ఇంత జరిగిన తరువాత రాజా ఇక్కడే ఉంటే ఇంకా రిస్క్ అని అర్థం అయ్యి పైగా ఇదే సందు అని వాడిని హైదరాబాద్ పంపించారు వాళ్ల అమ్మ నాన్న తరువాత రాజా ఇచ్చిన టోకెన్ అగ్రిమెంట్ లో రాజా పేరు మార్చి వాళ్ల బావ తేజ పేరు పెట్టారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత రాజా ఒక రోజు తన favorite హీరో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చూడడానికి వెళ్లాడు అప్పటికే మనోడు 5 సార్లు చూశాడు అలా Imax లో సినిమా కీ వెళ్లినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఏస్కలేటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాడు చూస్తే ఆ అమ్మాయి రీతిక తనని చూడగానే రాజా తనని లేపి అక్కడి నుంచి పారిపోయాడు కాకపోతే రీతక సినిమా లో తన పక్క సీట్ లో కూర్చుంది తన పక్కన ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇంటర్ ఎల్ లో రీతిక రాజా నీ చూసి “హే ఏంటి ఇందాక అలా వెళ్లి పోయారు” అని అడిగింది,
దానికి రాజా “ఆ రోజు అంత సీన్ జరిగింది కదా మళ్లీ మీతో మాట్లాడాలి అంటే ఏదోలా అనిపించింది” అని కొంచెం మొహమాటం పడుతు మాట్లాడటం చూసి “పర్లేదు I can understand” అని చెప్పింది రీతిక అప్పుడు తన పక్కన ఉన్న అబ్బాయి గురించి అడిగితే తన కాబోయే భర్త అని చెప్పింది దాంతో కంగ్రాట్స్ అని చెప్పాడు ఆ తర్వాత సినిమా అయిపోయాక చెర్రీ నుంచి ఫోన్ వచ్చింది “బావా మనం అనుకున్న సైట్ లో ఏదో స్కామ్ జరిగింది అంట అందుకే ఆ బిల్డింగ్ మూసేశారు మన డబ్బు పోలేదు ఎంతైనా లక్కీ రా మనం” అన్నాడు కానీ రాజా మాత్రం వెళ్లుతున్న రీతిక నీ చూసి ఈ అమ్మాయి మనకు లక్కీ లాగా ఉందే అనుకున్నాడు.