బుజ్జాయిలు : బజ్జిసింహాల దాహం తీర్చి , ఆకలివేస్తోందా …… అమ్మ చెంతకు చేరి పాలు త్రాగుతారా అంటూ అడవిరాణి దగ్గరికి వదిలి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు , మహారాజా …… నీళ్లు లేవు కాబట్టి ఆహారం కూడా లేదేమో , వంటశాల ప్రక్కనే ఉన్న పెద్ద భవనంలో కూరగాయలతోపాటు మాంసం కూడా చాలా నిల్వ ఉంచారు , మహారాజుగా ఆజ్ఞవేస్తే వెంటనే తీసుకొస్తారు .
మహారాజు మహారాజు ……. మిమ్మల్నీ , మహారాజే ఆజ్ఞ వెయ్యాల్సిన అవసరం లేదు మా ముద్దిచ్చే బుజ్జి యువరాజు యువరాణి కూడా ఆజ్ఞ వెయ్యవచ్చు ఎందుకంటే జంతువుల ఆకలి తీరబోతున్నది మీవల్లనే కదా …… , మీ మనస్సు గొప్పది మీ అమ్మగారిలానే అనుకుంటాను , మహారాణీగారు …… దాహం తీరుస్తున్నారు – మీరు ….. ఆకలి తీర్చబోతున్నారు అంటూ ఇష్టంగా ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఊహూ మహారాజుగారే ఆజ్ఞ వెయ్యాలి .
నాకోసం నాకోసం దయచేసి నాకోసం అంటూ బ్రతిమాలుకున్నాను .
బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ మేముకూడా పాటించాలి కాబట్టి సరే అంటూ సైనికులకు ఆజ్ఞవేశారు మొత్తం ఆహారాన్ని తీసుకురమ్మని ……..
మా బుజ్జాయిల మనస్సు బంగారం అంటూ ముద్దులుకురిపిస్తాను .
మహారాణిగారు సంతోషం పట్టనట్లు చప్పట్లు కొడుతూనే ఉన్నారు .
కాస్త ఇబ్బందిపడుతూనే , ప్రజలందరికీ కూడా ధాన్యాన్ని పంచండి .
మహారాజా మహారాజా మహారాజా ………
ఆగండి ఆగండి ……. , ఎవరి గొప్పతనం ఎవరికి ఇస్తున్నారు , బుజ్జియువరాజు – బుజ్జియువరాణి ……..
ప్రజలు : బుజ్జి యువరాజు – బుజ్జి యువరాణి ……. అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా హోరెత్తించారు సంతోషంతో ……..
జంతువులు మాంసం – కూరగాయలను చూసి సంతోషాలతో గర్జించాయి – గాండ్రించాయి , మాపైకి నీళ్లు వెదజల్లి సంతృప్తిగా తిని ఆశీర్వదించి వెళ్లిపోయాయి , చివరగా అడవిరాజు కుటుంబం మాత్రమే మిగిలింది .
ప్రజలు : మహారాజా …… ఈ ధాన్యంతో చాలారోజుల తరువాత పిల్లలు కడుపునిండా తినబోతున్నారు – ధన్యవాదాలు మహారాజా అంటూ దండాలు పెడుతున్నారు .
ఈ ఒక్కపూటే కాదు రోజూ మూడుపూటలా ఇంటిల్లిపాది సంతృప్తిగా తినేలా చెయ్యాలి ఎలా యువరాజా మహారాజా ……. ? .
యువరాజు : వీలవుతుంది మహారాజా …… , మీవీరత్వం వలన చుట్టుప్రక్కల వేరువేరుగా ఉన్న పదులసంఖ్యలో పెద్ద చిన్న రాజ్యాలు ఒక్కటైపోయాయి ఒకరికొకరం సహకరించుకుంటే సంతోషంగా జీవించవచ్చు , ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను నాకు వదలండి .
చాలా చాలా సంతోషం మహారాజా …… , అలాగే మన రాజ్యం కరువు పోయేలా దుర్గమ్మ తల్లికి పూజలు జరిపించాలి .
యువరాజు : మీరు ఎలా అంటే అలా మహారాజా …… , నాకుకూడా సెలవు ఇప్పిస్తే మా తండ్రిగారి దహన సంస్కారాలు పూర్తిచేయాలి .
మరొకసారి మా సంతాపం మహారాజా ……
యువరాజు : కృతజ్ఞుణ్ణి మహారాజా …… , పూర్తయ్యాక కలుస్తాను అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి తన భద్రతా సైన్యంతోపాటు వెళ్ళిపోయాడు .
ప్రజల గురించి ఆలోచించే మహారాజు దొరకడం మన అదృష్టం అంటూ సంతోషంతో నినాదాలు చేసి సెలవు తీసుకున్నారు ప్రజలు …….
అడవిరాజా …… పూర్తిగా చీకటిపడింది మీరు వెళ్లలేదే ? , ఓహో …… మీ పిల్లలు కదూ ……
ఊహూ ….. అంటూ తలలను అడ్డంగా ఊపి నాప్రక్కనే చేరి ఆశతో చూస్తున్నాయి .
మంజరి : అడవిరాజుపైకి చేరి , ” నేను , నా కుటుంబాన్ని చేరినట్లుగానే మీరుకూడా మీ ప్రియసఖి చెంతకు చేరేంతవరకూ మీరు ఔనన్నా కాదన్నా మీవెంటే ” అంటున్నాడు ప్రభూ అడవిరాజు అనిచెప్పివెళ్లి మహారాణీ చుట్టూ ఎగురుతోంది .
అడవిరాజా ……. నిర్ణయానికి వచ్చేసారన్నమాట నామాటకూడా వినరు అయితే , కృతజ్ఞుణ్ణి …….
మేమే కృతజ్ఞులం అన్నట్లు నా పాదాలను స్పృశిస్తున్నారు .
భలేభలే అంటూ ఆనందిస్తున్నారు బుజ్జాయిలు …….
కృష్ణా …… రేయ్ మిత్రమా ఎక్కడ ఎక్కడ , నువ్వుకూడా మహారాణీ చెంతకే చేరిపోయావా …… సరిపోయింది – ఏమైంది మీకు ? , మీకు ఆకలివెయ్యడం లేదా నాకైతే తెగ ఆకలిగా ఉంది .
ఆకలిగా ఉందా వెంటనే వంటలు సిద్ధం చేస్తాము అంటూ మహారాణిగారు ఆతృతతో రాణులు – చెల్లితోపాటు రాజమందిరం లోపలికివెళ్లారు .
బుజ్జాయిలూ ……. మీ రాజ్యంలో …..
బుజ్జాయిలు : మన రాజ్యం ……
అమ్మో సరే సరే మనరాజ్యంలో మాహారాణి – రాణులు వంటలు చేస్తారా ? .
బుజ్జాయిలు : లేదు లేదు వంట మనుషులు చాలామంది ఉన్నారు కదా ….. మాకూ అదే ఆశ్చర్యంగా ఉంది , మీరు ఆకలి అనగానే అమ్మ చలించిపోయి పరుగులుతీశారు వెనుకే మంజరి కూడా ……
మంజరి కూడా వెళ్లిపోయిందా సరిపోయింది – నువ్వు వెళ్లలేదే మిత్రమా …….
బుజ్జాయిలు : వెళ్లడానికే ప్రయత్నించి ఆగడం చూసాము మహారాజా ……
ఏమో అయ్యింది మీకు , నాకంటే మహారాణీగారే ఎక్కువ అయిపోయింది మీకు .
బుజ్జాయిలు : గారు వద్దండి అమ్మ …….
తప్పు తప్పు ……. , ఆహా …… చంద్రుడి వెన్నెల మరియు కాగడాల వెలుగులలో ఎంత అద్భుతంగా ఉంది అంటూ కొండకు ఆనుకుని నిర్మించిన మహాద్భుతమైన రాజభవనాలను చూస్తున్నాను .
బుజ్జాయిలు : కొండ పైభాగం మరింత అద్భుతంగా ఉంటుంది రండి చూయిస్తాము అంటూ బుజ్జిచేతులతో చూయించారు అటు అంటూ ……. , అడవిరాజా – కృష్ణ మిత్రమా రండి ……..
ఉమ్మా ఉమ్మా …….
బుజ్జాయిలు : మహారాజా …… మీకు రాజభవనాలంటే ఇష్టమా ? , భవనాలలోపల మరింత విలాసవంతంగా ఉంటుంది .
నాకు – నా ప్రాణ సఖికి …… ప్రకృతి అంటే ఇష్టం , కొండ అందాలను చెరపకుండా – పచ్చని చెట్లను నరికి వెయ్యకుండా నిర్మించిన రాజభవనాల నిర్మాణపు సౌందర్యం ఇష్టం , ఇక విలాసాలకు చాలాదూరం – ఉద్యానవనాల సౌందర్యం చూయించండి చాలు ……. , మేము విశ్రమించబోయేది కూడా అక్కడే …….
బుజ్జాయిలు : మహారాజు గారు ఉద్యానవనంలోనా ? .
అవునుమరి మేము పుట్టి పెరిగినది ప్రకృతి ఒడిలో ……..
బుజ్జాయిలు : సరిగ్గా అమ్మలానే మాట్లాడుతున్నారు – అమ్మకూడా ……..
ఇప్పుడు మహారాణిగారి గురించి ఇప్పుడెందుకు ? .
బుజ్జాయిలు : మీ ప్రాణసఖి చాలా చాలా అదృష్టవంతురాలు , పరాయి స్త్రీ గురించి ఆలోచనే లేదు .
ఇక్కడ ఉన్నది కేవలం …….
బుజ్జాయిలు : తెలుసులే మహారాజా …… , ప్రతీసారీ గుర్తుచేయ్యాల్సిన అవసరం లేదు అంటూ బుజ్జి అసూయ చెందుతున్నారు .
అసలు మరిచిపోతేనే కదా నా హృదయసుందరి దేవకన్యను అంటూ కళ్ళు మూసుకుని అనుభూతి చెందుతున్నాను.
బుజ్జాయిలు : దేవకన్యనా …… ? , ప్చ్ …… ఆ దేవకన్య మా అమ్మ కానీ పిన్నమ్మలు కానీ అయిఉంటే ఎంత బాగు ……..
ష్ ష్ ష్ …… తప్పు తప్పు బుజ్జాయిలూ ……. మహారాణీ గారు – రాణీ వాళ్ళు వింటే బాధపడతారు .
బుజ్జాయిలు : మాకైతే అలా అనిపించనే లేదు , అమ్మ – పిన్నమ్మలు …… ఇక్కడ ఉన్నంతసేపూ మిమ్మల్నే ప్రేమతో చూస్తూనే ఉన్నారు తెలుసా ? , మీకెలా అనిపించింది మిత్రమా కృష్ణా – అడవిరాజా …….
అవునన్నట్లు తలలుఉపారు .
బుజ్జాయిలు : మీరు ఊ అనాలేకానీ మమ్మల్ని లాగేసి మీ గుండెలపైకి చేరిపోరూ …….
నాకూ అదే భయంగా ఉంది బుజ్జాయిలూ …… , మహారాణులు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు , తెల్లవారగానే ఇక్కడనుండి జారుకోవడం ఉత్తమం .
బుజ్జాయిలు : వీరాధివీరా అంటూ కళ్ళల్లో చెమ్మతో నా వస్త్రాన్ని చిరిగిపోయేలా పట్టేసుకున్నారు .
మిమ్మల్ని వదిలివెళ్లడం కూడా కష్టమే అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాను .
బుజ్జాయిలు : అయితే మమ్మల్ని కూడా మీవెంటే తీసుకెళ్లండి .
తల్లీబిడ్డలను వేరుచెయ్యడం పాపం తెలుసా ……
బుజ్జాయిలు : అమ్మా దుర్గమ్మా …… వీరాధివీరుడి దేవకన్య అమ్మను ఎందుకు చెయ్యలేదు అంటూ బాధపడుతున్నారు .
ష్ ష్ ష్ …… బుజ్జాయిలూ మీరుకూడా దుర్గమ్మ తల్లినే పూజిస్తారా ? .
బుజ్జాయిలు : ఆ దుర్మార్గపు రాజు నుండి అమ్మను – పిన్నమ్మలను కాపాడుతూ వస్తున్నది దుర్గమ్మ తల్లే , మేముకూడా రోజూ పూజిస్తాము అంటూ ముద్దుముద్దుగా చెప్పారు , అంటే మీరుకూడా …….
అవును అమ్మవారి భక్తుడినే అంటూ ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఆనందించారు , మహారాజా ……. రాజ భవనాలలోకి వచ్చేసాము – ప్రకృతి తప్ప ఏ అద్భుతాలనూ వీక్షించారన్నమాట అయితే ఉద్యానవనాల దగ్గరకే తీసుకెళతాము రండి పైకివెళ్లండి అటువైపు అటువైపు …… , సింహాసనం ఇటువైపు …….
మనకు సింహాసనంతో పనిలేదు పైకివెళదాము .
బుజ్జాయిలు : నవ్వుకున్నారు , ఆయుధ నిల్వాగారం – వజ్రాలు బంగారం రాసులుగా పోసిన బాండాగారం …… అంటూ చూయిస్తూ సగం పైకి వచ్చేసాము మహారాజా అన్నారు , దారిపొడుగునా కాపుకాస్తున్న సైనికులు – చెలికత్తెలు ….. సింహాలను చూసి భయపడటం చూసి నవ్వుకుంటున్నారు .
అవన్నీ అవసరంలేదు అందమైన ఉద్యానవనాల దగ్గరకు …….
బుజ్జాయిలు : అక్కడికే తీసుకెళతాము అంటూ బుజ్జికోపాలతో ముద్దులుపెట్టారు – ముందైతే వంటశాలలో మా మహారాజుగారికోసం ఏమేమి వంటలు చేస్తున్నారో చూసి ఆకలివేస్తోంది అన్నారుకదా రెండుచేతులతో తీసుకొస్తాము అదిగో అతిపెద్దదైన వంటశాల – అమ్మావాళ్ళు లోపలే ఉన్నట్లున్నారు తీసుకెళ్లండి .
మీరువెళ్లి మీ అమ్మలను పలకరించి రండి నేను ఇక్కడే వేచిచూస్తాను అంటూ అడవిరాజుపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాజును – అడవిరాణిపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాణిని కూర్చోబెట్టాను .
బుజ్జాయిలు : అమ్మలేమీ మిమ్మల్ని కొరుక్కుని తినెయ్యరు .
ముసిముసినవ్వులతో తలదించుకున్నాను రాను అన్నట్లు ……
బుజ్జాయిలు : అయితే కొద్దిగా ముందుకువెలితే ఉద్యానవనం ఉంది అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి వెంటనే వచ్చేస్తాము .
ఎటువైపు బుజ్జాయిలూ …….
బుజ్జాయిలు : ప్రకృతి అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం – చెలికత్తెలూ ….. మన మహారాజుగారిని ఉద్యానవనానికి తీసుకెళ్లండి అంటూ ఆజ్ఞవేశారు .
చిత్తం బుజ్జియువరాణీ …… , మహారాజా ….. ఇటువైపు అంటూ తీసుకెళ్లారు .
బుజ్జాయిలను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లడం చూసి సంతోషంతో ముద్దులువదిలి అమ్మా – అత్తయ్యా – పిన్నమ్మలూ …… అంటూకేకలువేస్తూ వంటశాల లోపలికివెళ్లారు .
Hero and Heroin thondaraga kalisi valla pillatho happy ga undali inka ekkuvaga storylo ibbandulu pettakunda valla kada sukantham ga chestarani ashistunnanu.