జనం మెచ్చిన రాజు – Part 31

Posted on

సోదరా ……. ఆయుధం కూడా పట్టుకోవడం రాని మాతో ఒక చిన్నపాటి యుద్ధమే చేయించి గెలిపించావు – దేవుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అంటూ విజయ సంబరాలు చేసుకుంటున్నారు .

జనం మెచ్చిన రాజు – Part 30

మాకు మద్దతిస్తున్న ప్రజలు కిందకువచ్చి మాదగ్గరికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను పెద్ద సంఖ్యలో భటులు అడ్డుకుని మమ్మల్ని చీకటి కారాగారంలోకి తోసేశారు .

సోదరులారా ……. ముందుగా బాణాలు – దెబ్బలు తగిలినవారికి వైద్యం చెయ్యాలి అంటూ కిందకుదిగాము .
పర్లేదు వీరాధివీరా …… నీవలన పొందిన విజయానందంతో పోలిస్తే ఈ బాణాల నొప్పి ఏపాటివి అంటూ అందరూ నాముందు మొకరిల్లారు – మాలో ఒక్కరి ప్రాణాలుకూడా పోలేదు అంటే మీవల్లనే మాజీవితాంతం రుణపడి ఉంటాను .
సోదరులారా …… మీ సహకారం లేకపోయుంటే మనం విజయం సాధించేవాళ్ళమే కాదని ఖచ్చితంగా చెప్పగలను – ఇది మనందరి సమిష్టి విజయం అంటూ అందరినీ లేపి కౌగిలించుకున్నాను .
ఇంతటి గొప్ప వీరాధివీరుడిని కలవడం మా అదృష్టం – రాజు అంటే మీలా ఉండాలి – చంపడానికి వచ్చిన రాక్షసుల్లాంటి సైనికులను కూడా ప్రాణాలతో విడిచిపెట్టారు .
వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ వారికీ మనలానే కుటుంబం ఉంటుంది కదా …… , ఆ కుటుంబం …… వీరికోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను మహిని తలుచుకుని …….
మనమెప్పుడు మన కుటుంబాన్ని చేరతామో ……. , బానిసలను చేసి లాక్కునివచ్చి ఈ చీకటి కారాగారంలో పడేసారు , ఎలా ఉన్నారో ఏమిచేస్తున్నారో ఎన్ని కష్టాలు పడుతున్నారో ……. మన కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళను మళ్లీ చేరుకుంటామో లేదో అని బాధపడుతున్నారు .
వారి ప్రశ్నకు సమాధానం తెలియక మౌనంగా ఉండిపోయాను .
భటులు వచ్చి మా అందరినీ మా మా గదులలోకి తోసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు .
తోటి సోదరుడు : వీరాధివీరా ….. వొళ్ళంతా రక్తం కారుతున్నా మీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు – ఆ కన్నీళ్లు ఎవరికోసమో కానీ వారిని తప్పకుండా చేరుతారు .

రోజులు గడిచిపోసాగాయి కానీ చివరి పోటీల దండోరా మాత్రం మ్రోగడం లేదు .
తోటి సోదరుడు : దేవుడా ……. ఇంతసమయం తీసుకుంటున్నారు అంటే పెద్దగానే ప్రణాళికలు వేస్తున్నట్లుగా ఉంది – రోజురోజుకూ భయం పెరుగుతూనే ఉంది – మీపై రాజు చాలా చాలా కోపంగా ఉన్నట్లున్నాడు నిద్రపడుతున్నట్లుగా లేదు ……..
ఇద్దరమూ నవ్వుకున్నాము . మిమ్మల్ని ఎలాగైనా ……
తెలుసు తెలుసు సోదరా ……. , అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను – నాకోసం నాకంటే ఎక్కువగా ఎదురుచూస్తున్న నా ప్రాణం కోసమైనా ఇక్కడనుండి ప్రాణాలతో బయటపడాలి అంటూ మహి ఊహాలతో రోజులు గడుపుతున్నాను .

కొన్ని పక్షముల తరువాత మొదటి ఏడాది చివరి పోటీలకోసం దండోరా మ్రోగడం – పెద్ద మొత్తంలో భటులువచ్చి నన్నుమాత్రమే గోలుసులతో బయటకు తీసుకెళ్లారు .
తోటి సోదరుడు : భటులారా …… నన్నుకూడా తీసుకెళ్లండి .
మమ్మల్ని కూడా తీసుకెళ్లండి అంటూ ఇనుప ద్వారాలను ముందుకూ వెనుకకూ కదిలిస్తున్నారు .
భటులు : వీడు ఖతం అయితే మీరెంతసేపు అంటూ రాక్షస నవ్వులు నవ్వుకున్నారు – పోటీలు అంటేనే ఉచ్చపోసుకునేవారు వీడొచ్చాక వచ్చిన ధైర్యం వీడితోనే పోతుందిలే – ఈరోజుతో వీడి కథ ముగిసిపోతుంది .
తోటి బానిస : మాదేవుడికి మరణం లేదు – వీరాధివీరా ….. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము .
భటులు : ఇక్కడెందుకు వేచి చూడటం – వీడి మీ దేవుడి చావును కళ్లారా చూసి పోయిన భయాన్ని మళ్లీ మీలో పుట్టిస్తాము వెనుకే లాక్కునిరండి అంటూ సోదరులను ద్వారం దగ్గరే ఆపి నన్ను క్రీడా ప్రాంగణం మధ్యలోకి తీసుకెళ్లారు .
వీరాధివీరుడు వీరాధివీరుడు యోధుడు ……. అంటూ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోతోంది .
సోదరులు : ఇంతమంది ప్రజలా ……. అంటూ చుట్టూ చూసి ఆశ్చర్యపోతున్నారు .
భటులు : మీ దేవుడి గురించి విని చుట్టుప్రక్కల రాజ్యాలనుండి కూడా తండోపతండాలుగా వచ్చారు .

నా ఎదురుగా రాజు రాక్షనవ్వులతో ఈరోజు పోటీ ఎదుర్కో అన్నట్లు చూస్తున్నాడు .
( మహారాజా …… ఈరోజుతో వీడి కథ ముగిసిపోయినట్లే , ఇంతలా అభిమానిస్తున్న ప్రజలు పక్షము రోజులలో వీడి గురించి మరిచిపోతారు .
రాజు : అంతకంటే ముందుగానే మరిచిపోయేలా ఏర్పాట్లు చేసాను చూస్తూ ఉండండి ) .

ఒక భటుడువచ్చి ఇంతకుముందులానే మొండికత్తిని అందించి , చనిపోబోతున్నందుకు సంతోషం అనిచెప్పి వెనకనుండి మోకాలిపై కొట్టాడు .
మోకాళ్ళమీదకు చేరాను .
శభాష్ సైనికా అంటూ సైన్యాధ్యక్షుడు ……
భటుడు : చనిపోబోయే ముందు అయినా మహారాజుగారి శరణు కోరు – ప్రాణాభిక్ష పెట్టవచ్చు …….
గర్వంగా లేచి నిలబడ్డాను .
ప్రజలంతా నినాదాలతో హోరెత్తించారు .
భటుడు : ఇక నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అంటూ చేతికున్న సంకెళ్లను తీసేసి వెళ్ళిపోయాడు .

నలువైపులా ఉన్న నాలుగు ద్వారాలు తెరుచుకోవడం – అందులోనుండి అరివీర భయంకురులు వస్తారనుకుంటే భటులు వచ్చి రెండువైపులా నేలపై ఉన్న గొలుసులను లాగడంతో నేలపై ఉన్న గోతులు తెరుచుకున్నాయి – అందులోనుండి చూస్తేనే వణుకుపుట్టేలా రెండు చిరుతపులులు బయటకువచ్చాయి .
ప్రజలందరూ భయంతో ఉసూరుమన్నారు – రాజు కళ్ళల్లో గర్వం వాటిని ఎలా ఓడిస్తావు అన్నట్లు …….
నాకైతే నవ్వు ఆగడంలేదు .
వీరాధివీరా జాగ్రత్త అంటూ ఉత్కంఠతో చూస్తున్నారు సోదరులు – ఇనుప ద్వారాన్ని బద్ధలుకొట్టి నాకు సహాయం చెయ్యడం కోసం ప్రయత్నం చేస్తున్నారు .
భటులు నావైపుకు వదిలిన చిరుతపులులు రెండువైపులా నామీదకు పంజా విసరడానికి వస్తున్నాయి – వాటి గొంతుకు గొలుసులు వేసి నియంత్రిస్తున్నారు .

రాజు సైగచెయ్యగానే గొలుసులను వదిలెయ్యడంతో నామీదకు దూసుకువస్తున్నాయి – ప్రజలందరూ భయంతో లేచిమరీ చూస్తున్నారు కంగారుపడుతూ ……. , సగం మంది చంపేయ్ చంపేయ్ అంటూ ఉద్రేకంగా కేకలువేస్తున్నారు .
పెదాలపై చిరునవ్వులతో గురువుగారిని తలుచుకుని చిరుతపులుల వైపుకు అరచేతులు ఉంచి వాటి కళ్ళల్లో కళ్ళుపెట్టి రెండింటి వైపు చూసి ఆగమని ఆప్యాయంగా ఆజ్ఞాపించాను .
అంతే నా అరచేతులవరకూ వచ్చి స్పృశిస్తూ ఆగిపోయాయి .
అంతే ఒక్కసారిగా క్రీడాప్రాంగణం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది .
అప్పటివరకూ కంగారుపడుతున్న సోదరులు జయహో వీరాధివీరా – జయహో దేవుడా …… మీకు తిరుగులేదు అంటూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు .
రెండు చిరుతపులులను అక్కున చేర్చుకుని , మిమ్మల్ని గాయపరచగలనా మిత్రులారా అంటూ నా వశం చేసుకున్నాను .
క్షమించు కమించు అన్నట్లు నన్ను స్పృశిస్తున్నాయి .
సోదరులతోపాటు ప్రజల నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోతోంది .
రాజు లేచిమరీ కోపంతో ఊగిపోతున్నాడు .
మహారాజా ఇంకా అయిపోలేదు అంటూ చిరుతపులులకు వేసిన గొలుసులను లాగి ఏవో ద్రవాలను ఎక్కించారు – మరొక రెండు గుంతల దగ్గరకు కూడా వెళ్లి ఇనుప ద్వారాల ద్వారా ద్రవాలను ఎక్కించి ఆ ద్వారాలను కూడా లాగేశారు .

రెండు చిరుతపులులతోపాటు మిగతా రెండు గుంటలనుండి రెండు పెద్ద పులులు ……. , వాటి గాండ్రింపులకే ప్రజలంతా ఉలిక్కిపడ్డారు .
ఆశ్చర్యన్గా చిరుతపులులు మరియు పెద్ద పులుల కళ్ళు ఎర్రగా మారిపోసాగాయి .
వెనుక నుండి భటులువచ్చి , నాపై రక్తాన్ని పోసి పరుగునవెళ్లిపోయారు .
రక్తపు వాసనకు నాలుగు క్రూర జంతువులు పిచ్చెక్కిపోయినట్లు గొలుసులు తెంపుకునేలా ప్రవర్తిస్తున్నాయి – గొలుసులు పట్టుకున్నవాళ్లపైకే దూకడంతో గొలుసులను వదిలేసి భయంతో గుంతల్లో ద్వారాలను మూసేసుకున్నారు .
పిచ్చెక్కినట్లు ఉద్రేకానికి లోనౌతున్న క్రూర జంతువులు …… మిగిలిన నామీదకు ఒకేసారి దూసుకువస్తున్నాయి .
వీరాధివీరా …… మొండికత్తి కిందపడింది అందుకో అంటూ కేకలువేస్తున్నారు సోదరులు …….
పులులకు ఏమో అయ్యింది ఇక చంపేదాకా ఆగేలాలేవు అంటూ ఉత్కంఠ – భయంతో వీక్షిస్తున్నారు ప్రజలు ……..
నాలుగు జంతువుల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ శాంతించమని ఆజ్ఞాపించినా ఆగకపోయేసరికి , సోదరా …… బల్లెం అనేంతలో నాలుగు క్రూర జంతువులు …… నామీదకు పంజావిసిరి రక్కేస్తున్నాయి – మెడను పట్టేసేంతలో ఒక్కొక్కదానిని పట్టుకుని నలువైపులకూ విసిరేసాను .
దేవుడా బల్లెం అంటూ విసిరారు – పై వస్త్రాన్ని చిరిపేసాయి – వొళ్ళంతా పంజా వేట్లకు రక్తం కారుతోంది .
భటుడి నుండి లాక్కుని సోదరుడు విసిరిన బల్లెం అందుకుని కొస్సిగా ఉన్నదానిని తీసివేసి , కర్రను రెండుగా విరిచి రెండుచేతులలో పట్టుకున్నాను .
పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తూ రక్తపు వాసనకు ఉద్రేకంతో వచ్చిన ఒక్కొక్క పులిని తప్పించుకుంటూ వాటిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది – మిత్రులారా అంటూ ఒక్కొక్కదానిని ఒంటరిదానిని చేస్తూ వాటికి దెబ్బలువేస్తూ నేలకొరిగేలా చేస్తున్నాను – ప్రతీసారీ మరింత కోపోద్రిక్తంతో నామీదకు దాడిచేస్తున్నాయి – వొళ్ళంతా పంజాలతో రక్కేస్తూనే ఉన్నాయి – నొప్పికి కేకలువేస్తూనే ఉన్నాను .
ఇలాకాదని మన్నించమని కోరుతూ నేరుగా వాటి తలలపై దిమ్మతిరిగేలా – ద్రవాల మత్తు వదిలేలా గట్టిగానే దెబ్బలువెయ్యడంతో నోటి నుండి స్రవాలను వదులుతూ నేలకొరిగిపోయాయి – లేవడానికి ప్రయత్నించినా వీలుకాకపోవడంతో కదలకుండా ఉండిపోయాయి .
అయిపోయింది మహారాజా …… ఈ భయంకరమైన పోటీ కూడా గెలిచేశాడు , వీరుల్లాంటి సైనికులనే కాదు మాధమెక్కించిన క్రూర జంతువులను కూడా ……
రాజు కోపంతో ఊగిపోతున్నాడు ఇక ఏమీ చేయలేమా అన్నట్లు ……

నాలుగింటినీ ఒకదగ్గరకు చేర్చి , మిత్రులారా ….. మిమ్మల్ని గాయపరిచాను మన్నించండి త్వరలోనే కోలుకుంటారు అనిచెప్పాను .
చుట్టూ ప్రజల నినాదాలు – సగం మందిలో నిరాశ ……
వారి వైపుకు తిరిగి ప్రజలారా మీకు కావాల్సినది వినోదమే కదా ……. , మీరు ఆనందించారా లేదా ……. , ఎవరు చస్తే మీకేంటి ఆనందించండి ……., ఇది ఆనందం కాదా ……..
అంతే వారుకూడా వీరాధివీరుడు – దయ గలవాడు ……. అంటూ మాకు మద్దతిస్తున్నవారితోపాటు కేకలువేస్తున్నారు .
వీరాధివీరా వీరాధివీరా …… అంటూ సోదరులంతా ద్వారాన్ని బద్ధలుకొట్టుకుని వచ్చి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకుంటున్నారు ……….

( రాజు కోపంతో రాజమందిరం చేరుకుని దొరికినదానిని పగలగొట్టేస్తున్నాడు – సైన్యాధ్యక్షుడా …… ఏమిచేస్తావో ఎంతమందితో వెళతావో తెలియదు వాడు సూర్యోదయాన్ని చూడకూడదు – వాడు బ్రతికి ఉన్నంతసేపూ నాకు మనస్సాoతి లేదు – ఆహారంలో విషం కలిపి అయినా చంపేయ్యండి ……
సైన్యాధ్యక్షుడు : చిత్తం ప్రభూ ……
అది కుదరని పని ప్రభూ …… అంటూ మంత్రి వచ్చాడు – ఇప్పటివరకూ మనకు మద్దతిస్తున్న ప్రజలంతా కూడా వాడి వీరత్వానికి గులాం అయిపోయారు పైగా మన చుట్టుప్రక్కల రాజ్యాల నుండి వచ్చిన ప్రజలు తరువాతి పోటీలకోసం – ఆ పోటీలలో అతడి వీరత్వం చూడటం కోసమే రావాలని చర్చించుకుంటున్నారు – ఖచ్చితంగా మూడు పర్యాయాలలో పోటీలు నెగ్గి స్వేచ్ఛను మీ వరాలను పొందుతాడని అనుకుంటున్నారు .
రాజు : తదుపరి పోటీలు మలి ఏడాదికే కదా ……
మంత్రి : అవును ప్రభూ …… , మలి ఏడాది జరిగే పోటీలలో వీడు కనుక లేకపోతే మనం నిర్వహించే పోటీలను ఎవ్వరూ నమ్మరు – వీక్షించడానికి రారు – పోటీల ద్వారామన రాజ్య ఆదాయం ఎంతో తెలుసా అంటూ ఒక సైగ చెయ్యడంతో రాజు ముందు కుప్పలు కుప్పలుగా సంపదను కురిపించారు భటులు ……. , ఈ సంపదతో మన రాజ్యం ఎంతకైనా విస్తరించుకుంటూ వెళ్ళవచ్చు – మనమే పెత్తనం కావచ్చు …….. , ఇలాంటి పరిస్థితుల్లో గనుక మనం అతడిని ఏమైనా చేస్తే మీపైననే వస్తుంది – క్షమించండి మిమ్మల్ని పిరికి రాజు అంటారు – గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్న రాజ్యాలు మనపై దండెత్తుతాయి .
రాజు : లేదు లేదు అలా జరగడానికి వీలులేదు – అయితే మనం వాడిని ఏమీచెయ్యలేమా ? – చిలుక వినలేదుకదా …… దాని మాటలకు నిద్రకూడా రాదు .
భటులు : లేదు ప్రభూ …….
మంత్రి : ఏమిచేసినా పోటీలలోనే చెయ్యాలి ప్రభూ …… , 12 పక్షముల సమయం ఉంది వాడి అంతుచూసే వీరాధివీరులను తయారుచేద్దాము .
రాజు : అవును తయారుచేద్దాము – అంతవరకూ వాడిని చీకటి కారాగారంలోనే చిత్రహింసలు పెట్టండి కానీ చంపకండి ) .

పెద్ద సంఖ్యలో భటులు వచ్చి మా అందరినీ కారాగారంలో వదిలి రెండుమూడు తాళాలు వేయడమే కాకుండా మూడింతల భద్రతను కట్టుదిట్టం చేశారు , బానిసలారా …… వాడికి మద్దతు ఇచ్చి మహారాజు గారి కోపాగ్నికి లోనయ్యారు , తదుపరి పోటీలవరకూ వాడితోపాటు మీకు చిత్రహింసలే …….
ఈరోజు కలిగిన ఆనందంతో పోలిస్తే అలాంటి చిత్రహింసలు మాకు వెంట్రుకతో సమానం ……. , వీరా వీరాధివీరా …… నినాదాలతో కారాగారం దద్దరిల్లిపోతోంది .
క్షమించండి మిత్రులారా ……. నావలన మీరుకూడా …….
అలాంటిదేమీ లేదు వీరా …… , ఈ కారాగారంలో ఉండటంతో పోలిస్తే ఆ చిత్రహింసలేమీ మమ్మల్ని బాధించవు , అయినా ఒకసారి చుట్టూ చూడండి మహారాజు మందిరానికి ఎలాగయితే కాపలా ఉంటారో అంతకు రెట్టింపు మనకు కాపలాగా ఉన్నారు అంటే మనం మహారాజు కంటే గొప్పవారం అన్నట్లే కదా ……
మిత్రులంతా నవ్వుకున్నారు .
అందరితోపాటు నవ్వుకుని నా దేవకన్య స్మృతులలో నిద్రకు ఉపక్రమించాను , కళ్ళు మూతలుపడగానే నా ప్రియాతిప్రియమైన ప్రాణమైన దేవకన్యతో విహారానికి వెళ్లినప్పటి మధురమైన స్మృతులు మెదులుతున్నాయి – నా దేవకన్య తియ్యనైన చిలిపిపనులు పెదాలపై చిరునవ్వులు పూయిస్తున్నాయి – రోజంతా ఎంతో ఆహ్లాదంగా విహరించి చీకటిపడేసరికి అలసిపోయినట్లు స్నానమాచరించడానికి నదీ అమ్మ ఒడిలోకి చేరాము , గంగమ్మ ఒడిలో నా దేవకన్య ….. నన్ను ముద్దుల మైకంలోకి తీసుకెళ్లి వస్త్రాలను ప్రవాహానికి వదిలేసి స్వర్గపు శృంగార డోలికలో ముంచిన మాధుర్యం మనసుకు తెలుస్తోంది – దానికి మించిన తృప్తి జననిపై లేదన్నట్లు వొళ్ళంతా పులకించి పారవశ్యం పొందుతోంది , మహీ నా హృదయదేవీ అంటూ సిగ్గుతో అంతులేని ఆనందంతో లేచాను – ముద్దుకే ఒప్పుకోలేదని నదీఅమ్మ సహకారంతో ఇంతటి తియ్యనైన ద్రోహానికి పాల్పడ్డావన్నమాట అంటూ సిగ్గుపడుతూనే ఉన్నాను – అందుకే ఆరాత్రి జరిగినది గుర్తులేదు , ఆ మాధుర్యం మళ్లీ మళ్లీ ఆస్వాదించాలన్నట్లు వెంటనే కళ్ళుమూసుకున్నాను , అలా నా దేవకన్య తొలిరేయి శోభన మాధుర్యపు ఊహాలతో కారాగార జీవితాన్ని కొనసాగించాను .

తరువాతి రోజు నుండి శిక్షించడానికని కొండల్ని బద్దలు కొట్టడానికి గుట్టలు – చెట్లు నరకడానికి అడవికి తీసుకెళ్లినప్పుడు తప్పించుకోవడానికి చాలా సందర్భాలు ఉన్నప్పటికీ నాతోపాటు తోడుగా ఉన్న సోదరులందరికీ కూడా స్వేచ్ఛ లభించాలని ఆగిపోయాను , రోజురోజుకూ పెరుగుతున్న శిక్షలను తట్టుకుంటూ రోజులు గడపసాగాను , రోజంతా ఎంత పనిచేసినా చీకటిపడేసరికి కారాగారం చేరి నీటిని సేవించి శయనించగానే దెబ్బలు మానిపోయి ఊహల్లోకి వచ్చే మహి మధురస్మృతులలో కష్టాన్నంతా మరిచిపోయి చిరునవ్వులు చిందించడం చూసి మిత్రులంతా ఆశ్చర్యపోయేవారు .
వీరాధివీరా మేము అనుభవించే శిక్షను రెండింతలుగా అనుభవిస్తున్నావు , చీకటిపడేసమయానికి ఈ ఆనందం ఎలా ? అంటూ ఒకరోజు అడిగారు .
మనకు ప్రియమైన – ప్రాణమైనవారిని ఎన్నటికైనా కలుస్తాము అన్న ఆశ ఉంటే చాలు వారితో గడిపిన మధురానుభూతులే మన ఆనందాలు కారణం అవుతాయి – ఆరోజంటూ వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు ప్రయత్నించండి .
కొద్దిసేపటి తరువాత అవును అవును వీరాధివీరా హాయిగా ఉంది , సంతోషం చాలా చాలా సంతోషం , మా తల్లిదండ్రులను బార్యాపిల్లలను మళ్లీ కలవడం కంటే సంతోషం మరొకటి లేదు , వారి ఊహాలతోనే ధైర్యంగా జీవిస్తాము .

ఉదయమంతా కష్టాలు – చిత్రహింసలు , చీకటిపడగానే అందరి ముఖాలలో ఆనందంతో రోజులు గడిచిపోసాగాయి .
భటులు కూడా రోజూ కొట్టి కొట్టి అలసిపోయినా మహారాజు ఆజ్ఞల వలన ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులలో హింస పెట్టేవారు , అలా మరొక పోటీలకాలం కూడా వచ్చినట్లు దండోరా మ్రోతతో తెలిసింది .
ఈసారి ఎలాంటి క్రూరమైన పోటీలు నిర్వహిస్తారో అన్నట్లు కారాగార సోదరులంతా కంగారుపడుతుంటే , రెండో పోటీలు వచ్చేసాయని ఇక మిగలబోయేది ఒకటే అంటూ సంతోషంలో నేనున్నాను .

ఆరోజు రానే వచ్చింది – భటులు వచ్చి మొత్తం కారాగారంలో ఉన్న వారందరినీ సంకెళ్లతో బంధించి మొండి ఆయుధాలను చేతులకు అందించి పోటీ స్థలంలోకి తీసుకెళుతున్నారు – బానిస వీరాధివీరా ఇప్పుడు ఇప్పుడు నీ సోదరులుగా భావిస్తున్న వీరందరినీ కాపాడుకుంటూ నీ ప్రాణాలను నిలబెట్టుకుంటూ ఎలా పోటీలు నెగ్గుతావో చూస్తాము – మహారాజుగారి పన్నాగం ఎలా ఉంది .
సోదరులందరినీ కాపాడుకోవడం ఎలా అంటూ కంగారు మొదలైంది – అందరివైపు చూస్తున్నాను .
వీరాధివీరా …… మాగురించి ఆలోచించకు – నీతోపాటు జీవించిన ఈ సమయం చాలు – సంతోషంగా ప్రాణాలొదిలేస్తాము – పరులకోసం బ్రతకడం ఎలానో నేర్పించావు – మరొక జన్మ ఉంటే నీకు మిత్రులుగా జీవించాలని ఉంది అంటూ సోదరులు సంతోషంగా చెప్పారు .
మీలాంటి మిత్రులకు దూరం కావడానికి ఏమాత్రం సిద్ధంగా లేను – నా ప్రాణాలు అడ్డు వేశయినా మిమ్మల్ని రక్షిస్తాను – మిత్రులారా …… నేను చెప్పినట్లు చేస్తే మనమంతా ప్రాణాలతో విజయం సాధించవచ్చు .
ఆజ్ఞ వీరాధివీరా అంటూ సోదరులలో ఆశ చిగురించినట్లు చిరు సంతోషాలు వెళ్లువిరిసాయి .
మీగురించి మీ ప్రాణాల గురించి కాకుండా ప్రక్కనున్న మిత్రుల ప్రాణాలకు రక్షణగా ఉంటే చాలు .
అర్థమైంది వీరాధివీరా …… నా ప్రాణాలను ఫణంగా పెట్టైనా నా మిత్రుడిని రక్షించుకుంటాను – నేను …… నా మిత్రుడిని – నేను …… నా మిత్రుడిని ……. మహారాజు పన్నాగానికి మించిన ప్రణాళిక , హై హై వీరాధివీరా …… వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ……. అంటూ రాజ్యం నినాదాలు చేస్తూ రాక్షస క్రీడాస్థలానికి చేరాము .

మమ్మల్ని చూసినవెంటనే అదిగో మన వీరుడొచ్చాడు , వీరా వీరాధివీరా …… నీ వీరత్వాన్ని చూడటానికే వచ్చాము , వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ……. అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లేలా హోరెత్తించారు నలుమూలల రాజ్యాల నుండి వచ్చిన వీక్షకులు .
హోరెత్తిన ప్రతీసారీ మహారాజు కళ్ళు ఎర్రబడుతున్నాయి , ఏమీచెయ్యలేక కోపాన్ని మాత్రం వ్యక్తపరుస్తున్నాడు , నాచావును వెంటనే చూడాలన్నట్లు పోటీలకు పచ్చ జెండా ఊపాడు .

ఢమరుక శబ్దాలు మొదలయ్యాయి – భయంకరమైన కేకలతో ఏడడుగులకు పైనే ఉన్న రాక్షసుల్లాంటి పదిమంది క్రూరాతి క్రూరమైన ఆయుధాలను చేతబట్టి మాముందుకు వచ్చి నిలబడ్డారు – విచిత్రమైన కేకలువెయ్యడం చూస్తుంటేనే సోదరులందరిలో వణుకు మొదలయ్యింది – కొంతమందైతే వెనక్కు పరుగు తియ్యడానికి ప్రయత్నించి సంకెళ్ళ వలన పడిపోవడం చూసి మహారాజు నవ్వుకుంటున్నాడు .
మిత్రులారా …… ప్రక్కనున్న మిత్రులను కాపాడండి కలిసి పోరాడండి వాళ్ళు పది మంది మనం వందమంది విజయం మనదే ……..
నువ్వే మా ధైర్యం వీరాధివీరా …….. అంటూ ఆయుధాలతో సంకెళ్లను కొడుతూ పోటీకి సిద్ధం అన్నట్లు మోత మ్రోగిస్తున్నారు – దానికి తోడు వీక్షకులంతా మావైపునే ఉన్నారు .

మహారాజుకు మళ్లీ కోపం వచ్చినట్లు నరమాంస భక్షకులారా బానిసలందరినీ చంపేయ్యండి – వారి మాంసాలను తినెయ్యండి – విజయం సాధిస్తే అడవిలో ఉన్న మీ గుహల దగ్గరకే నర మాంసాన్ని పంపిస్తాను .
మహారాజు మాటలకు పిచ్చెక్కిపోయినట్లు శబ్దాలు చేస్తూ మామీదకు ఎగబడ్డారు .
సంకెళ్లు వేరుచేసే సమయం కూడా లేకపోవడంతో మాలో చాలామందిని గాయపరిచారు – నేనున్నానన్న ధైర్యంతో సంకెళ్ళ నుండి విముక్తి పొంది అదే ధైర్యంతో గుంపులు గుంపులుగా నరమాంస భక్షకులపై విరుచుకుపడ్డారు – నెత్తురు చిందిస్తూనే పట్టుదలతో ఎదురొడ్డుతున్నారు .
వీరాధివీరా …… అందరినీ ఒడిసిపట్టేసాము అనేంతలో మళ్లీ నగారా మ్రోగింది .
పదిమందిని మించిన ముగ్గురు నరరూపరాక్షసులు భయంకరమైన ఆయుధాలతో పరుగునవస్తున్నారు – ఇప్పుడేమి చేస్తావు బానిసా అంటూ మహారాజు రాక్షస నవ్వులు నవ్వుతున్నాడు .
అవును వాళ్ళు గనుక పదిమంది పట్టుని బెడిసికొట్టారో మాలో ఒక్కరం జీవించము అని తెలిసి రెండు కత్తులు పట్టుకుని ముగ్గురికి అడ్డుగా నిలబడి చాలాసేపు పోరాడి వొళ్ళంతా రక్తంతో చివరికి ముగ్గురినీ నేలకొరిగేలా చేసాను – ఆ ధైర్యంతో సంతోషంలో మిత్రులందరూ ఒడిసిపట్టిన వాళ్ళందరినీ నేలకొరిగేలా చేసి నరమాంస భక్షకులు బ్రతికి ఉండకూడదు అని పొడిచి చంపేసి విజయ సంతోషంలో వీరాధివీరా వీరాధివీరా …… కేకలువేస్తూ నావైపుకు వస్తున్నారు .

ఎక్కడనుండి దూసుకువచ్చాయో ముందు నుండి రెండు బాణాలు ఛాతీలోకి దిగాయి .
ఆహ్హ్ ……….
వీరాధివీరా …….
మోసం – ద్రోహం – మహారాజు పిరికిపంద అంటూ వీక్షకులంతా అలా చూస్తుండిపోయారు .
నోట్లో నుండి కారుతున్న రక్తంతో యా …… అంటూ కేకలువేస్తూ రెండు బాణాలను బయటకు లాగి మహారాజువైపు గర్వంగా అడుగులువేశాను .
మహారాజు భయపడిపోయినట్లు సైగ చేయగానే వెనకనుండి బాణాలు దూసుకువచ్చి వెన్నులోకి దిగాయి .
ఆహ్హ్ …… మహీ అంటూ నేలతల్లి ఒడిలోకి చేరాను .
వీరాధివీరా అంటూ మిత్రులందరూ చుట్టూ చేరారు – బ్రతికే ఉన్నాడు వీరాధివీరుడు ఇంకా బ్రతికే ఉన్నాడు .
మహారాజు : ఇంకా బ్రతికే ఉన్నాడా …… ? , ఈ క్షణం కోసమే సిద్ధం చేసిన చివరి నరమాంస భక్షకుడిని పంపండి , ముందు వీరుడైన బానిసను తరువాత చుట్టూ ఉన్న బానిసలను …… , భటులారా …….
భటులు వచ్చి మిత్రులందరినీ బంధించారు .
అలాగే అన్నట్లు రాక్షస శబ్దాలతో నావైపుకు వస్తున్న మృగాన్ని సంకెళ్లు ఉన్నా అడ్డుపడుతున్న సోదరులను ప్రక్కకు లాగేస్తూ నా దగ్గరికి చేరుకున్నాడు – నా తలను నరకడం కోసం మనిషి బరువున్న రాక్షస గొడ్డలిని పైకెత్తి మహారాజువైపు చూసాడు .
మహారాజు …… గొంతు తెగ నరకమని ఆజ్ఞాపించడం , ఆజ్ఞ అన్నట్లు చుట్టూ ఉన్న వీక్షకుల వైపుచూసి రాక్షస నవ్వులతో క్రీడామైదానం మొత్తం ఘీంకరిస్తూ సిద్ధం అయ్యాడు .

” నా ప్రియదేవుడా ……. మీకు అపజయమా ? , మీరులేక నేను జీవించగలనా ? , నా చావు మీ కౌగిలిలో – మీ చావు నా కౌగిలిలో మాత్రమే , మీరాక కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను అంటూ పెదాలపై నా దేవకన్య ముద్దు ” .
రాక్షసుడి గొడ్డలి నా మెడను తాకేంతలో …… నేలకొరిగిన కత్తితో వాడి తలను నరికి విజయ గర్వంతో మహారాజు ఎదుట నిలబడ్డాను చిరునవ్వులు చిందిస్తూ ……..
వాడి చావు కేక రాజ్యం మొత్తం వినిపించింది – మహారాజు అవాక్కై అలా నిలబడిపోయాడు .
వీరా వీరాధివీరా అంటూ సంకెళ్లతో వచ్చి నన్ను పైకెత్తి విజయ సంబరాలు చేసుకున్నారు .
మిత్రులందరిపై స్పృహకోల్పోయాను .
నీళ్లు నీళ్లు అందుకోండి – వీరాధివీరుడికి వెంటనే నీళ్లు కావాలి అంటూ తోటి చెరశాల మిత్రుడు కేకలువేస్తున్నాడు .

1313800cookie-checkజనం మెచ్చిన రాజు – Part 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *