కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – ముగింపు

Posted on

“హాస్టల్ లో చెత్త తిన్నాలే”
తన ఉన్న హాస్టల్ నుంచి ఓ 5 కిమీ దూరం రాగానే పక్క సందు లోంచి ఓ అమ్మాయి పరిగెత్తు కుంటు రోడ్డు మీద కు వచ్చింది.
తను అలా హఠాత్తుగా రావడం వాళ్ళ నేను బైక్ కు సడన్ బ్రేక్ అప్లై చేయాల్సి వచ్చింది.

తను వచ్చి నా ముందు చక్రం తగులుకొని రోడ్డు మీద పడిపోయింది. నేను సడన్ బ్రేక్ వేయడం వాళ్ళ వెనుక నుంచి కీర్తన నన్ను గుద్దుకోగా నేను కొద్దిగా ముందుకు జరిగి , కాళ్లు కిందకు పెట్టి కంట్రోల్ చేసుకుంటూ బైక్ ని ఆపేశాను.
కింద పడ్డ అమ్మాయి తను వచ్చిన సందు వైపు చూస్తూ గబా గబా తన బ్యాగ్ లోంచి కింద పడ్డ బట్టలు తీసుకొని తన బ్యాగ్ లో సర్దుకో సాగింది.
మేము ఇద్దరం కిందకు దిగగా కీర్తనా తన దగ్గరకు వెళ్లి “నీకు దెబ్బలు తగల లేదు కదా అంటు కింద పడ్డ తన బట్టలు ఏరి తన బ్యాగ్ లో సర్దడానికి హెల్ప్ చేయసాగింది”.
తన మాటి మాటికి తన వచ్చిన సందు వైపు చూస్తూ “నాకేం తగల లేదు” అంది.
“మా బావ నిన్ను ఇక్కడ కావాలంటే అక్కడ దింపు తాడు దా వచ్చి బైక్ ఎక్కు” అంటు నా పర్మిషన్ లేకుండా తను బైక్ మీద కూచుని తన వెనుక ఆ అమ్మాయిని కుచోమని చెప్పి తను కుచున్నాక నేను బైక్ ను ముందుకు దూకించాను.
వెనుక కూచున్న అమ్మాయి ఏడుస్తుంది అనడానికి సూచనగా అడ్డం లో తను మాటి మాటికి తన చున్నీ తో తన కళ్ళు తుడుచు కోవడం కనపడింది.
ఇంటికి వెళ్ళాలి అంటే ఇంకో 20 నిమిషాలు పడుతుంది ఈ అమ్మాయి సంగతి ఏంటో ఇక్కడే తేల్చి ఆ తరువాత ఇంటికి వెళదాం అనుకుంటూ ఓ హోటల్ ముందు బైక్ ని ఆపాను.
“రండి కొద్దిగా ఏదైనా తిని ఆ తరువాత వెళ్దాం” అంటూ లోపలి తీసుకెళ్లాను.

“ఇప్పుడు చెప్పు, బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు వచ్చిన సందు వైపు ఎందుకు అలా చూసావు , ఎవరన్నా నిన్ను ఇబ్బంది పెట్టారా ఏంటి ? ఇంతకూ నీ పేరు ఏంటి ” అంటూ అడిగింది కీర్తన
“అక్కా, నా పేరు దివ్యా , నన్ను కొందరు తరుము కుంటు వస్తున్నారు , అందుకే చూసుకోకుండా వచ్చి మీ బైక్ ను గుద్దు కొన్నాను”
“వాళ్ళు ఎందుకు నిన్ను తరుముతున్నారు?”
“వాళ్ళకు కావలసిన ఫైల్ ఒకటి నా దగ్గర ఉంది, అది మా నాన్న నాకు ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పాడు, అది వాళ్ళకు ఎలా తెలిసిందో పొద్దున్నే మా ఇంటికి వచ్చారు , నేను ఇంట్లోంచి తప్పించు కొని వచ్చాను.”
“మీ నాన్న ఇంట్లో లేడా వాళ్ళు వచ్చినప్పుడు”
“లే దక్కా, మా నాన్న రాత్రి షిఫ్ట్ కు వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు, కానీ పొద్దున్నే వాళ్ళు వచ్చారు. వాళ్ళను తప్పించు కొని తిరుగుతూ ఉన్నా పొద్దున నుంచి.”
“వాళ్ళు ఎవరో తెలీదు, మీ నాన్న ఇచ్చిన ఫైల్ లో ఎం ఉందో తెలీదు”
“అవ నక్కా , ఏమో ఉందో తెలీదు, కానీ ఆ ఫైల్ నా దగ్గర ఉంది.”
“అది ఏంటో తరువాత చూద్దాం ముందు టిఫిన్ తిను ఆ తరువాత ఆ ఫైల్ గురించి ఆలోచిస్తాము” అంటూ వచ్చిన టిఫిన్ తన ముందుకు జరిపింది కీర్తన.

ఎన్నో రోజుల నుంచి తిండి లేనట్లు తన ముందు ఉంచిన ప్లేట్ ఖాళీ చేసింది.
టిఫిన్ తరువాత వచ్చిన కాఫీ కప్ కూడా ఖాళీ చేసిన తరువాత అడిగాను “ఇంతకూ మీ నాన్న ఎక్కడ పని చేస్తాడు”
“మా నాన్న అర్చనా మెడికల్స్ ఫ్యాక్టరీ లో పనిచేస్తాడు”
“ఇంతకూ ఎం పని చేస్తా డో తెలుసా”
“పూర్తిగా తెలీదు , కానీ మెడిసన్స్ తయారు చేసే ప్లాంట్ డిపార్ట్‌మెంట్ లో అని చెప్పాడు ఓ సారి”
“ఓహొ అలాగా అయితే, మీ నాన్న ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు ఎక్కడ ఉన్నాడో , ఇంకా ఎందుకు ఇంటికి రాలేదో కనుక్కుందాము” అంటూ నా ఫోన్ బయటికి తీశాను.
తను చెప్పిన నెంబర్ కి కాల్ చేశాను. కానీ ఆ నెంబర్ ఆఫ్ చేసింది అని రిప్లై వచ్చింది.
“మీ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది”
“నన్ను తరుముతూ వచ్చిన వాళ్ళు ఏమైనా చేసారేమో, మా నాన్నను” అంటూ ఏడవ సాగింది.
“మీ నాన్నకు ఎం అయ్యి ఉండదు , ఏడవకు , మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పు , అక్కడ వదులు పెడతాము” అంది కీర్తన
“ఈ ఊళ్లో ఎవరు లే రక్కా, మేము ఇక్కడికి వచ్చి 2 నెలలే అయ్యింది”
“సరే అయితే మాతో పాటు ఇంటికి రా అక్కడ ఎం చేయాలో డిసైడ్ చేద్దాం” అంటూ కీర్తన చెప్పగా , ముగ్గురం ఇంటికి దారి పట్టాము.

ఇంటికి చేరుకోగానే , కీర్తన హెల్ప్ చేస్తూ ఉండగా దివ్యా ఫ్రెష్ అయ్యి వచ్చింది.
“ఇప్పుడు చెప్పు దివ్యా , మీ నాన్న పేరు ఏంటి? నీకు ఎం ఇచ్చాడు దాచి పెట్టమని”
“మా నాన్న పేరు రమేశ్, నాకు ఇదిగో ఈ ఫైల్ ఇచ్చాడు దాచి పెట్టమని” అంటూ తన తెచ్చిన బ్యాగ్ లోంచి ఒక ఫోల్డర్ తీసి నా చేతికి ఇచ్చింది.
తన చేతి లోంచి ఆ ఫోల్డర్ తీసుకొని ఓపెన్ చేసి చూపాను.
వైట్ పేపర్ మీద డేట్స్ వేసి ఓ డైరీ లాగా మైం టైన్ చేశాడు.
తను ఆ కంపెనీ లో చేరిన 15 రోజులకు స్టార్ట్ చేసినట్లు ఉన్నాడు , మధ్యలో కొన్ని రోజుల పేపర్స్ మిస్ అయినట్లు ఉన్నాయి.
ముఖ్యమైన సంఘటనలు జరిగిన రోజుల్లో మాత్రమే డైరీ రాశాడు.
చివరి పేజి 2 రోజుల కిందట రాసింది.
“దివ్యా, వాళ్ళు దీని కోసమే నీ వెంట పడుతూ ఉన్నారు, మీ నాన్న ను రక్షించే ది ఈ ఫైల్ మాత్రమే, నేను చెప్పినట్లు చెయ్యి మిగతా ది నేను చూసుకుంటా” అంటు ఆ ఫైల్ లోని పేజీలను ఫోన్ నిక్షిప్తం చేసాను ఫోటోల రూపం లో.
“రాత్రికి నువ్వు ఇక్కడే ఉండు మా దగ్గర , రేపు పొద్దునే నిన్ను మీ ఇంటికి దగ్గర లో దిగ బెడతాను అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు , నేను నీ వెనుకే ఉంటాను నీకు ఎటువంటి ఇబ్బంది రానీయకుండా నేను చూసుకుంటా” సరేనా
“సరే అంకుల్, మా నాన్నకు ఎం కాదు గా”
“ఈ ఫైల్ మన చేతిలో ఉండగా వాళ్ళు మీ నాన్నను ఎం చేయరు”
“థేంక్స్ అంకుల్”
“కీర్తన నీ తోనే ఉంటుంది. నాకు కొన్ని పనులు ఉన్నాయి బయట, మీకు లంచ్ కు ఏమైనా ఆర్డర్ చేసుకోండి” అంటూ కీర్తనకు కొన్ని డబ్బులు ఇచ్చి నేను సాయంత్రం వస్తాను అని చెప్పి ఇంట్లోంచి బయట పడ్డాను.
బైక్ ను డైరెక్ట్ గా ఆఫీస్ వైపు తిప్పాను. ట్రాఫిక్ ఎక్కువగా లే నందు వలన 15 నిమిషాల్లో ఆఫీస్ చేరుకున్నాను.
ఫోన్ ను ఆఫీస్ లాప్ టాప్ కి కనెక్ట్ చేసి నేను ఫొటోలు తీసిన ఆ పేపర్స్ ను ఒక పిడిఎఫ్ ఫైల్ లాగా చేసి. వాటిని తేదీల వారీగా చదవ సాగాను.
దాదాపు 30 నిమిషాలు పట్టింది ఆ ఫైల్ లోని పేపర్స్ అన్నీ చదివే సరికి.
క్లుప్తంగా అర్థం అయ్యింది ఏటంటే, కవిత మొగుణ్ణి కేసులొంచి ఎలా బయటకు లాగాలి అని బుర్ర బద్దలు కొట్టు కొంటున్న నాకు మంచి క్లూ దొరికింది.
ఈ ల్యాబ్ మీద ఇప్పుడు దాడి చేస్తే వెంటనే ఆధారాలు ఏమైనా దొరుకుతాయి లేదంటే వాళ్ళు తప్పించు కొనే ఛాన్స్ ఉంది.

153843cookie-checkకలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – ముగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *