సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Posted on

ఇంటికి వెళ్లేముందే సంజన వివేక్ కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది…
దాంతో ఇంటికి రాగానే వివేక్ సంజనని ఎత్తుకొని గాల్లో గిరగిరా తిప్పాడు… వివేక్ ఆనందానికి అవధులు లేవు ఆ క్షణంలో … పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు… కారణం ఏంటో తెలియకపోయినా తమ తల్లిదండ్రుల సంతోషం చూసి వాళ్లకూ సంతోషం కలిగింది… సంజన అపోయింట్ మెంట్ ఆర్డర్ టేబుల్ మీద ఉంది… అప్పటికి పది సార్లయినా దాన్ని చదివి ఉంటాడు వివేక్ …

“సంజూ… నిజంగా వాళ్ళు నీకు ఈ జాబ్ ఇచ్చారంటే నమ్మబుద్దెయ్యట్లేదు…” అన్నాడు
సంజన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది ఆ మాటలతో… ఇప్పటికి పది సార్లు అన్నాడు వివేక్ ఆ మాట…
“అంటే నాకా అర్హత లేదంటావా వివేక్… “అడిగింది సంజన కాస్త కోపంగానే…
“నోనో నా ఉద్దేశ్యం అది కాదు డార్లింగ్… నీ కెపాసిటీ ఏంటో నాకు బాగా తెలుసు… దీనికి నువ్ అన్నిరకాలుగా అర్హురాలివే…కానీ వాళ్ళు ఇంత తక్కువ సమయంలో అది తెలుసుకోగలరని నేను అనుకోలేదు… ”

“అదంతా ప్రియ చలవ వివేక్… దాని సహకారం వల్లే నేనీ ఇంటర్వ్యూ సక్సెస్ ఫుల్ గా నెగ్గాను… ఇప్పుడు నేను వెంటనే వెళ్లి దానికి థాంక్స్ చెప్పి వస్తాను…. లేదంటే నాకీ రోజు నిద్ర పట్టదు…”
“అవును వెళ్ళిరా… నా తరపున కూడా ప్రియకు థాంక్స్ చెప్పు..” అంటూ పంపించాడు…
కాఫీ షాప్ లో ప్రియని కలవగానే “థాంక్యూ ప్రియా… నిజానికి నీకు థాంక్స్ చెప్పాడానికి ఆ మాట ఒక్కటి సరిపోదు…” అంటూ కౌగిలించుకుంది…. సంజన కళ్లెంబడి నీళ్లు కారుతున్నాయి….

“ఏయ్ పిచ్చిదానా ఎందుకే అంత ఎమోషనల్ అవుతావ్… అయినా నేనేం చేసాను చెప్పు… అక్కడ అవకాశం ఉందని మాత్రమే చెప్పాను…”
“లేదు ప్రియా… నీ మేలు మరిచిపోలేను… ముఖేష్ ఒకటికి రెండు సార్లు చెప్పాడు… నీ రికమండేషన్ వల్లే నాకీ జాబ్ ఇస్తున్నట్టు…”
“సంజనా నీకు అన్ని అర్హతలూ ఉన్నాయి కాబట్టే నీకు అది దొరికింది… బాగా పనిచేసి నిన్ను నువ్ మరొకసారి ప్రూవ్ చేసుకో…”
“తప్పకుండా ప్రియా… పూర్తి డెడికేషన్ తో వర్క్ చేస్తా…”

“ఓకే.. ఇప్పుడు ఇక వెళ్ళు… వెళ్లి పిల్లలతో, వివేక్ తో కలిసి సెలెబ్రెట్ చేసుకో…”
“ఓకే ప్రియా… థాంక్స్ వన్స్ అగైన్… బై…” అంటూ సంజన వెళ్ళిపోయింది…
సంతోషంగా సంజన వెళ్లినవైపే చూస్తూ కాఫీ షాప్ లోనే కూర్చుంది ప్రియ… సంజన కనుమరుగవ్వగానే ఆమె మొహంలో సంతోషం కూడా మాయమైంది…
ప్రియ తన సెల్ తీసుకొని కాల్ చేసింది… అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తగానే… “సర్ నేను ప్రియని… సంజన ఒప్పుకుంది…”
“తెలుసు…”
“సర్ అది చాలా అమాయకురాలు… ” అంటుండగానే…
“చూడు ప్రియా… నీకు అప్పజెప్పిన పని పూర్తయింది… దానికి నీకు ఇస్తానన్న ప్రతిఫలం నీకు రాత్రికల్లా ముడుతుంది… ఇక మీదట జరిగే వాటితో నీకు ఎలాంటి సంబంధం లేదు… ఈ విషయాలన్నీ ఇక్కడితో మరిచిపోతే నీకు మంచిది… ఇంటికి వెళ్లి హాయిగా ఉండు… బై..”

తర్వాత మాటలేమీ వినబడలేదు…
లైన్ కట్ అయిందని ప్రియకు అర్థం అయింది…
దీర్ఘంగా నిట్టూర్చి తనలో తాను అనుకుంది…
“అంతా మంచే జరగాలి…”

126145cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *