ్ ఒక టాస్క్ లాంటిది ఎంజాయ్ చెయ్యండి .
స్టూడెంట్స్ : ప్రక్కనే పేరెంట్స్ ఉండటం వలన మరింత గోల చేయక , ఛాలెంజ్ టాస్క్ ………. సూపర్ ప్రెసిడెంట్ we’ll accept అని సంతోషించి , తొందరగా మన చీఫ్ గెస్ట్ ఎవరో ………. చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ……..అని కేకలువేశారు .
ప్రెసిడెంట్ : sorry sorry sorry ………. our చీఫ్ గెస్ట్ mr మహే ……… mr మనోజ్ ……….. మనోజ్ సర్ మనోజ్ సర్ ………. please ఎక్కడున్నా స్టేజీమీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము . స్టూడెంట్స్ మీ మధ్యనే ఆరడగుల ఎత్తులో ఉంటారు . వారు కనిపిస్తే నావైపు సైగచేయ్యండి .
మనోజ్ నా ………. ఎవరబ్బా నా మరొక పేరు పెట్టుకున్న ఆ సీక్రెట్ చీఫ్ గెస్ట్ అని స్టూడెంట్స్ తోపాటు నేనూ చూస్తున్నాను .
మనోజ్ నా ………. అని మహి – బుజ్జిఅక్కయ్య అర్థం అయ్యీ అవ్వనట్లు వెనక్కు తిరిగి తిరిగి చూస్తున్నారు .
నా ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ : రేయ్ రేయ్ …….. కొంపదీసి మన వెనుక ఉన్న తాటిచెట్టునా ? అంతలేదురా అని నవ్వుకున్నారు .
ప్రిన్సిపాల్ గారు – లెక్చరర్లు లేచి అటూ ఇటూ చూస్తున్నారు . కృష్ణగాడివైపు చూసి ఎక్కడ అని అడగడంతో , వాడు అక్కడ అని చూయించాడు .
ప్రిన్సిపాల్ గారు తమ స్టాఫ్ తోపాటు వచ్చి , స్టూడెంట్స్ ……… అని నేరుగా నాదగ్గరకువచ్చి మహేష్ ……… నో నో నో మనోజ్ please స్టేజీమీదకు రండి అని స్వాగతం పలికారు .
ప్రెసిడెంట్ : there our చీఫ్ గెస్ట్ మనోజ్ సర్ …….. మన ప్రిన్సిపాల్ గారు – మేనేజ్మెంట్ – లెక్చరర్స్ స్వయంగా పిలుచుకునివస్తున్నారు అని చేతితో చూపించడంతో ,
చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అవాక్కై మరియు కూర్చున్న స్టూడెంట్స్ లేచి ఎగబడుతూ చూస్తున్నారు .
షాక్ లో ఉన్న నన్నుచూసి , మహే ……… మనోజ్ …….. మీ చైర్మన్స్ నా చిన్ననాటి ఫ్రెండ్స్ మేము కలిసి చదువుకున్నాము . స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్ కోసం కలవడానికి వెళ్ళినప్పుడు కంపెనీలో నా ఫ్రెండ్స్ పక్కన నీ ఫోటో చూసి , నిన్ను ఎక్కడో ఎక్కడో ………. ఆ మహి ఫీజ్ కట్టడానికి వచ్చినప్పుడు చూశానని అర్థమై నీ గురించి – నా ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఉండటానికి కారణం నువ్వేనని తెలుసుకుని ఫిక్స్ అయిపోయాను – నువ్వే కాలేజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ వని ………. , నువ్వంటే మా చైర్మన్స్ కు ఉన్న అభిమానం వలన ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యమని కృష్ణ నెంబర్ ఇచ్చారు . కలిసి ప్లాన్ చేసే సమయంలో ఇక్కడ ఉన్న సమస్యను వివరించడంతో మనోజ్ పేరుని ఫిక్స్ అయ్యాము . ఇక మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ కాల్ చేసి మహి వాళ్ళను అతిథులుగా గౌరవించాలి అని ఆర్డర్ వేశారు అని వివరించి , రండి అని ఆహ్వానించారు .
స్టూడెంట్స్ ముందుకు రాగానే ముందు కృష్ణగాడు చెల్లెమ్మ లేచి చప్పట్లుకొట్టడంతో , అందరూ లేచి చూసి చప్పట్లతో స్వాగతం పలికారు .
లావణ్య వాళ్ళు మరియు మహి బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని లేచి , ప్రిన్సిపాల్ తో సహా లెక్చరర్లు అందరూ గౌరవంతో నన్ను తమ ముందుగా స్టేజీమీదకు తీసుకెళ్లడం చూసి నోరు తెరిచి కన్నార్పకుండా షాక్ లో అలా చూస్తుండిపోయారు .
రేయ్ ……….. ఏంట్రా ఇది అని వాడివైపు చిరుకోపంతో చూసివెళ్లి , బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి లవ్ యు మహీ ……… ఆ బుద్ధిలేని చీఫ్ గెస్ట్ అని మనం మాట్లాడుకున్నది నా గురించే అని నవ్వుతూ పైకివెళ్ళాను .
ప్రెసిడెంట్ ………. ఫ్లవర్స్ శాలువా మరియు కాలేజ్ జ్ఞాపికను తీసుకొచ్చి ప్రిన్సిపాల్ గారి ద్వారా ఇప్పించి అప్పటికే స్టేజిమీద ఏర్పాటుచేసిన టేబుల్ కుర్చీలలో కూర్చోమనిచెప్పి ప్రిన్సిపాల్ గారు – మేనేజ్మెంట్ మరొక కుర్చీ ఖాళీ వదిలి ప్రక్కనే కూర్చున్నారు .
ఇంకా నిలబడే షాక్ లో ఉన్న మహివైపు కన్నుకొట్టడంతో , తేరుకుని కూర్చున్నారు .
డార్లింగ్ డార్లింగ్ అని లావణ్యవాళ్ళు గుసగుసలాడుతున్నారు .
బుజ్జిఅమ్మ : నాన్నా , తల్లీ కృష్ణా ……… అని ఇద్దరి చేతులలో పెనవేసి అంతులేని ఆనందాన్ని ఆస్వాదించారు .
అక్కయ్య అందరిలానే చప్పట్లు కొట్టడం చూసి గుండెలపై చేతినివేసుకొని పరవశించిపోయాను .
కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ అయిపోయావురా ………. నేను చీఫ్ గెస్ట్ ఏంటిరా అని గుసగుసలాడాను .
కృష్ణ : చెల్లి , బుజ్జిఅమ్మతోపాటు నవ్వుతుండగానే ,
ప్రెసిడెంట్ : our second చీఫ్ గెస్ట్ I*S కృ …….. కృనాల్ గారిని స్టేజీమీదకు పిలుచుకొని రావాల్సిందిగా మన గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను అనడంతో , నేనే ముందుగా లేచి చప్పట్లు కొట్టి రారా రారా ……..అని చేతితో సైగచెయ్యడం చూసి చెల్లి – బుజ్జిఅమ్మ నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : నాన్నగారూ మీరుకూడానా ఈరోజెంటే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ లు అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
కృష్ణ : లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… అని ముద్దు వదిలి , కంగారుపడుతూనే ప్రిన్సిపాల్ వెంట నడిచాడు .
కృష్ణ : సర్ ……….. అని వెనుకకు వెళ్లిపోతుంటే ,
రేయ్ ……… స్టేజి ఇటువైపురా అనడంతో అందరూ నవ్వుకున్నారు .
ప్రిన్సిపాల్ : మీరిద్దరూ ఒక్కటి అని నా ఫ్రెండ్స్ చెప్పారు సో ……….
కృష్ణగాడు స్టేజిమీదకువచ్చి నావైపు చూడకుండా తలదించుకుని వచ్చి నాప్రక్కనే కూర్చున్నాడు . కృష్ణగాడినీ సన్మానించారు .
ప్రెసిడెంట్ : ఫ్రెండ్స్ మన సెకండ్ చీఫ్ గెస్ట్ I*S మన వైజాగ్ లోనే విధులు నిర్వహిస్తున్నారు . డ్యూటీలో చేరి రెండు నెలలు కూడా కాకుండానే ఎన్నో సాల్వ్ అవ్వని కేస్ లను పెండింగ్ లో ఉన్న కేస్ లను పరిష్కరించారు .
చప్పట్లతో అభినందించారు . ప్రిన్సిపాల్ గారిని మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాము .
ప్రిన్సిపాల్ గారు మైకు దగ్గరకువెళ్లి మాకు థాంక్స్ చెప్పి తమ కాలేజ్ గురించి స్టూడెంట్స్ గురించి మాట్లాడారు .
ప్రెసిడెంట్ : నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ లను మాట్లాడవలసినదిగా కోరుకుంటున్నాము .
వాడివైపే చూసి ఎంజాయ్ చేస్తున్న నన్ను చూడకుండానే రేయ్ నిన్నే పిలుస్తున్నారు అనిచెప్పడంతో , ఎస్క్యూస్ మీ సర్ ……….
ప్రిన్సిపాల్ వాళ్ళు : our pleasure మహేష్ …….. please ……..
మైకు దగ్గరకువెళ్లి స్టేజీపైన ఉన్నవాళ్లకు థాంక్స్ చెప్పి , స్టూడెంట్స్ ……… మీ గ్రేట్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసేంతవరకూ మాకూ తెలియదు మేము అతిథులం అని – మీరే కాదు మేముకూడా ఇంకా నమ్మలేకపోతున్నాము – తప్పదు నమ్మాల్సిందే ………
అందరూ సంతోషంతో నవ్వుకుని చప్పట్లుకొట్టారు .
నేనూ వా ……. I*S కృనాల్ గారు ప్రాణమిత్రులం – సంతోషాలను కష్టాలను బాధలను కలిసి అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాము . హార్డ్ వర్క్ ………
గుంపులో నుండి ఆ సర్ I&S ………. మరి మీరు ఏమి సాధించారో చెప్పనేలేదు . అయినా ఇంత చిన్నవయసులో కాలేజ్ చీఫ్ గెస్ట్స్ అంటే నమ్మలేకపోతున్నాము .
గుడ్ క్వశ్చన్ బ్రదర్ ………. 17 సంవత్సరాల ముందు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు కానీ ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లోకి రోజుకు కనీసం కోటి అయినా చేరుతుంది. మనకంటూ ఒక ఇన్స్పిరేషన్ – ప్రాణం కంటే ఎక్కువైన వాళ్ళ కోరిన కోరిక అని అక్కయ్యవైపు కళ్ళల్లో చెమ్మతో చూస్తూ ………. తీర్చాలి అని పట్టుదల ఉంటే పదేళ్ల వయసులోనే వండర్స్ సృష్టించొచ్చు అని ఎంతోమంది నిరూపించారు . కాబట్టి వయసుతో సంబంధం లేదు . పేరెంట్స్ మనపై పెట్టుకున్న ఆశలను ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు ……… అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది . మా వయసు తక్కువే కానీ మేమిద్దరమూ మరియు my డియరెస్ట్ సిస్టర్ అతిత్వరలో డాక్టర్ కాబోతోంది – తను చూసిన కష్టాలు అడ్డంకులు అన్నింటినీ మా ప్రాణమైన వాళ్ళ ఆశలను నిలబెట్టాలన్న ఏకైక ఆశయంతో అన్నింటినీ అధిగమిస్తూ బాధపడుతూ సంతోషిస్తూ ఒకరికొకరం ఉంటూ ఇప్పుడు ఈ స్టేజీపై ఉన్నామని గర్వపడుతూ చెబుతున్నాము . ఒక్కటిమాత్రం చెప్పగలను ముందు మన పేరెంట్స్ తోబుట్టువులు తరువాతనే మిగిలినవి ……… అవేంటో మీకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అని ఉద్వేగంతో చెప్పాను .
ప్రతీ స్టూడెంట్ ప్రక్కనే కూర్చున్న పేరెంట్స్ లేచి ఆనందబాస్పాలతో చప్పట్లు కొట్టడం – ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ లెక్చరర్లు ఇలా పెద్దవారందరూ చప్పట్లు కొట్టి అభినందించారు .
స్టూడెంట్స్ sorry ………. ఎక్కువ ఎమోషనల్ అయ్యాను . మిమ్మల్ని బ్యాడ్ చెయ్యాలని కాదు . కాలేజ్ లైఫ్ మళ్లీ రాదు ఎంజాయ్ చేస్తూనే ఒక ప్లానింగ్ తో వెళ్ళాలి – మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి – all the best for your bright future ………. సెలవు అనివెల్లి కూర్చున్నాను .
పేరెంట్స్ తోపాటు స్టూడెంట్స్ లేచి వైజాగ్ మొత్తం వినిపించేలా చప్పట్లు కొట్టారు .
సోఫాలలో కూర్చున్న లెక్చరర్లు వచ్చి మహేష్ ……… మా వయసులో సగం లేదు చీఫ్ గెస్ట్ ఏంటి అనుకున్నాము – మీ మాటలే చెబుతున్నాయి మాకంటే ఎక్కువ చూశారని ………. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ అని అభినందించారు . ప్రిన్సిపాల్ గారు వచ్చి మహేష్ ………. నా ఫ్రెండ్స్ నీ భజన చేస్తుంటే బిల్డప్ అనుకున్నాను – కానీ తక్కువ అని అర్థమయ్యింది – నీ మాటలు పేరెంట్స్ గుండెల్లోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే నేనూ పేరెంట్ నే కదా ………
కృష్ణ : మామా ……… చితక్కొట్టేశావు . నీ చెల్లి చూడు మనవైపు ఎంతలా చూస్తోందో ……… ఇక నైట్ నాకు పసందైన భోజనం .
లవ్ యు మామా ………. ఎంజాయ్ అని నవ్వుకున్నాము .
అక్కయ్య – బుజ్జిఅమ్మ – మహీవాళ్ళు ……… ఇంకా చప్పట్లు కొడుతూనే ఉన్నారు .
ప్రెసిడెంట్ మైకు అందుకొని ఫ్రెండ్స్ ముందే చెప్పాము మనోజ్ సర్ గురించి తెలుసుకోవడానికి రెండు రోజులు ఆగాలని , ఆ ప్రశ్న వేసినవాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే ఫస్ట్ మీరే తెలుసుకుని నాకు కాల్ చేసి పశ్చాత్తాపం చెందుతారని ఆశిస్తున్నాను . Anyway we move on ………. నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అనగానే ,
కింద మొత్తం దద్దరిల్లిపోయింది .
నేనూ – కృష్ణగాడు కూడా సంతోషంతో హైఫై కొట్టుకుని లేచాము .
ప్రెసిడెంట్ : మనోజ్ సర్ – కృనాల్ సర్ ………. మా స్టూడెంట్స్ కంటే మీరే ఎక్కువ ఎంజాయ్ చేసేలా ఉన్నారు . కాస్త మాకు గౌరవించుకునే అవకాశం ఇవ్వండి . ప్రిన్సిపాల్ గారిని చీఫ్ గెస్ట్ లను కిందకు పిలుచుకునివేళ్ళాల్సిందిగా కోరుతున్నాము అని స్టూడెంట్స్ తోపాటు నవ్వి చెప్పడంతో ,
సర్ వాళ్ళు పిలుచుకొనివెళ్లి అక్కయ్య ముందు సోఫాలు వెయ్యబోతే , ప్రెసిడెంట్ చేవిలో చెప్పి అక్కయ్య వెనుక వేయించి వెళ్ళాము .
చెల్లి : అన్నయ్యా – బేబీ ………. అని ఇద్దరినీ ఆనందబాస్పాలతో హత్తుకుని చెరొకవైపుకు కూర్చోబెట్టుకొని వాడి బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతోంది . బుజ్జిఅమ్మ నా ప్రక్కనే వచ్చి కూర్చుని ప్రౌడ్ ఆఫ్ యు నాన్నలూ అని చిన్నగా చెప్పి పొంగిపోతోంది. బుజ్జిఅక్కయ్య ……… అక్కయ్య గుండెలపైనుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
బుజ్జిఅక్కయ్యా ………. దగ్గరకువచ్చి ఇవ్వచ్చుకదా ……..
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యను వదిలి నేను రానంటే రాను . ఇప్పటివరకూ మహి ఎత్తుకుంది అని స్టేజివైపుకు తిరిగి అక్కయ్యపై కూర్చుంది .
అక్కయ్య : అలా వెళ్లి ముద్దులిచ్చి వచ్చేయ్యొచ్చు కదా బుజ్జిచెల్లీ ……….
బుజ్జిఅక్కయ్య : మీరు నాకు ఇస్తే అప్పుడు వెళతాను .
అక్కయ్య నవ్వుకుని నా ముద్దులన్నీ మా బుజ్జిచెల్లికే అని బుగ్గలపై – నుదుటిపై ముద్దులుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : ఇప్పుడు అలానే అంటారులే మీ తమ్ముడు వచ్చాక ముద్దులన్నీ మన తమ్ముళ్లకే కదా లవ్ యు అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుపడుతున్న అక్కయ్యను చూసి నవ్వుతూ వెనుకకువచ్చింది .
తమ్ముడూ ………. చూశావా ఎంజాయ్ .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… అని బుగ్గలపై నుదుటిపై పెదాలను తాకి అక్కయ్య ముద్దులను నేను ఆస్వాదించాను .
హ్యాపీనా అని నాకు వాడికి చెల్లికి ఒక్కొక్క ముద్దుపెట్టి అక్కయ్య దగ్గరికి పరుగునవెళ్లి నావైపు చూస్తూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టడం చూసి ,
ఆఅహ్హ్హ్………. లవ్ యు లవ్ యు అని బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
పాపం మహికి నా గుండెలపై వాలిపోవాలని ఉన్నప్పటికీ ……… కంట్రోల్ చేసుకోవడం చూసి , నవ్వుకుని వెళ్ళేటప్పుడు కారులో అని మెసేజ్ పెట్టాను .
మహి మొబైల్ చూసి వెనుకకు తిరిగి అక్కయ్య చూడకుండా లవ్ యు అని పెదాలను కదిలించింది .
అక్కయ్య : మొదటి డాన్స్ ప్రోగ్రాం చూసి , బుజ్జిచెల్లీ …………అని ప్రాణంలా కౌగిలించుకుంది .
బుజ్జిఅక్కయ్య : ఏమిటక్కయ్యా ………. అంత ఆనందం .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ……… మా కాలేజ్ రోజులు గుర్తుకొస్తున్నాయి . నా ఫ్రెండ్స్ సునీత కాంచనతో కాలేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేసినది మరియు వెనుక కూర్చుని గోల గోల చేసినవి గుర్తుకొస్తున్నాయి అని సిగ్గుపడుతూ చెప్పారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… మిమ్నల్ని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తోంది – చాలా ఆనందం వేస్తోంది . లవ్ యు అక్కయ్యా ………. ఇలానే నవ్వుతూ ఉండాలి అని బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : ఆనందించి , నా బంగారు బుజ్జిచెల్లి ……… బుజ్జిచెల్లీ …….. ప్రోగ్రామ్స్ మొత్తం చూసి వెళదామా …….. ఒకవేళ నీకు నిద్రవస్తే చెప్పు వెళ్లిపోదాము .
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ఆనందాన్ని నేను ఆపుతానా …….. మీరు డాన్స్ లు ఎంజాయ్ చెయ్యండి – నేను మీ నవ్వుని ఎంజాయ్ చేస్తాను అని అక్కయ్య ఒడిలో మావైపు తిరిగికూర్చుంది .
ఆ మాటలను విని ఆనందబాస్పాలతో లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని బుజ్జిఅమ్మ చేతిపై ముద్దుపెట్టాను .
చెల్లి : అన్నయ్యా …….. అటువైపు జరగండి – బుజ్జిఅమ్మా ……. అని చేతిని అందుకొని మా మధ్యన కూర్చోబెట్టి , సమయం 10 అవ్వడంతో ఆకలేస్తోందా అని అడిగింది .
బుజ్జిఅమ్మ : లేదు బుజ్జితల్లీ ……….. అమ్మ మహి బుజ్జితల్లి మరియు మనందరి ఆనందం చూసి కడుపు నిండిపోయింది అని నా చేతిని చుట్టేసి లవ్ యు నాన్నలూ ………. అని మురిసిపోతోంది .
ఒకవైపు డాన్స్ స్కిట్స్ ………. జరుగుతుండగానే , ప్రెసిడెంట్ వచ్చి తినడానికి పిలిచింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా …….. మాకు ప్రోగ్రామ్స్ చూడాలని ఉంది .
ప్రిన్సిపాల్ గారు వచ్చి ప్రెసిడెంట్ ………. మన గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ ఇక్కడికే తీసుకురండి డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు .
బుజ్జిఅమ్మ : థాంక్స్ సర్ …………
ప్రిన్సిపాల్ : మా అదృష్టం బుజ్జితల్లీ ……….. అని వెళ్లిపోయారు .
స్టూడెంట్స్ కౌన్సిల్ మెంబెర్స్ ప్లేట్లలో అన్నీ ఐటమ్స్ వడ్డించుకునివచ్చి ముందు బుజ్జాయిలకూ వాళ్ళ పేరెంట్స్ కు తరువాత మాకు అందించారు .
థాంక్స్ ప్రెసిడెంట్ అనిచెప్పి అందరమూ తిన్నాము . ప్రెసిడెంట్ లవ్లీ ఫుడ్ అనడంతో మళ్లీ మళ్లీ వడ్డించారు .
తిని ఫంక్షన్ మొత్తం పూర్తయ్యేంతవరకూ ఉన్నాము . అక్కయ్య తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకుని ఎంజాయ్ చెయ్యడం చూసి మేమూ ఆనందించాము . మధ్యమధ్యలో చప్పట్లు కేరింతలు ఒకసారైతే మంచి స్టెప్పుకు విజిల్ కూడా వెయ్యబోయి చుట్టుచూసి సిగ్గుపడటం చూసి నేను సిగ్గుపడ్డాను . బుజ్జిఅక్కయ్య అయితే నావైపుకు తిరిగి అక్కయ్యకు ముద్దులుపెడుతూ నన్ను కవ్వించి నవ్వుతోంది.
బుజ్జిఅక్కయ్యా ………. ఒకే ఒకటి ఒక్కటంటే ఒక్కటి అక్కయ్యకు ముద్దు అని అడిగాను .
బుజ్జిఅక్కయ్య : వేలితో బెదిరించడం చూసి , బుజ్జిఅమ్మ చెల్లి వాడు నవ్వుకున్నారు .
ఫంక్షన్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది . అప్పటికే సగం మంది వెళ్లిపోయారు . బుజ్జిఅక్కయ్య తప్ప బుజ్జాయిలందరూ వాళ్ళ అమ్మల గుండెలపై నిద్రపోతున్నారు – బుజ్జిఅమ్మ చెల్లి ఒడిలో – బుజ్జిమహేష్ పెద్దమ్మ ఒడిలో నిద్రపోతున్నారు . ప్రెసిడెంట్ అక్కయ్యా మహీవాళ్లను – ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కలిసి థాంక్స్ చెప్పారు .
ప్రిన్సిపాల్ గారూ ………. మేమే మీకు థాంక్స్ చెప్పాలి . మీవలన కొన్ని మధురమైన ఆనందాలను ఆస్వాదించాము అని అక్కయ్యవైపు చూసి సంతోషిస్తూ చెప్పాను . మా కార్లవారకూ వచ్చి వదిలి మళ్లీ ఒకసారి కలుద్దాము మహేష్ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు .