కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – ముగింపు

Posted on

“వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసింది ఆ ఫైల్ కోసమే , ఆ ఫైల్ దొరికింది అని వాళ్ళ బాస్ కి ఫోన్ చేసారు, అది తీసుకొని రమ్మని చెప్పారు , కానీ ఈ లోపల వాళ్ళు ఫోన్ కట్ చేసారు. వీళ్ళు వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.” అన్నారు దివ్యా వాళ్ళ నాన్న.

“అక్కడ నుంచి ఇంకా ఫోన్ రాదు లే, మీరు చేప్పండ్రా, ఆ స్టోర్ మేనేజర్ ను చంపింది మీ బ్యాచేనా ?”

“మేము ఎవరినీ చంప లేదు సర్, ఇతని దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని రమ్మని , ఆ పేపర్స్ కోసం కావాలంటే వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పారు , అంతే గానీ వీళ్లని చంపమని మాకు ఎం చెప్పలేదు”
“వాళ్ళ ఫోన్ లో ఉన్న నంబర్స్ తీసుకొని , వాటి ఓనర్స్ ఎవరో కనుక్కోండి , ఈ ఫోన్ కాల్స్ ఎవిడెన్స్ గా తీసుకోండి” అంటూ ఆ ఫోన్ నెంబర్ ను నూర్ కు ఇచ్చాను.
ఈ లోపల బైట నుంచి ఏవో వెహికల్స్ వచ్చినట్లు సౌండ్ వచ్చింది, అది విని
“మేడం , మనం కాల్ చేసిన వెహికల్స్ వచ్చినట్లు ఉన్నాయి” అంటూ ఉండగా ఓ 10 మంది constables గన్స్ తో లోపలి కి వచ్చారు.

“వీళ్ళను స్టేషన్ కి తీసుకొని వెళ్ళండి” అంటూ అందరిని వ్యాన్ ఎక్కించారు.
“నేను వీళ్ళను ఇంటి దగ్గర దింపి వస్తాను , నువ్వు వాళ్లతో స్టేషన్ కు వెళ్ళు హామీదు” అంటూ దివ్యా ని , జాకీని , దివ్యా నాన్నని ఓ జీప్ ఎక్కించి డ్రైవర్ తో దివ్యా ఇంటి వైపు తిప్ప మన్నది. నేను వెనుక నా బైక్ లో వాళ్లను ఫాలో కా సాగాను.

ఓ 20 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు చేరుకున్నాము.
“ఇంక మీకు వచ్చిన భయం ఎం లేదు, మీరు పని చేస్తున్న కంపెనీ డైరెక్టర్స్ అందరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ వల్ల నీకు ఈ ఇబ్బంది రాదు” అంది నూర్.
“అయితే నేను ఇంకో ఉద్యోగం ఎతుక్కోవాలి అన్న మాట” అంటూ నిట్టూర్చాడు దివ్యా నాన్న.
“మీరు జాబ్ గురించి ఎం వర్రీ కాగండి మా శివా మీకు అంత కంటే మంచి జాబ్ ఇప్పించ గలడు” అంటూ నా వైపు చూసి నవ్వింది.
“రేపు ఓ సారి కలవండి, లేదా నేనీ ఫోన్ చేసి మీకు చెప్తాను ” అన్నాను
“సరే సర్ , అలాగే మీకు రేపు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.”
“నేను మీ కంటే వయసులో చిన్నవాన్ని నన్ను సార్ అనడం ఏంటి, శివా అని పిలవండి చాలు”
“మీరు నాకు చాలా సాయం చేసారు. మీరే లేకపోతే నా కూతురు , నేను ఏమై పోయేవాళ్ళమో” అన్నాడు కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ .
“ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ ఈ హీరో ఉంటాడు లెండి” అంది నూర్ నా వైపు చూస్తూ.
“ఏంటి జాకీ , నిన్ను ఆఫీస్ లో డ్రాప్ చేయనా” అన్నాను జాకీ వైపు చూస్తూ.
“నేను దివ్యా కు తోడుగా ఈ రోజు ఇక్కడే ఉంటా సర్, రేపు నేను వచ్చేస్తా లే”

“సరే అయితే, మాకు స్టేషన్ లో కొద్దిగా పని ఉంది మీరు జాగ్రత్త అంటూ” మేము స్టేషన్ కు బయలు దేరాము వాళ్లను ఇంట్లో వదిలి.
అక్కడ మేము వెళ్ళే సరికి. దాదాపు 200 మంది దాకా స్టేషన్ బయట జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లలో సగం మంది న్యూస్ చానల్ నుంచి , మరియు టీవీ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు అక్కడ ఎం జరుగుతుందో అని చూడడానికి అక్కడ గుమిగూడారు.
మేము స్టేషన్ లోపలి కి వెళ్ళగానే. దాదాపు 10 మెడికల్ కంపెనీలకు చెందిన పెద్దమనుషులు , వాళ్ళ వెనుక లాయర్లు ఉన్నారు. నూర్ లోపలి వెళ్ళగానే
వాళ్ళలో ఒకరు లీడ్ తీసుకొని “ మేడం మేము మొత్తం రికార్డ్ చేసాము , మా వెంట మీడియా కూడా ఉంది. దానికి తోడూ మీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నకిలీ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీని సీజ్ చేశాము, మా సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కాపలాగా ఉన్నారు. మా లాయర్లు మీకు తోడుగా ఉంటారు , మీరు వెంటనే ఆ కంపెనీ డైరెక్టర్స్ అందరిని అరెస్టు చేయాలి అంటూ. కంప్లైంట్ కు సంబంధించిన అన్ని పేపర్స్ వాళ్ళ లాయర్స్ ఇవ్వగా FIR ఫైల్ చేసి. ఆ కంపెనీ వాళ్ళ మీద నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ చేసి. వాళ్లను అరెస్ట్ చేయడానికి ఫోర్సు తో పాటు తను కూడా వెళ్ళింది.

తను అటు వెళ్ళగానే ఇంత దాకా లీడ్ తీసుకొని మాట్లాడిన అతనే “మీ హెల్ప్ లేక పొతే మా కంపెనీలు చాలా లాస్ అయ్యే వి శివా , మేము మీకు చాలా రుణ పది ఉన్నాము , మీకు మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నిస్సంకోచంగా అడగండి” అన్నాడు.
“అందులో నేను చేసింది ఏమీ లేదు సర్, కానీ ఆ కంపెనీ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి నిజాయితీ ఆ కంపెనీ బండారం బయట పెట్టబడింది. ప్రస్తుతం ఆ వ్యక్తీ ఉద్యోగం , జీవితం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి కి అతని ని కుటుంబానికి హెల్ప్ చేయండి”
“మీరు ఆ వ్యక్తీ గురించి మరిచి పొండి శివా , మేము చూసుకుంటాము. అతను ఎక్కడ ఉన్నారో చెప్పండి , మా ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. ఇంక అతనికి జాబ్ అంటారా అతను ఇంతకూ ముందు సంపాదించే దానికి రెట్టింపు జీతంతో నా కంపెనీలో రేపటి నుంచి జాయిన్ కావచ్చు. ఇదిగో ఈ కార్డు అతనికి ఇచ్చి రేపు నన్ను మా ఆఫీస్ లో కలవమని చెప్పండి.” అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు.

ఆ కార్డ్ తీసుకొంటు, దివ్యా వాళ్ళ నాన్న నెంబర్ ఇచ్చాను.
నాకు కార్డ్ ఇచ్చిన అతనే బయట ఉన్న తన సెక్యూరిటీ అతనికి ఆ నెంబర్ ఇచ్చి నెంబర్ ఉన్న వ్యక్తీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వండి నేను వద్దు అని చెప్పేంత వరకు. అతని కి , అతని ఫ్యామిలీ అందరికి 24 గంటలు జాగ్రత్తగా చూసుకోండి అంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి పంపాడు.
“శివా , మీరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ కంపెనీ వెనుక చాల పెద్ద హాండ్స్ ఉన్నాయి మేము వీళ్ళను హ్యాండిల్ చేస్తాము , ఇక్కడ ఉంటే వాళ్ళు మీ మీద పగ పట్టే ఛాన్స్ ఉంది” అన్నారు.
“మా ఫ్రెండ్ ఒకరు ఈ డూప్లికేట్ మెడిసిన్స్ వల్ల ఓ కేసు లో చిక్కు కొన్నారు. అతనిని విడిపించడానికి నేను ఈ కేసులో వేలు పెట్టాల్సి వచ్చింది.”
“మీరు డీటైల్స్ ఇవ్వండి శివా , మేము చూసుకుంటాము ఆ కేసు కూడా , మా బెస్ట్ లాయర్స్ చూస్తారు” అంటూ కేసు డీటెయిల్స్ తీసుకున్నారు.
“ఈ రోజు ఈవినింగ్ కల్లా మీ ఫ్రెండ్ ఇంట్లో ఉంటారు, కేసు హియరింగ్ కి రాగానే మా లాయర్లు చూసుకుంటారు”
“థాంక్స్ సర్ , అయితే నేను బయలు దేరుతాను”
“మేము మీకు థేంక్స్ చెప్పాలి శివా , కొన్ని కోట్లు ఈ కంపెనీ వలన మాకు అందరికి నష్టాలు వస్తు ఉన్నాయి, మేము ఎం చేయలేని స్థితిలో ఉండగా మీరు సమయానికి మంచి లీడ్ ఇచ్చి మా కంపెనీలను ఈ నష్టాల నుంచి గట్టెక్కించారు”
అందరికి బాయ్ చెప్పి స్టేషన్ లోంచి బయటకు వచ్చాను. వాళ్ళు ఇచ్చిన కార్డ్ నాదగ్గరే ఉంది దాన్ని దివ్యా వాళ్ళ నాన్నకు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. అనుకుంటూ బైక్ కు దివ్యా ఇంటి వైపు తిప్పాను.

నేను వాళ్ళ ఇంటికి చేరుకునే సరికి బయట ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు.
“ఎవరిని కలవాలి” అంటూ నన్ను చెక్ చేసి పంపారు.
నా చేతిలోని విజిటింగ్ కార్డు రమేశ్ చేతిలో పెట్టి “మీరు రేపు ఈ కంపెనీ CEO ని కలవండి , మీకు జాబ్ గ్యారంటీ”
“థాంక్స్ శివా, కొద్ది సేపు ఉండండి దివ్యా వాళ్ళు పక్క సందులోకి వెళ్ళారు ఇంట్లోకి సరుకులు కావాలంటే” అన్నాడు.
మేము మాట్లాడుతూ ఉండగా దివ్యా , జాకీ వాళ్ళ వెనుక ఓ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు.

153843cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – ముగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *