ఎందుకో నాకు రాహుల్ ని హగ్ చేసుకోవాలనిపించి గట్టిగ హగ్ చేసుకున్నాను.
తను కూడా నన్ను గట్టిగ హగ్ చేసుకొని “హే….. ఏమైంది ?? ఇట్స్ ఓకే….” అంటూ నా జుట్టు నిమిరాడు.
కౌగిలి నుంచి బయటకు వచ్చి “హే…. ఏమైంది ?? నీ మోహంలో సంతోషం లేదు…..”
“ఎం లేదు రాహుల్…… డీల్ ముందుకి వెళ్ళలేదు….. జస్ట్ మూడ్ ఆఫ్ లో ఉన్నాను అంతే…..”
“అంతేనా ?? నేనింకా ఇంకేదో అయిందేమో అనుకున్నాను……ఈ డీల్ కాకపోతే ఇంకోటి…..”
“hmmmmm…..”
నేను ఇప్పటి దాకా డబ్బు గురించే ఆలోచించాను కానీ ఆ తర్వాత నా జీవితం గురించి ఆలోచించలేదు. మొన్న హాస్పిటల్ లో ఎదురైనా సంఘటన నాకు పదే పదే గుర్తొస్తుంది. నేను ఇప్పుడే నా జీవితం గురించి ప్లాన్ చేసుకోవాలని అర్ధమైంది.
రాహుల్ నేను ఇద్దరం వెళ్లి సోఫాలో కూర్చున్నాం. తను ప్రయాణం చేసి అలసిపోయాడు. నాకు టీవీ చూసే మూడ్ లేదు. నేను సోఫా మీద నుంచి లేసి పడుకోవటానికి వెళ్తుండగా
రాహుల్ నాతో “నేహా….. ఎక్కడికి ??”
“నాకు మూడ్ లేదు రాహుల్….. “
“అయితే ??”
“వెళ్లి పడుకుంటాను”
“నేహా……మనం ఇన్ని రోజుల తర్వాత మళ్ళా కలుసుకున్నాం…….కావాలంటే ఇక్కడే పడుకో నా వొళ్ళో ఇద్దరం మాట్లాడుకుందాం……నీ ఫోన్ కి ఎన్ని మెసేజెస్ పెట్టిన రిప్లై లేదు……అసలు నీకు ఈ రేలషన్శిప్ మీద ఇంటరెస్ట్ ఉందా లేదా ??” అని అడిగాడు.
మొన్నటి దాకా నాకసలు ఈ రిలేషన్షిప్ గురించి ఏమి ఆలోచించలేదు కానీ హాస్పిటల్ లో జరిగిన విషయం దగ్గర నుంచి నేను జీవితం గురించి ఆలోచించటం స్టార్ట్ చేసాను. రాహుల్ తో సీరియస్ గానే ట్రై చేద్దాం అని డిసైడ్ అయ్యాను కానీ తనొచ్చాక ఊరి నుంచి మాట్లాడాలి అనుకున్నాను. ఇప్పుడు ఇదే సందర్భం అనుకున్నాను.
“రాహుల్…..”
“చెప్పు నేహా….”
“నీకు సీరియస్ గా ట్రై చేయాలనీ ఉందా ఇదంతా ??” అని అడిగాను.
“యా అదే నేను కూడా నిన్ను అడుగుతుంది……”
“రాహుల్….. నా జీవితం నీకు తెలుసు…… ప్రస్తుతం రెండు జీవితాలను జీవిస్తున్నాను ……”
“నేహా అదంతా వదిలేసేయి….. రెండు కాకపోతే మూడు జీవించు…… నిషా జీవితం నాకు అక్కర్లేదు….. నాకు కావాల్సింది నేహా…… నేహా నాతో ముందుకి సాగడానికి సీరియస్ ఆ లేదా కదా ??”
“సీరియస్…..”
“ఒకే….” అంటూ నా పెదాలకో ముద్దిచ్చాడు.
“నువ్వు కొంచెం లావుగా కనిపిస్తున్నావు…..” అన్నాడు.
“ఏంటి ??” అని అడిగాను.
“పోయిన సారికి ఈ సరికి కొంచెం లావుగా కనిపిస్తున్నావు నువ్….”
“నీ దగ్గర వెయింగ్ మెషిన్ ఉందా ??”
“పై ఫ్లోర్ లో ఉంది” అన్నాడు.
ఇద్దరం పైకెళ్ళి వెయింగ్ మెషిన్ లో నా వెయిట్ చూసుకున్నాను. ఒక ఒక కిలో ఎక్కువున్నాను పోయిన వారంతో పోలిస్తే.
“రాహుల్ ఒక kg మాత్రమే పెరిగాను…… నీకెందుకు అలా అనిపించింది ??” అని అడిగాను.
“ఆ ముందు వారం ఎంతున్నావ్ ??” అని అడిగాడు.
నేను ఆలోచించి “చూసుకోలేదు…..ఏమో” అన్నాను.
“ఏమో ముందు కూడా నువ్వు పెరిగుండొచ్చు….”
“ఆమ్మో…..నేను ఈ మధ్య జిం చేయట్లేదు రెగ్యులర్ గా …..”
“పైన థ్రెడ్ మిల్ ఉంది కావాలంటే……” అన్నాడు.
“ఇప్పుడా ??”
“చాల స్ట్రెస్డ్ గా ఉన్నావు చూడటానికి….. కొంచెం సేపు exercise చేస్తే రిలీఫ్ వస్తుంది…….”
నన్ను రాహుల్ తీసుకొని వెళ్లి థ్రెడ్ మిల్ చూపించాడు. నా బట్టలు చాల వరకు ఇక్కడే ఉండిపోయాయి. నేను బట్టలు మార్చుకొని ఫోన్ లో సాంగ్స్ పెట్టుకొని exercise స్టార్ట్ చేసాను.
అప్పుడే అమిత్ నుంచి కాల్ ఒచ్చింది. మధ్యలో ఆపి ఫోన్ ఎత్తుకున్నాను.
“నేహా డియర్….”
“అమిత్….”
“వాళ్ళు ఏదో అర్జెంటు పని మీద వెళ్లారు…… ఈ డీల్ ఇప్పుడైతే ఇక లేదు…… టైం పడుతుంది….”
“టైం అంటే ??”
“ఒక 2-3 వారాలు పట్టొచ్చు…..”
“అవునా ??”
“నేహా డియర్ నీ టైం బాడో ఏంటో తెలీదు….. కరెక్ట్ గా మంచి డీల్ నీకు సెట్ చేశాను అనుకున్నాను….. ఇలా జరిగింది…. మొదటి నుంచి ఈ డీల్ విషయంలో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది…….ఎప్పుడు ఇలా జరగలేదు….”