‘ఏం చేయాలా…?’ అని తను అనుకుంటుండగా, సరిగ్గా అప్పుడే…. ఏవరిదో గట్టి గట్టిగా అడుగుల శబ్దం తనకి వినబడింది. తనింక ఏమీ ఆలస్యం చేయక వెంటనే లేచి నిలబడి, “హలో…! ఎవరైనా వున్నారా? ప్లీజ్…. హెల్ప్ అజ్… వుయ్ ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్!” అని చేతుల్ని వూపుతూ గట్టిగా అరిచింది. తన గొంతు బొంగురుగా అన్పించడంతో సవరించుకుని మళ్ళీ అరవడానికి నోరు తెరిచింది.
★★★
అజయ్ ఆ అరుపుని వినగానే చటుక్కున తన కుడి ప్రక్కనున్న చెట్టు దగ్గరికి పోయి అక్కడున్న పొదల్లోకి దూరాడు. అక్కడ ఒక అమ్మాయి నిల్చొని చేతులూపుతూ అతనికి కనబడింది. బస్సులో తన వెనకాల కూర్చుంది. ఆమె ప్రక్కనే తమ బస్సు క్లీనర్ నేలమీద పడి వుండటం కన్పించింది. చూస్తుంటే అతను అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా అనిపించిందతనికి. అజయ్ ని చూడగానే ఆ అమ్మాయి, “స్…సార్… ప్లీజ్ హెల్ప్… ఇతనికి ప్…పాము కాటేసింది…” అంటూ అరిచింది.
అజయ్ వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళి క్లీనర్ ప్రక్కన కూర్చుంటూ, “ఎక్కడా..?” అనడిగాడు. సుజాత తన చెయ్యెత్తి కాటు పడిన ఆ ప్రదేశాన్ని చూపించింది. “ఇంత ప్…పెద్ద ప్…పాము… నల్లగా నా అరచేయంత లావుగా వుంది… అతన్ని రెండుసార్లు క్…కాటేసింది అక్కడ… నాకేం చేయాలో తెలీలేదు… నా చ్..చున్నీతో అతని కాలుని గట్టిగా కట్టి వుంచాను… విషం పెకెళ్ళకుండా… తర్వాత.. ఏం… చేయాలో…. ఏమిటో…. ఇంకా ఆ పాము…..” అంటూ సుజాత ఆపకుండా ఆ పాము ఎలా వుందో మొత్తం వివరిస్తూ చెప్పసాగింది. అజయ్ కాటు పడిన ప్రదేశంలో తన లైట్ ని ఫ్లాష్ చేసి చూశాడు. దగ్గర దగ్గరలో పడిన రెండు కాట్లు అతనికి కన్పించాయ్. ఆ క్లీనర్ ఇంకా భయంలో ఏదో గొణుగుతున్నాడు. ఊపిరందక వాడి ఛాతీ ఎగిరెగిరిపడుతోంది. అజయ్ అతని ఛాతీ పైన చెయ్యేసి నిమురుతూ, “రిలేక్స్ మేన్… కామ్ గా వుండు… లేదంటే ఇంకా ప్రమాదం… నీకేమీ కాదు… నేను చూస్కుంటాను.. కాసేపు ఏం మాట్లాడకు…” అంటూ ఆ క్లీనర్ ని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ మాటలు విని క్లీనర్ కాస్త నెమ్మదించాడు. గొణగడం ఆపేసి గమ్మునున్నాడు. అజయ్ మళ్ళీ వాడి కాలును పరిశీలించాడు. అతని కాలుని సుజాత తన చున్నీతో కట్టడం వల్లన ఆ కట్టినంత వరకే విష ప్రభావం వ్యాపించి చర్మం రంగు మారింది.
“యు డిడ్ ఎ గుడ్ థింగ్…! కాలుని కట్టి మంచి పని చేశావ్… ఇప్పుడు విషాన్ని సాధ్యమైనంత వరకూ త్వరగా బయటకు లాగేయాలి! తర్వాత మనం వీడ్ని బస్ దగ్గరకు క్యారీ చేయొచ్చు! లక్కీగా మనం రోడ్డుకి దగ్గర్లోనే వున్నాం…” అన్నాడు పైకి లేస్తూ… ఇందాక వీళ్ళ వైపు వస్తున్నప్పుడు మెయిన్ రోడ్డు అతనికి చెట్లమధ్య నుంచి లీలగా కనబడింది.
సుజాత దానికి, “అంటే… ఇప్పుడు మీరు నోటితో ఆ విషాన్ని లాగేస్తారా…?” అనడిగింది ఆసక్తిగా.
అజయ్ చిన్నగా నవ్వి తల అడ్డంగా వూపుతూ, “నువ్వు సినిమాలెక్కువ చూస్తావనుకుంటా… అదంత సజెస్టబుల్ కాదు. ముందు, ఇక్కడ పదునైన రాయేదైనా వుంటే ఒక చిన్న గాటు పెట్టి ఆ విషాన్ని బయటకు లాగేయవచ్చు…” అన్నాడు అటు ఇటు చూస్తూ…
“గ్-గ్-గాటు పెడ్తారా…? ఆ ప్-పాము రెండుసార్లు కాటేసిందిగా… ఎక్కడ గాటు పెడ్తారు..?” అంటూ భయపడింది సుజాత.
“హా… నిజమే.! రెండుసార్లు కాటేసింది. బట్, ఇట్స్ ఓకే… మొదటి కాటులో ఎక్కినంతగా రెండో కాటులో ఎక్కదు. ఇన్పాక్ట్, ఒక్కసారి కాటేసాక పాముకి విషం తయారవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇకపోతే, సరిగ్గా గాటు పెట్టకపోడం వల్ల ఆ విషం వేరే కణాల ద్వారా గుండెకి త్వరగా చేరే అవకాశం వుంటుంది. ఇట్స్ ఏ బిట్ కాంప్లికేటెడ్… బట్, ఐ హేవ్ డీల్ట్ దిస్ టైప్ ఆఫ్ సిట్యువేషన్స్ మెనీ టైమ్స్… నాకు తెలుసు ఎలా చేయాలో! ఐ-జస్ట్-నీడ్-సమ్-షార్ప్-రాక్…” అంటూ వంగి ఒక రాయిని తీసాడు. అప్పుడే సుజాత ఏదో గుర్తొచ్చి ఆ క్లీనర్ దగ్గరకు పోయి వాడి నడుం దగ్గర చెయ్యి పెట్టి అక్కడ పడి వున్న మడతకత్తిని తీసి, “ఇదుగోండి సార్…. కత్తి,” అంటూ అజయ్ కి అందించింది. అతను, “ఎక్సెలెంట్…!” అంటూ ఆ రాయిని పడేసి ఆమె దగ్గర్నుంచి కత్తిని తీసుకుంటూ, “దీన్ని పట్టుకుని ఆ కాలు దగ్గర లైట్ ని ఫోకస్ చెయ్…” అని తన ఫోన్ ని ఆమెకు ఇచ్చాడు. ఆనక ఆ క్లీనర్ దగ్గర కూర్చుని వాడి కాలుని పట్టుకుని జాగ్రత్తగా అక్కడ ఒక గాటు పెట్టాడు. అంతే, నల్లటి రంగులో విషం కలిసిన చిక్కటి రక్తం ఆ నరాల్లోంచి కారడం ప్రారంభించింది. ఆ క్లీనర్ చిన్నగా మూల్గాడు. “రిలేక్స్…రిలేక్స్… ఏం కాదు” అంటూ వాణ్ని నార్మల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తూ అజయ్ తన చేతుల్తో కాలు దగ్గరి నరాల్లో ఒత్తిడిని పెంచుతూ త్వరగా విషం బయటకు వచ్చేలా చేయసాగాడు. ఆ రక్తాన్ని చూడగానే సుజాతకి కళ్ళు తిరిగినట్లు అవడంతో తన కళ్ళను మూసుకుంది. కాసేపటికి బయటకు వచ్చే రక్తం రంగు మామూలు రంగులో రాసాగింది.
“యస్… గుడ్…” అంటూ అజయ్ చున్నీ కొనతో ఆ గాటు పెట్టిన ప్రదేశాన్ని తుడిచి క్లీనర్ మొహం వంక చూశాడు. వాడు తన కళ్ళను కొద్దిగ తెరచి అజయ్ ని చూస్తున్నాడు. వాడి ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. “దా-హం..గా.. వుం-ది….” అని మూల్గుతూ నాలుకని చప్పరించాడు వాడు.
“ఈజీ… ఈ పరిస్థితిలో నీళ్ళు త్రాగకూడదు… కాస్త ఓర్చుకో…” అని, “ఓకే… ఇప్పుడు మనం బస్ దగ్గరకు వెళ్దాం,” అని వాడి చేతిని నిమిరి పైకి లేచాడు. సుజాత ఇంకా తన కళ్ళను మూసుకొనే వుంది. అజయ్, “ఓయ్… పిల్లా…” అంటూ సుజాత భుజమ్మీద చెయ్యేసి కదిపాడు. తను మెల్లగా కళ్ళు తెరచి రక్తసిక్తమైన ఆ ప్రదేశాన్ని చూసి భయపడి తల యెత్తి అతనితో, “అయిపోయిందా సార్…? ఏం పర్లేదా ఇంక…?” అంది. అజయ్ ఆమె దగ్గర్నుంచి ఫోన్ తీస్కొని ఒక నెంబర్ కి డయల్ చేస్తూ, “హా… రక్తమైతే క్లియర్ అయ్యింది… కానీ… పూర్తిగా-” అంటూ అప్పుడే కాల్ కనెక్ట్ అవ్వడంతో, “ఆ… ఒన్ మినిట్…” అని తన ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని, “హలో… శంకర్… ఎక్కడున్నావ్? బస్సు దగ్గరా?” అనడిగాడు.
“లేదు.. ఏఁవయింది?” అన్నాడు శంకర్ అజయ్ మాటలో తొందరను, కంగారునూ గమనించి.
“ఏమ్లేదు… ఇక్కడ మన బస్ క్లీనర్ కి పాము కరిచింది—”
“పామా… నేనిప్పుడే వస్తున్నాను… ఆ… బస్సు దగ్గర అంజలీ, మీనాక్షి గారు వున్నారుగా… వాళ్ళకి ఫోన్ చేయ్… నేనూ ట్రై చేస్తాను. ఇంతకీ నువ్వెక్కడున్నావ్…?”
“చెప్తే తెలిసే ప్లేస్ కాదులే… త్వరగా బస్ దగ్గరకు వచ్చేయ్…” అనేసి ఫోన్ పెట్టేశాడు.
★★★
అజయ్ ఫోన్ పెట్టేయగానే శంకర్ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. పాము కరిచింది అన్న వార్తని జీర్ణం చేసుకోవడానికి అతని మైండ్ కి కాస్త సమయం పట్టింది. తర్వాత తన తలని ఓసారి విదిలించి క్రింద పడి వున్న తన పేంటుని తొడుక్కుంటూ చుట్టూ చూశాడు. లావణ్య, దీప్తీ ఇంకా కమల ఆ వాగు దగ్గరకు పోయి తమ వంటిని శుబ్రపరుచుకోసాగారు. ఇటు ప్రక్కన నీలవేణి తను తనని ఎక్కడైతే వదిలి పెట్టాడో అక్కడే బొమ్మలా నిలబడి వుంది.