ఖర్కోటఖుడు – Part 8

Posted on

“ఏంటి ఎలా జరిగింది ఆపరేషన్” అన్నాడు హార్ధిక్ వస్తూ వస్తూ హాథీని చూస్తూ.
హాథీ ” ఉఫ్ఫ్…” అని కర్చీఫ్ తో నుదురు తుడుచుకుంటూ “చాలా భయంకరంగా జరిగింది సర్. అక్కడ ఒక్కడు కూడా మిగలలేదు. క్షణాల్లో వాళ్ళందరిని శవాలు చేసేసారు. ” అన్నాడు.
ఛటర్జీ వైపు చూస్తుంటే కాళ్ళు చేతులు ఛిద్రం అయిపోయి ఉన్నాయి. కుడిచెయ్యి ఎముక విరిగిపోయింది. బాధతో అరచి అరచి స్పృహ కోల్పోడానికి దగ్గర్లో ఉన్నట్టు ములుగుతున్నాడు.

అది చూసి హార్ధిక్ వాళ్ళ వైపు చూస్తూ “రేయ్ ఎవడ్రా ఇలా చేసింది? వీడు నాకు ప్రాణాలతో కావాలని చెప్పాను కదా?” అన్నాడు కోపంగా.
“ప్రాణాలతో అని చెప్పారు కానీ కాళ్ళు చేతులతో అని చెప్పలేదు కదా దొర?” అన్నాడు గుంపులోనుంచి ఒకడు అమాయకంగా.
హార్ధిక్ కి కోపం క్షణంలో మాయమయ్యింది. మనస్ఫూర్తిగా ఒక 5నిమిషాలు నవ్వాడు.
తర్వాత నవ్వు ఆపుకుంటూ “హాథీ కార్డియాలజిస్ట్, డెంటిస్ట్, సర్జన్, ఆర్థోపెడిషియన్ హూ ఎవర్ ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్ ఇక్కడ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ తెప్పించండి. పాలస్ లో ఒక రూమ్ ఆపరేషన్ థియేటర్ గా మార్చేయ్యండి. అర్థమయ్యిందా. ఇంకొక 4 ఛాపర్స్ రెంట్ కి తీసుకో. వీళ్ళకి అర్జంట్ గా మెడికల్ అసిస్టెన్స్ ఇప్పించు. వీడికి కూడా..” అంటూ ఛటర్జీని చూపించి మల్హోత్రా భుజం మీద చెయ్యి వేసి వేరే రూంకి తీసుకువెళ్ళాడు.
అక్కడ డోర్ క్లోజ్ చేసి లాకర్ ఓపెన్ చేసాడు.
అందులో ట్రిగ్గర్, ఇంకా ఏవో డాక్యుమెంట్స్ ఉన్నాయి.
“ప్లాన్ రెడీ చెయ్యండి మల్హోత్రా. ఇక్కడ మీరు సేఫ్. నేను ఒక టెన్ మినిట్స్ లో వస్తాను” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
హార్ధిక్ సౌరవ్ కి కాల్ చేసాడు ” హెలో..” అన్నాడు అవతల సౌరవ్.
“డాడ్.. మల్హోత్రాని తీసుకొచ్చాను. ప్రాజెక్ట్ రేపట్నుంచి మొదలుపెడతాం. నాకు ఒక హెల్ప్ కావాలి”
“ఎప్పుడూ రేపు అనుకోకూడదు హార్ధిక్. ఇప్పుడు ఎందుకు కాకూడదు? సరే ఏం కావాలి?” అన్నాడు సౌరవ్.
హార్ధిక్ చెప్పగానే సౌరవ్ ఒక కాంటాక్ట్ మెసేజ్ చేసాడు.
కాల్ కట్ అయ్యింది.

సౌరవ్ పంపిన నెంబర్ కి కాల్ చేసాడు హార్ధిక్.
అవతలి వ్యక్తి “హెలో ” అనగానే తను ఎవరో చెప్పి తనకి ఏం కావాలో వివరించాడు హార్ధిక్.
తనని ఎక్కడ కలవాలో టైం, ప్లేస్ చెప్పాక ఆ కాల్ కట్ అయ్యింది.

హార్ధిక్ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చాడు.
మల్హోత్రా అక్కడ కూర్చుని ఉన్నాడు.
“హ్మ్మ్.. చెప్పండి మల్హోత్రా ఏం ఆలోచించారు?” అన్నాడు హార్ధిక్.
“నేను ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ హార్ధిక్.”
” ఓకే.. మీకు ఎంత కావాలి చెప్పండి?”
“నా ప్రాణాలు.”
“వ్వాట్? ప్రాణాలా?”
“అవును హార్ధిక్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత విలువైందో. ఆ రిచర్డ్స్ ఉన్నంత వరకు నేను బ్రతకడం అనేది కల. మీరు ఏదొకలా ఆ రిచర్డ్స్ అంతు చూస్తే నేను నా మిగిలిన జీవితాన్ని స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఏ భయం లేకుండా బ్రతుకుతాను. అందుకు నజరానాగా మీకు ఈ టైం మెషీన్ బహుమతిగా ఇస్తాను. సరేనా” అన్నాడు.
మొదటిసారిగా హార్ధిక్ మనసు తనకి తెలియని దేని గురించో ఆలోచిస్తుంది.
అంతలోనే తేరుకుంటూ “వెల్ mr మల్హోత్రా. ఇట్స్ ఎ డీల్. మీకు కావలిసిన లిస్ట్ ఇస్తే నేను రెడీ చేయించి పెడతా. మీరు రెస్ట్ తీసుకోండి. ఈ నైట్ కి నేను వేరే చోటుకి వెళ్తున్నాను. హాథీ మిమ్మల్ని చూసుకుంటాడు. ఓకే నా. బై” అంటూ ట్రిగ్గర్, డాక్యుమెంట్స్ లోపల పెట్టి లాక్ చేసి బయలుదేరాడు.
టైం చూస్తే 5 కావొస్తోంది.
గంగాదాస్ కి కాల్ చేసి తన కార్ వస్తుంది. అందులో నలుగురు అమ్మాయిల్ని పంపమని ఫోన్ పెట్టేసాడు.
హాథీకి ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్పి తన చార్టర్డ్ ఫ్లయిట్ ని రన్ వే మీద రెడీగా ఉంచమని కార్లో ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాడు.

హార్ధిక్ ఎక్కడికి వెళ్తున్నాడు. ?
మల్హోత్రా ఏం చేస్తాడు?
నలుగురు సరిపోతారా ఆ పదిమందికీ?

చూడండి అదరగొట్టే శృంగార సన్నివేశాలు, ఒళ్ళు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు, మతి పోగొట్టే మలుపులకై…..

********* ఖర్ఖోటకుడు. ***********

హార్ధిక్ కారు రన్వే మీదకి వచ్చి ఆగింది. అక్కడ ఫ్లయిట్ రెడీగా ఉంది. కార్లోంచి హార్ధిక్, టూటూ దిగారు. టూటూకి ఇదంతా వింతగా ఉంది.
ఆశ్చర్యంగా విమానం వంక చూస్తూ ఉండిపోయాడు.
హార్ధిక్ కదిపితే కానీ తెరుకోలేదు.
“టూటూ.. వెళ్దామా?”
“ఏంది దొరా ఇది?”
“ఏంటి ఇది ఎప్పుడూ చూడలేదా?”
“లేదు దొరా”
“సినిమాల్లో కూడా చూడలేదా?”
“సినిమాలంటే ఏంది దొరా?”
“ఏంటి ఇవేవీ తెలీవా నీకు?”
“లేదు దొరా”
“సరే లోపలికి పదా.. కూర్చుని మాట్లాడుకుందాం”
“అలాగే దొరా” అని హార్ధిక్ ని అనుసరించసాగాడు టూటూ.
హార్ధిక్ వెళ్ళి విండో పక్కన సీట్లో కూర్చున్నాడు.
టూటూ హార్ధిక్ పక్కనే కింద కూర్చున్నాడు. అది చూసి హార్ధిక్ “ఏంటి టూటూ ఇది. పైకి లే. ఇలా వచ్చి సీట్లో కూర్చో” అన్నాడు.

171110cookie-checkఖర్కోటఖుడు – Part 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *