నేను “ ఒసేయ్ కొండ ముచ్చు లత…. దేవుడు దయవలన నాకు ఏదైనా అవకాశం దొరికితే నిన్ను ఊరికే వదిలి పెట్టనే ,, నీ అంతు చూస్తానే పేడ మొహం దాన….” అని తిట్టు కొని ఇంక తరువాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా……
చంద్ర అభిలాష – 2
ఒక వారం రోజులు అవే ఆలోచలనలతో గడిపాను. ఎంత ఆలోచించినా చేసిదేమి లేక ఇక ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. నా ప్రయత్నం ఫలించి రేపు ఇంటర్వ్యూ కి రమ్మని మెయిల్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు నా వర్క్ మొత్తం చూసి ఉద్యోగం ఇచ్చారు. నేను ఒక “THANK YOU ” చెప్పేసి వచ్చేసాను.
నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ మధ్యలో ఒక పాప పడిపోయింది, అలాగే అటు వైపు నుండి వేగంగా ఒక కార్ వస్తుంది. నేను ఆ పాపని పట్టుకొని రోడ్ కి అటుపక్క పడ్డాను, సరిగ్గా నేను పాపను పట్టుకునే సమయానికి ఆ కార్ కూడా వేగంగా పక్కకి తిప్పడం తో పక్కనే ఉన్న చెట్టుకు తగిలి పెద్ద శబ్దం వచ్చింది.
పాప బాగానే ఉందని చూసుకొని వాళ్ళ అమ్మకి అప్పగించాను, అప్పటికే అక్కడ జనం గుమిగూడారు. ఎవడో ఆ వెధవ చూద్దాం అని కార్ దెగ్గరకు వెళ్తే ఒక నలభై వయసులో ఉన్న ఆమె ఉంది. మరింత గమనిస్తే తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది, ఆలస్యం చెయ్యకుండా ఆటో ఎక్కించి ఆసుపత్రి లో చేర్పించాను.
ఆరు గంటలు తరువాత డాక్టర్ వచ్చి ఆమెకి స్పృహ వచ్చిందని నన్ను చూడొచ్చని చెప్పి వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్లి చుస్తే ఆమె తలకి కట్టు కట్టి ఉంది. దెగ్గరికి వెళ్లి “ ఇప్పుడు ఎలావుందండి ” అని అడిగాను. తను చిన్నగా నవ్వుతూ “ పర్లేదండి, బాగానే ఉన్నాను ” అని చెప్పి ఏం జరిగిందని అడిగింది. నేను జరిగింది అంతా ఆమెకు వివరించాను.
ఆమె నా వైపు కృతజ్ఞతగా చూస్తూ “THANKS అండి, మీరే లేకపోతే ఆ పాపకు ఏం జరిగుండేదో ఏమో ” అని కొంచం భయం గా అనింది. “ పర్లేదండి , ఇది నా బాధ్యత ” అని చెప్పి ఆమెతో కాసేపు నవ్వుతూ మాట్లాడాను, మాటల మధ్యలో ఆమె పేరు “ మధుమతి ” అని తెలుసుకున్నాను. ఎందుకో తెలియదు మధుమతి తో మాట్లాడుతుంటే సొంత మనిషితో మాట్లాడుతున్నట్లుంది, మేము అలాగే చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాం, డాక్టర్ గారు వచ్చి కొన్ని రిపోర్ట్లు చూసి మధుమతిని వేల్లచ్చని చెప్పారు.
నేను మధుమతి గారితో పాటే బయటి వరకు వచ్చి “ ఇక నేను బయల్దేరుతాను ” అని చెప్పాను. మధుమతి నా చెయ్యి పట్టుకొని “ అదేంటి అంత సులభంగా తప్పించుకుందాం అనుకుంటున్నావా చంద్ర, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి ” అని చెప్పింది. నేను కొంచం మొహమాటంగా “ పర్లేదు మధుమతి గారు , ఈ మాత్రం దానికే ఎందుకు ఇవన్ని ” అని ఇంకా ఏదో చెప్తుండగా “ ష్….. నువ్వేం మాట్లాడకు చంద్ర, నువ్వు వస్తున్నావ్…. అంతే ” అని చెప్పేసి వద్దన్నా వినకుండా టాక్సీ లో వాళ్ళ ఇంటికి చేరుకున్నాము.
అది ఒక అద్భుతమైన విల్లా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, స్విమ్మింగ్ పూల్, లోపలికి వెళ్లి చుస్తే ఎంతో విలాసంగా సౌకర్యంగా ఉంది. మధుమతి నా వైపు చూసి “ చంద్ర .., కాస్త ఫ్రెష్ అయ్యి రా , తినేద్దాం ” అని చెప్పింది. నేను మెల్లగా “ ఇప్పుడెందుకు ఇవన్ని…. ” అని ఇంకా ఏదో చెప్తుంటే మధుమతి కోపం గా చూసే సరికి “ సరే సరే… వెళ్తాను. ఈ మాత్రం దానికే ఎందుకు అంత కోపం ” అని చెప్పి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దెగ్గర కూర్చున్నాం.
నేను చుట్టూ చూస్తుంటే “ ఏంటి అలా చూస్తున్నావ్ ” అని అడిగింది. “ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే కలిసి తినొచ్చు కదా ” అని అన్నాను. దానికి మధుమతి నవ్వుతూ “ ఈరోజు ఈ ఏకాకికి తోడుగా నువ్వున్నావ్ , రేపటి నుంచి మళ్ళి ఏకాకిగా నే ఉండాలి ” అని చెప్పింది. నేను ఆశ్చర్యంగా చూస్తూ “ నీకు ఎవ్వరు లేరా ” అని కొంచం మెల్లిగా అడిగా,
తను కొంచం దిగులుగా “ అందరూ ఉన్నా ఎవరిదెగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ” అని చెప్పింది. నేను కొంచం బాధగా “ I AM SORRY మధుమతి గారు, అనవసరంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చానని ” చెప్పాను, మధుమతి మళ్ళి మాములుగా మాట్లాడుతూ “ ఎప్పుడో జరిగినదాని గురించి ఇప్పుడెందుకు చంద్ర, మనం తిందాం పట్టు ” అని నాకు వడ్డించి, తను కూడా వడ్డించుకొని తినడం మొదలు పెట్టాం.
నేను చాలు చాలు అంటున్నాసరే “ అప్పుడేనా .… ఈ బిర్యానీ వేసుకో….చికెన్ వేసుకో…. మటన్ తిను….” అంటూ కొసరి కొసరి వడ్డించింది. ఇక చాలా సేపటి తరువాత ఇద్దరం తృప్తి గా భోజనం ముగించాం. తను చంద్రా అని నన్ను పిలిస్తే “ అమ్మో.. ఇక నా వళ్ళ కాదు తల్లి, ఒక్క మెతుకు కూడా ఈ పొట్టలోకి పోదు ” అని దండం పెట్టేసాను. నా చర్యకి తను మనసార నవ్వుకొని “ అది కాదులే, కూల్ డ్రింక్ తీసుకొస్తా ఉండు ” అని చెప్పి డైనింగ్ టేబుల్ మొత్తం శుభ్రం చేసి రెండు గ్లాస్సుల్లో కూల్ డ్రింక్ తీసుకొస్తుంది.
తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, సమయం చాలా అయిపోవడం తో నేను వెళ్తాను అని చెప్పాను, అప్పటి దాక నవ్వుతున్న తను ఆ మాట వినే సరికి దిగులుగా మారిపోయి “అప్పుడే వెళ్ళిపోవాలా ” అని అడిగింది.
నేను కొంచం ధైర్యం చెప్తూ “ ఇప్పుడేగా ఫ్రెండ్స్ అయ్యింది , అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం గా , దిగులు పడకండి ” అని బాధ పడొద్దు అన్నట్లుగా చెప్పాను.
మధుమతి కొంచం కోపం గా “ అండి..గిండీ… ఏంటి !! నేనేమైన ముసల్దాన్లా కనిపిస్తున్నానా… ఇంకోసారి అలా అన్నావనుకో ” అంటూ వెళ్ళు చూపిస్తూ బెదిరించే సరికి నేను కూడా నవ్వుతూ “ సరే..అలాగే…మధుమతి.” అని అన్నాను.
దానికి మధుమతి నవ్వేస్తూ “ GOOD BOY ” అంటూ నా భుజం తట్టింది. నేను మళ్ళి “ వెళ్తాను ” అంటే మధుమతి “ అంటే మళ్ళి రావా … వెళ్తాను కాదు వేల్లోస్తాను అనాలి ” అని తలమీద మొట్టికాయ వేసింది. నేను తలరుద్దుకుంటూ “ ఆహ్… సరేలే వెళ్లొస్తాను చాలా ” అని చెప్పాను.
తను కూడా నవ్వుతూ మళ్ళి ఏదో మర్చిపోయిన్దానిల “ చంద్ర నీ నెంబర్ ఇవ్వు ” అని మెసేజ్ చేసింది. నేను సరేలే అని చెప్పి టాక్సీ మాట్లాడుకొని నా ఫ్లాట్ కి వచ్చి బెడ్ పై పడుకొని ఈరోజు జరిగిన సంఘటనలన్నీ ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నానని తనకి మెసేజ్ చేసి నిద్ర పోయాను.
మరుసటి రోజు ఉదయాన్నే లేచి టిఫ్ఫెన్ తినేసి తయారై ఆఫీసుకు వెళ్ళాను . మొదటి రోజు కాబట్టి మేనేజర్ అందర్నీ పరిచయం చేసి నా టీం ని చూపించారు. అందులో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు ఉన్నారు, అందరితో పరిచయం పెంచుకొని సరదాగా మాట్లాడుకున్నాం.
ఇంకా లంచ్ టైం అవ్వడంతో కాంటీన్ కు వెళ్లి అందరం తింటూ ఉండగా పక్కన “ ఏంటి ఈరోజు మన బాస్ రాలేదు….” అని గుసగుసలు వినిపించాయి. నేను పక్కనున్న నా టీం మెంబెర్ తో “ ఏంటి, బాస్ ఈరోజు రాలేదా ??” అని అడిగాను. దానికి తను అవునని తల ఊపాడు.
తినేసి వెళ్లి చీకటి పడేంత వరకు పనిచేసి ఫ్లాట్ కి తిరిగి వచ్చేసాను. ఒకసారి మధుమతికి “ ఇప్పుడు ఎలాగుంది మధుమతి…అంతా ok నా ” అని మెసేజ్ చేశాను. 5 నిమిషాల తరువాత “ బాగున్నాను. రేపటి నుంచి మాములుగా ఆఫీసు కు వెళ్తాను, నీ మొదటి రోజు ఎలావుంది ” అని అడిగింది. నాకు కూడా చాలా బాగుంది అని బదులిచ్చాను. ఇంకా కొన్ని మాటలు సరదాగా మాట్లాడుకొని పడుకున్నాం.
పొద్దునే లేచి ఆఫీసుకు వెళ్ళిపోయాను. కాసేపటి తరువాత నన్ను బాస్ పిలుస్తున్నారని తెలిసింది, నా టీం మెంబెర్స్ అందరు తెగ జాగ్రత్తలు చెప్పారు “ బాస్ దెగ్గర జాగ్రత్త అని… అలవుండాలి…ఇలావుండాలని…” చెప్పారు. ఇవన్ని విని మనసులో “ ఈ బాస్ ఎవరో కాని వీళ్ళందరినీ ఇంతగా కంట్రోల్ లో పెట్టారంటే కొంచం జాగ్రత్తగా ఉండాలి ” అని అనుకోని బాస్ గది తలుపు దెగ్గరకు వచ్చి “ MAY I COME IN MADAM..” అని మర్యాదగా అడిగాను.
అవతలవైపు నుండి “ COME IN ” అని వినిపించి లోపలికి వెళ్లి విష్ చేశాను, ఆమె ఒక ఫైల్ చూస్తుండటంతో మొహం కనబడలేదు. నేను ధైర్యం చేసి “ మేడం పిలిచారంట…” అని అన్నాను. ఆమె “ ఏంటి mr. చంద్ర , ఆఫీసు అంతా ఎలావుంది ?” అని అడిగింది. నేను అంతా బాగుందని చెప్పాను.
తను ఫైల్ కిందకి దించి నవూతూ “ అయితే అంతా ok నా రా ” అని చూస్తుంది. నేను ఆశ్చర్యంతో “ మధుమతి …… ను..ను..నువ్వా…సారీ..సారీ.. మీరా?” అని అన్నాను. మధుమతి నిట్టూరుస్తూ “ రేయ్ ఎన్ని సార్లు చెప్పాల్రా…. పేరు పెట్టి పిలవమని ” అని నవ్వుతూ కసిరింది. నేనింక అదే షాక్ లో వున్నా. “ మధుమతి…నువ్వేనా ఈ కంపెనీ కి బాస్ వి ” అని కొంచం ఆనందం గా అడిగాను.
