శ్యా మల-19 వ భాగం

Posted on

నేను ఇంటి కి వెళ్ళేసరికి మా అమ్మ ” రావే నీ కోసమే చూస్తున్నా. ఎల్లుండి నిన్ను చూసుకోడాని కి వస్తున్నారంట. రేపు ఎక్కడకి వెళ్ళకు. చక్కగా ఇంట్లోనే ఉండు” అంది.
నేను ” సరే లేవే” అని బాత్ రూం లోకి వెళ్ళి బట్టలు అన్నీ విప్పుకుని చల్లటి నీళ్ళు ఒంటి మీద పోసుకుని ఒళ్ళు అంతా రుద్దుకుని, బట్టలు కట్టుకుని వచ్చా. ఇప్పుడు ఎంతో హాయి గా ఉంది.
మా అమ్మ నాకు ఏవో చెపుతూ, అన్నం పెట్టి, ” చూడు శ్యామలా ఈ సంబంధం చాలా మంచి ది. కుర్రాడికి చాలా డబ్బు ఉందంట. ఏదో వ్యాపారాలు కూడా ఉన్నాయంట. చదువుకున్న పిల్ల, ఇంటి పనులు అవీ బాగా వచ్చి ఉంటే చాలు అని అన్నారు, నీ అదృష్టం బాగుండి ఈ సంబంధం కుదిరితే నీ కు ఏ లోటూ ఉండదే” అంటూ ఏదో చెప్పుకు పోతూంది.
నేను అన్నిటి కీ “ఊఁ ” అంటూ అన్నం తినేసి, కొద్ది సేపు మా అమ్మ తో మాటాడి వెళ్ళి పడుకుండి పోయా.
మరునాడు మా అమ్మ నన్ను ఎక్కడ కీ వెళ్ళద్దు” అని చెప్పి ఇంట్లోనే ఉంచే సింది.
అలా ఆ రోజు కొంత మంది తెలిసిన వాళ్ళు, ప్రక్క వాళ్ళు రావడం తో అస్సలు టైము తెలీలేదు. నా పెళ్ళి చూపులు గురించే హడావిడి అంతా. మా నాన్న కూడా ఏవో పనులు చూస్తూ హడావిడి గా తిరుగుతూ నే ఉన్నాడు. అలా ఆ రోజు కూడా గడచి పోయింది. మరునాడు నాకు మా అమ్మ తలంటి నీళ్ళు పోసి, పెళ్ళి వాళ్ళు వచ్చే సరికి ఏమి బట్టలు కట్టుకోవాలో చెప్పి, నాకు చాలా జాగ్రత్తలు చెప్పింది.
“వాళ్ళు అడిగే వాటి కి చక్కగా సమాధానం చెప్పు తెలి సిందా” అంటూ ఇలా ఏవో చెపుతూ ఉంది. “వాళ్ళు 400, 5-00 గంటల మధ్యలో వస్తారు” అని చెప్పింది.
సరిగ్గా 3-00 కి మా ఇల్లు అంతా ఒకటే హడావిడితో, తెలిసిన వాళ్ళ తో నిండి పోయి ఒకటే గోల గా ఉంది.
నేను అన్నిటి కీ “ఊఁ ” అంటూ అన్నం తినేసి, కొద్ది సేపు మా అమ్మ తో మాటాడి వెళ్ళి పడుకుండి పోయా.
మరునాడు మా అమ్మ నన్ను ఎక్కడ కీ వెళ్ళద్దు” అని చెప్పి ఇంట్లోనే ఉంచే సింది.
అలా ఆ రోజు కొంత మంది తెలిసిన వాళ్ళు, ప్రక్క వాళ్ళు రావడం తో అస్సలు టైము తెలీలేదు. నా పెళ్ళి చూపులు గురించే హడావిడి అంతా. మా నాన్న కూడా ఏవో పనులు చూస్తూ హడావిడి గా తిరుగుతూ నే ఉన్నాడు. అలా ఆ రోజు కూడా గడచి పోయింది. మరునాడు నాకు మా అమ్మ తలంటి నీళ్ళు పోసి, పెళ్ళి వాళ్ళు వచ్చే సరికి ఏమి బట్టలు కట్టుకోవాలో చెప్పి, నాకు చాలా జాగ్రత్తలు చెప్పింది.
“వాళ్ళు అడిగే వాటి కి చక్కగా సమాధానం చెప్పు తెలి సిందా” అంటూ ఇలా ఏవో చెపుతూ ఉంది. “వాళ్ళు 400, 5-00 గంటల మధ్యలో వస్తారు” అని చెప్పింది.
సరిగ్గా 3-00 కి మా ఇల్లు అంతా ఒకటే హడావిడితో, తెలిసిన వాళ్ళ తో నిండి పోయి ఒకటే గోల గా ఉంది.
టైం 4-20. మా ఇంటి ముందు ఏవో కార్లు ఆగిన చప్పుడు, మా వాళ్ళ హడావిడి. నా గదిలోకి మా చుట్టం ఒక ఆవిడ వచ్చి “శ్యా మలా పెళ్ళి వాళ్ళు వచ్చేసారే, ” అని చెప్పి నా అలంకారం బాగుందో లేదో మళ్ళీ చూసి, ఏవో కొద్ది గా సర్ది, “ఊఁ ఇప్పుడు ఇం కా బాగున్నావే, ” అని వెళ్ళి పోయింది.
మా హాల్ లో ఏదో మాటలు, కొద్దిగా నవ్వులూ, పెళ్ళి వాళ్ళకి తినడాని కి పలహారాలు వెళుతున్నాయ్యి. సరిగ్గా 4-45 కి మా అమ్మ, ఇంకో చుట్టం కలసి నా గది లోకి వచ్చి “శ్యా మలా నిన్ను చూ పెట్ట మన్నారు నడు” అని నా కు వాళ్ళు ఇద్దరూ ప్రక్క ప్రక్కనే ఉండి నన్ను తీసుకు వెళుతున్నారు. నా కాళ్ళు ఒకటే దడ గా ఉన్నాయి, చేతులు ఒణుకుతున్నాయి. ఏదో భయం, భయం గా ఉంది. అలాగే వెళ్ళి మా అమ్మ చెప్పిన కుర్చీలో తల వంచుకుని కూర్చున్నా.
మా నాన్న పెళ్ళి వాళ్ళ తో “మా అమ్మాయి శ్యామల అండీ, ఇంటర్ వరకూ చదివింది,” అని చెప్పుతున్నారు. పెళ్ళి కొడుకు తండ్రి, తల్లి, అక్క, అనుకుంటా ఏవో మాటాడుకుంటూ.
పెళ్ళి కొడుకు అక్క అడిగింది ” అమ్మాయీ నీకు వంటలు బాగా చెయ్యడం వచ్చా” అని.
నేను తల కొద్దిగా పైకి ఎత్తి ” వచ్చండీ” అన్నా.
పెళ్ళి కొడుకు తల్లి అడిగింది, “అ మ్మాయీ నువ్వు ఏమైనా కుట్లూ, అల్లి కలూ నేర్చుకున్నావా”, అని.
నేను తల కొద్ది గా ఎత్తి, కుట్టు పనులు తెలుసండీ అన్నా.
మా అమ్మ వెంటనే “భైజులు, అవీ కుడుతుంది అండీ, ఈ మధ్యనే ఖాలీ గా ఉండ కుండా నేర్చుకుంటూంది” అంది.
పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు ఎవరో పెళ్ళి కొడుకు తో “ఒరే అమ్మాయి ని సరిగ్గా చూసుకో, మళ్ళీ ఇంటి కి వెళ్ళేకా నేను సరిగ్గా చూడలేదు అంటే బాగా ఉండదు” అంటూ వేళాకోళం చేసారు.
పెళ్ళి కొడుకు అక్క కూడా “తమ్ముడూ పిల్లని సరిగ్గా చూడ రా” , అని నా తో “నువ్వు కూడా మా తమ్ముడిని చూసుకో అమ్మాయీ” అంది.
నాకు ఒకటే సిగ్గు గా ఉంది. తల కొద్ది గా పైకి ఎత్తి చూసా. వెంటనే తల దింపేసుకున్నా. అలా కొద్ది సేపు వాళ్ళు ఏవో మాటాడుకుని “ఇంక అమ్మాయి ని లోపల కి తీసుకు వెళ్ళండి” అన్నారు ఎవరో.
నేను హమ్మయ్యా అనుకున్నా. మా అమ్మా, మా చుట్టం కలసి నన్ను లోపల కి తీసుకు వెళ్ళేరు. మా అమ్మ మళ్ళీ బైటకి వెళ్ళి పోయింది.
మా చుట్టం అంది “ఏమే పిల్లాడు ఎలా ఉన్నాడు” అని.
నేను “చీ పో” అంటూ సిగ్గు పడి పోయా.
తను మళ్ళీ “చీ పో అంటే కాదు. అసలు తల కూడా నువ్వు పైకి ఎత్తి చూడలేదు, పోనీ ఇలా గుమ్మం ప్రక్కనే ఉండి ఒక సారి సరిగ్గా చూడు” అని నన్ను గుమ్మం ప్రక్కన నించో పెట్టి తనూ నా ముందు నిలబడింది.
ఇప్పుడు కొద్ది గా నాకు ఆ పిల్లాడు కనపడుతున్నాడు. తను కొద్ది గా చామన ఛాయ గా ఉన్నాడు. అంత లావూ
కాదు, సన్నం కాదు, చూడ్డాని కి బాగానే ఉన్నాడు. నేను మళ్ళీ ఒక సారి చూసి వెళ్ళి మంచం మీద కూర్చుండి పోయా.
ఒక అర గంట తరువాత అనుకుంటా మళ్ళీ మా అమ్మ వచ్చి “శ్యా మలా ఒక సారి నిన్ను మళ్ళీ చూస్తారట రా అమ్మా,” అని నన్ను మళ్ళీ తీసుకు వెళ్ళేరు.
ఈ సారి నన్ను అలా నుంచో పెట్టి పెళ్ళి కొడుకు అక్క నా దగ్గరకి వచ్చి నా పొడవు ఎంతో చూసుకుంది.
నా తో “అ మ్మాయీ మా తమ్ముడిని చూసుకున్నావా, లేక పోతే ఇంకో సారి చూడు కావాలంటే ఏమీ పరవాలేదు” అంది. అలగే వాళ్ళ తమ్ముడి తో కూడా “ఒరే నువ్వు కూడా మొహమాట పడ కుండా అమ్మాయి నె చూసు కోరా” అంది.
అలా కొద్దిసేపు వాళ్ళు ఏదో మాటాడుకుంటూ ఉంటే నేను అలాగే మా అమ్మ ప్రక్కన ఉన్నా. పెళ్ళి కొడుకు అక్క, “శ్యా మలా నువ్వు లోపలకి వెళ్తే వెళ్ళమ్మా” అంది.
నేను మళ్ళీ హమ్మయ్యా అనుకుంటూ నా గది లోకి వెళ్ళి పోయా. ఒక అర గంట తరువాత అను కుంటా వాళ్ళు వెళ్ళి పోయారు. మధ్యవర్తి చేత మాటాడిస్తాం అని చెప్పి. అప్పటి కే టైం 6-00 అయ్యింది. వాళ్ళు వెళ్ళి పోగానే ఇంక
మా ఇంటి లో ఒకటే హడావిడి. పెళ్ళి కొడుకు బాగున్నాడని, మంచి డబ్బు ఉన్న వాళ్ళనీ ఇలా వాళ్ల గొప్పల గురించే అన్నీ.
కొంత మంది ” మీ పిల్ల కి ఈ సంబంధం కుదిరితే అద ష్టమే మరి” అని కొద్ది సేపు ఉండి అంతా వెళ్ళి పోయారు.
వెళ్ళే ముందు మా చుట్టం ఒకావిడ మా అమ్మ తో “నీ కూతురి కి పడుకునే ముందు దిష్టి తీసి పడేయ్యవే” అని చెప్పి వెళ్ళింది.
అలా అంతా వెళ్ళి పోయాకా, మా నాన్న, అమ్మా నేను కూర్చున్నాం. మా నాన్న “శ్యా మలా నువ్వు చూసేవా పెళ్ళి కొడుకుని. బాగున్నడా” అని అడిగాడు.
నేను పో నాన్నా అని సిగ్గుతో నా గది లోకి పారి పోయా.
అలా ఆ రాత్రి అంతా హడావిడి గా గడచి పోయింది. నేను అన్నం తిని వెంటనే పడుకుండి పోయా. నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీలేదు. ఉదయం లేచే సరికి 7-00 అయ్యింది.
మా అమ్మ నాకు కాఫీ ఇచ్చి “శ్యా మలా, పెళ్ళి కొడుకు చక్కగా ఉన్నాడే”, అంటూ మళ్ళీ ఆ మాటలే మొదలెట్టింది. నన్ను “కుదురుగా ఇంటి పట్టున ఉండూ, ఈ సంబంధం సంగతి తెలిసే దాక ఏంటి వింటున్నావా” అంది.
నేను “సరే లే బాబూ రోజూ ఉండే గొడవే కదా” అని మా అమ్మ పెట్టిన టిఫిన్ తిని అలా గే ఇంటి లో కూర్చున్నా.
ఇంకా ఉంది.

451620cookie-checkశ్యా మల-19 వ భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *