ఓన్లీ ఒన్ చాన్స్

Posted on

మొదట్నుంచీ రామారావుది మధ్య తరగతి కుటుంబమే. రామారావు తండ్రి జగన్నాధం ప్లీడరు గుమస్తాగా పనిచెసి ఎకరమ్న్నర మాగాణి సంపాదించగలిగాడు.
ముచ్చటగా ముగ్గురు పిల్లలతో కళకళలాడుతూ తిండికి లోటు లేకుండా ఉండేది. కానీ విధి ఎప్పుడూ మధ్య తరగతి కుటుంబాల మీదనే తన వికట్వాన్ని ప్రదర్శిస్తూంటుంది.

కూతురు పెళ్ళికో అరెకరం, భార్య క్షయ వ్యాధికో అరెకరం, రామారావు చదువుకో అరెకరం ధారపోసి వట్టి చేతులతో మిగిలిపోయాడు వయసుమళ్ళిన ఆ ప్లీడరు గుమస్తా. రామారావు ఎం.ఏ ఫస్టుక్లాసులో పాసయినపుడు గర్వంతో పొంగిపోయాడు. రేపు కొడుకు ఓ వెయ్యిరూపాయిల జీతగాడయితే తన శ్రమకో అర్ధం దొరుకుతుందని మురిసిపోయాడా పిచ్చి ప్లీడర్ గుమస్తా. కానీ ఉద్యోగానికి కావలసినవి ఫస్టుక్లాసులూ, గోల్డ్ మెడల్సూ కావని అంతకుమించిన “రికమెండేషన్” అర్హత ఉండాలనీ తెలుసుకోలేకపోయాడు.

లేకుంటే డైనమిక్ పెర్సనాలిటీ, ఫస్టుక్లాస్ పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీగల రామారావు ఏ ఇంటర్యూకు వెళ్ళినా “నాట్ సెలెక్టెడ్” అనిపించుకోవడం ఏమిటి?
చదువు పూర్తయిన సంవత్సరమే ఐదువేలు కట్నమూ, బ్యాంకులో ఉద్యోగమూ ఇప్పిస్తామని వచ్చిన గుడివాడ సంబంధాన్ని కాదన్నాడు రామారావు.

చిన్నప్పటుంచీ కలిసిమెలిసి తిరిగి, వయసుతోపాటూ పద్మజ పట్ల తను పెంచుకున్న అనురాగమె దానికి కారణం. కొడుకు ఉద్దేశ్యాన్ని విన్న జగన్నాధం, ఆ కుటుంబంతో తనకు ఉన్న చిరకాల పరిచయం దృష్ట్యా కాదనలేకపోయాడు.

పద్మజ చాలా అందమైనదనే చెప్పుకోవాలి. పొడవుగా, సన్నగా ఉంటుంది. ఒత్తైన ఉంగరాల జుట్టు, గాజులా మెరిసే పసుపుపచ్చని శరీరం, కోలగా అందంగా ఉండే మొహం, చేపపిల్లలాంటి చలాకీ కళ్ళు, అందంగా ఒంపుతిరిగిన సన్నని ముక్కు, మొనతేరిన గెడ్డం, గెడ్డం మీద పుట్టుమచ్చ.. చూసిన పడుచువాళ్ళ గుండెల్లో గుర్రాలు పరిగెత్తించేంతటి అందం పద్మజది.

ఆరుగురు సంతానాన్ని, భార్యని, ముసలితల్లినీ పోషిస్తూ, బ్రతుకును బరువుగా యీడ్చుకొస్తున్న కోర్టు గుమస్తా కూతురు పద్మజను, కానీ కట్నం లేకుండా చెసుకున్నాడంటే రామారావు విశాల హృదయంకంటే కళ్ళు జిగేల్ మనిపిచి ఒళ్ళు జల్లుమనిపించే పద్మజ అందమేనని చెప్పుకోవాలి.

రామారావు మొదట్నుంచీ తన భవిష్యత్తు గురిచి ఓ నిర్ధుష్టమైన పధకాన్ని వేసుకున్నాడు. ఆ పధకాన్ని రంగురంగుల కలల్లో నిలుపుకున్నాడు. ఓ బంగళా… బంగళాముందో గార్డెన్, అందమిన భార్య, ఓ పాప, ఓ బాబు. కారు, చేతినిండా డబ్బు, చీకుచింతా లేని జీవితం. ఇదీ రామారావు పధకంలోని భవిష్యత్తు రూపం. కానీ వర్తమాన జీవితంలో అవి గాలిమేడల్లా మాత్రమే నిలిచిపోయాయి. దానిలో రామారావు సాధించిందీ, తనకు లభించిందీ ఒక్కటే అందమైన భార్య.

డిగ్రీ తీసుకున్న తరువాత రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. రెండు సంవసరాలపాటు పత్రికల్లో వాంటెడ్ కాలంస్ లో పడ్డ ప్రతీ ప్రకటనంకూ అప్లై చేశాడు. సగటున రోజుకో అప్లికేషన్ పెడితే, ఆరునెలలకో ఇంటర్వ్యూ వచ్చేది. కానీ ఫలితం మాత్రం “నాట్ సెలెక్టెడ్”.

ఈ ఉద్యోగమైనా జగన్నాధం పనిచేసే ప్లీడరుగారి రికమెండేషన్ ద్వారా వచ్చింది.
రామారావుకు నచ్చకపోయినా, ఖాళీగా వుండి చేసేది లేకనూ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యాను చేరక తప్పింది కాదు. చేరిన దగ్గరనుంచీ “బెటర్” చాన్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం శూన్యం. అందుకే ఏ సరదాలూ తీర్చుకోడానికి ఉపయోగపడని తను జీవిస్తున్న జీవీం నరకంలా తోస్తుంది. దానిలోంచి బయటపడాలి.
రామారావుకు నిద్ర పట్టటంలేదు. కళ్ళు తెరిచి పైకప్పు వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు.
మద్యహ్నం ఆఫీసులో జరిగిన సంఘటన మెదుల్తోంది కళ్ళముందు.

“అయ్యగారు రమ్మంటున్నరు…”
మంత్లీ అడ్వాన్స్డ్ టూర్ డైరీ వ్రాస్తున్న తను తలెత్తి చూశాడు.
“నిన్ను చూస్తుంటే జాలేస్తుండోయ్…” అన్నారు సుబ్బారావుగారు, టేబుల్ నీదకు వాలుతూ.
తనేమీ మాట్లాడలేదు. “నిన్ను చూస్తే జాలివేస్తుంది” అన్న మనిషి “ఎందుకు జాలి కలుగుతుందో” చెబుతాడని తెలుసు తనకు.

“ఎం.ఏ ఫస్టుక్లాస్… మంచి ఎబిలిటీస్. బ్రహ్మాండమైన పెర్సనాలిటీ… మంచి ఎడ్మినిస్ట్రేటివ్ కెపేసిటీ… అన్నీ వుండి, నువ్వీ ఉద్యోగం చేస్తున్నావంటే…”
తను తలవంచుకుని వింటూ వుండిపోయాడు.
“అన్నట్టు హైద్రాబాద్ లో మన బ్రాంచి ఒకటి ఓపెన్ చేస్తున్నాం తెలుసా?”
త్లుసన్నట్లు తలూపాడు తను.

“దాని బ్రాంచి మేనేజర్ పోస్టు ఎవరికిద్దామా అని ఆలోచిస్తున్నాం,,,” తనలో ఆనందం పొంగుతూంది. చెవులు రిక్కించి వింటున్నాడు.
“పన్నెండువందలు జీతం, వెల్ ఫర్నిష్డ్ క్వార్టర్సు… ఓ కారు…” తనూహించుకున్న భవిష్యత్తే అది. ఈ రోజు సజీవంగా తన ముందుకొస్తూంది. ఊపిరి బిగబత్ట్టి వింటున్నాడు తను.

“మన కంపెనీలో ఆ పోస్టుకు ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తున్న రెండు రోజులనుంచి…”
తను ఆత్రంగా చూశాడాయన వైపు.
“నా దృష్టిలో…”
“త్వరగా చెప్పండి…” అని అరుద్దామనిపించింది.
“నీ వొక్కడివే కనిపించావు…”
తన వెన్ను జలదరించింది… ఒళ్ళు తేలికై ఎక్కడికో తేలిపోతూంది.
ఆనందంతో పిచ్చిగా అరచి గంతులు వేయాలనిపించింది.

“చాలా అదృష్టవంతుణ్ణి సార్! మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను” గొంతుక తడబడింది… వణికే చేతుల్ని జోడించి నమస్కరించాడు.
“అన్నట్టు…”
ఆత్రంగా చూశాడు తను.
“మీ ఆవిడ చాలా అందంగా ఉంటుందట కదూ…”

ఉలిక్కిపడ్డాడు తను… బిత్తరపోయాడు… రక్తం మొహంలోకి తన్నుకు వచ్చింది.
“సుబ్బారావుకు ఆడవాళ్ళపిచ్చి ఎక్కువనీ, కటికి నదురుగా అందంగా కనిపించిన ఆడదాన్ని పొందకుండా నిద్రపోడనీ… తన కంపెనీలో పనిచేసే వారికెవరికైనా అందమైన భార్యలుంటే వారికేవో ఉపకారాలు చేసి వారి భార్యల్ని పొందుతాడనీ, వాళ్ళిష్టపడకపోతే ఏవో కారణాలు చూపించి ఉద్యోగాల్లోంచి పీకించేస్తాడనీ…” తను విన్నాడు. కానీ అతని దాహానికి తను కూడా తల వంచాలనీ, ఆ స్థితి తంకీ వస్తుందనీ ఆలోచించలేదు. కోపంతో వణికిపోయాడు తను.

“ఆలోచించుకో… ఇటువంటి గొప్ప అవకాశం నీకు మళ్ళీ పది జన్మలెత్తినా రాదు. నాటె ఆర్డినరీ ఆపర్ట్యూనిటీ… నిన్ను రికమెండు చేద్దామని అనుకుంటున్నా…”
సుబ్బారావుగారు రికమెండ్ చేయడమంటే ఆర్డరు వెయ్యడమేనని తెలుసు తనకు. పన్నెండువందల జీతం. కారు, బంగళా… నౌకర్లు… తనకు కావలసినదీ, తనూహించుకున్న భవిష్యత్తూ అదే… కానీ ఇంత నీచమైన కోర్కెకు ఎలా ఒప్పుకునేది.

“ఆలోచించుకో… నీకింతటి ఉపకారాన్ని చేస్తున్నాను. ని భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే అది నీ చేతుల్లో ఉంది. నీకీ చాన్స్ అందుకోవాలని ఉంటే… నాకో చాన్స్… అంతే!…” పేపర్ వెయిట్ ను గిర్రున తిప్పుతూ అన్నారాయన.
ఆ పేపర్ వెయిట్ లానే తిరుగుతుంది తన తల కూడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *