అందమైన అనుభవం

Posted on

“ఇంత అందమైన ప్రదేశంలో మెత్తని ఇసుకపై నీ పక్కనే నడుస్తూంటే, ఏదో చెప్పలేని ఆనందం, “అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను. అందమైన అమ్మాయితో ఇటువంటి రమణీయ ప్రదేశంలో గడపడం నిజంగా నా అదృష్టం. కల్లోకూడా ఊహించలేదు.”

ఆ మాట నేనే అనాలి. పరిచయమైనప్పటి నుండీ మీతో గడిపిన ప్రతి క్షణం, నా జీవితంలో ఓ అందమైన అనుభవంలా మిగిలిపోతుంది. ఇక్క డికి రాకముందు ఎంతో భయపడ్డాను. కానీ ఇలా మీ పక్కనే ఉంటే, భయమన్నదేలేదు అంది అమూల్య. అక్కడ ఇసుకలో కూరుకుపోయిన ఓ పడవ పక్కనే నడుస్తున్న అమూల్య తుషార్ భుజంమీద చెయ్యి వేయబోయి తూలిపడబోయింది. ఒడుపుగా ఆమెను పటుకున్న తుషార్తో సహా ఇద్దరూ సైకత తల్పం లాంటి ఇసుక పాన్పు మీద వెల్లకిలా పడిపోయాడు. అలా పడ్డప్పుడు ఆమె పయ్యెద మాటున పదిలంగా దాగిన సంపద మొత్తగా అతని గుండెల్ని ముద్దాడింది. అమూల్య ఎంతో హాయిని అనుభవిస్తూ అతన్ని ఇంకా గట్టిగా వాటేసుకుని తన గుండెలకు బలంగా హత్తుకుంది.

చుట్టూ ఏకాంతం, మనసుని తొందరపెడుతున్న వయసు ప్రభావం..

తనువు, మనసు ముడివేసుకున్న ఆ జంట సరస సల్లాపాలను చూసి ప్రకృతి పులకించి పోయింది. వారి ప్రేమకు సాక్షిగా అప్పుడే ఉదయించిన బాలభానుడు తన నులివెచ్చని లేత కిరణాలతో వాళ్ళను ఏకంకమ్మని ఆశీర్వదించాడు. అలా వారిద్దరూ ఆ ఏకాంతాన్ని ఆనందిస్తుండగా అంతలో పడవవాడు తమకేసి రావడం చూసి సిగ్గుతో పైకిలేచి ఇసుక దులుపుకుని ముసిముసిగా నవ్వు కుంటూ పడవలో తిరిగి ప్రయాణమయ్యారు.

కొద్దిసేపటిక్రితం ‘అనుభవం’ పడవలో కూర్చున్న అమూల్యకు గుర్తొచ్చి ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. ఆమె బుగ్గలు సింధూరవర్ణం దాల్చాయి. సూర్యుని లేతకిరణాలు ఆ నదిమీద నుండి పరావర్తనం చెంది, అమూల్య మీదపడి ఆమె మోము సప్తవర్ణాల ఇంద్ర ధనస్సులా మారింది. ఆమె అందాలను మైమరచి చూస్తున్న తుషార్ తో ‘దిగండి సాబ్.’ అన్నాడు పడవవాడు నవ్వుతూ. ఈ లోకంలోకి వచ్చిన తుషార్ వాడి చేతిలో వెయ్యిరూపాయల నోటు పెట్టి షుక్రియా” అంటూ పడవదిగి, అమూల్యకు చెయ్యి అందించాడు.’

‘నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచి పోయాయి. నిన్ను వదిలి ఒంటరిగా వెళ్ళాలంటే భయంగాను, బాధగాను ఉంది’ ట్రాలీబ్యాగులో బట్టలు సర్దుతూ అంది అమూల్య.

“బాధ ఎందుకు? నేను పక్కనుండగా నువ్వెప్పుడూ బాధపడకూడదు. నేను తట్టుకోలేను’ ఆమెకు బట్టలు అందిస్తూ నవ్వుతూ అన్నాడు తుషార్.

నీకంతా నవ్వులాటే నేను ఒంటరిగానే వెళ్ళాలి కదా బ్యాగ్ జిప్ వేస్తూ కన్నీటిని దాచుకుంటూ అంది అమూల్య.

‘అమూల్యా నేనూ నీతోపాటే వస్తున్నాను” అన్నాడు తుషార్.

“వాట్! ఏం మాట్లాడుతున్నావు నమ్మశక్యం కానట్లుగా అడిగింది.

“ఎస్. నేనూ నీతో పాటే ట్రైనులో వస్తున్నాను. అందుకే నా ఫ్లైటు టిక్కెట్టు క్యాన్సిల్ చేశా. నీకు సర్ఫ్రైజ్ ఇద్దామని చెప్పలేదు. సో నీతో మరో ఇరవై నాలుగు గంటలు ఒకే బెర్తు మీద. ఏదో చిలిపిగా నవ్వుతూ తుషార్ చెప్పబోతుండగా ‘థాంక్యూ అంటూ తుషార్ వంక ప్రేమగా చూసి, “నీతో కొన్నిగంటలు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రయాణం చెయ్యాలని ఉంది’ మనసులోనే అనుకుని అతన్ని మరోసారి అల్లుకుపోయింది. ఆమె పాలబుగ్గల మీద ముద్దుపెడుతూ ‘అమూల్య మనిద్దరం ఎన్నో మరపురాని అనుభవాలతోను, అను భూతులతోను ఈ కాశీ నగరం వదులుతున్నాం” అంటూ ఆమె నుదుటి మీద గాఢంగా చుంబించి, “ఈసారి జంటగా ఇక్కడికి వద్దాం” అన్నాడు నవ్వుతూ.

147816cookie-checkఅందమైన అనుభవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *