జనం మెచ్చిన రాజు – Part 1

Posted on

రాజుల కాలం :
అది దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిష్ఠమైన అందమైన గురుకులం – దట్టమైన అరణ్యం మధ్యన చుట్టూ పచ్చదనం , ఆ గురుకులం అంటే చుట్టూ నాలుగుదిక్కులూ ఉన్న రాజ్యాలకు దేవాలయం , ఎందుకంటే అక్కడ విద్యనభ్యసించిన యువరాజులు పరిణితి చెంది తమ తమ రాజ్యాలను చక్కగా పాలించడం అనాదిగా జరుగుతూనే ఉండటం .
ఇందుకు ముఖ్య కారణం ఆ గురుకులంలో ఉన్న ఆదిగురువుగారు , ఆయనకు వంద సంవత్సరాలు అని ఒకరంటే చిన్న గురువులు మరియు రాజులు మాత్రం 150 – 200 సంవత్సరాలు అని చెప్పేవారు , అందుకు కారణం లేకపోలేదు చుట్టుప్రక్కల తరతరాల రాజులు యుద్ధవిద్యలు – పరిపాలన నేర్చుకున్నది అక్కడే కాబట్టి …….. , ఇక అంతటి గురువుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బుజ్జి యువరాజులుగా గురుకులంలో అడుగుపెట్టిన అన్ని విద్యలూ నేర్చుకుని ఒక రాజుగా మార్పు చెంది వెళ్లేవారు .

ఆది గురువుగారు ఎప్పటికీ రాజులనుండి ఏదీ ఆశించేవారు కాదు , అంతటి గొప్ప గురువుగారు యువరాజులకు మాత్రమే కాదు చుట్టూ రాజ్యాలలో ఉండే ఆసక్తి గల పిల్లలకు కూడా విద్యను నేర్పించేవారు .
శిష్యులందరూ గురువులతోపాటు చుట్టూ అరణ్యం నుండి పొందిన పళ్ళు – కూరగాయలను మాత్రమే స్వీకరించేవారు .
అది కొద్దిమంది యువరాజులకు నచ్చేది కాదు , తమతో సమానంగానా అంటూ యువరాజులకు నచ్చేది కాదు తమతమ తండ్రులకు ఫిర్యాదులు చేసేవారు కానీ గురువుగారిపై రాజ్యాలకున్న గౌరవం వలన అనాదిగా సర్దిచెప్పబడుతూనే వస్తోంది .

యువరాజులైనా – రాజ్యం పిల్లలైనా …… ఆదిగురువుగారికి అందరూ సమానమే , శిష్యులుగానే పిలవబడేవారు , ” గురువు – శిష్యుడు ” సాంప్రదాయం అన్నది హిందూయిజంలో పవిత్రమైనది .
ప్రతీ శిష్యుడు ప్రతీరోజు సూర్యోదయం కాకముందే లేచి దేవుళ్లను – గురువుగారిని పూజించి , అన్నీ పనులలో గురువుగారికి సహాయం చేస్తూనే అన్ని విద్యలను అభ్యసించేవారు . అలా క్రమశిక్షణను నేర్చుకునేవారు .
ఆదిగురువుగారు …… స్వర్గాన్ని చేరిన తమ పెద్ద గురువులనుండి మొదలుకుని బ్రహ్మచర్యం పాటిస్తూనే గురుతత్వమే పరమావధిగా తరతరాలుగా విద్యతోపాటు ఒకరాజుగా రాజ్యాన్ని మిగతా రాజులు ఆక్రమించడానికి కూడా భయపడేలా దైర్యంగా పరిపాలించేందుకు అవసరవైన యుద్ధవిద్యలను నేర్పించేవారు .
ప్రతీ సంవత్సరం చివరన అన్నీ విద్యలకు సంబంధించిన పోటీలు కూడా నిర్వహించేవారు – గెలుపొందిన శిష్యులు గురువుగారి మన్ననలుపొందేవారు . పోటీల తరువాత సకలవిద్యలు నేర్చుకున్న ఒక శిష్య బృందం ….. గురువుల ఆశీర్వాదం తీసుకుని గురుకులం నుండి సంతోషంగా ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు అదేసమయానికి ఒక బుజ్జి శిష్య బృందం ….. విధ్యనభ్యసించడానికి గురుకులంలో కొత్తగా అడుగుపెట్టేవారు .

కొన్ని వందల శిష్యబృందాలు ….. గురుకులం నుండి బయటకు వెళ్లడం – లోపలికి రావడం జరుగుతున్నా ఆదిగురువుగారి మదిలో ఒక పెద్ద అసంతృప్తి అలానే ఉండిపోతోంది . గురుకులంలో శిష్యులు తమకు అవసరమైన విద్యలను అవసరం నిమిత్తం నేర్చుకుని వెళుతున్నారుకానీ , గురువుగారు మెచ్చిన శిష్యుడు ఇప్పటికీ కనిపించకపోవడం ప్రతీ ఏడూ బాధను అంతకంతకూ పెంచుతూనే ఉంది .

సంవత్సరాలు గడిచిపోసాగాయి , అలా ఒకరోజు గురువుగారి నిద్రలో ఒక అద్భుతం తారసపడింది , సంతోషంలో అలవాటు ప్రకారం కాకుండా కాస్త ముందుగానే నిద్రలేచారు .
గురువుగారు గురువుగారు నిద్రలేచారు అంటూ మిగతా గురువులు కంగారుపడుతూ లేచి శిష్యులను మేల్కొలిపారు .
శిష్యులు మరింత కంగారుపడుతూ లేచి రోజూలానే కార్యకలాపాలు మొదలుపెట్టారు .
శిష్యులందరి కళ్ళల్లో నిద్రను చూసి , చిన్న గురువులు …… ఆదిగురువుగారి దగ్గరకువెళ్లి , గురువుగారూ ……. సూర్యోదయానికి చాలాసమయం ఉందికదా అంతలోనే వెళుతున్నారు – ఈరోజు ఎందుకు ఇంత త్వరగా మేల్కొన్నారు అని గౌరవంతో అడిగారు .
ఆదిగురువుగారు : ఇలా ఎందుకు జరిగినదో తెలుసుకోవడానికే వెళుతున్నాను , శిష్యులను ఇబ్బందిపెట్టినట్లుగా ఉన్నాను – మరి కాసేపు పడుకోనివ్వండి .
చిన్న గురువులు : అలాగే గురువుగారూ …… , ఎక్కడికి వెళుతున్నారని అడగకూడదు – చిమ్మచీకటిగా ఉంది .
ఆదిగురువుగారు : పెదాలపై చిరునవ్వే సమాధానంగా సంతోషంతో బయటకు అడుగులువేశారు .
చిన్న గురువులు : చిమ్మ చీకటి అయితేనేమి , ఈ అరణ్యం మొత్తం గురువుగారి కనుసన్నల్లోనే కదా ఉండేది అంటూ గుసగుసలాడుకున్నారు .

గురువుగారు వేగంగా రోజూ వెళ్లే గురుకులం దగ్గరలో ప్రవహించే నదీ తీరం చేరుకున్నారు . సూర్యోదయ సంధ్యా వందనానికి చాలాసమయం ఉన్నప్పటికీ నిద్రలో కనిపించిన అద్భుతం కోసం నదీ ప్రవాహంవైపు ఆశతో చూస్తున్నారు .
ఘడియలు గడిచిపోతున్నకొద్దీ గురువుగారి కళ్ళల్లో ఉత్సాహం స్థానంలో నిరుత్సాహం , అంతలో సూర్యోదయ సమయం కావడంతో గురువుగారి దైవమైన పరమ శివుడిని తలుచుకుని నిరుత్సాహంతో నదిలోకి చేరి సూర్యనమస్కారం చేస్తున్నారు .
నదిలో మూడోసారి మునగగానే పసికందు ఏడుపు వినిపించింది .
నిద్రలో తారసపడిన అద్భుతం – ” మహేశ్వరా ” …… అంటూ చిరునవ్వుతో లేచి వారివైపుకు పూలబుట్టలో పసికందు ఏడుపుతో రావడం చూసారు – వెంటనే ప్రవాహం వైపుకువెళ్లి పరమేశ్వరా అంటూ బుట్టలోని పసికందును చేతులలోకి తీసుకున్నారు .

గురువుగారిలో ఒక చలనం – పసికందు వెంటనే ఏడుపు ఆపి గురువుగారినే చూస్తూ నవ్వుతున్నాడు . ఆ క్షణం కలిగిన ఆనందం గురువుగారికి కొత్తగా అనిపించింది – పరమేశ్వరా …… ఏమిటీ కొత్త అనుభూతి , మీ వరప్రసాదమే అంటూ మిక్కిలి ఆనందంతో గుండెలపైకి తీసుకున్నారు , జీవితానందం కలుగుతోంది – మీ భక్తుడి జీవితానికి గమ్యాన్ని చూయించారన్నమాట – ఎందుకోసమైతే ఈ పసికందును నాదగ్గరికి చేర్చారో తెలియదు కానీ గురువుని మించిన శిష్యుడిలా తయారుచేస్తాను అంటూ ప్రార్థించి , గురుకులం చేరుకున్నారు .

పసికందు నవ్వులకు చిన్న గురువులు మరియు శిష్యులంతా గురువుగారి వెనుకే శివుడి దేవాలయానికి చేరుకున్నారు .
గురువుగారు …… పసికందును శివుడి పాదాలముందు ఉంచి ప్రార్థించారు , స్వామీ ……. నా జీవితానికి ఒక గమ్యాన్ని చూయించారా మహాశివరాత్రి రోజున , సంతోషంగా ప్రయోజకుడిని చేస్తాను అంటూ ఆనందిస్తున్నారు .
చిన్న గురువులు : గురువుగారూ గురువుగారూ …… ఏమిటీ ఆనందం – మిమ్మల్ని ఇలా ఇంతవరకూ చూడనేలేదు .
గురువుగారు : అంతా ఈ పసికందు వల్లనే …… , పరమశివుడి అనుగ్రహం అంటూ జరిగింది వివరించారు .
చిన్న గురువులు : మీ దైవం మిమ్మల్ని ఇలా అనుగ్రహించారు గురువుగారు – మీ సంతోషమే మా సంతోషం – ఈ పసికందును ప్రేమతో చూసుకుంటాము .
గురువుగారు : సంతోషం అంటూ పసికందును చేతుల్లోకి తీసుకున్నారు .
చిన్న గురువులు : పసివయసులో తల్లిస్పర్శ లేకపోయినా చిరునవ్వులు చిందిస్తున్నాడు అంటే నిజంగా మీరు భక్తితో ఆరాధించే శివప్రసాదమే గురువుగారూ …….. , ఇంతకూ పసికందు పేరు ఏమని నిర్ణయించారు గురువుగారూ …….
గురువుగారు : పేరు పేరు ……. ఆ ఆ నేను నదిమునకలో ఉన్నప్పుడు ఈ పసికందు ఏడుపు వినిపించగానే ” మహేశ్వరా ” అని పాలికాను , వెంటనే నవ్వాడు అప్పుడు మొదలుపెట్టిన నవ్వు ఆపలేదు – మహేశ్వరుడు ప్రసాదం ……. మహేశ్వరుడు అని నామకరణం చేస్తున్నాను , మహేష్ ……. నిన్ను నా విద్యలన్నింటికీ వీరుణ్ణి చేస్తాను .
” మహేశ్వరుడు ” ……. శిష్యులూ మన గురుకులానికి మన దైవం పంపిన బుజ్జిదేవుడే స్వయంగా వచ్చాడు చూసి తరించండి అంటూ చూయించారు .
శిష్యులు : గురువుగారు ముద్దుగా పలికిన మహేష్ ముచ్చటగా ఉంది , మహేష్ మహేష్ అంటూ గురువుగారి చుట్టూ చేరి సున్నితంగా స్పృశిస్తూ ఆనందించారు .
కొంతమంది యువరాజులు మాత్రం ఎవరైతే మాకేంటి మేము కాబోయే రాజులం అంటూ పట్టించుకోలేదు .
గురువుగారు సంతోషించి మన దైవమైన శివుడి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ పరమశివుడికి అలంకరించిన బుజ్జి హారాన్ని తీసి పసికందు మెడలో వేశారు .
అధిచూసి యువరాజులు మరింత అసహనానికి లోనయ్యారు – మాకంటే ఆ పసికందే ఎక్కువ ఇష్టం అన్నమాట అంటూ అక్కడనుండి సాధన దగ్గరికి వెళ్లిపోయారు .
కానీ గురువుగారికి మాత్రం అందరూ సమానమే – వారి దైవం అనుగ్రహం కాబట్టి పసికందును ప్రాణంలా భావించారు – ఆరోజు నుండీ శిష్యులకు బోధించిన వెంటనే మహేష్ మహేష్ అంటూ పసికందు దగ్గరకు చేరిపోయేవారు .
ఆ సంతోషంలో ఎలా గడిచిపోయాయో ఏమో 4 సంవత్సరాలు గడిచిపోయాయి .
***********

పసికందుకు ఊహ తెలియడం – పలుకులు రావడంతో చుట్టూ ఉన్న శిష్యులు గౌరవంతో పలికినట్లుగా అతడు కూడా గురువుగారిని అంతే గౌరవంతో గురువుగారు గురువుగారు అంటూ ముద్దుముద్దుగా పలకడం విని గురువుగారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
చిన్న గురువులు : గురువుగారూ ……. మహేష్ పలికిన తొలి మాట గురువుగారు అంటే మిమ్మల్నే …… , తెలుస్తోంది తెలుస్తోంది మీరెంతగా మురిసిపోతున్నారో …… , ఇక మీ ప్రియతమ బుజ్జి శిష్యుడికి బోధించే సమయం ఆసన్నమయ్యింది అనుకుంటాము .
గురువుగారు : అవునవును , రేపు ఆ శివుడికి ఇష్టమైనరోజు మహాశివరాత్రి రేపే విద్యాబ్యాసం మొదలుపెడదాము .
చిన్న గురువులు : ఆ ఏర్పాట్లను అంగరంగవైభవంతో చేస్తాము గురువుగారూ ….. , మహాశివరాత్రి రోజున గురుకులం చేరిన బుజ్జి మహేశ్వరుడికి విద్యాబ్యాసం అంటే ఎంత అదృష్టం అంటూ గురువుగారు మరింత సంతోషించేలా మాట్లాడి వెళ్లారు .

యువరాజులైన మనకేమో ఎటువంటి ఆర్భాటం లేకుండా విద్యాబ్యాసం చేయించారు – దిక్కూమొక్కూలేకుండా నదిలో కొట్టుకొచ్చిన అనాధకు అంగరంగవైభవంతో విద్యాభ్యాసం ……..
చిన్న గురువులు : యువరాజులూ ……. అలా మాట్లాడకూడదు , స్వయానా శివుడి వరప్రసాదం – అతడి విద్యాబ్యాసం చూస్తే అందరికీ మంచి జరుగుతుంది రండి రండి ఏర్పాట్లు చేద్దాము .
యువరాజులు : ఆ అనామకుడి ద్వారా చేకూరే మంచి మాకవసరం లేదు – ఇప్పటికే మాతో సమానంగా మాకింద బ్రతికే కూలీల కొడుకులను చూస్తుండటాన్నే సహించలేకపోతున్నాము ఇప్పుడు వీడొకడు , గురువుగారికి ఈ విషయం చెప్పారో మేమేమి చెయ్యగలమో తెలుసుగా వెళ్ళండి వెళ్ళండి .
చిన్న గురువులు : ఇప్పటికే ఆ పిల్లలతో సేవలు చేయించుకుంటున్న విషయం తెలిసినా గురువుగారికి చెప్పే ధైర్యం మాకుందా యువరాజా ……..
యువరాజులు : ఈమాత్రం భయం ఉండాలి అంటూ నవ్వుకున్నారు .

తరువాతిరోజు గురువుగారు లేవకముందే లేచి అన్నయ్యలందరితోకలిసి గురుకులం పనులు చేస్తున్నాను .
గురువుగారు సూర్యోదయానికి కొద్దిసేపు ముందు లేచారు – నేను కనిపించకపోవడంతో మహేష్ మహేష్ …… అంటూ కంగారుపడుతూ బయటకువచ్చి , అందరితోపాటు కలిసి చిరునవ్వులు చిందిస్తూ పనులు పూర్తిచేస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు .

గురువుగారు గురువుగారు అంటూ అందరూ వినయంగా నమస్కరించడం చూసి నేనూ నమస్కరించాను .
గురువుగారు నవ్వుకుని , రమ్మని కళ్ళతోనే సైగచెయ్యడంతో బుజ్జిబుజ్జిపరుగుతో వెళ్ళాను . మహేష్ …… ఈరోజు ఏమిటి నాకంటే ముందుగా లేచావు – అందరితోపాటు కలిసి పనులు చేస్తున్నావు …….
మీరే చెప్పారుకదా గురువుగారూ ……. ఈరోజు నుండీ నా విద్యాభ్యాసం అని అందుకే అందరితోపాటు నేనూ జతకలిసాను – ఈరోజు నుండీ నేనూ శిష్యుడినే …. – ఇకనుండీ అందరితోపాటు మా గురువుగారిని సేవిస్తూ విద్య నేర్చుకుంటాను .
గురువుగారు : మంచిది మంచిది ……. అంతలోనే ఎన్ని మాటలు నేర్చావు , విద్యాభ్యాసం కంటే ముందు మా బుజ్జిమహేష్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి , ఈ గురువుతోపాటు వస్తావా …… ? .
మీతోపాటు ఎక్కడికైనా వస్తాను గురువుగారూ అంతకంటే అదృష్టమా అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : సంతోషించి దీవించారు , మహేష్ …… నువ్వు ఏమిచేసినా నాకు మిక్కిలి సంతోషం కలుగుతోంది అంటూ లేపి వారితోపాటు తీసుకెళ్లారు .

( ఇలా ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లారా అంటూ యువరాజులు లోలోపలే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు )

అరణ్యంలో కొద్దిసేపు నడిపించుకుంటూ అరణ్యం గురించి వివరిస్తూ నది ఒడ్డుకు తీసుకెళ్లారు . నీళ్ళల్లోకి మోకాళ్ళవరకూ తీసుకెళ్లి , నాయనా మహేష్ …… ఈ నదీ దేవతనే నిన్ను నా చెంతకు చేర్చింది – నీకు ఏకష్టం వచ్చినా నదీ దేవతతో పంచుకోవచ్చు .
అమ్మలా అన్నమాట ……..
గురువుగారు : అవును మహేష్ , నీతల్లితండ్రులేవరో తెలియదు కాబట్టి నీకు ….. తల్లీ తండ్రి ఈ నదీ దేవతనే …….
నాకు తల్లీ తండ్రి గురువు దైవం అన్నీ మీరే గురువుగారూ ……. , అయినా మీ దగ్గర ఉంటే కష్టమే తెలియదు .
గురువుగారు మురిసిపోయారు – నాయనా మహేష్ …… ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి సూర్యనమస్కారం చేసుకోవడం ఆరోగ్యం , రోజూ నాతోపాటు వస్తావా ? .
గురువుగారూ …… నేను మీ శిష్యుడిని ఆజ్ఞ వెయ్యండి , అన్నయ్యలతో అన్నీ తెలుసుకున్నాను , ఇకనుండీ విద్యను అభ్యసిస్తూనే గురువుగారిని సేవించుకోవడమే నా కర్తవ్యం అంటూ నమస్కరించాను .
గురువుగారు : విద్యాభ్యాసం మొదలుకాకముందే అన్ని విషయాలూ తెలుసుకున్నావు , ఎంతైనా బుజ్జిదేవుడివి కదా …….
నేనెప్పటికీ మా గురువుగారి శిష్యుడినే …….
గురువుగారు : గురువుగారినే మునగచెట్టు ఎక్కిస్తున్నావు , నీ ఒక్కొక్క బుజ్జి పలుకుకు ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను – అదిగో సూర్యోదయం అంటూ సూర్య వందనం ఎలా చేయాలో నేర్పించారు .
గురువుగారితోపాటు నదీ దేవత అమ్మ ఒడిలో స్నానమాచరించి అరణ్యం గురించి తెలుసుకుంటూనే గురుకులం చేరుకున్నాము .

అప్పటికే విద్యాభ్యాసానికి ఏర్పాట్లు పూర్తిచేసి ఉండటంతో శివుడి పూజ జరిపించారు . గురువుగారు ముందుగా గురుకులంలో కొత్తగా అడుగుపెట్టిన శిష్యబృందానికి ఓనమాలు దిద్దిన్చి చివరగా నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని విద్యాభ్యాసం చేయించారు .
గురుకులంలో ఉన్నన్ని రోజులు గురువుగారు చెప్పినట్లుగా నడుచుకుంటాము అని అందరమూ ఒకేసారి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని దేవుడిని మొక్కుకున్నాము .
చిన్న గురువులు : చూసారా యువరాజులూ …… మొదట కొత్తగా వచ్చిన మీ తమ్ముళ్లకు చేయించి చివరన బుజ్జి మహేష్ కు విద్యాభ్యాసం చేయించారు , గురువుగారి దృష్టిలో అందరూ సమానమే …..
యువరాజులు : అందరూ సమానం అన్నదే మాకు ఇష్టం లేదు , మేము పాలించేవాళ్ళము – మీరంతా పాలించబడేవారు , ఇక్కడ ఉన్నంతవరకే వినయంగా ఉంటాము ఎందుకంటే ఇలాంటి గురువుగారు దొరకడం అదృష్టం అనిచెప్పారు మా నాన్నగారు , అన్ని విద్యాలూ నేర్చుకుని మా ఇష్టప్రకారం పరిపాలన చేస్తాము . మాకు నీతులు చెప్పడం మానేసి తొందరగా అన్ని విద్యలూ నేర్పించండి …….
చిన్న గురువులు : ఏ విద్యలు ఎప్పుడు నేర్పించాలో గురువుగారే నిర్ణయిస్తారు .

వినాయక స్తోత్రంతో బుజ్జాయిలందరికీ బోధన మొదలుపెట్టారు .
మహాశివరాత్రి కావడంతో సూర్యాస్తమయం వరకూ పళ్ళ రసాలతోనే ఆకలితీర్చుకుని , సాయంత్రం మహాశివరాత్రి ఘనంగా జరుపుకుని పానకం స్వీకరించి రాత్రంతా శివుడి భజనలతో జాగారం చేసాము .

తరువాతి రోజునుండీ గురుకులం అన్నయ్యలందరితోపాటు గురువుగారికంటే ముందే లేచి పనులు పూర్తిచేసి , గురువుగారితోపాటు వెళ్లి సూర్య నమస్కారం మరియు నదీ అమ్మ ఒడిలో స్నానమాచరించి గురుకులం చేరుకోవడం , విధ్యనభ్యసిస్తూనే గురువుగారిని సేవించుకోవడం – అరణ్యం నుండి గురుకులంలో అందరికీ ఆహారం తీసుకురావడం – గురుకులాన్ని శుభ్రం చెయ్యడం – పనులు చెయ్యడం – పడుకునేముందు గురువుగారి పాదాలను స్పృశిస్తూ వారు నిద్రపోయిన తరువాత నిద్రపోవడం ……..
ఆ చిన్న వయసుకే విద్యతోపాటు అరణ్యంలో ఉండే ప్రతీ మొక్క ఒక ఆయుర్వేదంగా ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడం – కర్రసాము – మళ్ల యుద్ధం – విలు విద్య – కత్తిసాము ……. ఇలా యుద్ధవిద్యలన్నీ నెమ్మదిగా నేర్పించేవారు .

గురువుగారు అప్పుడప్పుడు అందరినీ దట్టమైన అరణ్యంలోకి తీసుకెళ్లి సాధు జంతువులతో మచ్చిక మొదలుకుని క్రూర జంతువుల నుండి ఎలా చాకచక్యంగా తప్పించుకోవడం గురించి వివరించేవారు మరియు ఆచరణాత్మకంగా చూయించేవారు .
అదేసమయానికి సింహం గాండ్రిoపు వినిపించింది దూరంగా చూస్తే మనిషి ఎత్తున్న సింహం , అందరూ గజగజావణికిపోతున్నాము .
గురువుగారు నేనున్నాను నేనున్నాను అని ధైర్యం ఇస్తున్నా శిష్యులందరూ కేకలువేస్తూ గురుకులం వైపుకు పరుగులుతీశారు . గురువుగారు నవ్వుకుని చిన్న గురువులందరికీ జాగ్రత్తగా తీసుకెళ్లమని పంపించారు . మహేష్ …… నువ్వెంటీ ఇక్కడే ఉన్నావు అంతపెద్ద సింహం చూసి భయం వెయ్యడం లేదా ? .
మా గురువుగారు ఉండగా నాకు భయమేల అంటూ వణుకుతున్నా దైర్యంగా ప్రక్కనే ఉన్నాను .

గురువుగారు : శివుడి వర ప్రసాదం అయిన మా బుజ్జిమహేష్ భయపడతాడు అనుకోవడం నాదీ తప్పు అంటూ నన్ను ఎత్తుకుని నేరుగా సింహం దగ్గరికి చేరారు .
ఆశ్చర్యం తమను – అరణ్యాన్ని వందల ఏళ్లుగా రక్షిస్తున్నారు అన్నట్లుగా గురువుగారికి నమస్కరించి వెనుతిరిగింది .
ప్చ్ ప్చ్ …….
గురువుగారు : మహేష్ …… సింహాన్ని తాకాలని అనుకున్నావుకదూ నాకు తెలిసిపోతోందిలే అంటూ , సింహంతో మాటలు కలిపారు గురువుగారు .
గురువుగారి మాటలను గౌరవించి మావైపుకు తిరిగింది .
గురువుగారు తాకేలా చెయ్యడమే కాకుండా సింహంపై కూర్చోబెట్టారు .
అంతే బుజ్జి హృదయం ఆగినంత పని అయ్యింది – వణుకుతూ ఉండిపోయాను .
గురువుగారు నవ్వుకుని అరణ్యంలో ఒక కొద్దిదూరం నడిపించి , సంతోషమేనా బుజ్జిమహేష్ అంటూ ఎత్తుకున్నారు .
అంతే గురుకులం చేరేంతవరకూ గురువుగారిని వదిలితే ఒట్టు గట్టిగా కరుచుకుపోయాను .

సింహంపై స్వారీని కొంతమంది అన్నయ్యలు …… చిన్న గురువులు ఇచ్చిన ధైర్యంతో దూరం నుండీ చూసినట్లు , గురువుగారి నుండి నన్ను కాస్త కష్టపడే ఎత్తుకుని భయం వెయ్యలేదా అని అడిగారు .
అంతలోనే నా పాదాలవెంబడి తడిని చూసి యువరాజులు నవ్వుకున్నారు .
అన్నయ్యలు : బుజ్జి మహేష్ నువ్వు కేవలం తడిపేశావు – మా ప్రాణాలైతే పోయేవే నువ్వు చాలా ధైర్యవంతుడివి అంటూ భుజం తట్టారు .
యువరాజులు కోపంతో వెళ్లిపోయారు .

అంతలో ఒక అన్నయ్య వచ్చి గుడ్డ అందించాడు . తెరిచి చూస్తే సింహంపై స్వారీ చేస్తున్న నా బొమ్మ ……. , సంతోషంతో ధన్యవాదాలు తెలిపి గురువుగారూ గురువుగారూ అంటూ పరుగునవెళ్లి చూయించాను .
గురువుగారు : చాలాబాగుంది అంటూ కుటీరంలో గోడకు తగిలించారు .
గురువుగారికి నేనంటే ఎంత ఇష్టమో మరింత బాగా తెలిసింది .

ఏడాది మొత్తం అందరితోపాటు గురువుగారిని సేవిస్తూ అంతకుమించి గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో విద్య మరియు జీవనానికి అవసరమైన విద్యలను అభ్యసించాను .
ప్రతీ ఏడాది చివరన నిర్వహించే నా వయసు పిల్లల పోటీలన్నింటిలో ప్రథమంగా నిలిచి గురువుగారు గర్వపడేలా చేసాను .
ఆ క్షణం గురువుగారు పొందిన ఆనందాన్ని చూసి చాలా సంతోషం వేసింది ఇక జీవితాంతం అందివ్వాలని ధృడంగా నిశ్చయించుకుని ముందు ఏడాది కంటే మరింత ఇష్టంతో కష్టపడుతూ గురువుగారికి ఆ ఆనందాన్ని పంచుతూనే ఉన్నాను.
అధిచూసి యువరాజుల అసూయ ఈర్ష్యలు పెరుగుతూనే అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి .

యువరాజుల గురించి ఆనోటా ఈనోటా గురువుగారి చెవికి చేరింది . పదిహేనవ ఏట నుండీ యువరాజులకు నేర్పించే యుద్ధవిద్యలను వారితో సమానంగా నాకు కూడా నేర్పించడం మొదలుపెట్టారు . గుర్రపు స్వారీతో మొదలుపెట్టి యుద్ధ విద్యలు – రాజ్య పాలన …….
యువరాజులకు మాత్రమే నేర్పించే విద్యలను ఒక సామాన్యుడికి తమతో సమానంగా తమతోపాటు కలిపి నేర్పించడం మరింత ఆగ్రహాన్ని కలిగించింది . కానీ గురువుగారి ఆజ్ఞలను కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు .
ఆ ఏడు మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందేలేచి గురువుగారి దగ్గరకు చేరుకుని నది దగ్గరికి చేరుకున్నాము .

అక్కడ నది ఒడ్డున ఒక అందమైన గుర్రం నీళ్లు తాగుతోంది . మమ్మల్ని చూడగానే మాదగ్గరికి వచ్చింది – నా చుట్టూనే తిరుగుతోంది .
గురువుగారు : ధైవేచ్చ ……. , మహేష్ ……. నీకోసం మన దైవమే నీ చెంతకు ఇంతటి శక్తివంతమైన అశ్వాన్ని దరి చేర్చారు , ఇక నుండీ నీ సొంతమైన అశ్వంతో శిక్షణ తీసుకోవచ్చు .
నా ఆనందానికి అవధులు లేవు – అశ్వాన్ని ఆప్యాయంగా హత్తుకున్నాను .
గురువుగారు : ఇద్దరూ ఒక్కటైపోయారన్నమాట , నీ ప్రాణ స్నేహితుడి పేరు ఏమిటి మహేష్ …….
అర్జునుడికి దారిని చూయించేది కృష్ణుడు కదా గురువుగారు …….
గురువుగారు : కృష్ణ అన్నమాట – చాలా బాగుంది మహేష్ …….

అశ్వంతో గురుకులానికి చేరాము . అంతటి అద్భుతమైన అశ్వాన్ని చూసి యువరాజులే ఆశ్చర్యపోయారు .
ఆరోజు నుండీ ఇద్దరమూ ఒక్కటిగా శిక్షణను ప్రారంభించి చాలా చాలా దగ్గరయ్యాము ఒకరిని విడిచి మరొకరం ఉండలేనంతలా ……..

అలా మూడేళ్ళ చివరకు చేరుకుంది – పోటీలకు రంగం సిద్ధమైంది .

1308370cookie-checkజనం మెచ్చిన రాజు – Part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *