అందమైన అనుభవం

Posted on

“వెల్కమ్ సార్, మీ రూము కీస్ తీసుకోండి ఫార్మాలిటీస్ పూర్తిచేసి తుషార్ చేతికి తాళాలిచ్చాడు గంగా గెస్టు హౌస్ మేనేజర్.

“థాంక్యూ అంటూ, ‘ఓ సింగిల్ రూము ఏదైనా ఉందా’ అడిగాడు తుషార్.

సారీసార్ సీజను కదా చెప్పాడు మేనేజర్.

“ఇక్కడేమీ రూములు లేవట. అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నాతో ఉండండి. రేపు ఎక్క డైనా ట్రై చేద్దాం” అన్నాడు అమూల్యతో తుషార్. అతని వంక అనుమానంగా చూసింది.

“చూడండి. ఇద్దరం ఒకే రాష్ట్రంవాళ్ళం. పైగా ఒకే బెర్తుమీద కలిసి ప్రయాణించి వచ్చాము. అంచేత మీరింకేం ఆలోచించకండి. అయినా నేను అలాంటివాణ్ణి కాదు, నా మాట నమ్మాలి మీరు” భరోసా ఇచ్చాడు తుషార్.

‘సరే కానివ్వండి. మీమీద నమ్మకం ఉంది’ అంటూ అతడి రూములోకి వచ్చింది అమూల్య.

***

అర్ధరాత్రి వేళ. గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడ్డారు తుషార్, అమూల్య. ఎదురుగా పున్నమి చంద్రుని కిరణాల కాంతిలో మిలమిల మెరుస్తూ, ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగానది!

“అహా ఎంతో అందంగా, నవకన్యలా మెరిసి పోతోంది కదూ గంగానది అమూల్యతో అన్నాడు తుషార్. గాలికి ఆమె కురులు ఎగురుతూ తుషార్ ముఖానికి తగిలి అతడికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆమె పర్ప్యూమ్ పరిమళం అతడికి ఏదో సరికొత్త మత్తునిస్తోంది.

నిజమే, మీరన్నట్లు గంగానది చూడ్డానికి ఎంత బావుందో అంది అమూల్య.

బైట బాగా చలిగా ఉంది. చూడండి నా బుగ్గలు, చేతులు ఎంత చల్లబడిపోయాయో” అన్నది. ఆమె బుగ్గల మీద చేతులు వేసి, ఆమె చేతిని చొరవగా పటుకున్నాడు తుషార్ నిజమే మీరు చాలా చల్లగా అయిపోయారు. పదండి లోపలికి రేపు మీ పోస్టర్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. పైగా మీకేమైనా అయితే నేను తట్టుకోలేను నవ్వుతూ అన్నాడు తుషార్ ఆ అభిమానం, ప్రేమకు పొంగిపోయింది అమూల్య. సడన్గా అతణ్ణి వాటేసుకుంటూ అతని గుండెల మీద ముద్దుల వర్గం కురిపించింది. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయాడు తుషార్ ఆమెను గట్టిగా పొదివి పటుకుని నుదుటన పెదవులతో సృశించాడు. ‘అమూల్యా నువ్వు నా దానివి’ అన్నాడు. ఆమె ఇంకాగట్టిగా వాటేసుకోవడంతో పరవశమైపోయాడు తుషార్ అతడి వెచ్చని కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగి పోయింది. ఆ మధుర క్షణాలు అనుభవించిన కొద్దిసేపటికి వారిద్దరూ సడనుగా ఏదో తప్పు చేసినవారిలా విడివడ్డారు. సిగ్గుతో ఒకర్ని చూసి మరొకరు నవ్వుకుని గుడ్ నైట్ చెప్పకున్నారు.

***

మర్నాడు ఉదయం బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టిన వారిద్దరిలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం, ఉద్వేగం!

పచ్చనిచెట్లతో హరితవనంలా, విశాలమైన భవంతులున్న క్యాంపస్ ముగ్దుల్ని చేసింది వారిని. ‘ఆహా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులో అనుకున్నారు. క్యాంపస్ దారుల్లో అందమైన యువతులు, రంగురంగుల సీతాకోకచిలకల్లా తిరుగుతూ యూనివర్సిటీకి మరింత అందం తెస్తున్నారు.

మధ్యాహ్నం పేపరు ప్రెజెంటు చేశాడు తుషార్. ‘ఆ… అమూల్య నీ పోస్టర్ ప్రెజంటేషన్ కూడా అయిపోయింది కదా, ఇక పద సరదాగా అలా గంగలో షికారుకి వెళ్ళి ఆ తర్వాత గంగా హారతి చూద్దాం” అన్నాడు. ఆనందంగా అతడి వెంట వెళ్ళింది అమూల్య.

***

సాయంత్రంవేళ చల్లగాలిలో మనసుకు నచ్చినవాడితో గంగానదిపై పడవప్రయాణం. ఎంతో హాయి అనిపించింది అమూల్యకు ‘అబ్బా ఎంత బావుందో కదా ఈ అనుభవం. కానీ ఈ చలిగాలే ఇబ్బంది పెడుతోంది’ అంటూ పడవలో తుషార్ పక్కన కూర్చుంది అమూల్య.

వచ్చీరాని తెలుగు, హిందీలో ఫూట్ల విశేషాలు చెబుతున్నాడు పడవవాడు. సాబ్ మీకు తెలుసోలేదో మీ మద్రాసి హీరో చిరంజీవి అదిగో కనిపిస్తోందే ఆ ఇంటిని ఈ మధ్యనే కొన్నారు అని చెప్పడంతో ఏమిటో వీళ్ళకు తెలియని విషయాలు లేవనుకుంటాను అనుకుని నవ్వుకున్నారు. పడవవాడు తన ధోరణిలో ఏదో చెప్చుకుపోతున్నాడు. కానీ అమూల్య దృష్టంతా తుషార్ పైనే దానికి తోడు చలిగాలి పెరిగింది. అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ ‘అబ్బా ఏమిటి బాబూ, వాడి నస. ఇప్పుడు మనం ఈ ఫూట్ల గురించి తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? వాణ్ణి కాస్త ఆపమను అంది. ‘అది వాడి వృత్తి, ఇంక చలి అంటావా నాకు దగ్గరగా కూర్చో అప్పుడు చలీగిలీ అన్నీపోతాయి’ అంటూ రెండు చేతులూ ఆమె చుట్టూ వేశాడు తుషార్. ‘ఏమిటో తుషార్, మీ పరిచయం ఓ కలలాగా ఉంది. నిజంగా మీరు తోడు లేకపోతే ఈ ఊళ్ళో నేనెలా ఉండేదాన్నో ఎక్కడ ఉండేదాన్నో తల్చుకుంటుంటే, గమ్మత్తుగాను, భయంగాను ఉంది. థాంక్స్ ఎలాట్ నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు’ అతని కళ్ళల్లోకి ఆరాధనగా అంతకు మించి ప్రేమగా చూస్తూ అంది అమూల్య.

“అదేం కాదు, నీతో పరిచయం నిజంగా నా అదృష్టం’ అని, పడవవాడితో ‘చూడు బాబూ రేపు ఉదయం మమ్మల్ని గంగ అవతలి ఒడ్డుకు తీసుకు వెళ్తావా’ హిందీలో అడిగాడు తుషార్. తీక్ హై సాబ్, ఐదు గంటలకువచ్చి తీసుకెళ్ళి సూర్యోదయం చూపిస్తాను’ అంటూ తుషార్ ఇచ్చిన ఐదువందల నోటుని తీసుకుని వెళ్ళిపోయాడు.

అమూల్య సాయంత్రం మనం గంగలో షికారు కెళ్ళినప్పుడు నువ్వో విషయం గమనించావా, దూరం నుండి చూస్తే ఆ గంగ వంపు అచ్చు ఓ కన్నెపిల్ల సన్నని నడుంలా ఎంతో అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మన్మథుడు ఎక్కుపెట్టిన విల్లులా, శివుని శిరస్సుపై నెలవంకలా ఎంత బావుందో కదా?’ అమూల్య నడుం వంక చూస్తూ అన్నాడు తుషార్.

“ఓహో. అన్నీ బాగానే అబ్జర్వ్ చేశావే. సరే అయితే నా ఒంట్లో భాగాలు ఎలా ఉంటాయో చెప్పండి చూద్దాం’ కవ్విస్తూ బెడ్డుమీద అతని పక్కనే కూర్చుంటూ అంది అమూల్య.

అన్నీఅంటే… ఊ… ఎక్కడ నుండి మొదలు పెట్టను, పైనుండా, కింద నుండా’ అని నవ్వుతూ ఆమె గుండెల కేసి ఆశగా చూస్తున్న తుషార్ పెదాలను మరోసారి తన అధరాలతో మూస్తూ ‘ఏమో నాకేం తెలుసు, అన్నీ ఆటోమేటిక్ గా నా ప్రమేయం ఏమీ లేకుండా వాటంతటవే జరిగిపోతున్నాయి’ అంటూ అతన్ని తన మీదకు లాక్కుంది అమూల్య. ఆ రాత్రి తెల్లవార్లూ అతన్ని ముద్దులతో ముంచెత్తుతూనే ఉంది.

***

చెప్పిన ప్రకారమే మర్నాడు ఉదయం పడవ వాడు వాళ్ళను తీసుకుని గంగ ఆవలి ఒడుకు బయలుదేరాడు. పడవ గంగ నడిమధ్యకు చేరుకుంది. పూలవానలా కురుస్తోంది మంచు. గంగ ఒడ్డున స్నానం చేసిన భక్తులు దీపాలు వెలిగించి గంగలో వదులుతున్నారు. ఆ దీపాలు నదిమీద తేలుతూ వెళుతుంటే ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది. ఆ వాతావరణం చూసి పరవశించిపోయాడు తుషార్. చలిగాలికి వణుకుతున్న అమూల్యను చూసి ఏంటి అమూల్య చలిగా ఉందా? పోనీ వెనక్కు వెళ్ళిపోదామా అన్నాడు ప్రేమగా.. వద్దు తుషార్, ఇటువంటి అనుభవం మళ్ళీ జీవితంలో దొరకదు. నీతో ఇలా పవిత్ర గంగానదిపై పడవ ప్రయాణం “అందమైన అనుభవం’. దీని కోసం ఒక్క చలిగాలేంటి దేన్నీ లెక్కచెయ్యను’. తుషార్ భుజంపై తలవాల్చి అతని చెవిలో మెల్లగా అంది. “మన ప్రేమకు ఈ గంగమ్మతల్లే సాక్షి. ఐ లవ్యూ తుషార్ కళ్ళమూసి తన్మయ త్వంతో చెప్పింది. పడవవాడు తనలోనే నవ్వుకున్నాడు. వాళ్ళను గంగ ఒడ్డున వదిలి, సాబ్ నేను గంటలో వస్తాను. ఈలోగా మీరు. అంటూ నవ్వుతూ హిందీలో ఏదో అని వాళ్ళకు ఏకాంతం కలిగించి వెళ్ళిపోయాడు.

147816cookie-checkఅందమైన అనుభవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *