తర్వాతి శనివారం రోజు గోవా ప్లాన్ చేసుకున్నారు.భార్గవ్ కార్ అపార్ట్ మెంట్ దగ్గర పెట్టి నలుగురు హరి కార్ లో వెళ్తున్నారు.రాణి వాళ్ళ ఇద్దరి జోడి బాగుంది కదా అన్నాడు హరి.అవును అన్నది రాణి.హరి మరియు భార్గవ్ కొద్దిసేపటికే కలిసిపోయారు.మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు.హరి చాలా రాయల్ గా ఉన్నాడు. రాణి కి సరైన జోడి.ఇద్దరూ బాగున్నారు కదా. నా మనసు మార్చుకోవడం మంచిది అని మనసులో అనుకున్నాడు భార్గవ్.
మధ్యలో టిఫిన్ చేయడానికి ఆపారు.మీరు ముందు పదండి మేము వస్తాం అన్నాడు హరి.రాణి ఇలా రా అని కార్ వెనక్కి తీసుకెళ్లి.ఒక కిస్ ఇవ్వే ప్లీజ్ అన్నాడు.ఏంటిది బయట. గోవా వెళ్ళాక రూం లో చూద్దాం రా అంటుంది. కార్ లో ఫోన్ మర్చిపోయా అని వెనక్కి వచ్చాడు భార్గవ్.రాణి వద్దు వద్దు అనేది వినపడి కొంచెం చాటుగా చూసాడు భార్గవ్.బలవంతంగా దగ్గరికి లాక్కుని రాణి లిప్స్ పై ముద్దు పెట్టాడు హరి.అది చూసిన భార్గవ్ కళ్ళల్లో చిన్నగా నీళ్ళు తిరిగాయి. ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రా భార్గవ్ అని చేయి పట్టుకుని హోటల్ లోపలికి నడుస్తుంది కిరణ్మయి.వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే రాణి,హరి ఇద్దరూ వచ్చారు.
టిఫిన్ ఆర్థర్ చేసి కూర్చున్నారు నలుగురు.భార్గవ్ ఫేస్ డల్ అవడం గమనించింది రాణి. ఏమైందే అని కిరణ్మయి ను సైగ చేసి అడిగింది. ఏమో అని సైగ చేసింది.
టిఫిన్ తిని మళ్ళీ కార్ ఎక్కారు.ముందున్న జోష్ లేదేంటి భార్గవ్ గారు అన్నాడు హరి.అదేం లేదు హరి గారు.సడన్ గా తల నొప్పి వచ్చింది.ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది.అన్నాడు భార్గవ్.వెనుక సీట్ లో ఉన్న రాణి, కిరణ్మయి కి కనపడకుండా భార్గవ్ కి మెసేజ్ చేసింది.ప్లీజ్ కాస్త నవ్వుతూ ఇందాకటి లా ఉండు. హ్యాపీ గా వెళ్తున్నాం కదా.నువ్వలా ఉంటే నా ఫ్రెండ్ బాధ పడుతుంది.తనని బాధ పెట్టకు అని చేసింది.
ఓకే అని సింబల్ పెట్టాడు.
మళ్ళీ నార్మల్ అయ్యాడు భార్గవ్.
గోవా వెళ్ళాక వేరు వేరు రూమ్స్ తీసుకుని లోపలికి వెళ్ళారు.
njyoti57913@gmail.com
ఈ కథ నచ్చితే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి
Continue the remaining story