నా కోరిక 3

Posted on

కారు అలా వెళ్ళగానే అన్నయ్య బైక్ తీసుకోని తిరుపతికి వెల్లిపోయాడు, నేను ఇంట్లోకి వెల్లి ఫ్రెష్ అయి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను టిఫిన్ కోసం, అప్పటికే కిరణ్ టిఫిన్ చేస్తున్నాడు, నన్ను చూసి రమ్య నాకు కూడా రెండు దోశలు వేసుకొని వచ్చింది, నేను టిఫిన్ చేస్తూ అందరూ ఎక్కడికి వెళ్లారు అని అడిగా, కీర్తి లోపలి నుండి వచ్చి మదనపల్లికి వెళ్లారు అక్కకు మ్యాచ్ చూడటానికి అంది, నేను కీర్తి వైపు చూసా దేవాకన్యలా ఉంది తనని చూస్తుంటే నా మనసు లాగేసింది,

నువ్వెంటి అంత హ్యాపీ గా ఉన్నావ్ నీకు లైన్ క్లియర్ అయిందనా అన్నాను, నాకు లైన్ క్లియర్ కావడం ఏంటి నేను ఈ జన్మలో పెళ్ళి చేసుకోను అని విసురుగా లోపలికి వెల్లిపోయింది, నాకు నీరజ చెప్పింది గుర్తుకు వచ్చింది కీర్తిని పడేయడం కష్టం అనిపించింది, కిరణ్ నా వైపు చూసి ఆ మెంటల్ దాని గురించి పట్టించుకోవద్దురా అది ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలిదు అన్నాడు, నేను టిఫిన్ తినేసి మా ఇంటికి వెల్లి పడుకొని నిద్రపోయాను.

మధ్యాహ్నం రెండు గంటలకు కిరణ్ వచ్చాడు, భోజనానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, రమ్య దీర్ఘంగా ఆలోచిస్తూ కనపడింది, బహుశా తన పెళ్ళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనుకున్నాను, నేను ఏమి మాట్లాడలేదు కీర్తి మాకు భోజనం వడ్డించింది, నేను సైలెంట్ గా భోజనం చేసి మా ఇంటికి వెల్లిపోయాను,

సాయంత్రం నాలుగు గంటలకు కరాటే డ్రెస్ వేసుకొని గ్రౌండ్ కి వెళ్లాను(కరాటే క్లాస్ జరిగే చోటుకి). రాజు నీకు కరాటే లో ఏమి వచ్చో చేసి చూపించమని అడిగాడు మాస్టర్, నేను నాకు వచ్చిన ట్రిక్స్ అన్నీ చేసి చూపించాను, బాడీ కొద్దిగా ఫిట్ చెయ్ మనం కాంపిటీషన్ కి వెళ్దాం, రేపటి నుండి నువ్వు ఉదయం పూట రా నీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను కరాటే కి కిక్ బాక్సింగ్ కి తేడా ఉంది, నీకు కాంపిటీషన్ కి అవసరమైన ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు, నేను సరే మాస్టర్ అన్నాను,

తరువాత నెల రోజులు నార్మల్ గా గడిచిపోయాయి, రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్, కిక్ బాక్సింగ్ ప్రాక్టీసు తరువాత టీవీ చూడటం అదే నా దినచర్య,

పెళ్ళి కుదిరినప్పటి నుండి రమ్య నాకు దూరంగా ఉంటోంది, నేను కూడా తనని ఇబ్బంది పెట్టలేదు, ఇంక కీర్తితో అయితే కనీసం మాట్లాడే వాడిని కూడా కాదు, అప్పుడప్పుడు నీరజ భార్గవి పల్లవి ఆంటీ ఫోన్ చేసి మాట్లాడే వాళ్లు కానీ ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు,

రమ్య పెళ్ళి దగ్గర పడింది ఇంక కేవలం పది రోజులు మాత్రమే ఉంది, పెళ్ళి పనులు జోరందుకున్నాయి, కిరణ్ వాళ్ళ నాన్న పెళ్ళి పనుల్లో నన్ను హెల్ప్ చేయమని అడిగాడు, మా నాన్న కూడా పర్మిషన్ ఇచ్చేసాడు పెళ్ళి అయిపోయే వరకు వాళ్లకి హెల్ప్ చెయ్ అని చెప్పాడు, ఆరోజు నుండి అంకుల్ కి కిరణ్ కి పెళ్ళి పనుల్లో తోడుగా ఉన్నాను,*

ఒక రోజు నేను అంకుల్ కలసి పెళ్ళి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాము, చాల ఊళ్లకు వెళ్ళాం తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది, అప్పటికే మా ఇంట్లో లైట్స్ అరిపోయాయి, మీ వాళ్లు పడుకున్నట్లు ఉన్నారు వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఎందుకు ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేసి ఇక్కడే పడుకో అన్నాడు, నేను సరే అన్నాను,

భోజనం చేసి పడుకునే టైంలో కరెంటు పోయింది, ఇంట్లో చాల ఉక్కపోతగా ఉంది, కిరణ్ వాళ్ళ నాన్న పవర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఇంకొ రెండు మూడు గంటలు పడుతుంది కరెంటు రావటానికి అని చెప్పారు, ఇంట్లో పడుకోవడం కష్టం మేడ మీదకి వెళ్దాం చల్లగా గాలి వస్తుంది అంది కిరణ్ వాళ్ళ అమ్మ,

అందరం మేడ మీదకి వెళ్ళాం, కిరణ్ వాళ్ళ నాన్న అమ్మ, తరువాత కీర్తి రమ్య కిరణ్ తరువాత నేను వరుసగా పడుకున్నాం, కిరణ్ వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, కిరణ్ రమ్య ఇద్దరు చెరొక హెడ్ సెట్ స్పీకర్ చెవిలో పెట్టుకొని మొబైల్ లో పాటలు వింటున్నారు,

నేను నా మొబైల్ లో సినిమా పెట్టుకొని చూస్తున్నా, మొబైల్ లో ఎం చూస్తున్నావు అని అడిగింది కీర్తి,* దూకుడు సినిమా చూస్తున్నాను అన్నాను, నేను మహేష్ కి పెద్ద ఫ్యాన్ నేను కూడా మూవీ చూస్తాను అని నా పక్కన పడుకొని సినిమా చూస్తోంది, నాకు నీరజ చెప్పింది కీర్తి మహేష్ కి ఫ్యాన్ అని అందుకే మూవీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అది ఇప్పుడు ఉపయోగ పడింది, నేను కీర్తి కూడా చెరొక స్పీకర్ చెవిలో పెట్టుకున్నాం, కీర్తి నా కన్నా వయసులో పెద్దది పైగా నేను వాళ్ళ ఇంట్లో మెంబెర్ లా కలసిపోవడం వల్ల, కీర్తి నా పక్కన పడుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఏమి అనలేదు,

146464cookie-checkనా కోరిక 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *