కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 5

Posted on

“శివా , ఇంకా షామియానా తేలేదు, వంట వాళ్ళు రాలేదు , సరుకులు కుడా తేలేదు , మా ఆయన పక్కురుకు వెళ్ళాడు , నువ్వు వేలతావా పక్కరులో అన్నీ దొరుకుతాయి నీకు తోడుగా ఇదుగో ఈ అబ్బాయిని తీసుకెళ్ళు అని” వాళ్ళ బడువుల అబ్బాయిని నాకు తోడుగా పంపించింది.
వాళ్ళకు ఏమి కావాలో అన్ని ఓ లిస్టు రాసుకొని అవి ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఆ అబ్బాయితో పాటు టౌన్ కు వెళ్ళాము. కావలిసిన సరుకులన్నీ తీసుకోని వచ్చేటప్పుడు షామియానా వాళ్ళకు చెప్పి వాళ్ళను వా వెంటే తీసుకోని పల్లెకు వచ్చాము.

శామియానావల్లకు చెప్పి అన్ని సక్రమంగా అరేంజ్ చేసి , వంట వాళ్ళకు రాత్రికి , రేపు పొద్దున్న మరియు రేపు మద్యానం భోజనానికి ఏమి వండాలో వాటికి కావలిసిన సరుకులన్నీ అప్పచేప్పి అక్కడే ఉన్న కుర్చీలో కుచోన్నా. ఇంతలో

“ఓ డ్రైవర్ అబ్బి , వాళ్ళకు చెప్పి 4 గ్లాసులు కాఫీ పంపు ఇక్కడికి ” అంటూ ఎవరో చెప్పినట్లు వినబడితే వెనక్కు తిరిగి చూసా. అక్కడ రాజీ పరిచయం చేసిన రమణి వయ్యారంగా వాకిట్లో నిలబడి నాకు ఆర్డర్ వేసింది.

54.3

“అలాగే అంటూ , అక్కడ వంట వాళ్ళకు చెప్పి , కాఫీ తయారు చేయించు కొని ఓ ట్రే లో తీసుకోని వెళ్ళా”
“ఎవరే ఆయన్న , పొద్దునుంచి అన్ని పనులు ఒక్కడే చేస్తున్నాడు, ఆయన్నకే చెపుతున్నావు కాఫీ తెమ్మని ” అంటూ అక్కడ కూచొన్న తన ప్రెండ్స్ లో ఓ అమ్మాయి అంది.
“మా శాంతా వాళ్ళ డ్రైవర్ లే, పనులు చేసేదానికే ఇక్కడికి తీసుకొచ్చారు, ఎం పరవాలేదులే తీసుకోండి ” అంటూ దర్పంగా నా మీద పెత్తనం చెలాయించింది. నేనేమి మాట్లాడకుండా వాళ్ళకు కాఫీ గ్లాసులు అందిచ్చి వచ్చాను. అందిచ్చేతప్పుడు గమనించాను తను ఎక్కువుగా చదుకోలేదని తన భాష వలన తెలుస్తుంది. చూడడానికి అన్నీ బాగానే ఉన్నాయి , కొత్తగా పెళ్లి అయినట్లు ఉందిగా ఇప్పుడిప్పుడే వళ్ళు ఇడుగుతుంది. చూద్దాం ఎంత వరకు ఎగురుతుందొ అను కొంటూ షామియానా కిందకు వెళ్ళా. అప్పుడే శాంతా నా దగ్గరకు వచ్చింది , నా చేయి పట్టుకొని “నాకు ఇక్కడ బోరు గా ఉంది బయటకు తెసికేల్లు ఓ గంట తరువాత వద్దాము ” అంది గోముగా , అక్కడ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న రాగిణి మేము అలా దగ్గర ఉండడం చూసి
స్పీడుగా శాంతా దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని పక్కకు తీసికెళ్ళి “శాంతా ఏంటి డ్రైవర్ తో అంత చనువుగా మాట్లాడుతున్నావు , వాళ్ళను నెత్తి కి ఎక్కిచ్చు కోవద్దు , కాళ్ళ కిందనే ఉంచాలి ” అంటూ తనకు హిత బోద చేయసాగింది. వయసులో తన కంటే 4 అయిదు నెలలు పెద్దది అందుచేత శాంతా ఏమి అనకుండా తను చెప్పేది గత్యంతరం లేక విన సాగింది. వేరే పనేదో పడితే నేను అక్కడ నుండి వెళ్లి పోయాను.

రాజీ వాళ్ళ ఇల్లు రోడ్డుకు పక్కనే ఉంటుంది. రోడ్డు మీద వచ్చి పోయే సౌండ్స్ అన్ని ఇంట్లోకి వినబడతాయి. నేను వెళ్ళిన కొద్ది సేపటికి గట్టిగా అరుపులు వినబడ్డాయి రోడ్డు మీద. అందరు గుమ్మం ముందుకెళ్ళి తొంగి చూడ సాగారు. వాళ్లతో పాటు నేను అక్కడికి వచ్చే సరికి మాకు కొద్ది దూరంలో కుడి పైపు ఎద్దుల బండి దౌడు మీద వస్తుంది . అందులో 5 సంవత్సరాల చిన్న బాబు కూచొని వున్నాడు వాడు అటు ఇటు ఉగుతున్నాడు , బండి కేమో మాంచి పోగురుమిదున్న గిత్తలు పుల్ స్పిడుతో వస్తున్నాయి. దారి చాలా చిన్నది పిల్లడు ఎక్కడ కింద పడతాడో అని అందురు అరుస్తున్నారు , వాళ్ళ అమ్మా నాన్నా కొద్ది దూరంలో బండి వెనుక పరుగెడుతున్నారు కాని బండిని అందుకోలేక పోతున్నారు . మేము చూస్తుండగానే బండి మా గుమ్మానికి దగ్గర కాసాగింది. బండికి ఎదురు వెళ్ళడానికి లేదు పోనీ పక్కన నుంచి ఎక్కుదామంటే చాలా స్పీడుగా వస్తున్నాయి గుమ్మానికి పక్కనే మిద్ది మీదకు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ను ఆనుకొని ఇంటి చుట్టూ పిట్టగోడ ఉంది , పిట్టగోడ ఎక్కి రోడ్డు మీదకు సరిగ్గా బండిలోకి దూక గలిగితే సరే లేదంటే కింద రోడ్డు మీద పడతాము ఏమాత్రం జాగ్రత్త లేకున్నా , లేదా కొద్దిగా టైం తేడా వచ్చినా. అలోచించి టైం లేక గబగబా మెట్లు మీద నుంచి పిట్టగోడ మీదకు ఎక్కాను. నాకు అక్కడా సరిగ్గా నించొనే టైం కుడా లేకుండా బండి నా ముందు రోడ్డు మీద కనిపించిది. కాళ్ళు సరిగ్గా పిట్టగోడ మీద అనకుండానే రోడ్డు మీదకు దూకాను. రోడ్డు మీద జనాలు నేను బండి వెనుక రోడ్డు మీద పడ్డానని గట్టిగా అరవసాగారు. నాకు సరిగా బండి చివరి నాటు దొరికింది. దాన్ని పాట్టుకొని బండ్లోకి పాకి నగలు దగ్గరికి వెళ్ళే సరికి పిల్లాడు హై పిచ్ లో ఏడుస్తూ నగలు చివరకోచ్చేసాడు వాడి రెక్కలు పట్టుకొని నా విపుకి వుప్పేసుకొని నా మెడను గట్టిగా పట్టుకొని చెపుతూ , కింద వేలాడుతున్న పగ్గాలు పట్టుకొని, కాళ్ళను కాడిమాను కేసి తొక్కి పట్టి బిగాపట్టే కొద్ది కొద్ది దూరం వెళ్లి ఆగిపోయాయి గిత్తలు. వాటి వీపు మీద తడుతూ వాటిని సమదాయిస్తుంటే వెనుక పిల్లగాడు నా మెడ చుట్టూ చేతులేసి వెనుక నుంచి నన్ను పట్టేసుకొని ఏడుపు ఆపేస్తూ , “ఒవ్ ఒవ్ అంటూ” ఎద్దులను నిలబెట్టే సౌండ్స్ చేయసాగాడు. వాడి ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది. వాడిని ముందుకు వల్లో కి తీసుకొనే లోపున వాళ్ళ నాయన వెనుక నుంచి బండి లోకి ఎక్కేసాడు.
“అన్నా పిల్లగానికి ఏమి కాలేదు కదా” అంటూ వాన్ని నా చేతుల్లోంచీ తీసుకోని వాళ్ళ అమ్మకు అందిచ్చాడు. పగ్గాలు నా చేతులోంచి తీసుకోని నన్ను వెనుక కుచోమని బండిని కొద్దిగా ముందుకు పోనిచ్చి అక్కడున్న మలుపులో వెనుకకు తిప్పుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు.

మేము రాజి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే కొద్ది అక్కడ దాదాపు ఓ 20 మంది గుమి కుడారు. వాళ్ళ మాటల వాళ్ళ తెలిసింది ఏమంటే. బడిని ఇంటి ముందు నిల్లు తాగడానికి అపాడట పిల్లోని వాళ్ళమ్మ చెంబుతో నీళ్ళు ఇచ్చి , సంకలో పిల్లగాడు వాళ్ళ నాయన మీదకు ఎగబడుతుంటే , అయన చేతికిచ్చి లోనకు వెళ్ళింది. ఆయనేమో నిల్లు తాగి పిల్లోని నగల్లో కూచోబెట్టి చెంబు ఎయడానికి లోపలి వెళ్ళాడంట. ఈ లోపున వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎదో రిపేసి చేసుకుంటూ అక్కడున్న రేకు డబ్బాను గట్టిగా కొట్టారంట అసౌండ్ కు గిత్తలు బయపడి దౌడు తీసాయి. అయన బయటకు వచ్చి చూసే లోపు ఆయనకు అందకుండా పోయాయి.

“నీకేం కాలేదుగా అన్నా ” అంటూ పిల్లగాని వాళ్ళ నాయన వచ్చి నా చేతులు పట్టుకొన్నాడు. ఆ హడావుడిలో చూసుకోలేదు కానీ బండి లోనికి దుంకినప్పుడు అక్కడున్న రేకు చేతికి గీసుక పోయింది. ఆ గీత వెంట రక్తం చుక్కలు తేలాయి నేను గమనించలేదు. వాళ్ళ అమ్మదగ్గరున్న పిల్లగాడు నా చేయి వైపు చుపిస్తూ ” అమ్మా , మామకు నేత్తర వస్తుంది” అంటూ వాళ్ళ అమ్మకు చూపెట్టాడు.

“అయ్యో , నేత్తర కారుతుంది ఏదన్నా గుడ్డ పెట్టి తుడవండి ” నా చేయి వైపు చూపించింది. అప్పుడు చేయి వైపు చూసుకుంటు , జేబులోని హంకి తో అక్కడ నొక్కి పట్టి ఇంట్లోకి వెళ్లాను. పిల్లగాని వాళ్ళ నాన్న బండి తోలుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు , కాని పిల్లగాని వాళ్ళ అమ్మ మాతో పాటు ఇంట్లోకి వచ్చి.
“అన్నా మా ఇంట్లో టించరు వుంది పట్టిద్దాం రా ” అంటూ రాజీ వాళ్ళ అమ్మ వైపు చూసింది.
“వెళ్ళు శివా, వాళ్ళు మన వాళ్ళే , వుండు రాజిని కుడా పంపుతాను ” అంటూ రాజీ ని కేకేసింది , అంత వరక రాజీ ఇక్కడ లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళమ్మ కేకేసినప్పుడు ఇంట్లోకి అడుగు పెడుతుంది.
“ఏంటమ్మా ?”
” ఇదిగో శివాని మీ ఫ్రెండ్ యశోద వాళ్ళ ఇంటికి అంట తీసుకెళ్ళు చేతికి దెబ్బ తగిలింది ” అంటూ రాజికి నన్ను అప్పగిచ్చింది.
“నేచేతికి ఏమైంది అన్నా ? అయ్యో నేత్తర వస్తుందే, అక్కా బాబుని నేను ఎత్తుకుంటా ” అంటూ ఆ బాబుని తను తీసుకోని వాళ్ళ అమ్మతో కలిసి 5 గడపల అవతల ఉన్న యశోద వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
ఎల్లా రెడ్డి ఆ ఊర్లో ఓ భుసామి , ఓ కొడుకు ఆనంద రెడ్డి , కోడలు భారతి , కూతురు యశోద రాజి క్లాసు మేటు పెద్ద మెడ ఇల్లు , మేము వెళ్లేకొద్ది పెద్దాయన ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ కొడుకు అప్పుడే బండి విప్పి ఎద్దులను కట్టేసి ఇంట్లోకి వచ్చాడు.
“టయానికి నువ్వు బండి మిందకు దుంక కుంటే , నా మనమడిని ఇలా చూసి వుండే వాళ్ళం కాదు , నీకు చేతికి దెబ్బ తగిలిందంటనే ” అంటూ యశోదా , ఆ గూట్లో టించరు వుంటుంది ఇట్లా తే అంటూ కేకేసాడు.

కొద్ది సేపటికి యశోద టించరు సీసాతో వచ్చింది , తన చేతిలోంచి దూది , టించరు తీసుకోని గిసుకొన్న చోట దూదితో అద్ది కొద్ది సేపు అక్కడే పెట్టి ఉంచాను. ఈ లోపున భారతి కాఫీ చేసుకొని వచ్చింది, కాఫీ తాగి పెద్దాయనతో కొద్ది సేపు గడిపి ఇంటికి వచ్చేసాను. శాంతా నా కోసం ఎదురుచూస్తుంది.
“ఎక్కడికి వెళ్లావు , ఇక్కడ కుడా ఎదో హిరో గిరీ వెలగ బెట్టావట ” అంటూ నా మీద రుస రుస లాడింది.
“ఏమి లేదులే , ఎదో పిల్లోడు బండ్లోంచీ పడుతుంటే పట్టుకొన్నా ” అంటూ తన నుంచి తప్పిచ్చుకోవడానికి పక్క రూము లోకి వెళ్ళాను నా కర్మ కొద్ది అక్కడే రమణి పంజాబీ డ్రెస్ విప్పి చీర మార్చు కొంటుంది. నన్ను చుసిన వెంటనే కయ్య మని అరుస్తూ , తిట్ట సాగింది. సారీ చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చేసాను.

147546cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *