సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Posted on

బయట సోఫాలో వివేక్ డల్ గా కూర్చుని ఉన్నాడు… సంజనని చూసి చిన్నగా నవ్వి “ఆల్ ది బెస్ట్ సంజనా…. వచ్చేప్పుడు గుడ్ న్యూస్ తో రావాలి.” అన్నాడు…
“థాంక్యూ వివేక్… పిల్లలకి కాస్త తినిపించి స్కూలుకి పంపించు… అన్నీ టేబుల్ మీద ఉన్నాయి….. నేను ఇంటర్వ్యూ అవగానే ఫోన్ చేస్తాను… ఓకేనా… బై…” అంటూ వివేక్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి సంజన ఇంట్లోంచి బయలుదేరింది…
తొమ్మిదంతస్తుల పెద్ద బిల్డింగ్ ముందు నిలబడి అక్కడ రాసి ఉన్న

MAS అనే ఎర్రటి పెద్ద అక్షరాలని తదేకంగా చూసింది సంజన… బిల్డింగ్ మొత్తం అద్దాల తో నిండి ఉంది … ఉదయం పూట సూర్యకిరణాలు ఏటవాలుగా పడి రిఫ్లెక్ట్ అవుతుండడంతో మొత్తం బిల్డింగ్ తలతళ మెరుస్తోంది…

మనసులో దేవుణ్ణి తలచుకుంటూ గేట్ లోపలికి అడుగుపెట్టింది సంజన… అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి తాను ఇంటర్వ్యూకి వచ్చిన సంగతి చెప్పి అక్కడి రిజిస్టర్ లో తన పేరు, వచ్జిన పని లాంటివి రాసి లాబీలో సెక్యూరిటీ వ్యక్తి చూపించిన చోట కూర్చుంది…
కొద్దిగా నెర్వస్ గా ఉంది సంజనకి… తన లాప్టాప్ బ్యాగ్ ను గట్టిగా పట్టుకుని కూర్చుంది… చల్లగా ఏసీ వస్తున్నా నుదుటిమీద సన్నగా చెమట పోస్తుంది… మాటి మాటికీ కర్చీఫ్ తో నుదుటిమీద వత్తుకుంటుంది… నెర్వస్నెస్ పోవడానికని కళ్ళు మూసుకుని దైవాన్ని తలచుకుంటుంది…

“హెలో మిసెస్ సంజనా… ” అన్న తియ్యటి కంఠ స్వరం విని కళ్ళు తెరిచింది… ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది…
కాస్త పొట్టిగా ఉన్నా అందంగా ఉంది… సినిమా హీరోయిన్ అలియా భట్ ని తలపించేలా ఉంది ఆమె ఫిగర్…
“హెలో సంజనా… హౌ ఆర్ యు… ఐ యాం అనిత …”అంటూ చెయ్యి చాపడంతో సంజన చెయ్యి అందుకుని “హలో అనిత… ఐ యాం ఫైన్.. థాంక్స్.. అండ్.. నైస్ టు మీట్ యూ…” అంది…

“మీ టూ… రండి వెళ్దాం… ఇప్పటికే కాస్త ఆలస్యం అయింది… మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మన సీఈఓ ముఖేష్ గారు వెయిట్ చేస్తున్నారు….” అంటూ అనిత వెళ్తుంటే సంజన ఆమెని ఫాలో అయింది…
“ఇంటర్వ్యూ టైంలో మీకేం పంపించమంటారు సంజనా… కాఫీ, టీ, లేదా ఏదైనా కూల్ డ్రింక్ పంపనా…”

“అవేం వద్దు అనిత… మంచి నీళ్ళు చాలు … ” అంది సంజన
అనిత సంజనని 9 వ అంతస్థుకి తీసుకెళ్లింది… CEO అని రాసి ఉన్న డోర్ ని ఒక సారి చిన్నగా తట్టి, మెల్లిగా తలుపు తీసుకుని లోపలికి నడిచింది… చాలా విశాలమైన హాల్ లాంటి గది అది… అందంగా decorate చేసి ఉంది… ఎడమ వైపున మూడు నాలుగు బ్రౌన్ కలర్ ఖరీదైన సోఫాలు ఉన్నాయి… వాటి మధ్యన ఒక టీపాయ్ ఉంది… దాని మీద రకరకాల మ్యాగజైన్ లు, కంపనీ బ్రోచర్లు ఉన్నాయి… పక్కన ఒక కాఫీ స్టాండ్ ఉంది… ఒకే సారి పది మంది కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉందక్కడ… సిట్టింగ్ ఏరియా కావొచ్చు అనుకుంది సంజన…

కుడి పక్కన ఒక ఫ్రిడ్జ్, గోడకు ఒక పెద్ద టీవీ ఉంది… దాని ముందు రెండు రెక్లైనేర్ ఛైర్స్ వేసి ఉన్నాయి…
ఇక గది మధ్యలో ఖరీదైన వెడల్పాటి వుడెన్ టేబుల్ ఉంది… దాని ముందు ఒక నాలుగు కుర్చీలు ఉన్నాయి… టేబుల్ వెనకాల ఉన్న కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు… అతనే ముఖేష్ అయుంటాడు అనుకుంది సంజన… అనిత, సంజన లు టేబుల్ దగ్గరకు రాగానే… ” ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి” అన్నాడు…

అతను మెల్లగానే చెప్పినా అందులో అధికార స్వరం కొట్టొచ్చినట్టు కనిపించింది సంజనకి…
అనిత సంజనని ఎడమ పక్కన ఉన్న సిట్టింగ్ ఏరియా లోని సోఫాలో కూర్చోమని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఫ్రిజ్ నుండి తెచ్చి మూతతీసి ఒక గ్లాస్ తో పాటు సంజన ముందు ఉంచి నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది….

గది నిశ్శబ్దం గా ఉంది… ముఖేష్ సీరియస్ గా ఫైల్ వంక చూస్తున్నాడు… ఆ ఫైల్ లో పేపర్ తిప్పినప్పుడు వచ్చే శబ్దం తప్ప మరే చప్పుడూ వినిపించడం లేదు అక్కడ… సంజన అతని వైపు చూసింది… ముఖేష్ భారీ కాయుడు అనిపించింది… నల్లగా ఉన్నాడు… అతని కళ్ళకి ఉన్న బంగారు ఫ్రేమ్ లో ఉన్న అద్దాలు అతనికి మరింత హుందానిచ్చాయి అనిపిస్తుంది…

అతను సీరియస్ గా ఫైల్ చూసుకుంటుంటే సంజనకి ఏం చేయాలో తెలియక అనీజీగా అటూ ఇటూ చూస్తుంది… ఆమెకి కొంచెం టెన్షన్ గా ఉంది… “సంజూ… నువ్ తప్పక ఈ జాబ్ కొట్టేయాలే…” అని మనసులో గట్టిగా అనుకుంటుంది… అదెంత ముఖ్యమో, తనకెంత అవసరమో సంజనకి బాగా తెలుసు… ఇలాంటివి రావడం ఎంత కష్టమో కూడా తనకు తెలుసు … తనకి వచ్చింది బంగారం లాంటి అవకాశం అని కూడా ఆమెకు బాగా తెలుసు … “ఎంత మందికి డైరెక్ట్ గా సీఈఓ తో ఇంటర్వ్యూ దొరుకుతుంది… ఇలాంటి అవకాశం వదులుకోకూడదు సంజనా… నువ్ తప్పక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి…. కమాన్ సంజనా… యు శుడ్ గెట్ ఇట్… యూ మస్ట్ గెట్ ఇట్…” అని మనసులో ఒకటికి పదిసార్లు చెప్పుకుంది…

అంతలో ముఖేష్ కుర్చీలోంచి లేచిన చప్పుడైంది…
సంజన అటువైపు చూసింది… ముఖేష్ లేచి తనవైపే వస్తున్నాడు… ఆజాను బాహుడు అనుకుంది సంజన… అతని వయసు 50 దాటి ఉండవచ్చు… జుట్టు సగానికి పైగా రాలి పోయి ఉంది… ఉన్న జుట్టు నలుపు తెలుపు రంగుల్లో మిశ్రమంగా ఉంది… భారీ పొట్ట ముందుకు చొచ్చుకొచ్చినట్టుగా ఉంది… అతను వేసుకున్న సూట్ తాలూకు బటన్స్ ఏ క్షణమైనా తెగిపోవచ్చు అన్నట్లుగా ఉన్నాయి…

“హలో మిస్….??” అంటూ మధ్యలో ఆగిపోయాడు..
“మిసెస్ సంజనా సర్…”
“ఓహ్ యెస్ … మిస్సెస్ సంజనా… ఐ యాం సారి… మిమ్మల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది…” అంటూ ముఖేష్ సంజనకి ఎదురుగా కూర్చున్నాడు..
“ఇట్స్ ఆల్ రైట్ సర్… నో ప్రాబ్లెమ్…” అంది సంజన వినయంగా…
” గుడ్… మిసెస్ సంజనా.. మీరు ఇంతకు ముందు ఏం పని చేశారు…”
“ABC కంపెనీలో సిస్టం అనలిస్ట్ గా సిక్స్ ఇయర్స్ చేసాను సర్…”

126145cookie-checkసంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *