ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 11

Posted on

శ్రీరామ్ కి మేనేజర్ గా ప్రమోషన్ రావడంతో బిడ్డ పుట్టిన వేళా విశేషం అని అనుకున్నా అందరికి అది శ్రీరామ్ ప్రతిభ వల్లేనని తెలుసు. ఆ ఆనందంలో అల్లుడుకి BMW కార్ కొనే విషయం మళ్ళీ ప్రస్తావనకు తెచ్చాడు రాజారావు. శ్రీరామ్ సున్నితంగా తిరస్కరిస్తూ ఆ డబ్బుతో పేదలకు కానీ, తన కంపెనీ ఉద్యోగులకు ఏమైనా చేస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చాడు. అది నచ్చి రాజారావు తన కంపెనీలో ఒక స్థాయి ఉద్యోగుల వరకు, పిల్లలు మెరిట్ తో ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ లో అడ్మిషన్ వస్తే డిగ్రీ పూర్తి చేసేవరకు కాలేజీ ఫీజులు కంపెనీ భరించే విధంగా బెనిఫిట్ ప్రకటించాడు. ఉద్యోగులు చాలా హర్షించటమే కాకుండా, రాజారావు దంపతులకు సన్మానం చేసి తమ సంతోషాన్ని తెలియచేసారు. తనను ఆ విధంగా ఆలోచింపచేసినందుకు అల్లుడిని మనస్ఫూర్తిగా అభినందించాడు రాజారావు. అలాంటి అల్లుడ్ని పొందినందుకు గర్వ పడ్డారు దంపతులిద్దరూ.

*****************

డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాసింది సౌమ్య. క్యాంపస్ ఇంటర్వూస్ లో లోని ఒక బెంగుళూరు సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. జాయిన్ అవడానికి ఇంకా సమయం ఉండటంతో హైదరాబాద్ వచ్చింది సౌమ్య. తల్లి సహాయంతో కావ్య త్వరగానే రికవరీ అయ్యింది. కొన్ని రోజులు తరువాత సౌమ్య తోడుగా ఉండటంతో జానకి విజయవాడ వెళ్ళిపోయింది. సీత కూడా చాలా కాలం నుంచి ఉండటంతో అవసరం అయితే మళ్ళా వస్తానని జానకితో వెళ్ళిపోయింది. ఇంట్లో పిల్లాడిని చూస్తూ ఫుల్ టైం పనిచేసేలా రోజాని అడిగింది కావ్య. తనకి ఇష్టం ఉన్నా ఇంట్లో పెళ్లి సంభందాలు చూస్తున్నారని, కుదిరితే పరిస్థితుల బట్టి మానెయ్యాల్సి రావచ్చు అని చెప్పటంతో, రోజాకి జీతం పెంచి పొద్దున్న వంటలో కూడా సహాయం చేసేట్టు మాట్లాడుకుంది. పెళ్ళికి ధన సహాయం చేస్తానని మాటిచ్చింది కావ్య. కొంత కాలం పిల్లాడిని చూడటానికి ఊరునించి ఎవరినైనా ఆడమనిషిని చూడమని చెప్పింది కావ్య తల్లికి.

డెలివరీ అయ్యి ఆరు వారాలు కావడంతో మళ్ళీ కలవడం మొదలు పెట్టారు కావ్య శ్రీరామ్ లు. చాలా కాలం అయ్యిందేమో మొదటి సారి శోభనంలా ఏర్పాటు చేసింది కావ్య. సౌమ్య కూడా ఇంట్లోనే ఉందని శ్రీరామ్ వారించినా, దానికి తెలియంది ఏమి లేదు అంటూ వినలేదు. వారాంతాల్లో కావ్యకు ఎంత ఉబలాటం ఉన్నా శ్రీరామ్ కొంచెం నియంత్రణ పాటించే వాడు. అక్క బాధ గమనించి సౌమ్యే పిల్లాడిని తీసుకొని తన గదిలో ఆడిస్తూ వాళ్లకు ఏకాంతం కల్పించేది. అక్కతో చనువు ఉండటంతో, ఉబలాటం కొద్దీ ఎన్ని సార్లు అంటూ కొంచెం ప్రైవేట్ విషయాలు అడిగేది. సౌమ్యకు బావతో చాలా టైం పాస్. తాను ఎంత రెచ్చిపోయినా, కవ్వించినా శ్రీరామ్ మాత్రం తన పరిధిలో ఉండేవాడు. వీక్ డేస్ లో మాత్రం పని ఎక్కువ కావడంతో కొంచెం ఆలస్యంగా వచ్చేవాడు. వారాంతాల్లో మాత్రం సినిమాలకు, మాల్ కు, రెస్టారెంట్ లకు వెళ్లే వారు. సౌమ్య కూడా సహాయం చేస్తుండటంతో ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి నిశ్చయించుకుంది కావ్య. సౌమ్యకి కూడా పిల్ల వాడితో, అక్క బావాలతో, సినిమా షికార్లతో సమయం బాగానే గడిచి పోతుంది. రాత్రుళ్ళు అక్క బావ బెడ్ రూమ్ బయట ఉండి, వాళ్ళ ఆనందం తాలూకు చప్పుళ్ళని, రాగాలని, మాటలని వింటూ వేడెక్కి పోయేది. తర్వాత తన గదిలో దూరి ఏమేమో ఊహించుకుంటూ నీరు కారి పోయేది.

*****************

ఆ రోజు ఎప్పటి లాగే కావ్య ఆఫీస్ కి బయలు దేరింది. ముందురోజు ఆఫీస్ లో రాత్రి చాలా లేట్ గా పనిచేయడంతో శ్రీరామ్ ఆలస్యంగా లేచి ఇంటి నుండే పని చేస్తాను అని చెప్పడంతో వెళ్లి పోయింది. సాయంత్రం కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా స్తబ్దుగా ఉంది. బాబు పడుకొని వున్నాడు. ఎప్పుడు తనకు నవ్వుతూ హాల్లో పలకరించే సౌమ్య కనపడక పోవడంతో తన గదిలోకి వెళ్ళింది. తలుపు దగ్గరగా వేసి ఉండటంతో, డోర్ పై మెల్లిగా తట్టి లోపలికి వెళ్ళింది కావ్య. మంచంపై కొంచెం విచార వదనంతో కళ్ళు మూసుకొని ఉంది సౌమ్య. నిద్ర పోతున్నట్టు కనిపించలేదు కానీ, తనని ఆ పరిస్థితిలో కదిలించడం కంటే ప్రైవసీ ఇవ్వడం మేలని బయటకు వచ్చి తలుపు దగ్గరకి వేసింది. మూడో గదిలోకి వెళ్లి చూస్తే శ్రీరామ్ తన పని తాను చేసుకుంటూ కనిపించాడు.

చెల్లెలు గురించి అడుగుదామా అనుకొంది కానీ, ఏమైనా ఉంటే తానే చెప్తాడు అని, “రోజా రాలేదా ఇంకా?”
“లేదు. కొంచెం టీ చేసి ఇస్తావా?” అని అడిగాడు.
“ఏమైనా చేసేదా?”
“అత్తయ్య గారు తెచ్చిన జంతికలు ఇంకా ఉన్నాయి కదా. అవి పెట్టు”, అన్నాడు పనిలో నిమగ్నమై పోతూ.
అలాగే అంటూ కిచెన్ లోకి వచ్చి టీ పెడుతుంటే రోజా వచ్చింది. టీ అయ్యే సమయానికి సౌమ్య కూడా వచ్చింది. మొహం కడుక్కున్నదేమో ఆ విషాదపు ఛాయలు కనిపించలేదు. మనిషి మాత్రం ముభావంగా హాల్లో కూర్చుంది. భర్తకు జంతికలు ప్లేట్ లో పెట్టి రోజాతో పంపించింది. తాను టీ కప్పు తీసుకొని ఇంకో కప్పులో సౌమ్యకు ఇచ్చి ఎదురుగా కూర్చుంది.

సౌమ్య ఏమి మాట్లాడక పోవడంతో తానే కదిపింది.
“ఏమన్నా జ్వరంగా ఉందా? ఒంట్లో ఏమన్నా తేడా చేసిందా?”
“లేదక్కా బాగానే ఉంది.కొంచెం తల నెప్పిగా ఉంటె పడుకొన్నాను అంతే”

ఇక రెట్టించలేదు కావ్య. కాకపొతే చెల్లెలు మూడీగా ఉండటం గమనించింది. రాత్రి భోజనాల దగ్గర కూడా అలానే ఉంది. ఎప్పుడూ ఏదో గల గల మాట్లాడుతుండే తను కొంచెం స్తబ్దుగా ఉండటంతో ఏదో విషయం ఉండి ఉంటుంది అనుకొంది. రాత్రి పడక గదిలో తాము దూరిన తర్వాత శ్రీరామ్ తలుపు కింద గ్యాప్ పూరించేలా ఒక ఫ్లోర్ మాట్ పెట్టడం గమనించింది. ఎందుకని అడిగితె మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎవరైనా ఉంటె అన్నాడు. ఎప్పటిలాగే పిల్లాడిని నిద్ర పుచ్ఛి స్వర్గ సుఖాలు చవి చూసారు. భర్త ఏమైనా చెబుతాడేమో అని చూసింది కాని ఏమి చెప్పక పోవడంతో తను మాములాగానే ఉండి పోయింది. మరుసటి రోజు శుక్రవారం. ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత కూడా అదే వాతావరణం. సౌమ్య మామూలుగానే మాట్లాడింది కాని తన సహజ మైన అల్లరి ఎక్కడ కనిపించలేదు. తను గంభీరంగా ఉంటె ఒక రకమైన హుందాతనంతో బాగున్నా, చెల్లి మనసులో ఏముందా అని ఆలోచిస్తూనే ఉంది కావ్య. భోజనాలప్పుడు శనివారం ప్లాన్ డిస్కస్ చేయబోతే, తను మరుసటి రోజు విజయవాడకు ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టు చెప్పింది సౌమ్య. ఇంకా బెంగుళూరు వెళ్ళటానికి రెండు వారల సమయం ఉంది కదా అని సరి చెప్పపోయినా వెళ్ళటానికే పట్టు పట్టింది సౌమ్య.

మరుసటి రోజు మధ్యాహ్నం టీ తాగిన తర్వాత ఎయిర్పోర్ట్ కి బయలు దేరారు. ఎప్పటి లాగే కావ్య, బాబుతో వెనక సీట్లో కూర్చుంటే, శ్రీరామ్ పక్కన సీట్ లో కూర్చుంది సౌమ్య. బావా, బావా అంటూ ఎప్పుడు వాగుతుండే తను నిశ్శబ్దంగా ఉంది. శ్రీరామ్ జాబ్ గురించి అడిగిన విషయాలకు మాత్రం సమాధానాలు చెప్పింది. ఎయిర్పోర్ట్ లో పార్క్ చేయకుండా డిపార్చర్ లో గేట్ దగ్గర డ్రాప్ చేయమంది. కార్ లో బేబీ సీట్ లో బాబు నిద్ర పోతుంటే చెల్లికి వీడ్కోలు చెప్పటానికి దిగింది కావ్య. బూట్ లో ఉన్న సూట్ కేసు తీసుకొని సౌమ్య రోల్ చేస్తూ నడుస్తుంటే తన వెంటే నడిచింది కావ్య. సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఆగి అక్కను హత్తుకొంది. చెల్లి కన్నుల్లో కన్నీళ్లు తిరగడం స్పష్టంగా కనిపించింది కావ్యకు.

“బావా చాలా మంచోడు అక్క. నీవు చాలా అదృష్ట వంతు రాలివి. బావను బాగా చూసుకో” అంటూ తన చేతిని నొక్కి వడి వడిగా వెళ్ళిపోయింది.

ఏమి మాట్లాడో తెలియక చూస్తూ ఉండిపోయింది. ఎక్కువ జనం లేకపోవడంతో త్వరగానే లోపలికి వెళ్ళింది. వెళ్ళిపోతే వెనక్కి తిరిగి కొంచెం నవ్వు ముఖం పెట్టి చెయ్యి ఊపి చెక్ ఇన్ కౌంటర్ వైపు వెళ్ళిపోయింది. చివరికి తను నవ్వుతూ వెళ్లడంతో ఊపిరి పీల్చుకుంది కావ్య. తిరిగి వస్తూ కార్ లో సౌమ్య గురించి అడుగుదామనుకొని నోటి చివర వరకు వచ్చినా ఆపుకొంది. సిమ్రాన్ విషయంలో కూడా తన తప్పు ఏమి లేకున్నా ఆమె కోరిక గురించి ఎప్పుడు చెప్పలేదు. ఆడవాళ్ళ ప్రైవసీ, అంతరంగ విషయాలు వేరే అభిప్రాయం కలుగ చేస్తాయేమోనని చెప్పే స్వభావం కాదు తనది. ఏదో జరిగి ఉంటుంది, కాని అతను చెప్తేనే కాని అడగ కూడదు అని నిర్ణయించుకొంది.

రాత్రి భోజనం తర్వాత చెల్లికి బాగానే చేరావా అంటూ ఫోన్ చేసింది. సౌమ్య మాములాగానే మాట్లాడిన, తనూ ఏమి చెప్పక పోవడంతో ఆ విషయం గురించి మరచి పోవాలని నిశ్చయించుకుంది.

176122cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *