ఖర్కోటఖుడు – Part 8

Posted on

పెద్ద పొడుగు లేరు, లావు కూడా అంతంత మాత్రమే, కానీ ధృఢంగా ఉన్నారు. బట్టలు, జుట్టు దుమ్ము పట్టి ఉంది. నడుముకు మెలి తిరిగిన కొడవలి లాంటి కత్తి ఒకటి వేలాడుతుంది.
వాళ్ళ కళ్ళు మాత్రం చాలా చురుకుగా ఉన్నాయి. వాళ్ళ కళ్ళు చూసి ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది హార్ధిక్ కి. అంత పదునుగా ఉన్నాయి వాళ్ళ చూపులు.
“ఇంత చిన్న పిల్లలా?” అనుమానంగా అడిగాడు హార్ధిక్.

అనుమానం వద్దు సాబ్. ఒక్కొక్కరు 10మందిని అయినా నిమిషాల్లో మట్టి కరిపిస్తారు. ఒక్కసారి అటు చూడండి” అంటూ వాళ్ళకి సైగ చేసాడు.
వాళ్ళు ఎదురుగా ఉన్న 30 అడుగుల చెట్టుని ఉత్తి చేతి సాయంతో అరక్షణంలో ఎక్కి అక్కడి నుంచి అమాంతం ఉరికేసారు. ఆశ్చర్యం వాళ్ళకి చిన్న గీత కూడా పడలేదు.
“చూసారు కదా సాబ్? వీళ్ళని చిన్నప్పుడే అడవినుంచి ఎత్తుకొచ్చాను. కానీ వీళ్ళు వీళ్ళ అడవి బుద్దిని మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే వీళ్ళని రాత్రిపూట హత్యలకు ఉపయోగిస్తాను. మనిషి ఎవరైనా ఎంతమంది అడ్డున్నా పని పూర్తి చేసుకొస్తారు. తుపాకీ గుళ్ళు కూడా వీళ్ళను తాకడం కష్టమే” అన్నాడు.
“సరే వీళ్ళు మొత్తం ఎంత మంది ఉన్నారు?”
“12మంది సాబ్.. మొన్నే ఒకడు చచ్చిపోయాడు”
“మరి ఇంకొకడు ఎక్కడ?”
“అమ్మో వద్దు సాబ్.. వాడే ఇంకొకడ్ని చంపేశాడు. ఈ పులుల్ని పక్కన పెట్టుకోవడం ప్రమాదకరం సాబ్.”
“వాళ్ళు పులులైతే నేను రింగ్ మాస్టర్ ని కానీ.. వెళ్ళి వాడ్ని కూడా తీసుకురా”
“సాబ్ రింగ్ మాస్టర్ మాట వినడానికి వాడు పులి కాదు సాబ్ తోడేలు. జరంత నా మాట వినండి” భయంతో చెప్పాడు గంగాదాస్.
“గంగాదాస్.. చెప్తున్నా కదా? ఏం పర్లేదు. తీసుకురా”
“మీ ఇష్టం సాబ్. మీ మంచి కోసం చెప్పాను.” అని వాళ్ళలో ఒకడివైపు తిరిగి “రేయ్ సుల్తాన్.. ఆ బద్మాష్ టూటూ గాడ్ని పిలువు బే” అన్నాడు అరచినట్టుగా.
ఒక పది నిముషాలకి గేట్ కిర్రుమని ఓపెన్ అయ్యింది. అందరూ నిశ్శబ్దంగా అటువైపు చూస్తున్నారు. ఒక చామనఛాయలో ఉన్న 22 సంవత్సరాల కుర్రాడు ఉక్కు మనిషిలా ఉన్నాడు. నడుస్తూ వస్తున్న ఆ కుర్రాడు ఒక్క క్షణంలో మాయమయ్యాడు. తలతిప్పి చూసేలోపు ఆ వరుసలో నిలబడ్డ ఒకడి పళ్ళు సెట్టు మొత్తం నేల మీద ఉంది.
“అమ్మా..” అని మెడ విరిగిన బాధతో ఒకడు నేల మీద పడిపోయాడు.
వెంటనే గంగాదాస్ కోపంగా “రేయ్ టూటూ.. ఏంటి బే. ఏం చేస్తున్నావ్” అని అరిచాడు కోపంగా.
“క్షమించు బాబా.. నిన్న మందు అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఎంత పిలిచినా వినిపించుకోలేదు వీడు” అన్నాడు తల వంచుకుని టూటూ.
“చూసావా సాబ్? వీడికి పిచ్చి కోపం. వీడు ఒక్కడే ఈ పదిమందిని చంపేయ్యగలడు. అందుకే వద్దు అంటున్నా”
“పర్లేదు దాస్. వీడు నాకు పర్సనల్ బాడీ గార్డుగా ఉంటాడు.” అంటూ టూటూని దగ్గరకు రమ్మని పిలిచాడు. కానీ టూటూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోయాడు.
“సరే నేను వీళ్ళని తీసుకువెళ్తాను. పంపించు” అన్నాడు హార్ధిక్ బాక్స్ లోంచి చెక్ బుక్ తీసి కోటి రూపాయలకు చెక్ రాసి ఇస్తూ.

“రేయ్ ఇక నుంచి కొన్ని రోజులు ఈ సాబ్ తో ఉండాలి. ఏం చెప్పినా చెయ్యాలి. పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చెయ్యండి. మీకు ఏం కావాలన్నా సాబ్ చూసుకుంటాడు. సాబ్ ఏం చెప్తే అది చెయ్యండి. అర్థమయ్యిందా?” అన్నాడు.
అందరూ బుద్దిగా తలూపారు. హార్ధిక్ కాల్ చేసి వాన్ ని రమ్మన్నాడు.
హార్ధిక్ వీళ్ళని తీసుకుని కార్ దగ్గరకి వచ్చే సరికి వాన్ వచ్చి ఆగింది.
వాళ్ళని వాన్ లో ఎక్కించి తన ప్యాలస్ కి బయలుదేరాడు.
ఇంటికి వచ్చే సరికి హాథీ ఇంటి దగ్గర ఉన్నాడు.
“ఎక్కడున్నాడు?” అడిగాడు హార్ధిక్.
“అక్కడే ఉన్నాడు. కానీ చుట్టూ సెక్యూరిటీ ఎక్కువగా ఉంది.”
“సరే బయట వాన్ లో ఉన్నవాళ్ళకి వాడి ఫోటో, ప్లేస్ చూపించు. వాళ్ళు చూసుకుంటారు”
“ఓకే సర్” అని అక్కడి నుంచి బయటకు నడిచాడు హాథీ.
ఇంతలో హార్ధిక్ సీక్రెట్ బ్లాక్ బెర్రీ ఫోన్ రింగయ్యింది.
డాడ్ ఏమో అని చూసుకున్నాడు. కానీ ఏదో కొత్త నెంబర్.
ఎవరిదో అని లిఫ్ట్ చేసి “హలో” అన్నాడు.

“హెలో హార్ధిక్?” అవతలి వ్యక్తి కంఠం.
“హా..” అన్నాడు అప్రయత్నంగా.
“నేను మల్హోత్రాని” మల్హోత్రా కంఠం కంగారుగా పలికింది. “చెప్పండి. ఏమైంది?” అడిగాడు హార్ధిక్.
మల్హోత్రా చెప్పడం మొదలెట్టాడు.

###########

ఉదయం తన గుడిసెలో నిద్ర లేచాడు మల్హోత్రా..
చాలా కాలం తర్వాత ఒక వింతైన ఉదయాన్ని చూస్తున్నాడు. తన చిన్నతనంలో తనకి బాగా పరిచయమైన ఉదయం.
కళ్ళు తెరవగానే ఎదురుగా పెద్ద చెట్టు. దాని మీద వాలుతూ ఎగురుతూ ఆహార వేటకు వెళ్తున్న పక్షులు.
ఎరుపు రంగుకు నిర్వచనం ఇస్తూ మెల్లిగా ఉదయిస్తున్న పెద్ద సూర్యుడు..
ప్రకృతి ఎంత అందంగా ఉంది?
మనం ఎందుకు ఈ అందాన్ని ఆస్వాదించలేక కాంక్రీట్ అడవులలో మృగాల్లా ఎంతకీ తనివితీరని ఆకలితో కొట్టుమిట్టాడుతున్నాం.
అయినా తనకి జీవితం విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది.
కానీ ఇవన్నీ ఆలోచించేదెవరు?
లేచి ఒక వేప పుల్ల తీసుకుని దంతావధానం ముగించాడు.
ఎదురుగా ఉన్న ఒక టీ కొట్లో కూర్చుని వాడు ఇచ్చిన మల్లెపూలవంటి తెల్లని ఇడ్లీలు నాలుగు పొగలు కక్కుతుండగా కమ్మటి చెట్నీలో అద్ది కడుపులో వేసుకున్నాడు.
ఒక్కసారిగా ఏదో తెలియని ఒక మధురానుభూతిని పొందుతూ ఇలాంటి ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటే చాలు కదా అనిపించింది.
“ఎవరు బాబూ నువ్వు?” అంటూ ఒక ఆత్మీయమైన పలకరింపుతో ఒక ముసలాయన వెనకనుంచి భుజం మీద చెయ్యి వేసాడు.
వెనక్కి తిరగ్గానే రహీం చాచా..

171110cookie-checkఖర్కోటఖుడు – Part 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *