సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Posted on

“హ్మ్మ్ తర్వాత…”
“నాలుగేళ్లుగా ఎక్కడా చేయలేదు…”
“ఎందుకని….?”
సంజనకి భయంగా ఉంది… ఇది కూడా పోతుందేమో అని…
“పిల్లల్ని చూసుకోడానికి ఇబ్బందిగా ఉండి….” చెప్పింది నెర్వస్ గా…
“ఓహ్ ఎంత వయసుంటుంది మీ పిల్లలకు…?”
“బాబుకి 8, పాపకి 4….”

“అవునా మరి ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం లేదా….”
“ఉంది … కానీ కుటుంబ పరిస్థితులు బాగా లేక తప్పడం లేదు….”
“నువ్వు ఈ జాబ్ కి ఎలిజబులా కాదా అని నేను ఇప్పుడే చెప్పలేను కానీ… ఒకటి మాత్రం నిజం… ఈ జాబ్ ఎటువంటిదంటే… దీనికి చాలా కమిట్ మెంట్ అవసరం… నాలుగు రోజులు పని చేసి నాకు వీలవడం లేదు నేను మానేస్తా… అని మధ్యలో వదిలేసి వెళ్లే వాళ్ళకి ఇది ఇవ్వలేము…”

“లేదు సర్… నేను మధ్యలో వదిలేయను… తప్పకుండా పని చేస్తాను… ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయ్యను… నాకు ఇది చాలా అవసరం…” అంది సంజన గబగబా… తన కమిట్ మెంట్ ఆమె మాటల్లో స్పష్టంగా కనబడింది…
” ఓకే ఓకే… నువ్ అంత నమ్మకంగా చెప్తున్నావ్ కాబట్టి ఓకే…” అంటూ ముఖేష్ ఇంటర్వ్యూ కొనసాగించాడు… సంజనని రకరకాల ప్రశ్నలు అడిగాడు…
“నువ్ ఇంతకు ముందు ఏయే పనులు చేసేదానివి?”
“నీకు సాఫ్ట్వేర్ లో ఏయే విభాగాల్లో పరిచయం ఉంది..?”
” MAS గురించి నీకు ఏం తెలుసు”

“ఫలానా దాని గురించి తెలుసా…”
“ఫలానా సందర్భంలో నువ్ ఏం చేస్తావ్…”
ఇలా ప్రశ్నలు అడుగుతూ పోయాడు… సంజన జవాబులు చెప్తూ పోయింది…
ఒక అరగంట గడిచాక… “సంజనా… ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూ పట్ల నువేం అనుకుంటున్నావ్…? నీకీ జాబ్ వస్తుందనుకుంటున్నవా..” అని అడిగాడు ముఖేష్…
సంజన ఆ ప్రశ్న ఊహించలేదు… కొద్దిగా ఆలోచించి… ” సర్ జాబ్ వస్తుందా లేదా అనేదాని గురించి నేనేమీ చెప్పలేను… కానీ ఒక్కటి మాత్రం నిజం… మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చాను…”

“Hmm… మంచి సమాధానం… అయితే నా ఒపీనియన్ ప్రకారం జాబ్ కు నువ్ సూట్ కాదు… దీనికి కావలసిన స్కిల్స్ నీకు ఉన్నట్టు నీ సమాధానాల ద్వారా నువ్ ఫుల్ గా ప్రూవ్ చేసుకోలేక పోయావ్…

ఇది టెక్నికల్ లేదా డెవలప్మెంట్ జాబ్ కాదు… బిసినెస్ ఓరియెంటెడ్ జాబ్… నువు ceo తో కలిసి పని చేయాల్సి ఉంటుంది… సీఈఓ తరపున సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్స్ చదవాల్సి ఉంటుంది… వాటిమీద షార్ట్ నోట్స్ ప్రిపేర్ చెయ్యాలి… అవసరమైతే CTO లతో చర్చించాల్సి ఉంటుంది… ఇవన్నీ చేస్తూనే… మన క్లయింట్ అడిగితే ఏ జపనీస్ రెస్టౌరెంట్ నో బుక్ చేయవలసి ఉంటుంది… నాకెందుకో నువ్ ఇవన్నీ చేయలేవు అనిపిస్తుంది….”

“సర్ మీకిందాక చెప్పినట్టు …. ఎలా అయితే నిజాయితీగా సమాధానాలు చెప్పానో… అంతే నిజాయితీతో, నిబద్ధతతో మీరు అప్పగించిన ప్రతి పనినీ చేస్తాను… నాకు తెలియనివి చాలా ఉన్నాయని ఒప్పుకుంటాను.. కానీ వాటన్నిటినీ నేర్చుకుంటాను… నన్ను నమ్మండి… నాకా శక్తి, ఆసక్తీ ఉన్నాయి…. మీరు నాకో అవకాశం ఇచ్చి చూడండి… నేను మిమ్మల్ని కచ్చింతంగా డిసప్పాయింట్ చేయను…”
“సంజనా నువ్ చాలా స్మార్ట్ అని అర్థం అవుతుంది… నువ్ త్వరగా నేర్చుకోగలవని నేను నమ్ముతున్నాను… పైగా నీకు బలమైన రికమండేషన్ కూడా ఉంది…”

సంజన మనసులోనే ప్రియకి థాంక్స్ చెప్పుకుంది…
“ఓకే ఫైన్ సంజనా … నీకీ జాబ్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు… అయితే నువ్ ఒక నెలపాటు ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది… ట్రైనింగ్ పీరియడ్ కి కూడా శాలరీ ఇస్తాము… ట్రైనింగ్ చివర్లో ఒక వారం పాటు అమెరికాలోని మా కంపనీ హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్ కి అటెండ్ కావలసి ఉంటుంది…” అని చెప్తూ కాసేపు ఆగాడు ముఖేష్….
సంజన అంత మంచి జాబ్ తనకు వచ్చిందని స్టన్ అయిపోయింది…

“చూడు సంజనా ఇది హై లెవెల్ ట్రైనింగ్… దీనికి సుమారు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది… ఇప్పటికే ఇంకో ఆరుగురిని ఈ ట్రైనింగ్ కి ఎంపిక చేసాం… నువ్ ఒప్పుకుంటే నీ పేరు కూడా లిస్టులో చేరుస్తాను… అయితే నువ్ కనీసం రెండేళ్ల పాటు మా కంపనీ లో పని చేస్తానని బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది… ఒకవేళ నువ్ మధ్యలో మానేస్తే ట్రైనింగ్ అయిన ఖర్చు 10 లక్షలు కంపెనీకి కట్టాల్సి ఉంటది…”

సంజనకి కొద్దిగా భయం వేసింది… ఇక్కడ శాలరీ ఏంతో కూడా తెలియదు.. అలాంటిది పది లక్షల కు బాండ్ రాసివ్వడం సరైనదేనా అని ఆలోచిస్తుంది….
“ఇక నీ ప్యాకేజీ విషయానికి వస్తే ఏడాదికి 24 లక్షలు కంపనీ పే చేస్తుంది… వీటికి అదనంగా 30శాతం వరకు ఇతర అలవెన్సులు లభిస్తాయి…”
అంటూ ముఖేష్ ముగించాడు…
సంజన తన చెవులని తానే నమ్మలేకపోయింది…
“ఏమిటి … నెలకు రెండు లక్షలా…. నిజంగానేనా….” తనలో తాను అనుకుంది సంజన…
“సంజనా… ఎక్కడో ఆలోచిస్తున్నావు… నేను చెప్పిందంతా అర్థమైందా…. నీకు ఈ అగ్రిమెంట్ ఓకే నా…” అడిగాడు ముఖేష్…
“అదేం లేదు సర్ … సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయాను అంతే… నేను చేరుతాను సర్… మీరడిగనట్టు రెండేళ్లకు అగ్రిమెంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్దం… ఎప్పుడు జాయిన్ అవమంటారు” అంది సంజన సంతోశంగా….

“గుడ్… నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది… నువ్ వెళ్లి అనితను కలువు… మిగతా వివరాలన్నీ ఆమె చెప్తుంది…” అంటూ లేచాడు…
“చాలా చాలా థాంక్స్ సర్… ” అంటూ లేచింది సంజన…
“నాట్ టు మెన్షన్ ఇట్ సంజనా… చెప్పాకదా నీకు పెద్ద రికమండేషన్ ఉందని… దాన్ని నువ్ నిలబెట్టుకోవాలి…. ఆల్ ది బెస్ట్ ” అంటూ చెయ్యి చాచాడు…
సంజన మరో సారి ప్రియకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంది
“తప్పకుండా సర్” అంటూ

సంజన ఇచ్చిన చేయిని అందుకొని గట్టిగా వత్తుతూ షేక్ చేసి వెళ్ళిపోయాడు ముఖేష్…
అతని నల్లని చేతుల్లో కోమలమైన తెల్లని సంజన చేతులు ఎర్రగా మారాయి..
ముఖేష్ బయటకు వెళ్లిన వెంటనే అనిత లోపలికి వచ్చింది… “కంగ్రాట్స్ సంజనా… నువ్ నక్కను తొక్కి వచ్చావు… పద నీకు ఆఫీస్ అంతా చూపిస్తాను… ఆలోపు నీ అపోయింట్మెంట్ లెటర్ కూడా రెడీ అవుతుంది…” అంటూ తనతో తీసుకెళ్లింది….
ఆ రోజు సాయంత్రం…..

126145cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *