మల్హోత్రా కళ్ళు మూసుకుని పక్కకి పడుకున్నాడు. ఇంతలో వాన్ డోర్ తెరుచుకుంది. సిగ్గుగా మల్హోత్రా, జూలీ ఇద్దరూ తమ బట్టలు మీదికి లాక్కున్నారు.
రిచర్డ్స్ నవ్వుతూ వారిని సమీపించాడు. “వెల్ mr మల్హోత్రా.. మా జూలీ కంపెనీని బాగా ఎంజాయ్ చేశావ్ అనుకుంట?” అంటూ సూటిగా మల్హోత్రా కళ్ళలోకి చూశాడు.
మల్హోత్రా తల దించుకుని అవునన్నట్టు తల పైకి కిందకి ఆడించాడు.
“ఓకే మల్హోత్రా.. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తున్నాను. rest in peace” అన్నాడు గన్ తీస్తూ.
మల్హోత్రాకి గుండె ఆగినంత పనయ్యింది. “సర్ నేనేం చేశాను? ప్లీజ్ నాకు డబ్బు కూడా వద్దు. నన్ను వదిలెయ్యండి చాలు” ఒక్క ఉదుటున వాన్ నుంచి కిందకి దూకి రిచర్డ్స్ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నట్టు అన్నాడు.
“నో.. నో.. నో మల్హోత్రా.. ఇది డబ్బు సమస్య కాదు. నువ్వు ఒక హత్య చేశావనుకో? అక్కడ ఆధారాలు ఏమీ దొరక్కుండా జాగ్రత్త పడతావ్ కదా? ఇదీ అంతే”
“సర్ ప్లీజ్ సర్.. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఇక ముందు ఎవ్వరికీ చెప్పను కూడా.. నన్ను వదిలేస్తే నా బతుకు నేను బతుకుతాను”
“కమాన్ మల్హోత్రా బుర్ర పెట్టి ఆలోచించు. నేను నిన్ను వదిలితే ఎంత నష్టమో? నీతో పాటు నీ కొలీగ్స్ కూడా వస్తారులే.. కావాలంటే మన జూలీని కూడా తీసుకెళ్ళు. నీకు ఫుల్ టైంపాస్..” అన్నాడు జూలీ వైపు చూసి వెకిలిగా నవ్వుతూ..
“బా.. స్స్..” అంది భయం భయంగా రిచర్డ్స్ వైపు చూస్తూ. రిచర్డ్స్ ని చూస్తుంటే యముడే బ్రాండెడ్ బట్టలేసుకుని తన ముందు నిలుచున్నట్టు ఉంది.
“ఏంటి బేబీ షాక్ అయ్యావా? నువ్వు CIA లో వర్క్ చేస్తున్న విషయం నాకు తెలుసు. ఇక్కడి ఇన్ఫర్మేషన్ లీక్ చేశావని కూడా తెలుసు. ”
రిచర్డ్స్ ఇంకా చెప్పడం పూర్తి కాకుండానే మెరుపు వేగంతో షూ నుంచి గన్ తీసి రిచర్డ్స్ కి గురి పెట్టింది జూలీ. “ఓహ్.. సారీ రిచర్డ్స్.. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వు అక్కడికి రావు. ఇక్కడే ఉంటాను అంటావ్. సరే జైలుకి వస్తావా? ఇక్కడే చస్తావా? ఛాయిస్ నీదే డియర్” అంది రిచర్డ్స్ కళ్ళలోకి సూటిగా చూస్తూ.
రిచర్డ్స్ ఆమె వైపు వెటకారంగా చూస్తూ “ఓహ్ మై డియర్ పూర్ డార్లింగ్.. నాకు ఇన్ని తెలుసు కానీ నీకే నీ సుపీరియర్ గాబ్రియేల్ నా మనిషని, ఇప్పుడు ఎటువంటి ఫోర్సు ఇక్కడికి రావట్లేదని మరీ ముఖ్యంగా నీ గన్ లో బుల్లెట్లు లేవని తెలియలేదు పాపం.. హస్తలవిస్త బేబీ..” మాట పూర్తి కాకుండానే బుల్లెట్ జూలీ బుర్రలోకి వెళ్ళిపోయింది.
రిచర్డ్స్ వెంటనే మల్హోత్రా వైపు తిరిగి ” ఇక్కడ నమ్మకంగా పని చేసిన వాళ్లనే చంపేద్దాం అని డిసైడ్ అయిపోయాను.. ఇంక మోసం చేసే వాళ్ళని ఎందుకు వదిలేస్తాను చెప్పు?.. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మల్హోత్రా?” గోముగా అడిగాడు మల్హోత్రాని.
మల్హోత్రాకి అర్ధం అయిపోయింది తన చావు ఫిక్స్ అని. సెకన్లు లెక్కపెట్టుకుంటున్నాడు. అందుకే ఇంక ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
“నువ్వేం కంగారు పడకుండా కళ్ళు మూసుకో.. చస్తున్నావ్ అని తెలిసేలోపు చంపేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీకు ఇందాక జూలీతో పడక ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా?” చంపబోయేవాడల్లా ఆపి అడిగాడు రిచర్డ్స్.
తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపాడు మల్హోత్రా అయోమయంగా.
“ఏమీ లేదు మల్హోత్రా.. కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలు అవుతారంట. మళ్ళీ నీతో నాకెందుకులే రిస్క్ అని ఎకౌంటు సెటిల్ చేసేసా. ఇప్పుడు హ్యాపీగా చచ్చిపో.. బా…య్..” అని స్మూత్ గా మెదడులోకి పోనిచ్చేసాడు రెండు బుల్లెట్లు.
ఇదంతా నక్కి చూస్తున్న మల్హోత్రాకి బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. కొంచెం ఉంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది.
రిచర్డ్స్ బయటకి నడుస్తూ మిగిలిన సైంటిస్టులని కూడా చంపేసి అందరినీ ముక్కలుగా నరికి బయట పారేయ్యమని ఆదేశించి వెళ్ళిపోయాడు.
రిచర్డ్స్ మనుషులు అందరినీ చంపేసి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఆ శవాల్ని ట్రక్కులో వేసుకుని వెళ్ళిపోయారు.
మల్హోత్రా వాళ్ళు వెళ్ళిపోయాక క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. గదిలోకి పరుగు పరుగున వెళ్లి వర్తమానంలోకి వచ్చేశాడు.
తన చాంబర్ లోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. ఇంకా గుండె దడ తగ్గటం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాసేపు కళ్ళు మూసుకుని అలాగే పడుకున్న మల్హోత్రా “మల్హోత్రా.. అర్ యూ ఆల్రైట్?” అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా చూశాడు.
ఆ గొంతు ఎవరిది? తర్వాత జరగబోయే పరిణామాల కోసం తప్పనిసరిగా ఎదురు చూడండి.