శనివారం సాయంత్రం – Part 2

Posted on

ఒక గంట తర్వాత తలుపు తెరుచుకుని ఉదయ్, గోట్లే ఇద్దరూ బయటికొచ్చాడు. ఈ గంట లోనూ నా కోపం ఏ మాత్రం తగ్గ లేదు. నా మనసు లో ఇంతకు ముందు జరిగిన దృశ్యాలు ఇంకా కళ్ళకు కట్టినట్టు ఆడుతూనే వున్నాయి.

వాళ్ళు దగ్గరికి రావటం తో నేను లేచి నిల్చున్నాను. ఉదయ్ అయితే నేను పక్కనే లేనట్టు ప్రవర్తించాడు. గోట్లే గూడా ఆశ్చర్యం గా మా ఇద్దరి వైపు తేరి పార చూస్తున్నాడు.

“గ్రేట్ మీటింగ్ యు గోట్లేజీ, మనం మళ్ళీ కలుద్దాం” అంటూ ఉదయ్ గోట్లే తో కరచాలనం చేసి వడి గా నడవటం మొదలెట్టాడు. నేను పక్కన ఉన్నానా లేదా అని చూసుకోకుండా. నేను కూడా గోట్లే కి గుడ్ బై చెప్పి ఉదయ్ వెనకాల పరుగెత్తాను. లిఫ్ట్ డోర్ మూసుకునే వరకు గోట్లే నా గుండెల వైపు చివరి సారి తన్మయతత్వం చూస్తూ ఉంది పోయాడు.

“వాట్ ద ఫక్..” నా గొంతు నాకే పెద్ద గా వినిపించింది.

“ష్.. ఇప్పుడే కాదు.. మనం ఇంకా క్లైంట్ ఆఫీసు లోనే వున్నాం… ” అంటూ ఉదయ్ నా పెదాల్ని తన వ్రేలితో ముయ్యబోయాడు.

విసురు గా అతని చేతిని విదిలించి శివం ఎత్తినట్టు ఊగి పోతూ అతని వెనకాలే కారు వరకూ నడిచాను. నేను మళ్ళీ అరవటం మొదలెట్టానో లేదో, ఉదయ్ ఫోన్ మోగింది. బ్లూ టూత్ ఆన్ చేసి కాల్ తీసుకున్నాడు.

“ఓహ్ హలో నాథ్ గారూ, మీరు చెప్పినట్టు గానే, మీ స్పెసిఫికేషన్ కి ధర కి తగ్గట్టు గానే మళ్ళి కోట్ మీద వర్క్ చేస్తున్నాను.”

ఉదయ్ క్లైంట్ తో మాట్లాడుతున్నంత సేపూ, నేను వేరే వైపు చూస్తూ కూర్చున్నాను. ఉదయ్ డ్రైవ్ చెయ్యటం మొదలెట్టాడు. ఫిలిం సిటీ కి దగ్గర రాగానే, ఒక పచ్చిక దగ్గర కార్ ఆపాడు. కాల్ అయిపోయింది కాబోలు, ఇయర్ పీస్ తీసేసాడు.

“నీకు కోపం రావటాన్ని నేను పూర్తి గా అర్థం చేసుకోగలను” ఉదయ్ గొంతు మళ్ళీ మార్దవం గా ఉంది.

“యు ఫకింగ్ అసోల్”.. నేను విరుచుకు పడ్డాను. నేను ముందే చెప్పాను, నాకు ఈ ఎకౌంటు అవసరం లేదని. నువ్వు, గోట్లే గాడు కలిసి గంగలో కలవండి, నాకెందుకు ? ఇందులోకి నన్ను లాగి మరీ తన్నాల్సిన పనేమిటి?”

“సారీ.. కానీ..”

“నేను నీకు రిపోర్ట్ చెయ్యటం ఏమిటి ? ఏంటా బుల్షిట్” అంటూ బుసలు కొట్టాను. “నీ స్టంట్స్ నా దగ్గర గాడు. రేపే నేను సతీష్ ని కలిసి విషయం అంతా చెబుతాను, నీకు వార్నింగ్ ఇస్తాడో, తీసి పారేస్తాడో చూసుకో. జీవితం లో ఇంత అవమానం ఎప్పుడూ ఎదురవ్వలేదు.. ” అలా ఓ పది నిమిషాల పాటు చడా మాడా తిట్ట్టాక నా ఆవేశం కొంచం చల్లారింది. నేను మాట్లాడుతున్నంత సేపూ, ఉదయ్ నిశ్శబ్దం గా వింటూ వున్నాడు. నన్ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు.

“పద బయల్దేరుదాం” అన్నా.. నా ఊపిరి అలిసిపోయిన ఫీలింగ్ తో.

“నువ్వు చెప్పటం ఐందా?. నేను చెప్పేది సావధానం గా వింటావా?” అన్నాడు నెమ్మది గా.

నేను మాట్లాడటం మానేసి వినటం మొదలెట్టాను.

“ప్రియా, నా మాటలని నమ్ము. నువ్వు చాల స్మార్ట్, ఇంటిలిజేంట్ గర్ల్. చాల గట్టి దానివి, అలాగే, చాల అందగత్తె వి కూడా. నాకు నువ్వంటే చాలా అభిమానం, ఇష్టం.”

“నో..”

“ఇంత తెలివైన దానివి, అక్కడ జరిగిన డ్రామా ని గుర్తించలేక పోయావా?”

“డ్రామా?”

“అవును. ద్రామానే. నువ్వు ఇప్పడి దాక ఈ ఇడియట్ గోట్లే చుట్తో ఎన్ని రోజులు తిరుగుతున్నావు? మూడేళ్ళు, కదా?”

“అవును”

“ఐనా వాడు నీకు ఒక్క ఆర్డర్ అయినా ఇచ్చాడా?”

“నీకు తెలుసు, వాడు అడుగుతున్నా రేట్ మనకి సరిపడదని..”

“అదంతా మర్చిపో.. నా పాయింట్ ఏమిటంటే, వాడు మన కంపెనీ రిలేషన్స్ తో హ్యాపీ గా లేదు, ముఖ్యం గా, నీతో. ఎందుకనేదీ నాకైతే తెలియదు. మీ ఇద్దరి మధ్య ఇంతక ముందు ఏమైందో, నాకేమి ఐడియా లేదు. వాడు మాత్రం, నీకు ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వటానికి సుముఖం గా లేడు”

ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వింటూ కూర్చున్నాను.

“మూడేళ్ళు, డజన్ల కొద్దీ మీటింగులు. జీరో ఆర్డర్స్. వాడు నీ వైపు చూసే విధానం చూసాను. వాడి కన్ను నీ మీద వుంది. వెధవ పీనుగ. నీతో మీటింగులు అంటూ తిప్పించుకోవటం వాడి సరదా..”

“ఓహ్.. నువ్వు కూడా గమనిస్తావే..” అన్నాను ఎగతాళిగా..

“నేనేం కళ్ళు మూసుకుని లేను. నా ఉద్దేశం లో వీడు ఒక మగ మహారాజు అనుకుంటాడు. ఆడవాళ్ళంతా అసమర్ధులు గా, వంటిన్ట్లోనో, పడగ్గడికో అంకితం అని వీడి ఉద్దేశం. వాడి దృష్టి లో నువ్వొక ఆట బొమ్మ.”

ఉదయ్ కళ్ళ లోకి చూస్తె, నిజాయితీ కనిపించింది.

“ఈ విషయం నా దగ్గర ముందు ఎందుకు తేలేదు?”

“నేను రియాక్ట్ ఐన విధం నాకేమాత్రం ఇష్టం లేదు. వాడి పధ్ధతి రెండు నిముషాలు గమనించాక, తప్పని సరై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్నెందుకు బయటికి వెళ్ళమన్నానో తెలుసా.. నిన్ను తిడుతూ అక్కడే కూర్చోపెట్టటం ఇష్టం లేక.”

“వాడు నా గురించి ఏమన్నాడు?”

132301cookie-checkశనివారం సాయంత్రం – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *