“థేంక్స్ సర్, నేను సాయంత్రం కాల్ చేస్తా”
“సరే , ఉంటా శివాని”
దివ్యా ఇంటిని వాచ్ చేస్తున్న వాడు మాటి మాటికీ రోడ్డు వైపు చూడ సాగాడు. అంటే తనకు కావాల్సిన వాళ్ళు ఎవరో వస్తున్నారు అనుకొంటు బైక్ ను ఓ పక్కన ఆపి నేను వాడినే గమనించ సాగాను చాటు నుండి.
దాదాపు ఓ 30 నిమిషాలు ఓపికగా ఎదురు చూసే సరికి ఓ మారుతీ జిప్సీ వ్యాను వచ్చింది. దాంట్లో చి ఓ ఇద్దరు వ్యక్తులు దిగి అంత దాకా వారికోసం ఎదురు చూస్తున్న వ్యక్తీ దగ్గరకు వచ్చి ఎదో మాట్లాడారు. వాడు దివ్యా ఇంటి వైపు చూపిస్తూ ఎదో చెప్పాడు. ముగ్గురు చుట్టూ చూస్తూ ఆ ఇంటి వైపు వెళ్ళారు. వ్యాన్ లోని డ్రైవర్ వ్యాను ను ఇంటి గేటు కు దగ్గరగా తీసుకొని వెళ్ళారు.
మొబైల్ లో జాకీ కి ఒక మెసేజ్ పెట్టాను, “వాళ్ళు ఇంటి గేటు ముందు ఉన్నారు , ఎ క్షణం లో నైనా లోపలి కి రావచ్చు , కొద్దిగా రాద్దాంతం చేసి వాళ్ళకు లొంగిపో, ఫోన్ మాత్రం వాళ్ళకు దొరక కుండా దాచి పెట్టుకో” తన వైపు నుంచి ఓకే అని మెసేజ్ రాగానే బైక్ ను ఆన్ లో దివ్యా ఇంటి వైపు చూడ సాగాను.
ఒకడు వెళ్లి ఇంటి తలుపు తట్టగా, జాకీ వచ్చి తలుపు తీయడం నాకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. తను తలుపు తీయగానే గోడ చాటున ఉన్న మిగతా ఇద్దరు లోపలి వెళ్ళారు. వాళ్లతో గొడవ పాడడం నాకు కనిపిస్తూ ఉంది.
వాళ్ళు లోపలి కి వెళ్ళగానే , ఇంటి తలుపులు మూత పడ్డాయి. ఆ తరువాత ఓ 5 నిమిషాలకు దివ్యా , జాకీని కవర్ చేస్తూ లోపలి కి వెళ్ళిన ముగ్గురు వ్యాన్ దగ్గరకు వచ్చి వాళ్లను వ్యాన్ లోకి ఎక్కించారు.
వాళ్ళు వ్యాన్ లోకి ఎక్కగానే వాళ్లలో ఒకడు వెళ్లి ఇంటి తలుపులు వేసి వ్యాన్ ఎక్కాడు. వాడు ఎక్కగానే వ్యాన్ బయలు దేరింది.
ఆ వ్యాన్ కు కొద్ది దూరం లో వాళ్ళకు కనబడకుండా ఫాలో కా సాగాను. దాదాపు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ గోడౌన్ ముందు కారు ఆపి వాళ్లను లోపలి తీసుకొని వెళ్ళారు.
వాళ్ళు వ్యాన్ లోకి ఎక్కగానే వాళ్లలో ఒకడు వెళ్లి ఇంటి తలుపులు వేసి వ్యాన్ ఎక్కాడు. వాడు ఎక్కగానే వ్యాన్ బయలు దేరింది.
ఆ వ్యాన్ కు కొద్ది దూరం లో వాళ్ళకు కనబడకుండా ఫాలో కా సాగాను. దాదాపు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ గోడౌన్ ముందు కారు ఆపి వాళ్లను లోపలి తీసుకొని వెళ్ళారు.
– – – –
వాళ్ళు వెళ్ళిన కొద్ది సేపటికి గోడౌన్ దగ్గరి కి వెళ్లాను. గేటు నుంచి కాకుండా , గోడౌన్ వెనుకకి వెళ్లాను అక్కడ గాలి కోసం ఓ కిటికీ ఉంది. అక్కడున్న ఖాళీ డ్రం సపోర్ట్ గా పెట్టుకొని కిటికీ లోంచి గోడౌన్ లోపలి చూసాను.
నా అంచనా కరెక్ట్ అయ్యింది. దివ్యా వాళ్ళ నాన్న ను కూడా అక్కడే ఓ కుర్చీకి కట్టేశారు. తన పక్కనే ఉన్న ఇంకో రెండు కుర్చీలలో దివ్యా ను , జాకీని కట్టేశారు. దివ్యా వెంట ఉన్న బ్యాగ్ లోని సామాన్లు తన ముందు కుప్ప గా పోశారు, అందు లోంచి వాళ్ళ నాన్న తయారు చేసిన ఫైల్ తీసుకొని వాళ్ళ నాన్నను అడుగుతున్నారు ఇదేనా నువ్వు తయారు చేసిన ఫైల్ అని.
దివ్యా వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు అని కచ్చితంగా తెలియగానే అక్కడ నుంచి దిగి , ఆ గోడౌన్ కు కొద్దిగా దూరం వెళ్లి , నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఓ రెండు ఫోన్ కాల్స్ చేసాను.
“శివా మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము , మేము ఇప్పుడే దాడి చేస్తాము” అంటూ అటు వైపు నుంచి రిప్లై వచ్చింది.
ఇంకో ఫోన్ లో “మీ వెనుకే ఉన్నాము సర్” అంటు నా వెనుకగా బైక్ మీద హమీద్ , తన వెనుక S.I డ్రెస్ లో నూర్ ఉంది.
ఇదేం సినిమా కాదు అందులోనా నేను హీరో కాదు అందుకే ముందు జాగ్రత్త కోసం వాళ్లను నా వెనుకే రమ్మని చెప్పాను.
ముగ్గురం కలిసి ఇంతకు ముందు వాల్లు గోడౌన్ లోకి వెళ్ళిన దారి గుండా లోపలి కి వెళ్ళాము.
వెళుతూ వాళ్ళకు చెప్పాను “లోపలి కి ముగ్గురు వెళ్ళారు, దివ్యా , జాకీ , దివ్యా వాళ్ళ నాన్న లోపలే ఉన్నారు వాళ్లను ముగ్గరిని కుర్చీలకు కట్టేశారు.
నేను చూసేటప్పటికి వాళ్ళు ఎవరి ఫోన్ కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు.” అంటూ లోపలి వెళ్ళాము.
లోపలి వెళ్ళగానే నూర్ తన రివాల్వర్ తో గాళ్లో పేల్చి
“ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి , ఈ గోడౌన్ చుట్టూ పోలీస్ లో ఉన్నారు , కదిలితే కాల్చి పారేస్తాను” అంటూ వాళ్ళ వైపు ఎయిమ్ చేసింది.
ఈ లోపల వాళ్లలో ఒక్కడు తన చేతలోని రాడ్డును నూర్ వైపు విసరాడు. వాడి ఆక్షన్ గమనిస్తూనే రివాల్వర్ తో వాడి మోకాళ్ల మీద కాల్చింది.
“అమ్మా , రాక్షసి , చింపేసావు కదే” అంటూ కుప్ప కులాడు.
“ముందే చెప్పాను కదిలితే కాల్చేస్తా అని , టెస్ట్ చేస్తావ్ రా బాడ్కావ్” అంటూ తన పాయింటేడ్ షూస్ తో వాడి కాళ్ల మద్య శక్తి కొద్ది తన్నింది.
ఆ తన్నుకు వాడి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. సన్నగా మూలుగుతూ తన రెండు చేతులు కాళ్ల మద్య పెట్టుకొని దోర్ల సాగాడు.
“హమీద్ వాళ్ళ చేతులకు బేడీలు వెయ్యి” అంటూ హమీద్ వైపు చూసింది.
మిగిలిన ఇద్దరి చేతులు వెనక్కు పెట్టి ఆ ఇద్దరికీ సంకెళ్ళు వేసి ఇద్దరినీ జాయింట్ గా కట్టేశాడు.
“ఇప్పుడు చెప్పండి రా ఎవరు పంపారు మిమ్మల్ని, వెళ్ళాను కిడ్నాప్ చేసి , వీళ్ళ దగ్గర ఎం సంపాదించారు” అంటూ కట్టేసిన ఇద్దరి ముందు ఓ కుర్చీ వేసుకొని వాళ్లను అడగ సాగింది.
ఈ లోపున నేను హమీదు దివ్యా , వాళ్ళ నాన్నను మరియు జాకీ ని విడిపించాము.
“వాళ్లు ఎవరి ఫోన్ కోసమో ఎదురు చూస్తున్నారు , సార్ , ఆ కింద పడ్డ వాడి దగ్గర ఉంది ఫోన్” అంటూ జాకీ వాడి జేబులో ఉన్న ఫోన్ తీసి నా చేతికి ఇచ్చింది.
“నా దగ్గర ఉన్న ఫైల్ కూడా తీసుకున్నారు” అంటూ దివ్యా కంప్లైంట్ చేసింది.