ఖర్కోటఖుడు – Part 7

Posted on

“అలాగే కానీ నీకన్నా ముందు మల్హోత్రా జాగ్రత్త. అతను లేకపోతే మనం చేసేది మొత్తం వృధా.
వీలైనంత తొందరగా పని ప్రారంభించు. అవసరం అయితే తప్ప నీ ఆచూకీ ఎవరికీ తెలియనివ్వకు. బై” హార్ధిక్ కి ఇంక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసాడు సౌరవ్.

ఫోన్ పెట్టేసి హార్ధిక్ ఆలోచనలో పడ్డాడు. జరిగింది ఎలాగూ మార్చలేడు. ఇప్పుడు యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదు.

ఛటర్జీతో దాడి చేయించాడు అంటే తన ఆనవాలు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాగే తమకు శత్రువులు అయిన వాళ్ళని కలుపుకుంటున్నాడు. ఇక్కడ తనకి బలగం తమ శత్రువులు. ముందు ఎలాగైనా మల్హోత్రాని తెచ్చుకోవాలి.

ఆలోచిస్తూ దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు. నచ్చిన దాని కౌగిలిలో కాలిపోవడం తెలుసు కానీ ఇలా ఆలోచోనల వేడిలో కాలిపోవడం ఇదే మొదటిసారి.
ఇంతలో SI వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు.
“చెప్పు” అన్నాడు హార్ధిక్.
“అదే సర్.. రమ్మన్నారు కదా” అంటూ నసిగాడు.
“అవును.. కూర్చో. ఏం జరిగింది అక్కడ?” అంటూ కుర్చీ చూపించి సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు.
“ఎవరో ఇద్దరు అమ్మాయిల్ని హత్య చేసి వెళ్లిపోయారు సర్”
“హ్మ్.. ఇంకా”
“వాళ్ళు చైనా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నారు సర్”
“సాక్ష్యాలు ఏమైనా దొరికాయా?”
“కొన్ని అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నాం సర్.. బయట వాచ్మాన్ అయితే ఎవరూ రాలేదు అంటున్నాడు. అతని మాటలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. ఒకటి రెండు రోజుల్లో దీని మీద ఒక స్పష్టత రావచ్చు సర్”
“ఏం దొరికాయి?”
” వాళ్ళ సెల్ ఫోన్, వాళ్ళ నెంబర్ రాసి ఉన్న ప్లకార్డు, ఇంకా వాళ్ళ బ్యాంక్ కార్డులు దొరికాయి. అక్కడ ఏమైనా వేలిముద్రలు దొరుకుతాయేమో అని మా క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడే సెర్చ్ చేస్తున్నారు”
” ఓకే.. నాకు మీరు చిన్న హెల్ప్ చెయ్యాలి. ”
“చెప్పండి సర్”
“ఏం లేదు. అందులో లాస్ట్ కాల్ రికార్డ్ నాదే. వాళ్ళని రేపటికి బుక్ చేసుకున్నాను. కలవడానికి గేట్ వరకు వెళ్ళాను కానీ వాళ్ళు కిందకి రాలేదు. వాచ్మాన్ కి డబ్బులు ఇచ్చి వచ్చాను. కాబట్టి అందులో నా నంబర్ డిలీట్ చేసేయ్యండి. అలాగే ఆ వాచ్మాన్ ని వదిలెయ్యండి. ఆ ప్లకార్డు గురించి కూడా రిపోర్టులో మెన్షన్ చెయ్యొద్దు. సరేనా?”
“సర్ అది.. అది.” అంటూ నసుగుతున్నాడు.
“సరిపోతుందా” అన్న హార్ధిక్ మాటలకు తలెత్తి చూసిన SI కళ్ళ ముందు డబ్బు గుట్టగా పడి ఉంది.
“సర్” అని సెల్యూట్ చేసి ఆ డబ్బు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయాడు.
బాగా పొద్దుపోవడంతో రేపు మల్హోత్రా సంగతి చూడాలి అనుకుంటూ మంచం మీద పడి అలాగే నిద్రపోయాడు హార్ధిక్.

171091cookie-checkఖర్కోటఖుడు – Part 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *