ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 13

Posted on

“నాకు తెలుసు శ్రీ. ఇలాంటి కోరిక మన పెళ్ళికి ముందు సిమ్రాన్ నిన్ను కోరింది అని, అయినా నీవు ఒప్పుకోలేదని తెలిసి నీ మీద ఎంతో గౌరవం కలిగింది. నీ లాంటి మగాళ్లు చాలా అరుదు. నిజానికి నాకు కూడా పూర్తిగా ఇష్టమయి కాదు. పోనీ వేరే ఉపాయం ఏదైనా ఉంటే నువ్వే చెప్పు.” భర్తకు వేరే ప్రత్యాన్మాయం లేకపోతె తన తర్కంతో దారిలోకి తెచ్చుకోవచ్చు అన్న భావనతో అంది.

కావ్య సిమ్రాన్ ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం చూడటంతో, భార్య ఆ విషయం చెప్పడం అంత ఆశ్చర్యం కలగచేయలేదు. గతంలో కావ్య కూడా ఇండైరెక్ట్ గా ఆ ప్రస్తావన తీసుకు రావడం గమనించి తాను పట్టించుకుపోవడం గుర్తే తనకు. కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించాడు. తనకు సమయం ఇవ్వడానికి కిచెన్ లోకి వెళ్లి పళ్ళ రసం తీసుకొని ఇచ్చింది.

మెల్లిగా తాగుతూ, “ఇదే సమస్య మనకు వస్తే, నాలోనే లోపం ఉంటే, తప్పనిసరిగా ఫెర్టిలిటీ సెంటర్ కు వెళ్లే వాళ్ళం. సౌమ్య కూడా శశిధర్ తో మాట్లాడితే బాగుంటుంది కదా?”

“నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ అందరూ నీలా ఉండరు కదా! సౌమ్య దృష్టిలో, మరిది బాగా చదువుకున్న నీకున్నంతా విశాల హృదయం లేదు. దానికి తోడు అతను ఈ లోపాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాడన్న నమ్మకం లేదు తనకు. అసలు ఇంతవరకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నా ఎందుకు సక్సెస్ అవ్వడంలేదో అన్న ఆలోచనే అతనికి రాలేదు అంటె అర్ధం చేసుకో. ఒక వేళ అతనికి అసలు విషయం తెలిస్తే ఎలా తీసుకుంటాడో అని భయపడుతోంది చెల్లి.”

ఇక వేరే దారి లేక ఆఖరి అస్త్రం వదిలాడు. “వివాహ బంధంలో భార్య భర్తలు సమానమని నమ్మేవాడిని. మగవాన్ని, నేను ఏదైనా చేయొచ్చు అన్న భావన ఎప్పుడు లేదు. నేను చేసే ఏ పనైనా చేసే హక్కు నా భార్యకు ఉంది. అదే మార్గదర్శకంగా నడుచుకొన్న ఇన్నాళ్లు”, అన్నాడు ఉద్వేకంగా.

భర్త ఏమి చెప్పదల్చుకున్నాడో అర్ధం అయ్యింది కావ్యకు. అతని మీద ఎనలేని ప్రేమ ఉప్పోగింది. చటుక్కున లేచి అతని పక్కన కూర్చొంది. గాఢంగా కౌగలించుకొని ముద్దులు పెట్టింది. చివరికి అతని ఛాతీపై తలవాల్చి మెల్లగా చెప్పింది.

“నీ లాంటి భర్త దొరకటం నా అదృష్టం. నా ఫ్రెండ్స్ కు నీ గురించి చెపితే అసలు నమ్మరు. అందుకే చెప్పటం మానేశా. పెళ్లి అయిన తరువాత నువ్వు నాకు ఏ లోటు రానియ్యలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా శృంగార జీవితం చాలా అద్భుతంగా వుంది. బాబు మీద ఒట్టేసి చెబుతున్నా. నాకు వేరే మగాడి గురించి ఆలోచించే అవసరమే లేదు. అంతా సవ్యంగా జరిగితే అసలు ఈ విషయం చర్చకు వచ్చేదే కాదు. కొంత అసంతృప్తిగా ఉన్న చెల్లి కూడా చాలావరకు సర్దుకు పోతుంది. అందుకే సహాయం చేద్దామని అనుకొన్నా. మరి దేవుడు ఎందుకు పెట్టాడో ఈ పరీక్ష దానికి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. దయచేసి వప్పుకో.”

కావ్య అంత స్థిరంగా చెప్పడంతో తాను ఒక నిర్ణయానికి వచ్చిందన్న విషయం పూర్తిగా అర్ధం అయ్యింది. భార్య అంటె ఎంతో ప్రేమ తనకి. తనని పెళ్ళికి వప్పించిన తీరు, కష్టం అంటె ఏమిటో తెలియకుండా పెరిగినా కాపురంలో తన అభీష్టము తగ్గట్టుగా స్వంతగా పనులు చేసుకొని చక్క బెట్టడం, అత్త మామలను నెత్తిన పెట్టుకొని గౌరవించడం, అద్భుతమైన శృంగార జీవితం, ఆర్థికంగా చేయూత నివ్వడం, అలా అన్ని రకాలుగా అనుకూలమైన భార్య కావ్య. చపలచిత్తంతో నిర్ణయాలు తీసుకొనే రకం కాదు. తన లాగే పరిపక్వత కలిగివున్న స్త్రీ.

“ఏ విషయంలోనైనా బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఎందుకంటే ఆ నిర్ణయాల వచ్చే పర్యవసానాలకు మనమే భాద్యులం. దీని ఫలితం సెలయేటిలో రాయి వేస్తె కలిగే చిన్న అలజడా లేక తూఫాను సృష్టించే భీభత్చమా అన్నది అర్ధం కావటం లేదు. ఇంతవరకు హాయిగా గడిచిపోతున్న మన జీవితంలో లేనిపోనీ అవరోధాలు కొని తెచ్చుకుంటున్నామా అనిపిస్తోంది. ఈ విషయం ఏ కారణం చేతనైనా భవిష్య్తతులో బయటికి వస్తే ఎదుర్కునే ధైర్యం, మానసిక స్థైర్యం ఉండాలి”, అన్నాడు కొంచెం ఫిలసాఫికల్ గా.

భర్త మాటల్లో అతని ముందు చూపు, సంశయం అర్ధం చేసుకుంది.
“సొంత చెల్లికి సమస్య వస్తే సహాయం చేయకుండా ఎలా ఉండగలం. దీని వలన వచ్చే పరిణామాలకు నేనే పూర్తిగా భాద్యురాలిని. వివాహేతర బంధంలో స్త్రీ పురుషులు ఐచ్చికంగా శృంగారం జరిపితే తప్పు కాదని చట్టాలే చెబుతున్నాయి. ఇక పొతే దీని వలన అభ్యతరం మరిదికి, నాకు ఉండాలి. అతనికి తెలియదనే అనుకొంటున్న. ఒక వేళ తెలిసినా కలిగే పరిణామాలకు సిద్ధంగా ఉంటేనే ముందడుగు వేయమని సౌమ్యకు చెబుతా. ఇకపోతే నేను. నా పూర్తి సమ్మతంతో జరిగే పని. మనకు ఏ ఇబ్బంది రాదు. ఒక ఆడపిల్ల, నీ మరదలు కాపురం కుదుట పెట్టటం కోసమే అనుకుంటే మీ మనస్సుకు ఊరట కలుగుతుంది” అని అనునయంగా చెప్పి ప్రేమగా ముద్దు పెట్టింది.
“ఆలోచిద్దాం”అన్నాడు తాను ప్రతిగా స్పందిస్తూ.
అంతలో బాబు ఏడవడంతో లేచింది కావ్య. భర్త ఆలోచిస్తాను అనడంతో మనసు కుదుట పడింది.

***************************

మరుసటి రోజు చెల్లికి ఫోన్ చేసింది. ఆర్టిఫిసియల్ ఇన్సిమినేషన్ ద్వారా బిడ్డను పొందే సలహా ఇచ్చింది. అక్క అలాంటిది సజెస్ట్ చేస్తుందని ఊహించిన సౌమ్య రెండు సందేహాలు వెలిబుచ్చింది. మొదట ఎవరో అనానిమస్ డోనార్ అయితే తనకి ఇష్టం లేనట్టు చెప్పింది. తన మనసులో ఎవరున్నారో అని అడిగితె, కావ్య ఊహించునట్టుగా బావ అని చెప్పింది. సర్లే బావను ఒప్పిస్తాను అని చెప్పడంతో మెల్లిగా రెండో సందేహం వెలిబుచ్చింది.
“బయట ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్ కి వెళితే మూడో కంటికి తెలిసే అవకాశం వుంది కదే?”
“మరయితే ఏమంటావు?” చెల్లెలి మనోగతం తెలిసి అడిగింది ఆ ప్రశ్న. సమస్యకు పరిష్కారం ఏదో చెల్లెలి నోటివెంట వస్తే బాగుంటుందని.

“నీకు అభ్యంతరం లేకపోతె….”, ఏమని చెప్పాలో తెలియక ఆగింది. అక్కతో ఉన్న చనువుతో, “బావను ఒప్పించ కూడదు”, అంటూ ఏదో చెప్పబోయి సిగ్గుతో మాటల్ని మింగేసింది.

చెల్లి ఉద్దేశ్యం కూడా అదే కావటంతో ఊపిరి తీసుకుంది కావ్య.
“నీకు బావ సంగతి తెలుసుగా. ఒప్పించడం అంత తేలిక కాదు.”

“తెలుసే అక్క. డిగ్రీ పూర్తయిన తర్వాత, బాబు పుట్టినప్పుడు మీ ఇంటికి వచ్చాను గుర్తుందా. రాత్రి మీ గదిలో జరిగే అల్లరితో, తట్టుకోలేక, వయసు వేడిలో నీవు లేనప్పుడు, బావ మీద పడ్డాను. వేరే ఎవరయినా అయితే లడ్డూ లాంటి కన్నె పిల్ల, అందులో వరసయినది కోరి వస్తే ఊరుకొంటారా? బావ మెత్తగా, బుద్ధి వచ్చేలా, బాగానే ఇచ్చాడే డోసు. అటువంటి ప్రవరాఖ్యుడు దొరకడం నీ అదృష్టం. చూస్తుంటే బావ నీకు ఈ విషయం చెప్పినట్టు లేదు. తన తప్పు లేకపోయినా నా పరువు కాపాడాడు. తన సంస్కారం అక్కడే తెలిసిపోతుంది. నువ్వే బావకు ఎలాగో నచ్చచెప్పి నాకో మార్గం చూపించు.” చెల్లెలి గొంతులో తాను చేసిన తప్పుకి దుఃఖం పడటం స్పష్టంగా తెలుస్తోంది.

ఆ రోజు బాగా గుర్తు వుంది కావ్యకు. చెల్లెలి విచారవదనానికి కారణం తాను ఊహించిందే అయినా, చెల్లెలి నోటితో వినడంతో స్పష్టమయింది విషయం. భర్తను తన నీతి నియమాలు పక్కన పెట్టమని వత్తిడి చేసి అతనిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా అన్న సందేహం కలిగి మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

అక్క మౌనాన్ని ఇంకోలా అర్ధం చేసుకొంది సౌమ్య. “నన్ను క్షమించు అక్క. ఇందులో పూర్తిగా తప్పు నాదే. నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాలి. ఆ అవసరం రాదనుకొన్నాను. కానీ ఇలా అవుతుందని కోలేదు. నీకు ఇబ్బంది అయితే వద్దులే, వేరే ఏమన్నా ఆలోచిద్దాం”, అని అంది బొంగురు గొంతుతో.

తాను ఏదన్న మాట్లాడకపోతే అక్కడ చెల్లి వర్షించేలా ఉందని అర్ధం అయ్యింది. “అదేమీ లేదులే. ప్రయత్నిస్తాను” అని చెప్పింది కావ్య.

అక్క సమ్మతి తెలియజేయడంతో, “నీవు తలచుకుంటే సాధించలేనిది ఏమి ఉండదు. బావకు నీవంటే అమిత మైన ప్రేమ. నీ మాట వింటాడు. దయచేసి ఈ సహాయం చేసి పుణ్యం కట్టుకోవే. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను”.

ఆనందం, ఉద్వేగం కలిసిన చెల్లెలి మాటలతో కావ్య రిలాక్స్ అయ్యింది. అప్పటికే తాను ఆ పని చేసి ఉండటంతో తల మీద బరువు తగ్గినట్టనిపించింది. భర్త చెప్పిన విషయం మాత్రం మరిచిపోలేదు.

“నీ సినిమా డైలాగ్స్ ఆపవే. బావతో మాట్లాడి చూస్తాను. కానీ రేపొద్దున్న పుట్టే బిడ్డ పోలికలతోనో, లేక వేరే విధంగా మరిదికి తెలిస్తే ఎలా ఎదుర్కుంటావో?”

అక్క బావతో మాట్లాడతానని రూఢిగా చెప్పటంతో చాలా సంతోషం వేసింది సౌమ్యకు.
“అక్కా ఇది పూర్తిగా నా నిర్ణయం. రేపొద్దున అలాంటి సమస్య వస్తే నేనే ఎదో ఆలోచిస్తాను. అన్ని ఆలోచించిన మీదట నాకు ఇదే మంచి ఆప్షన్ అనిపించింది. మొదటినుంచి నేనే నిన్ను అడుగుదామని అనుకొంటున్న. కానీ నువ్వు ఏమనుకుంటావో అని ధైర్యంగా అడగలేదు. ఇప్పుడు సిగ్గు విడిచి చెబుతున్నా. అన్నింటిలో ఇదే మంచి ఆప్షన్.”

“సర్లే బావతో మాట్లాడిచూస్తాను. నీ ప్రయత్నం మాత్రం మానవద్దు.” అంటూ అంతటితో సంభాషణ ముగించింది.

అక్క బావతో మాట్లాడతాను అన్న భరోసా ఇవ్వటంతో తలపై నుంచి పెద్దభారం దింపినట్టు తేలిక పడింది. బావ విషయం తనకు తెలిసిఉండటంతో ఏమి చెప్తాడా అన్న సందిగ్ద మాత్రం ఉండి పోయింది.

176162cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *