నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 37

Posted on

వెనకాల నుంచి ఎవరి చేయి తగిలింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఉన్నారు.

“Madam, you are under arrest……..” అని ఒక పోలీస్ ఆమె అంది.

నా చుట్టూ ముగ్గురు ఆడా పోలీస్ లు వచ్చి చుట్టుముట్టారు. నన్ను జీప్ ఎక్కమన్నారు.

నాకు భయం వేసింది. నన్ను పోలీస్ కార్ లో ఎక్కమని చెప్పారు. నేను ఇదంతా ప్రాంక్ అనుకోని వాళ్ళ ID చూపించమని అన్నాను.

వాళ్ళు ID చూపించారు. అది నిజమేనా ID లాగే ఉంది. వాళ్ళు నా పై ఉన్న అరెస్ట్ వారెంట్ కూడా చూపించారు. ఆ పేపర్ లో పోలీస్ వాళ్ళ స్టాంప్స్ అన్ని ఉన్నాయ్. నాకు FIR కూడా చూపించారు. కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి 3 రోజులయ్యిందని చెప్పారు. ఎం కంప్లైంట్ అని అడిగాను. వాళ్లకు చెప్పట్లేదు ఆ విషయం. కొంచెం గట్టిగ అడిగాను. వాళ్ళు ఇంకా గట్టిగ మాట్లాడారు. ఇక నాకు ఎం చేయాలో అర్ధం కాక సైలెంట్ గా ఉండిపోయాను.

నెమ్మదిగా నన్ను పోలీస్ కార్ ఎక్కించారు. పోలీస్ కార్ లో నాకు రెండు పక్కల పోలీస్ లు కూర్చున్నారు. ఇదంతా చూసి నాకు భయం వేసింది. ఎం చేయాలో అర్ధం కాలేదు. నా కాళ్ళు చేతులు వణకటం స్టార్ట్ అయ్యాయి. నా కళ్ళలో నుంచి నీళ్లు కూడా వచ్చాయి. ..

3 నెలల తర్వాత:
సాయంత్రం టైం 6 గంటలు ఎప్పుడు అవుతుందా అని ఒక బెంచ్ పై కూర్చొని ఆతృతగా వెయిట్ చేసాను. చుట్టూ పక్కల చూసాను, చెట్లు గాలికి కదులుతున్నాయి, చల్లటి గాల్లో వీస్తుంది. వాతావరం చాల బాగుంది. అందరు తమ హాస్టల్స్ కి, PGs కి, ఇళ్లకు వెళ్తున్నారు. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. నేను మాత్రం ఒంటరిగా ఇక్కడ కూర్చొని 6 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఈ విషయాలు క్యాబ్ లోనో లేదా బస్సు లోనో మాట్లాడలేను.

ఈ టైం 6 అవ్వగానే ఫోన్ లో అలారమ్ మోగింది. నా చేతులు వెంటనే కాంటాక్ట్స్ లో కి వెళ్లి ఒక నెంబర్ ని డైల్ చేశాయి.

“హలో ……. అమిత్”

పక్కన రెస్పాన్స్ వచ్చింది.

“అమిత్ ……. నాకిక్కడ కష్టంగా ఉంది ……. నా EMI ల సంగతేంటి ?? ……. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి……. ??”

అమిత్ ఏదో మేనేజ్ చేస్తున్నానని చెప్పాడు.

“కానీ అమిత్ ……. అసలు ఎం జరుగుతుంది ……. ఈ రోజే న్యూస్ లో చూసాను ……. నా అపార్ట్మెంట్ కి పోలీస్ లు వచ్చి చెక్ చేసి వెళ్ళారంట ……. “

అమిత్ ఎం పర్లేదని చెప్పాడు.

“అమిత్ …… ఎలా ఓకే అవుతుంది?? ……. నువ్వేమో జైలు లో ఉన్నావ్ ……. నేనిక్కడ ఎక్కడో ఉన్నాను ……. ఏదో ఒక రోజు …… నా ఐడెంటిటీ బయటపడుతుందేమో అని భయం భయం గా ఉంది”

అమిత్ నన్ను ధైర్యంగా ఉండమన్నాడు.

“అమిత్ …… నాకైతే ఇప్పుడు ఏడవాలని ఉంది ……. ఓకే ?? గౌరవంగా ఉండేదానిని ……. ఇలా ఇరుక్కుపోయాను …… ముందుకి వెళ్ళలేను వెనక్కి రాలేని పరిస్థితి ……. నాకైతే వెళ్లి లొంగిపోవాలని ఉంది …… “

నేను లొంగిపోతే నేను జీవితాంతం జైలు లో ఉండాలి అలాగే లొంగానని తెలిస్తే నన్ను ఎవరో ఒకరు చంపించేస్తారు అని చెప్పాడు.

నాకేం మాట్లాడాలో తెలియలేదు. నేను సైలెంట్ గా ఉండిపోయాను. అమిత్ నన్ను ఒక 6 నెలలు ధైర్యంగా ఉంటె అన్ని సమస్యలు తీరతాయని చెప్తుంటే ఈ లోగ “మేడం ……. మెడం ……. ” అని వెనకాల నుంచి వాయిస్.

నేను కంగారుగా వెనక్కి తిరిగి చూసాను. అతని చేతిలో ఏదో కాగితం ఉంది.

“మేడం ….. నా assignment ……. సారీ లేట్ అయ్యింది ……. “

నేను హమ్మయ్య అనుకోని ఆ పేపర్ తీసుకొని ఎం మాట్లాడకుండా క్యాబ్ ఎక్కటానికి వెళ్ళిపోయాను.

క్యాబ్ లో నా జీవితం గురించే ఆలోచించాను. అమిత్ తో మాట్లాడిన ప్రతి సరి ఇదే చెప్తున్నాడు. రెండు నెలల కింద 6 నెలలు అన్నాడు, ఈ రోజు అదే చెప్తున్నాడు. నా బ్యాంకు అకౌంట్స్ అన్ని సీజ్ అయ్యాయి. నా కోసం అన్ని చోట్ల లుక్ అవుట్ నోటీసు పంపించారు. నా కోసం పోలీస్ లు అన్ని చోట్ల గాలిస్తున్నారు. అందుకే మొన్న నా అపార్ట్మెంట్ ఏదో కనుక్కుని అక్కడికి కూడా వచ్చారని తెలిసింది.

నేనేమో ఇక్కడ వేరే జీవితాన్ని జీవిస్తున్నాను. అమిత్ మాట్లాడేది వింటుంటే నా డబ్బు, అపార్ట్మెంట్స్ పై నాకు నమ్మకం కూడా పోయింది. ఒకవేళ ఈ సమస్యలన్నీ సాల్వ్ అయినా సరే నేను ఇది వరకు లాగ జీవించగలన అనిపించింది.

అన్ని విషయాలు confidential కాబట్టి అమిత్ నాకు ఎం విషయాలు చెప్పటం లేదు. ఎప్పుడు ఫోన్ చేసి అడిగిన problems సాల్వ్ అవుతాయి అని చెప్పి మాట దాటేస్తున్నాడు. నేను కాకపోయిన అమిత్ అయినా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి. అమిత్ బయటకు రావాలంటే నేను కూడా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేసినట్లే. అమిత్ నన్ను బయట వేస్తాడు అని నమ్మకం నాకు లేకపోయినా ….. కనీసం అమిత్ తన కోసం తను ఏదో ఒకటి చేసుకొని బయట పడతాడు అనే నమ్మకం నాకుంది. ఆ ప్రాసెస్ లో నన్ను కూడా బయట వేస్తాడని ఒక చిన్న ఆశ.

అమిత్ నన్ను జైలు జీవితం నుంచి కాపాడాడు కానీ ప్రతి రోజు వస్తున్న న్యూస్ చూస్తుంటే మాత్రం అమిత్ ఒక్కడే ఈ సమస్యను హ్యాండిల్ చేయలేడు అనిపిస్తుంది, పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయ్. రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నట్లవుతుంది. భయం భయం గా ఉంటుంది. ఎం చేయాలో తెలియట్లేదు.

నెమ్మదిగా క్యాబ్ నా అపార్ట్మెంట్ ముందు ఆగింది కానీ నేను నా ఆలోచనలలో ఉండిపోయాను. నన్ను గట్టిగ రెండు సార్లు పిలిచాక నేను క్యాబ్ ఆగిందని చూసి నా ఆపార్ట్మెంట్ కి వెళ్లాను. ఈ కొత్త పేరు ఇంకా నాకు అలవాటవ్వలేదు. ఈ కాలేజీ లైఫ్ నాకు ముందున్న లైఫ్ కి విరుద్ధంగా ఉండేసరికి చాల కష్టంగా అనిపించింది adjust అవ్వటానికి కానీ పాతుతానికి నాకు ఉన్న దారి ఇదొక్కటే.

నేను డోర్ లాక్ చేసి న్యూస్ హెడ్ లైన్స్ కోసం టీవీ ఆన్ చేసాను. నేనకున్న న్యూస్ రాలేదు. వెంటనే టీవీ ఆఫ్ చేసి బట్టలు మార్చుకోవటానికి వెళ్లాను. ఈ లోగ నా రూమ్ మాటే వచ్చినట్లుంది. ఏవో శబ్ధాలయ్యాయి. కానీ ఉన్న పరిస్థితి వల్ల నేను నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చెక్ చేసాను. రూమ్ మాటే కనిపించింది. రిలీఫ్ గా ఫీల్ అయ్యి మళ్ళి డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చాను.

“అబ్బా! నిధి….. ఈ కాలేజీ లో వర్క్ చేయటం నా వల్ల కాదు. ఇంకొక 6 నేలల్లో resign చేసి వెళ్ళిపోతాను……. నీ సంగతేంటి ??”

నేనేదో చెప్పబోతుంటే తనే వెంటనే “నువ్వు కొత్త కదా …… నీకు బాగానే ఉంటుంది …… ఒక రెండేళ్లు పని చేస్తే కానీ తెలీదు ….. ఆ ఫీలింగ్ ఏంటో ……. “

నేను నవ్వి ఊరుకున్నాను.

“నాకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు ……. మంచి సంబంధం రాగానే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి ……. ఏదో ఒక మాములు ఉద్యోగం చేసుకుంటా ……. నీ సంగతేంటి ??” అని అడిగింది.

నేను ఇంకా ఏమి ఆలోచించలేదు అని చెప్పాను. ఏజ్ బారైతే సెటిల్ అవ్వటం కష్టమయిపోతుంది అని నాకు చెప్పింది. నేనేమి ఆన్సర్ ఇవ్వలేదు. జస్ట్ నవ్వి ఊరుకున్నాను.

“సరే ఈ రోజు ఎం తిందాం ?? బయటకు వెళ్దామా ??”

నేను సైలెంట్ గా తలూపాను.

“నిధి……. మరి ఇంత సైలెంట్ అంటే ఎలా చెప్పు …… రేపు పెళ్లయ్యాక కూడా ఇలాగే ఉంటావా ??” అని అడిగింది.

నిధి కి నా నిజ జీవితం ఏంటో తెలీదు. నేను సైలెంట్ అమ్మాయని అనుకుంటుంది. ఐన ఆ విషయాలు గుర్తుచేసుకోవటం నాకు ఇష్టమ్ లేదు.

” ….. ప్రస్తుతం నా ఫోకస్ అంత కెరీర్ పైనే ఉంది …… అందుకే ……. ”

“ఇట్స్ ఓకే నిధి……. కెరీర్ గురించి ఆలోచనలు అందరికి ఉంటాయి ……. కానీ ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి …….. ఇంకొక 6 నెలలైతే ఒకసారి నాకు పెళ్ళైపోతే ఎంజాయ్ చేయటం కుదరదు …….. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను …….. ఈ ఆరు నెలల్లో బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను …….. అన్ని చోట్లకి తిరగాలని అనుకుంటున్నాను …… ఏమంటావ్ ??”

నేను మళ్ళి సైలెంట్ గా తలూపాను.

“నిధి …….. మరీ ఇలా ఉంటె ఎలా చెప్పు …….. ఈ కాలం లో ఇలా ఉంటె కష్టం …….. ఈ రోజు అమ్మాయిలే అందరికన్నా ఫాస్ట్ గా ఉన్నారు ……… నేనొక్కదాన్నే వేరు అనుకుంటే నువ్వు నాకన్నా వేరే మైండ్ సెట్ లో ఉన్నావ్ …….. ఐన ఆ డ్రెస్ లు ఏంటి ?? కాలేజీ లో అంటే అర్ధం చేసుకుంటాను …….. ఇంట్లో కూడానా ?? నా ఉద్దేశంలో మనం ఫస్ట్ వెళ్ళాల్సింది షాపింగ్ కి …….. “

185069cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 37

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *