పెద్దమ్మ వచ్చి పందిరి స్నానానికి వేలయ్యింది బుజ్జితల్లీ – బాబూ …… , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందరికీ ఆకలివేస్తుంటుంది అని బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టి జల్లెడ ద్వారా మొదట దేవత నీళ్లు పోశారు .
పెద్దమ్మ : బాబూ …… నెక్స్ట్ నువ్వే పొయ్యి లేకపోతే గోల గోల చేసేస్తోంది బుజ్జి రాక్షసి అంటూ ఆహ్వానించారు .
మరింత ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక దేవతతోపాటు నీళ్లుపోసి , అందరూ పంచుతున్న ఆప్యాయతకు పరవసించిపోయాను .
తరువాత ముత్తైదువులంతా నీళ్లుపోసి బుజ్జితల్లి ఒంటిపై పసుపు పూర్తిగా పోయేలా చేసి బుజ్జిబుజ్జిగా వణుకుతున్న బుజ్జితల్లిని – కృష్ణను లోపలికి తీసుకెళ్లారు .
అంకుల్ …….. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను .
పెద్దమ్మ : అప్పుడే మీ అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి లేదే బుజ్జి రాక్షసి , బట్టలు మార్చుకున్నాక లోపల కూడా పూజ ఉంది . కావాలంటే మీ అంకుల్ …… నీ ఎదురుగానే కూర్చుంటాడులే …….
బుజ్జితల్లి : ఇంకెంతసేపు అమ్మమ్మా ……
Sorry బుజ్జితల్లీ ……. త్వరగా పూర్తి చేస్తాములే అని అందరూ నవ్వుకున్నారు .
అందరూ పసుపును శుభ్రం చేసుకుని లోపలికి వెళుతున్నారు .
పెద్దమ్మ వచ్చి పెద్దయ్య కు అంటించిన పసుపును తడిగుడ్డతో శుభ్రం చేసి , బాబూ ……. లోపలికివచ్చి నీకిష్టమైన గదిలోకివెళ్లి శుభ్రం చేసుకో – బుజ్జితల్లి వచ్చే సమయానికి ఎదురుగా కనిపించకపోతే మాపై కోప్పడుతుంది .
Sorry పెద్దమ్మా ……. , నా వలన ……
పెద్దమ్మ – పెద్దయ్య : లేదు లేదు బాబూ …… , మాకు చాలా సంతోషం – చూశావుకదా ఆలస్యమైనా మీ ఇద్దరివలన ఎంత సంబరంలా జరిగింది – అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం చూసి చాలా చాలా ఆనందం వేసింది – అందుకు మేమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి – మాకోసమే వచ్చిన దేవుడు బాబూ ……. నువ్వు .
పెద్దమ్మా ……..
పెద్దయ్య : చెప్పాముకదా బాబూ …… ఇక నువ్వు అలవాటు పడాల్సిందే అని నవ్వుకున్నారు – వెళ్లు బాబూ …….
లోపలికివెళ్లి పైకివెళ్ళాను . నేను స్నానం చేసిన గదిలోకివెళ్ళాను .
లోపల దేవత …… బుజ్జితల్లి తడిచిన డ్రెస్ ను విప్పుతున్నారు . Sorry sorry మేడం – బుజ్జితల్లీ ……. ఎవ్వరూ లేరు అనుకున్నాను అని వెనుతిరిగాను .
పర్లేదు అంకుల్ ……. బుజ్జితల్లి నవ్వుతోంది .
అక్కడే ఆగండి మహేష్ గారూ …… , ఎంత ధైర్యం నా గదిలోకి రావడానికి …… అని కాస్త కోపంతోనే అడిగారు .
అదీ అదీ ….. ఇంతకుముందు ఇక్కడే ఫ్రెష్ అయ్యాను మేడం అని వణుకుతూ బదులిచ్చాను .
ముసిముసినవ్వులు వినిపించడంతో వెనక్కుతిరుగబోతే …….
దేవత : స్టాప్ …… , డ్రెస్ చేంజ్ చేసుంటున్నామని తెలిసికూడా చూడబోతున్నారు , నాకు తెలుసు మీరు బ్యాడ్ బాయ్ అని మళ్ళీ ముసిముసినవ్వులు …….
బుజ్జితల్లి : నాకైతే ఇష్టమే మమ్మీ ……..
దేవత : కీర్తీ ….. ష్ ష్ …… , ఎంత ధైర్యం నా గదిలో స్నానం చేయడానికి …….
అదీ అదీ బుజ్జితల్లి ……. sorry sorry
బుజ్జితల్లి : అవును మమ్మీ …… నేనే పిలుచుకునివచ్చాను అంకుల్ ను .
దేవత : ష్ ష్ ……. కీర్తీ , వెళ్ళండి ప్రక్కగదిలోకి వెళ్ళండి .
బ్యాగ్ లో టవల్ …….
దేవత : మీకోసం ప్రక్కగదిలో ఉంచాను వెళ్ళండి .
Sorry అంటూ తుర్రుమన్నాను .
గట్టిగా నవ్వుకున్నట్లు దేవత – బుజ్జితల్లి నవ్వులు వినిపించాయి . ప్రక్క గదిలోకివెళ్ళిచూస్తే బెడ్ పై టవల్ తోపాటు మరొక జత కొత్తబట్టలు కూడా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది . దేవత నవ్వుతోంది – కవ్విస్తోంది – వెంటనే కోప్పడుతోంది ఏమీ అర్థం కావడం లేదు . అందుకే అన్నారు కాబోలు ” ఆడువారిమాటలకు అర్థాలేవేరు ” అని నవ్వుకుని శుభ్రం చేసుకునివచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చేసరికి , కృష్ణను – బుజ్జితల్లిని ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టి కార్యక్రమం జరిపిస్తున్నారు .
అంకుల్ …… మీకోసమే సోఫా కూర్చోండి అని బుజ్జితల్లి ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
లవ్ యు బుజ్జితల్లీ ….. పర్లేదులే ……
దేవత : కూర్చోండి అని ఆర్డర్ వెయ్యడంతో …….. బుద్ధిగా కూర్చోవడం చూసి నవ్వుకున్నారు .
పూజా కార్యక్రమం పూర్తవగానే , అయిపోయింది అంటూ కృష్ణ బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
దేవత …… అసూయతో చూడటం చూసి వారి ఫ్రెండ్స్ తోపాటు నాకూ నవ్వువచ్చేసింది .
అప్పటికే 2 గంటలు అవ్వడంతో బయట భోజనాలు మొదలుపెట్టారు . తృప్తిగా భోజనాలు చేసి పెళ్లిలో కలుద్దాము అని ఊరిజనమంతా వెళ్లిపోయారు .
బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది కదూ …….
లేదు లేదు బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : అంకుల్ మీరు అపద్ధం చెబుతున్నారు , మీ కళ్ళు – స్పర్శ ద్వారా నాకు తెలిసిపోతోంది , నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు నిజం చెప్పండి అని ముద్దుపెట్టింది .
అవును బుజ్జితల్లీ ……. ఉదయం కూడా తినలేదు – బ్లడ్ కూడా ఇచ్చానుకదా బాగా ఆకలివేస్తోంది – బయట నుండి అధిరిపోయినట్లు వంటల ఘుమఘుమలు కూడానూ …….. అని దీనంగా ముఖం పెట్టి అడిగాను .
బుజ్జితల్లి : sorry అంకుల్ …… – తాతయ్యను రక్షించే క్రమంలో మీగురించి ఒక్కక్షణం కూడా ఆలోచించనేలేదన్నమాట – లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ . అంతే మమ్మీ – అమ్మమ్మా – మావయ్యా …… అంటూ బుజ్జికోపంతో గట్టిగా కేకలువేసింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ కీర్తీ …….. అంటూ ముగ్గురూ పరుగునవచ్చారు .
బుజ్జితల్లి : ఇంటి దేవుడు అని పిలవడం కాదు ……..
ష్ ష్ ష్ బుజ్జితల్లీ …… అంటూ నవ్వుతూ బుజ్జి నోటిని చేతితో మూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ఆగండి please please అంటూ నా చేతిపై – చేతిని తియ్యగానే బుగ్గపై ముద్దుపెట్టింది లవ్ యు అంటూ . మమ్మీ – అమ్మమ్మా …… తాతయ్యకోసం హాస్పిటల్లో ఉన్నారు – బ్లడ్ ఇచ్చారు – తాతయ్యను జాగ్రత్తగా తీసుకొచ్చి ఫంక్షన్ జరిగేలా చూసారు , బ్లడ్ ఇచ్చాక ఎంత నీరసమైపోతారో తెలుసుకదా ……. , పాపం అంకుల్ బ్లడ్ ఇచ్చిన తరువాత టిఫిన్ కూడా తినలేదు కాదు కాదు మనమే కనీసం అడగనేలేదు – ఇప్పుడు భోజనం కూడా ……..
బుజ్జితల్లీ ……..
బుజ్జితల్లి : ఆగమని చెప్పానుకదా అంకుల్ నోటిపై వేలుని వేసుకోండి .
అమ్మో ……భయమేస్తోంది అంటూ నోటికి తాళం వేసాను .
దేవత – పెద్దమ్మ – కృష్ణ …… ముగ్గురూ నవ్వుకుని హడావిడిగా బయటకువెళ్లి పెద్దపెద్ద పాత్రల నుండి ప్లేట్స్ లో వడ్డించుకునివచ్చారు .
పెద్దమ్మ : sorry బాబూ …… ఆయన దెబ్బలు చూసి – ఈ హడావిడిలో మరిచేపోయాము .
కృష్ణ : బుజ్జితల్లీ ……. మాపై మరింత కోప్పడాల్సింది – బ్లడ్ ఇచ్చిన అన్నయ్య గురించి ఆలోచించనేలేదు – మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా …… మీవల్లనే ఈ సంతోషాలు , భోజనం చెయ్యండి .
కృష్ణా …… నాన్నగారు భోజనం చేశారా ? .
కృష్ణ : మందులు వేసుకోవాలికదా పూజ జరిగేటప్పుడే తిని పడుకున్నారు .
గుడ్ కృష్ణా …….
కృష్ణ : ఇప్పుడు కూడా మా గురించే ఆలోచిస్తున్నారా అన్నయ్యా ……. , నిజంగా మీరు దేవుడు .
మళ్లీ మొదలెట్టావా ….. ? .
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ …… అమ్మ చెప్పింది కదా మీ ఇల్లే అనుకోబాబూ అని ఆకలివేస్తే మాకు ఆర్డర్ అయినా వెయ్యాలి లేకపోతే దర్జాగా వెళ్లి తినాలి , ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా …… ? – మీ బుజ్జితల్లితో తిట్టిస్తారా …… ? .
Sorry sorry మేడం ……. , పెదాలపై చిరునవ్వుతో కృష్ణ నుండి అందుకున్నాను . కృష్ణా – మేడం – పెద్దమ్మా ……. ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరూ భోజనం చెయ్యండి .
పెద్దమ్మ : కృష్ణ చెప్పినట్లు అనుక్షణం మా గురించే ఆలోచిస్తున్నారు – బాబూ ……. నువ్వు అతిథివి కావు ఇంటి మనిషివి కాదు కాదు మా దేవుడివి , ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే అధికారం నీకుంది – బుజ్జితల్లిలా మాపై కోప్పడే అధికారం కూడా ఉంది .
పెద్దమ్మా ……. , ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే బుజ్జితల్లికి …… నేనంటే ఇష్టమయ్యాను – పెద్దవారంటే నాకు అపారమైన గౌరవం , మేడం గారికి కూడా తెలుసు ……..
దేవత : ఆ ఆ తెలుసు తెలుసు అని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
నేనూ నవ్వుకుని బుజ్జితల్లీ తిను , నువ్వూ తినలేదు కదా ……..
బుజ్జితల్లి : మీరే తినిపించండి .
మేడం …… తినిపించడానికి స్పూన్ అని అడిగాను తలదించుకుని …….
బుజ్జితల్లి : మమ్మీ నో …….. , అంకుల్ మీరు తింటున్న చేతితోనే తినిపించండి .
బుజ్జితల్లీ ……. ఎంగిలి , మమ్మీకి కోపం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అయినా పర్లేదు కోప్పడితే కోప్పడనివ్వండి – మా అంకుల్ దేవుడు కదా దేవుడి చేతితో తినాలంటే అదృష్టం ఉండాలి . మమ్మీ – మావయ్య ……. ఎలా చూస్తున్నారు చూడు ఈ అదృష్టం కోసం .
అప్పటివరకూ ఆశతో చూస్తున్నట్లు దేవత తలదించుకున్నారు . కృష్ణకు ప్లేట్ ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకునివచ్చి మాతోపాటు కలిసితిన్నారు .
నవ్వుకుని , కృష్ణా ……. వంటలు భలే రుచిగా ఉన్నాయి – పెళ్లికి కూడా ఈ వంటవారేనా …… ? .
కృష్ణ : తింటూనే ……. , లేదు అన్నయ్యా ….. వంట చేసినది ఊరిలో ఉన్న పెద్దయ్య – వయసైపోయింది అయినాకూడా కృష్ణా …… మీ ఇంటి సంబరంలో వంట చేసే అదృష్టం ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదు అనడంతో ఈరోజు మన ఊరు వాళ్లే కాబట్టి వద్దు వద్దు ఇబ్బందిపడతారు అన్నాకూడా ఉత్సాహంతో చేశారు – పెళ్లికి జనం డబల్ అవుతారు ఇబ్బందిపడతారు , సిటీ నుండి పిలిపిస్తాను అన్నారు నాన్నగారు – అక్కయ్య వచ్చేన్తవరకూ పెళ్ళిపనులు మొదలుపెట్టకూడదు అని అనుకున్నాము , అక్కయ్య – బుజ్జితల్లి అంటే అంత ప్రాణం అందరికీ మీకు తెలియంది కాదు – అందుకే ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు , ఇకపైనా అన్నింటినీ ……..
దేవత : తమ్ముడు పెళ్లి అంటే ఏ అక్క అయినా నెల రోజులముందే ఉంటుంది నాలా గెస్ట్ లా ఒకరోజుముందు రాదు అని బాధపడుతోంది .
కృష్ణ : అక్కయ్యా ……. బాధపడకండి , నాన్నగారు లేవగానే సిటీకి వెళ్లి ఒక్కరోజులో అన్నీ సెట్ చేసేస్తాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. మమ్మీ రెండు నెలల ముందే రావాలని ఆశపడింది కానీ ఆ మాన్స్టర్ పంపించనేలేదు – మమ్మల్ని ఒంటరిగా వదిలి నెలలు నెలలు ఎక్కడికో వెళ్ళిపోతాడు .
దేవత కన్నీళ్ళతో వంట గదిలోకి వెళ్లిపోయారు .
ఈ కన్నీళ్లు అలవాటైపోయాయి బాబూ అంటూ పెద్దమ్మ బాధపడుతూ దేవత దగ్గరికి వెళ్లారు .
దేవత కన్నీళ్లను చూసి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి .
వెంటనే దేవత బయటకువచ్చి అనుకున్నాను మీరు తినడం ఆపేస్తారని , ప్లేట్ ను కిందపెడితే నాకు కోపం వచ్చేస్తుంది మహేష్ గారూ , మీకు కావాల్సినది నేను తినడమే కదా ఇదిగో తింటున్నాను అని మరొక సోఫాలో కూర్చుని తిన్నారు . బుజ్జితల్లీ ……. మీ అంకుల్ కు తినిపించు అని నవ్వుతూ చెప్పారు .
బుజ్జితల్లి : అంకుల్ …… తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని బుజ్జిచేతులతో తినిపించి ముద్దుపెట్టింది .
కన్నీళ్లను తుడుచుకుని తింటూ బుజ్జితల్లికి తినిపించాను .
పెద్దమ్మ : బుజ్జితల్లి చెప్పినట్లు బ్లడ్ ఇచ్చినవాళ్లు కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవాలి , మాకు ఇబ్బంది కలిగించకుండా ఇంతవరకూ పండుగలా జరిగేలా చూసారు – ఇక రేపటివరకూ మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు , పైకి వెళ్లిపోండి – బుజ్జితల్లీ తీసుకెళ్లు .
బుజ్జితల్లి : ఆ సంగతి నాకు వదిలెయ్యండి అమ్మమ్మా ……. – అంకుల్ కు జోకొడుతూ హాయిగా నిద్రపుచ్చుతాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . అంకుల్ వెళదామా ……. ? .
Ok బుజ్జితల్లీ …… అంటూ ప్రాణంలా హత్తుకుని పైకిలేచాను .
అంతలో పెద్దయ్య …… నాన్నా కృష్ణా కృష్ణా …… అంటూ ఇబ్బందిపడి నడుస్తూ లోపలికివచ్చారు .
నాన్నగారూ – పెద్దయ్యా …… అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే వెళ్లి పెద్దయ్యను రెండువైపులా పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ : నాన్నగారూ ……. పిలవచ్చు కదా …….
పెద్దయ్య : ఇంట్లోకి కూడా నడవకపోతే , పెళ్ళికోసం ఏర్పాట్లుపూర్తిచేయడానికి ఇప్పుడు సిటీకి ఎలా వెళతాను చెప్పండి
కృష్ణ : నాన్నగారూ ……. మీరు కోలుకునేంతవరకూ ఎక్కడికీ వెళ్లకూడదు , ఎక్కువగా నడవకూడదు , రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారుకదా ……..
అవును పెద్దయ్యా …….
పెద్దయ్య : ఇలాంటివి ఎన్ని చూడలేదు కృష్ణా …… , బాబూ ….. పెళ్లికి ఒక్కరోజే ఉందికదా ఈరోజే అన్నీ చూసుకోవాలి లేకపోతే కష్టం . నేనేకదా చెయ్యాల్సినది కష్టమైనా తప్పదుమరి …….
కృష్ణ : నాన్నగారూ ……. నేనున్నాను కదా , సిటీకి వెళ్లి …….
పెద్దయ్య : ఒక్కసారి పెళ్ళికొడుకుని చేశాక పొలిమేర దాటకూడదు నాన్నా …….
పెద్దమ్మ – దేవత : అవునవును , వెళ్లకూడదు కృష్ణా – తమ్ముడూ ….. ప్రమాదం అంటూ ఇద్దరూ కృష్ణ చేతులను పట్టుకున్నారు .
కృష్ణ : మరెలా అక్కయ్యా – అమ్మా …… , నాన్నగారిని ఈ పరిస్థితులలో పంపించడం అంతకంటే ప్రమాదం . నేనే వెళతాను – నాకేమి జరిగినా …….
దేవత : తమ్ముడూ ……. కొడతాను అంటూ గట్టిగా చేతిని చుట్టేశారు .
కృష్ణ : అయితే ఇప్పుడెలా అక్కయ్యా ……. , అందుకే పెళ్లిని పోస్ట్ …….
కృష్ణా …… పోస్ట్ ఫోన్ అన్నమాటను అని అందరినీ బాధపెట్టకు – పెళ్ళిపనులు పూర్తిచేయడానికి నేను లేనూ ……..
బాబూ – అన్నయ్యా ……. నో నో నో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం .
అంటే నేను ఈ ఇంటివాడిని కాదన్నమాట – ఈ ఇల్లు మీదే , మా ఇంటి దేవుడు , మాపై అధికారం చాలాయించవచ్చు అన్నది ఉత్తిత్తినే అన్నమాట . నా బుజ్జితల్లి వలన మీరంతా …… నా ఫ్యామిలీ అని ఉదయమే ఫిక్స్ అయిపోయాను – మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుండి గెట్ ఔట్ ……..
దేవత – పెద్దమ్మ :లేదు లేదు ఆ మాటను ……..
నవ్వుకుని , లేదులే పెద్దమ్మా – మేడం …… ఊరికే అన్నాను . మీరు ఔనన్నా – కాదన్నా …… పెళ్లి ఏర్పాట్లన్నీ చెయ్యబోతున్నాను అంతే ……
బుజ్జితల్లి : అంకుల్ కు తోడుగా నేను కూడా ……..
హైఫై హైఫై బుజ్జితల్లీ …… లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ ముద్దులుపెట్టాను . బుజ్జితల్లీ ……. లెట్స్ గో ……. , కృష్ణా – పెద్దయ్యా …… పెళ్ళికొడుకు శాస్త్రం కాకుండా ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు కదా ఇక మా ఇద్దరికీ వదిలెయ్యండి అని మళ్ళీ హైఫై కట్టుకున్నాను .
దేవత : నేను కూ ……… అని ఎందుకో ఆగిపోయి మావైపు ఆశతో చూస్తున్నారు .
మేడం …….. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ? .
దేవత : లేదు లేదు , థాంక్యూ soooo మచ్ మహేష్ గారూ అంటూ ఆనందబాస్పాలతో నమస్కరించారు .
పెద్దమ్మ : బాబూ …… నువ్వు రెస్ట్ …….
పెళ్లి పనుల ఉత్సాహం ఉంటే ఇంకా రెస్ట్ ఏమిటి పెద్దమ్మా ……..
పెద్దమ్మ : నువ్వు నిజంగా మా దేవుడే బాబూ …….
బుజ్జితల్లీ ……. ఇక్కడే ఉంటే ఇలానే దేవుడు దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు మనం వెళదాము పదా ……. అంటూ ముద్దుపెట్టాను .
కృష్ణ : అన్నయ్యా ……. అంటూ ఉద్వేగానికి లోనౌతూ బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా ……. – మేమంతా మీకు ఋణపడిపోయాము . మీకు తోడుగా మీరు చెప్పినవన్నీ చెయ్యడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు అని డబ్బు ఇచ్చాడు .
అయితే మంచిదే కదా ……. , వద్దు ఆనబోయి బాగోదు అని డబ్బు అందుకున్నాను.
కృష్ణ : నిమిషంలో వస్తారు అన్నయ్యా ……
బయటకువచ్చిన కొద్దిసేపటికి కృష్ణ ఫ్రెండ్స్ వచ్చారు – వినయ్ , గోవర్ధన్ లుగా పరిచయం చేశాడు .
ఇద్దరూ : అన్నయ్యా ……. ఇంతకుముందే కలవాల్సింది హడావిడిలో కుదరలేదు – మా ఊరి పెద్దయ్య ప్రాణాలు కాపాడిన దేవుడుమీరు – మాకే కాదు ఊరిలో అందరికీ పెద్దయ్య అంటే గౌరవం – అంతటివారిని కాపాడిన ……..
దేవుడిని అంతేకదా ……. ఉదయం నుండీ …….
బుజ్జితల్లి – కృష్ణ ……. నవ్వేస్తున్నారు . వెనకనుండి అందమైన నవ్వులు వినిపించడంతో చూస్తే గుమ్మం దగ్గర నిలబడిన దేవత …….
నవ్వుతున్న బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను .
కృష్ణ ఫ్రెండ్స్ : రేయ్ కృష్ణా …… ఎందుకురా నవ్వుతున్నారు ? .
కృష్ణ – బుజ్జితల్లితోపాటు దేవత …… మరింతగా నవ్వుతున్నారు . వెంటనే ఏంటి అలా చూస్తున్నారు అని వేలు చూయించి కోప్పడటంతో , నో నో నో అంటూ తల అడ్డంగా ఊపి తలదించుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. మీరు దేవుడుకదా , మమ్మీ కోపంతో చూడగానే భయపడిపోతారే ……. – మమ్మీ అంటే అంత భయమా …… ? .
చాలా అంటే చాలా బుజ్జితల్లీ ……. అంటూ ముద్దుపెడుతూనే దేవతవైపు చూసి నవ్వుకుని , కృష్ణా …… ఇంతకూ పెళ్లి ఎక్కడ గుడిలోనా లేక ఫంక్షన్ హాల్ లోనా ……. ? .
కృష్ణ : మన ఊరిలో ఫంక్షన్ హాల్ లేదు అన్నయ్యా ……. , ప్రతీ ఇంటి పెళ్ళీ ….. గుడి ప్రక్కనే ఉన్న కాలేజ్ గ్రౌండ్ లోనే జరిపించాలని పెద్ధలు ఎప్పుడో నిర్ణయించారు – దేవుని సమక్షంలో అక్కడ జరిగిన పెళ్లిళ్ల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటారని , భార్యాభర్తలు బంధం మరింత బలపడుతుందని నమ్మకం . అక్కయ్య పెళ్లి ఇక్కడే చేద్దామని బావకు ……. ( బుజ్జితల్లి ….. కృష్ణ చెంపపై కోపంతో కొట్టింది ) ఆ మాన్స్టర్ కు ( ఉమ్మా …… మావయ్యా ) ఎంతచెప్పినా వినలేదు – వైజాగ్ ఫంక్షన్ హాల్లో …….. అందుకే అంటూ బాధపడ్డాడు .
దేవత అటువైపుకు తిరిగారు – బాధపడుతున్నారని అర్థమైంది .
టాపిక్ మార్పించాలని , కృష్ణా ……. అంతటి శుభకరమైన ప్లేస్ ను ఒకసారి చూడాలని ఉంది .
కృష్ణ : ఉదయం వెళ్లిన గుడి ప్రక్కనే అన్నయ్యా …… రండి వెళదాము .
బుజ్జితల్లి : నేను నేను చూయిస్తాను అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుదిగి త్వరగా రండి అంకుల్ అంటూ బుజ్జిబుజ్జిగా పరుగుతీసింది .
బుజ్జితల్లి బంగారూ ……. జాగ్రత్త …….
దేవత : మా దేవుడైన మీరుండగా మీ బుజ్జితల్లికి ఏమౌతుంది మహేష్ గారూ …..
అంతలో మట్టిరోడ్డుపై వర్షాలకు పైకి తేలిన రాళ్లు ….. బుజ్జిపాదాలకు అడ్డు తగిలినట్లు , అమ్మా …… అంటూ బుజ్జితల్లి కిందకుపడింది .
అంతే బుజ్జితల్లీ – కీర్తీ తల్లీ ……. అంటూ నలుగురమూ పరుగుతీసాము . మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……. అంటూ అప్పటికే లేచి ఏమీకాలేదు అంకుల్ అంటున్న బుజ్జితల్లిని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను . మోచేతులు – మోకాళ్లపై దెబ్బలేమైనా తగిలాయేమోనని కంగారుపడుతూ చూసి హమ్మయ్యా …….. అంటూ ముద్దులవర్షo కురిపించాను .
బుజ్జితల్లి : మమ్మీ చెప్పారుకదా , దేవుడైన మా అంకుల్ ఉండగా నాకేమి అవుతుంది – ఇంతదానికే కళ్లల్లో కన్నీళ్లు వచ్చేసాయి మీకు – నేనంటే అంత ప్రాణం అన్నమాట ఉమ్మా ……. అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
అధిచూసి దేవత ఆరాధనతో నావైపు చూస్తున్నారు .
కృష్ణ ఫ్రెండ్స్ : ఎప్పుడో 20 – 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు – నడవడానికే కాదు వెహికల్స్ కూడా కిందపడి దెబ్బలు తగులుతున్నాయి అని MLA – MP గారికి సర్పంచ్ – పెద్దయ్యతోపాటు ఊరిజనమంతా వెళ్లి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు . ఉదయం నుండీ కీర్తినే పడటం ఇది రెండోసారి – తోటి పిల్లలతో ఆడుకుంటూ పడటం చూసాను .
నిజమా …… కృష్ణా …… , బుజ్జితల్లీ బుజ్జితల్లీ …… ఎక్కడైనా నొప్పివేస్తోందా అని కంగారుపడుతూ అడిగాను .
కృష్ణ : మూడోసారి అన్నయ్యా …… ఉదయం ఆటోలోనుండి దిగి తాతయ్యా – అమ్మమ్మా …… అంటూ సంతోషంతో పరుగుతీస్తూ కూడా ఒకసారి పడింది .
బుజ్జితల్లి : మావయ్యా …… దెబ్బలేమీ తగలలేదులే , ఒక్కసారి అని తెలిస్తేనే అంకుల్ కళ్ళల్లో కన్నీళ్లు వాచ్చేసాయి – అంకుల్ అంకుల్ మా మంచి అంకుల్ కదూ దేవుడు కదూ …… మీ బుజ్జితల్లికి ఏమీ కాలేదు – ఎక్కడా నొప్పివేయ్యడం లేదు అని బుగ్గలను స్పృశిస్తూ బుజ్జగిస్తోంది .
అధిచూస్తూ నవ్వు వచ్చేసింది . లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ పైకిలేచాను . బుజ్జితల్లీ …… మమ్మీకి బై చెప్పు వెళదాము .
బుజ్జితల్లి : మమ్మీ బై …….
దేవత : లవ్ యు బుజ్జితల్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
ఎగిరి క్యాచ్ పట్టి నా హృదయానికి అందించబోయి , దేవత కోపాన్ని చూసి బుజ్జితల్లి బుగ్గపై తాకించి వెనక్కు తిరిగిచూడకుండా గదివైపుకు నడిచాను . నవ్వులు వినిపించినా వెనక్కు తిరుగనేలేదు .