కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 41

Posted on

తను ఇంటికి వెళ్లి నా luggage తీసుకొని వచ్చింది , ఎక్కడ వీళ్ళు కూడా రెడీ కాగానే పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు, రామి రెడ్డి ,తన భార్యా నేను ఆదరం ఒక కార్లో నేను డ్రైవ్ చేస్తూ ఉండగా సిటీ కి బయలు దేరాము. హై వే ఎక్క గానే మల్లికార్జున కు మరో మారు ఫోన్ చేసి , తన బెయిల్ గురించి అడిగి కొద్దిగా హెల్ప్ చెయ్యండి సర్ అని చెప్పా , నువ్వు రా శివా, నువ్వు సిటి లోకి అడుగు పెట్టగానే బెయిల్ పేపర్స్ రెడీ గా ఉంటాయి , మనకు తెలిసిన లాయర్ తో మాట్లాడుతున్నా, డీటెయిల్స్ అన్నీ స్టేషన్ నుంచి తెప్పించుకుంటా లే అక్కడ ఉన్న ఆఫీసర్ నా ఫ్రెండ్ లే , నేను తనతో ఆల్ రెడీ మాట్లాడ , ఎదో ఫార్మాలిటీస్ ఫినిష్ చేయాలి అంతే. నువ్వేం తొందర పడకు. అంటూ నా కు కొంత ఉరట కలిగించాడు.
కార్ లో ఉన్న వాళ్ళకు అదే చెప్పా ” మనం సిటీ లోకి వెళ్ళే సరికి బెయిల్ పేపర్స్ రెడీ గా ఉంటాయి ఎం వర్రీ కావాల్సిన అవసరం లేదు ”
“ఇంతకూ ఆ పేషెంట్ కు ఎం జరిగింది రా ” అని అడిగాను నా పక్క సీట్లో కుచోనా పెళ్లి కొడుకును.
“తనకు డెంగు ఫీవర్ రా మామ , కాని నేను అక్కడ నుంచి వచ్చే రోజున డిశ్చార్జ్ చేయమన్నా , ఆ రోజు ఈవినింగ్ ఓ ఇంజక్షన్ వేసి డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు , ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు. నేను ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళింది అనుకుంటున్నా”
“అంటే నువ్వు వచ్చిన తరువాత ఎదో జరిగింది , దాన్ని వాళ్ళ మీద వేసుకోకుండా నీ మీద వేస్తున్నారు, నీకు management కు ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి”
“నాకు ఎం గొడవలు ఉంటాయిరా , కాకా పొతే జీతం పెంచమని చెప్పా , లేదంటే నాకు వేరే ఆఫర్ వచ్చింది , దానికి వెళతా అని చెప్పా”
“ఈ విషయం ఎవరికీ చెప్పావు ? ”
“నా సీనియర్ కి చెప్పా ? ”
“ఆయనకి , మేనేజిమెంట్ కి ఏమైనా లింక్స్ ఉన్నాయా ?? ”
“ఆయనకి ఇందులో 20 నో లేదా ౩౦% షేర్ ఉంది ”
“షేర్ ఉంది అని తెలిసి వాడికి ఎందుకు చెప్పావు , వదిలేస్తా అని ? నాకు చూస్తుంటే వాడు ఏదైనా చేశా డెమో అనిపిస్తుంది. ”
“ఏమో , ఇప్పుడు ఆలోచిస్తే , నాకు అలానే అనిపిస్తుంది , వాడి హ్యాండ్ ఏమైనా ఉందేమో ఇందులో , అయినా దాని కోసం ఒక పేషెంట్ ను చంపడమా , నాకు నమ్మ బుద్ది కావడం లేదు.”
“ఎవరినీ నమ్మ దానికి లేదు రా ? ”

దారిలో కారు ఆపి , లంచ్ చేసి బయలు దేరాము , 5 గంటలకు శంషాబాదుకు చేరుకున్నాము, టౌన్ లో ట్రాఫిక్ ఉంటుంది స్టేషన్ కి వెళ్ళే సరికి 7 కావచ్చు అనుకొంటూ , పోలీస్ లకు , మల్లికార్జునుకు ఫోన్ చేశాము ఎంత వరకు వచ్చిందో బెయిల్ పేపర్స్ విషయం.

పోలీసులు డైరెక్ట్ గా స్టేషన్ కు రమ్మన్నారు వాళ్ళు , స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు అన్నారు. మల్లి కార్జున కూడా అదే చెప్పాడు , ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి స్టేషన్ లో మన లాయర్ అక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళగానే ఏవో కొన్ని సంతకాలు పెట్టించు కొని మిమ్మల్ని వదిలేస్తాడు , మనం రేపు కూచొని మాట్లాడదాము అని చెప్పాడు.

రాత్రికి వాడు స్టేషన్ లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను , దానికి అందరూ సంతోషం వెల బుచ్చారు.

జూ దాటుతూ ఉండగా , రోడ్డు మీద ఓ బైక్ కింద పడి దాని పక్కన ఓ మనిషి పడి పోయి ఉండడం కనిపించింది , ఆ వ్యక్తీ పక్కన ఒక అమ్మాయి ఆ వ్యక్తిని లేపడానికి ట్రై చేస్తుంది. కారును వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి , కార్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కిందకు దిగాను ,

నాతో పాటు రామి రెడ్డి , పెళ్లి కొడుకు ఇద్దరు దిగారు.
“ఏమైంది , ఎందుకు పడి పోయాడు ” అన్నాను ఆ అమ్మాయిని,
“ఓ లారీ డ్రైవర్స్ రాష్ గా డ్రైవర్ చేస్తూ , మా బైక్ ను సైడ్ నుంచి గుద్దాడు , లారీ బంపర్ బైక్ కి తగిలి మేము పడిపోయాము. , మా ఆయన కళ్ళు తెరవడం లేదు ” అంటూ ఏడుపు మొహం పెట్టింది.
“మీరు కొద్దిగా పక్కకు జరగండి ” అంటూ తనను పక్కకు వెల్ల మని చెప్పి , అతన్ని నా వడిలోకి తీసుకొని చెక్ చేసాను. ఎక్కడా ఎం దెబ్బలు లేవు , చేతి మీద , కాలి మీద కొద్దిగా దోక్కొని పోయింది , అందు లోంచి రక్తం చుక్కలు వస్తున్నాయి , అవి తప్పితే ఎక్కడ ఎం దెబ్బలు లేవు , తల మీద ఎమన్నా తగిలిందా అని హెడ్ మొత్తం చూసాను , ఎక్కడా ఏమీ కనబడ లేదు. భయం తో తెలివి తప్పాడేమో అనుకొంటూ , నా పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని, నీటిని తన మొహం మీద చిలకరించాను.

మెల్లగా కళ్ళు తెరుస్తూ , ఎక్కడున్నా ను అన్నాడు. “మీరు ఎక్కడ పడ్డారో అక్కడే ఉన్నారు , భయంతో మీకు తెలివి తప్పింది , మీ ఆవిడా భయపడుతూ ఉంది మీకు ఎం అయ్యిందో అని” అన్నాను నా మీద నుంచి లేపుతూ.

“థేంక్స్ సర్, ఆ లారీ నా కొడుకు పక్కన గుద్దాడు , ఏమైందో ఏమో కింద పడ్డం గుర్తుకు ఉంది ఆ తరువాత గుర్తు లేదు” అన్నాడు.

కార్ లోకి వెళ్లి అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని , తన చేతి మీద , కాలి మీద గీ క్కొన్న చోట టించర్ తో అద్ది , ప్లాస్టర్ వేసాను. పైకి లేచి కొద్దిగా కుంటుతూ , బండిని లేపడానికి ట్రై చేసాడు , కానీ తన చెయ్యి సహకరించ లేదు. అది చూసి మీరు ఉండండి అంటూ బండిని పైకి లేపి “మీరు ఎక్కడికి వెళ్తున్నారు “
“టౌన్ కు వెళుతున్నాము సర్, జూ చూడడానికి వచ్చాము రిటర్న్ లో ఈ ఆక్సిడెంట్ జరిగింది”
“సరే అయితే , మా ఫ్రెండ్ వస్తారు నీ బైక్ మీద మీరు కార్ లో కుచోండి ఇద్దరు ” అంటూ రామి రెడ్డిని బండి తీసుకోమని , పెళ్లి కొడుకు వెనక కుచోగా వాల్లు ముందు బయలు దేరారు.

ఆవిడ వెనుక కుచోగా, అతన్ని ముందు కుచో పెట్టుకున్నాను.

“థేంక్స్ సర్, thank యు very much , చాల హెల్ప్ చేసారు లేదంటే మా ఆవిడ చాల ఇబ్బంది పడేది.”
“టేక్ ఇట్ ఈజీ బ్రో , నేనేం అడ్వెంచరు చేయలేదు లే, చిన్న హెల్ప్ ” అన్నాను.

“నా పేరు సురేష్ రెడ్డి , తను మా ఆవిడా ప్రియాంక రెడ్డి ” అంటూ వాళ్ళను ఇద్దరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, నా పేరు చెప్పాను, పల్లె నుండి టౌన్ కు వస్తున్నాము ఓ చిన్న పని మీద అని చెప్పాను.

అక్కడ నుంచి మరో గంట పట్టింది మేము టౌన్ చేరుకోవడానికి, స్టేషన్ ముందర రామి రెడ్డి బైక్ ఆపుకొని ఉన్నాడు. అక్కడికి వెళ్లి
“మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా, లేక బైక్ నడప గలరా ఇప్పుడు ” అన్నాను తన వైపు చూస్తూ
తన చేతులు కాళ్లు కొద్దిగా ఆడించి ఎం నొప్పి లేదు అని confirm చేసుకొని “నేను నడుప గలను లెండి సర్ , థేంక్స్ ” అంటూ వాళ్ళు ఇద్దరు కార్ దిగి బైక్ మీద వెల్ల గానే మేము స్టేషన్ లోకి వెళ్ళాము.
మల్లి కార్జున పంపిన లాయర్ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు , మేము రాగానే తనకు తాను పరిచయం చేసుకున్నాడు తన పేరు చంద్ర శేఖర్ రెడ్డి , high కోర్ట్ లో లాయర్ .

లాయర్ తో పాటు పెళ్లి కొడుకును పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ లు కూడా స్టేషన్ బయటికి వచ్చారు ( నేను ఫోన్ చేసి చెప్పాను , స్టేషన్ ముందుకు రాగానే )

ఆదరం కలిసి లోపలికి వేల్ల గానే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మేము స్టేషన్ లోంచి బయటికి రావడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. మల్లి కార్జున అక్కడ ఉన్నా వారికి అన్నీ చెప్పడం వలన మమ్మల్ని అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఇద్దరు inspectors.
“మీరు బ్రేక్ చేసిన కేసు గురించి మాకు తెలుసు సారూ , మీ లాంటి వాళ్ళు మా డిపార్టుమెంటు లో ఉండాల్సింది ” అన్నారు నన్ను చూసి. వాళ్ళకు థేంక్స్ చెప్పి ఇంటి దారి పట్టాము.

పెళ్లి కొడుకు ( గిరి ధర్ రెడ్డి , మేము గిరి అని పిలుస్తాము ) , మా ఇంటికి వేలదాం రా మామా , తను ఎలాగా అక్కడే adjust కావాలిగా అంటూ కారు ను వాళ్ళ ఇంటి వైపు తిప్ప మన్నాడు.

వాళ్ళ ఇల్లు చేరుకోగానే, అందరూ ఫ్రెష్ అయ్యి బయట నుంచి ఫుడ్ తెప్పించి తి ని రెస్ట్ తీసుకో సాగారు. “నేను రేపు మార్నింగ్ వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి హాస్పిటల్ కు వెళ్దాం , అక్కడ ఎం జరిగిందో నాకు కూడా తెలియాలి”

“ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎందుకు , ఇక్కడే పడుకో , పొద్దున్నే హాస్పిటల్ కి వెళ్ళక రేపు వేలుదువు గానీ ఇంటికి ” అన్నాడు గిరి.

153544cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 41

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *