సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 15

Posted on

“ఇప్పుడు బాగుంది… నువు ఇందాక సరిగా వేసుకోలేదు… నీకు వెస్టర్న్ డ్రెస్సెస్ బాగుంటాయి సంజనా …” అంటూ తన సీట్ వైపు వెళ్ళాడు…
డ్రెస్ సరి చేయడానికే దగ్గరకొచ్చినట్టు తెలిసి రిలీఫ్ గా నిట్టూర్చింది సంజన.. ఆమెలో ఇంకా వణుకు తగ్గలేదు..

“ఓకే సంజన… మనం లంచ్ తర్వాత మళ్లీ కలుద్దాం..” అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్..
మాస్ లో చేరినప్పటి నుండే సంజన స్నేహతో ఎక్కువగా టచ్ లో ఉంటుంది… ఆరోజు మధ్యాహ్నం వాళ్లిద్దరూ లంచ్ లో కలుద్దాం అనుకున్నారు… జరిగే అన్ని విషయాలు సంజన తనతో చెప్తున్నందుకు, తన సలహాలు తీసుకున్నందుకు స్నేహకు సంతోషంగా ఉంది… సంజన రాక వల్ల మొదట్లో కలిగిన భయాలు ఆమె ప్రవర్తన వల్ల క్రమంగా స్నేహ లో దూరమయ్యాయి… ఆనందిని హ్యాండిల్ చేయాలంటే స్నేహ తో సఖ్యంగా ఉండడం అవసరమని సంజన గ్రహించింది… అందుకే అవసరం ఉన్నా లేకపోయినా స్నేహ ని సలహాలు అడిగేది…

“హాయ్ సంజనా.. గుడ్ ఆఫ్టర్నూన్… ” అంటూ సంజన కూర్చున్న టేబుల్ వద్దకి వచ్చింది స్నేహ…
సంజన లేచి నిలబడి షేక్హ్యాండ్ ఇస్తూ
“హలో స్నేహ… హౌ ఆర్ యు…” అడిగింది సంజన…
“గుడ్… హేయ్ సంజన.. నీ డ్రెస్ అదిరింది ” అంది స్నేహ తేరిపార చూసి…
బదులుగా చిన్నగా నవ్వి థాంక్స్ చెప్పింది సంజన…
“hmm ఇంకేంటి వర్క్ విషయంలో బాగా కష్టపడుతున్నట్టున్నావ్ … ఫుల్ సక్సెస్ అన్నమాట..” అంది స్నేహ…
“కొంత కరెక్ట్, కొంత కాదు…” నిట్టూరుస్తూ అంది సంజన…
మంచి నీళ్ళు తాగుతూ… అదేంటి అన్నట్టు చూసింది స్నేహ..

“మన బాస్ వ్యవహారం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది స్నేహ…. కొన్ని సార్లు ఆయన ఎంతో తెలివైన, దనికుడైన వ్యాపారవేత్త లా వ్యవహరిస్తాడు… కొన్నిసార్లు అన్నీ వదిలేసిన వైరాగి లా ఉంటాడు… అతనికి ప్రపంచంలో దొరకనిది అంటూ లేదనిపిస్తుంది… కానీ తనకేవరూ లేరు అంటాడు… ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియట్లేదు… ఆయన గురించి తెలియకుండా.. అతన్ని అర్థం చేసుకోకుండా కలిసి పని చేయడం కష్టంగా అనిపిస్తుంది …”
“hmmm నువ్వన్నది నిజమే సంజనా… ఆనంద్ సర్ ది కాంప్లెక్స్ పర్సనాలిటీ… కానీ ఇంతవరకు నేను చూసిన వాళ్ళలో ఆయనే గొప్ప మనిషి…” అంది స్నేహ..

“ఎనిమిదేళ్ళ క్రితం సర్ వల్ల వైఫ్ చనిపోయింది.. ఆమెను సార్ చాలా ప్రేమించేవారు… సడెన్ గా ఆమె పోవడం సార్ ని షాక్ కి గురిచేసింది… పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటూ వాళ్ళ life వాళ్ళు బతుకుతున్నారు… అకస్మాత్తుగా భార్య పోవడం వల్ల సార్ ఒంటరివాడైపోయాడు… అయితే సార్ చాలా ప్రాక్టికల్ మనిషి… గతం గురించి ఎక్కువగా బాధ పడకుండా రాజా జీవితం గడుపుతున్నాడు…” కన్నుకొడుతూ చెప్పింది స్నేహ…

” అంటే..” అనుమానంగా అడిగింది సంజన..
“hmm… నీకిది చెప్పాలో లేదో తెలియదు కానీ… ఆనంద్ సర్ మంచి రసికుడు… ఫుడ్ విషయంలో, మందు విషయంలో, ఆడవాళ్ళ విషయంలో సార్ ది గొప్ప టేస్ట్… సర్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…”

“oh my God.. ఈ వయసులోనా…” ఆశ్చర్యంగా అడిగింది సంజన…
“మరీ అంత ఆశ్చర్య పోకు సంజన… ఒక ఆడది పొందగలిగే బెస్ట్ మొగాడు సారే తెల్సా…” అంది స్నేహ నవ్వుతూ కన్నుకొట్టి…
“హే.. ఏమంటున్నవ్ నువ్వు…” అంది సంజన షాకింగ్ గా… ఆమెకు స్నేహ చెప్పిన విషయం కన్నా చెప్పిన విధానమే ఎక్కువ ఆశ్చర్యంగా అనిపిస్తుంది…
“నిజo సంజనా.. నన్ను నమ్ము..” అంది స్నేహ సంజన కళ్ళలోకి చూస్తూ…

సంజన ఏదో అర్థం అయినట్టుగా మౌనంగా ఉంది….
స్నేహ సంజన చేతిని తన చేతిలోకి తీసుకొని… “సంజనా… నువు సార్ గురించి ఎక్కువగా ఆలోచించకు… నీ దారిలో నువ్ పనిచేసుకుంటూ వెళ్ళు… సర్ చెప్పిందల్లా చేస్తూ ఉండు… నీకేదైనా ఇబ్బంది గా ఉంటే నాకు ఫోన్ చెయ్యి… నేను చూసుకుంటా…ఓకే నా…” అంటూ భరోసా ఇచ్చింది స్నేహ…
వాళ్ళు తర్వాత ఇంకాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు… కలిసి lunch చేశారు… కాసేపు అదీ ఇదీ మాట్లాడి వెళ్తానంటూ బయలుదేరింది సంజన…
సంజన వెళ్తుంటే చివరివరకు చూసి దీర్ఘంగా నిట్టూర్చింది స్నేహ…

127280cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *