కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 5

Posted on

ఓ అరగంట తిరగగా ఉరి చివర కనిపించింది. గుడికి పక్కనే పూజారి కి ఇల్లు కుడా కట్టి ఇచ్చారు. ఇంటి బెల్లు కొట్టగానే. ఉరి పూజారి కంటే ఓ 7 ఏళ్ళు పెద్ద వయసున్న వ్యక్తి బయటకు వచ్చాడు. నన్ను నేను పరిచయం చేసుకొని , ఊరిలో ఉన్న పూజారి పేరు చెప్పగానే లోపలి రమ్మని చెప్పాడు.
“కిర్తనా కొన్ని మంచి నీళ్ళు తీసుకురామ్మా ” అంటూ కేకేసాడు. నిళ్ళు తెచ్చిన అమ్మాయి నన్ను చూసి అన్నా నువ్వా అంటూ నవ్వుతు నిళ్ళా గ్లాసు నా చేతికిచ్చింది.

“ఏంటమ్మా , ఇతను నీకు ముందే తెలుసా ” అన్నాడు పూజారి
=========================================
“అవును నాన్నా మొన్న మీకు చెప్పాను కదా, ముగ్గురు కుర్రాళ్ళు బైక్ మీద నా వెంట పడ్డారు అప్పుడు ఈ అన్నే వచ్చి వాళ్ళను అరిచే కొద్ది వెళ్లి పోయారు.”
“చాలా మంచి పని చేసావు నాయనా , వాళ్ళ బయానికి బయపడి అమ్మాయిని కాలేజి కుడా పంపకుడదనుకుంటుండా “
“ఎక్కడుంటారో తెలుసా , రొజూ ఏడిపిస్తారా “
“ఈ విధి చివర అక్కడో గ్యరేజి ఉంది ఎప్పుడూ అక్కడే పడి ఉంటారు. , కాలేజికి వచ్చేటప్పుడు , పోయేటప్పుడు రొజూ ఇదే తంతు , రోడ్డు మీద ఎవరూ లేక పొతే ఇంకా ఎక్కువ చేస్తారు “
“మరి పొలిసు కొమ్ప్లింట్ ఇవ్వలేక పోయారా ?”
“అక్కడ మా మాట ఎవ్వరు వింటారు నాయనా , ఆ తరువాత విల్లు ఏమైనా చేస్తారేమో నని భయము “
“అయినా ఎదో పనిమీద వచ్చిన నిన్ను మా కస్టాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నాము , ఇంతకీ నీకు ఏమి కావాలి నాయనా “. ఊరిలో పూజారి పేరు చెప్పి అయన పంపగా అమ్మవారు విగ్రహం చూడాలని వచ్చాను అంటూ నేను వచ్చిన విషయం దాచి పెడుతూ మిగిలిన విషయాలు అన్నీ చెప్పాను.
“వాడు నాకు తమ్ముడి వరుస అవుతాడు , ఇక్కడ గుడిమీద ఆదాయం ఏమి రాదు, రోజంతా నేను ఓ బట్టల షాప్ లో గుమస్తాగా చేస్తాను. పొద్దునా సాయంత్రం విధి ప్రకారం దేవుడికి దీపం వెలిగిస్తాము , అరా కోరా ఎప్పుడైనా అదివారమో చుట్టూ పక్కల పల్లెల్లో భక్తులు ఇక్కడి వచ్చి ఎట్లు కొట్టి పోతుంటారు అంత తప్ప ఇక్కడేమి వుండదు “
“నేను ఓ సారి గుడి చూడ వచ్చా ?”
“తప్ప కుండా చూడు , నేను ఇప్పుడు కొట్టుకు వెళ్ళాలి , కీర్తన కు అన్నీ తెలుసు తను చూపిస్తుంది , నేను ఓ మూడు గంటల్లో వస్తాను , ఈ లోపున తీరికగా నీకు ఓపిక ఉన్నంత సేపు ఉండు గుడిలో “
“మీకు అబ్యంతరం లేక పొతే నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు , వాళ్ళకు చెప్పి , రోడ్డు మీద పొకిరీ గాళ్ళకు బుద్ది చెప్పిస్తాను”
“ఆ తరువాత మాకు ఇబ్బంది రాదు కదా “
“మీ ప్రమేయం ఎమీ ఉండదు ఇక్కడ , అన్ని వాళ్ళే చూసుకుంటారు”
“అలా అయితే మంచిది , మా అమ్మాయి అదృష్టం నీవు ఆ రోజు టయానికి రావడం ఇపుడు ఇలా కలిసి రావడం ” అంటూ తను వెళ్లి పోయాడు
నేను వెంటనే ప్రతాప్ కు ఓ ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడ గ్యరేజి లేకుండా చేయి లేకుంటే ఆ గ్యారేజీలో కొందరు కర్రలు వచ్చి పోయే అమ్మాయిల్ని , అడాళ్ళను కామెంట్ చేస్తూ ఏడిపిస్తున్నారు. మా మామ కూతురు ఒకరికి అదీ పరిస్తితి వచ్చింది ఇప్పుడు తను కాలేజికి కుడా వేళ్ళ నంటుంది అంటూ ఇంకొద్దిగా ఎక్కిచ్చి చెప్పాను.
“నువ్వు ఎక్కడున్నావురా ఇప్పుడు ?”
“ఇక్కడే మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నాను “
“నేను హమిదును ఇంకో నలుగురు పోలిసోల్లు పంపిస్తున్నాను నువ్వు అక్కడే వుండు ఇంకో పది నిమిషాలలో వాళ్ళు వస్తారు అప్పుడు అందరు కలిసి వాళ్ళ తాట తీయండి ” అంటూ ఫోన్ పెట్టేసాడు.
“ఇక్కడా మీ మామా వాళ్ళు ఎవరన్నా ?”
“బందువులని చెపితే రేపు ఏమైనా సహాయం కావాలన్నా చేస్తారు అందుకే మీ నాన్నను మా మామ గారు అని చెప్పా , వాళ్ళు వచ్చి నప్పుడు నువ్వు కుడా అలాగే మాట్లాడు , అన్నా అన్నావనుకో నా కొంప మునుగుతుంది”. నా వైపు కొంటె నవ్వులు నవ్వుతూ , మరైతే ఏమని పిలవను వాళ్ళు వచ్చినప్పుడు
“నీకు ఎవ్వరు మామ కొడుకులు లేరా , వాళ్ళను ఎలా పిలుస్తావో అలా పిలు “
“నాకు ఎవ్వరూ మామలు లేరు , వున్నా వాళ్ళకు కొడుకులు లేరు ”
“సరే అయితే , బావా అని పిలువు , లేకుంటే మామా అని పిలువు నీకు ఏది వీలుగా ఉంటే అలా పిలువు “
“సరే బావా , కాఫీ తాగుతావా వాళ్ళు వచ్చేలోపల ” అంటూ చిలిపిగా నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది. చిన్న ఇల్లు పక్కనే గుది కావడం వాళ్ళ అనుకుంటా , ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఇంటికి వెనుక వైపు ఇంకో రెండు రూములు ఉన్నాయి.
“ఇంట్లో మీరు కాక ఇంక ఎవ్వరూ ఉండరా ? “
“నెనూ మా నాన్నే , మా అమ్మ నేను చిన్నగా ఉన్నాప్పుడే చనిపోయింది , మా నాన్న మల్లీ పెళ్ళి చేసుకోలేదు “
“మరయితే ఇంట్లో వంట ఎవరు చేస్తారు ?”
“అదేంటి బావా చెట్టంత అమ్మాయిని నేను ఉండగా వంట ఎవరూ చేస్తారు అంటున్నావు , నాకు వంట రాదనా నీ ఉద్దేశం “
“అది కాదు , నీవు చదువు కుంటున్నావుగా అందుకే అడిగా “
“పొద్దున్నే వంట చేసి కాలేజికి వెలతా , ఇంటికి వచ్చిన తరువాత రాత్రికి వంట నేనే చేస్తా ,నాతొ పాటు మా నాన్న షాప్ కు వెళతాడు , సాయత్రం నేను నాన్న కంటే ముందు వచ్చి గుడిలో దీపం పెట్టి మిగిలిన పని చేసుకుంటా “
“ఇంతకీ ఏమి చదువుతున్నావు ? ఆ తరువాత ఎం చేయాలను కుంటున్నావు “
“ఇంటర్ B.P.C, మంచి ర్యాంక్ వస్తే డాక్టర్ కావాలని నా కోరిక , కాని కోచింగ్ కు వెళ్ళడానికి నాన్న దగ్గర డబ్బులు లేవు అందుకు నేనే సొంతంగా చదువుకుంటున్నా “
“నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ది కోచింగ్ సెంటర్ ఉంది హైదరాబాదులో వెళతావా నేను చెప్తాను “
“ఏమో నాన్నను అడుగుతా , తను వేళ్ళ మంటే వెలతా , నువ్వు కుడా ఒక మాట చెప్పు ” మేము మాట్లాడు కొంటుఉండగా హమిదు జీపులో ఓ నలుగురు పోలిసోల్లతో వచ్చాడు. నేను వెళ్లి వాళ్ళను ఇంట్లోకి పిలుచుకొని వచ్చాను. “కీర్తనా అందరికి కొద్దిగా కాఫీ పెట్టు ” అంటూ తనను పురమాయించి హమిదుకు అన్నీ చెప్పి , రేపు వాళ్ళ వలన వీళ్ళకు ఏమి ఇబ్బంది ఉండ కూడదు అని చెప్పా.
“ఏంటి బయ్యా , మీ మామ అంటున్నావు , మల్లి ఇబ్బంది ఎందుకు వస్తుంది , కొడుకులకి కీళ్ళు తప్పించేయను, మీ మరదలకు , మీ మామకు నా నంబరు ఇవ్వు ఎప్పిడైనా ఒక్క మెసేజ్ పెట్టమను చాలు వచ్చి వాలి పోతాను ” అంటూ , కీర్తన ఇచ్చిన కాఫీ తాగుతూ వాళ్ళను పట్టుకొని , మొదట స్తేసన్లో వేస్తా , వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు భయపెట్టి పంపిస్తా వినక పోటో కొడుకులని పర్మనెంటు గా బొక్కలో తోస్తా .
“నువ్వేంభయపడకమ్మ , మీ బావ చెప్పాడంటే మా S.P సాబే ఉరుక్కొంటు వస్తాడు, నీకు ఏమి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి ” అంటూ తన నంబర్ ఇచ్చాడు.
“నేను రానా హమిదు ”
“రా భయ్యా , నువ్వు వస్తే ఇంకా మజా ఉంటాది. నువ్వయితే మాస్టర్ ప్లాన్ వేస్తావు. ” . నేను ఓ 30 నిమిషాలలో వస్తాను ఆ తరువాత గుడిలోకి వెళదాము అని కీర్తనకు చెప్పి వాళ్లతో కలిసి ఆ గ్యరేజి దగ్గరకు వెళ్ళాము

మేము వెళ్ళే కొద్ది అక్కడ ఓ రెండు బైకులు పార్క్ చేసి ఉన్నాయి వాటి మీద ఓ ఐదు మంది కుర్రాళ్ళు కూచొని ఉన్నారు. మెన్న కిర్తనని ఏడిపించిన వాళ్ళు కుడా ఉన్నారు అందులో. జీపు సరిగ్గా వాళ్ళ ముందర ఆపి హమిదు వాళ్ళ దగ్గరకు వెళ్లి
“అభే క్యా కర్ రహహై ఇదర్ బైట్ కే “
“ఎం ఇక్కడ కుచోకూడదా ఏందీ , మా భయ్యా షాప్ ఇది మేము ఇక్కడ పని చేస్తాము ” అంటూ ఓ జులపాల జుట్తోడు , బాగా చెప్పానా అన్నట్లు తన ఫ్రెండ్స్ వైపు చూసాడు. వాళ్ళు వాడి మాటలకు అదేదో పెద్ద జోకు వేసినట్లు వెకిలిగా నవ్వుతు వాడికి ఇంకా సపోర్టు ఇవ్వసాగారు.

వాళ్ళ వెకిలి నవ్వులు చూస్తూనే , ఆ జులపాలోని చెంప మీద లాగి పెట్టి కోట్టాడు హమిదు, ఆ దెబ్బకు వాడు వాడితో పాటు బైకు కింద పడ్డారు .
“ఎందుకు కొడతావ్ నేను ఎవరో తెలుసా , ఈ మునిసి పాలిటి మేయర్ కొడుకును ” అంటూ పైకి లెవబొయాడు. వాడు లేవక ముందే కాల్తో వాడి గడ్డం కింది తంతు
“పహేలే ఇస్కో అండర్ దాల్దో ” అంటూ పోలిసోల్లకు చెప్పాడు. ఇద్దరు పోలిసోల్లు వాడిని ఇంకా నాలుగు పికి జీపు లోపుల వేసాడు. ఆ దెబ్బలు చుసిన వాడి ఫ్రెండ్స్ లోనకు పరిగెత్తి , లోపల నుంచి ఓ మేకానిక్కును పిలుచుకొని వచ్చాడు. వాడు వస్తూనే
“ఏమైంది సార్ ”
“రేయ్ , ఈ స్తలం ఎవ్వరిది ? నీకు ఇక్కడ గ్యరేజి పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవ్వరు ఇచ్చారు ”
“ఏమో సాబ్ , ఓ కార్పొరేటర్ నన్ను ఇక్కడ పెట్టుకో మన్నాడు పెట్టు కొన్నా “
“రేపు పొద్దున్నే అ కార్పోరేటార్ ను ఈ స్తలానికి సంబందిచిన పేపర్లు తీసుకోని , కంట్రోల్ రూమ్ కి రమ్మని చెప్పు వచ్చి నన్ను కలవమను , లేటు చేసావో సాయంత్రం ఇక్కడ ఖాళి స్తలం ఉంటుంది . ఏమీ మిగల కుండా లేపెయిన్చిస్తా “
“వీడిని నేను స్టేసన్ కు తీసి కేలుతున్నా వీడి బాబును వచ్చి విడిపించుకొమ్మను. ” అంటూ
“భయ్యా నువ్వు బేఫికర్ ఘర్ జావో , మై సమాలుంగా, ఇస్కో “
“వాళ్లకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది హమీద్ జాగ్రత్త”
“భయ్యా మెన్న మనం పట్టుకొన్న అయుదాలకు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు లింకులు ఉన్నాయి , విల్లు ఇప్పుడు నోరు విప్పితే కొడుకులు జీవితం లో మాట్లాడ కుండా చేస్తా , నేను కుడా టైం కోసం చూస్తుండా , ఇదిగో నువ్వు ఈ అవకాసం ఇచ్చావు ఒక్కొక్కటే బయటకు లాగుతా ” అంటూ నన్ను పూజారి ఇంట్లో దింపి వాళ్ళు స్టేషన్ కు వెళ్లి పోయారు.
“ఏమైంది ” అంటూ ఆత్రుతగా బయటకు వచ్చింది కిర్తనా ఇంటి ముందర జీపు చూసి
“వాళ్ళల్లో ఒక్కన్ని స్టేసన్ కు తిసికేల్లారు , చూద్దాం రేపు ఏమి జరుగుతుందో “
“వాళ్ళు పగ పట్టి మల్లి నా మీదకు రారు కదా ?”
“పగ పట్టేంత సీన్ లేదు , హమీద్ ఎదో ప్లాన్ లో ఉన్నాడు , నువ్వు భయపడుకు ఏమి కాదు , పద నాకు గుడి చుపెడుదువు ” అంటూ తన ముందు దారి చూపుతుండగా నేను తన వెనుక నడవ సాగాను.

1475412cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *