ద్రోహం (నయ వంచన) and త్యాగం

Posted on

” నా జీవితంలో అత్యంత విషాదకరమైన, కఠినమైన సంఘటన అది. నా భర్త రెండో పెళ్ళి చేసుకుంటుంటే చూస్తున్న నా గుండె పగిలి ముక్కలైన సందర్బం అది. నాకు మాత్రమే చెందాల్సిన నా విలువైన వస్తువును నానుంచి ఎవరో దొంగలిస్తున్నట్లు, నేను నా అతి ముఖ్యమైన భాగాన్ని పొగొట్టుకున్న బాధాకరమైన ఘటన. కాని ఆ పని నేను చేయాల్సి వచ్చింది నా భర్త కోసం, ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అది నేనివ్వలేక పోయాను”, మా నాన్న చనిపోయిన నెల తరువాత ఓ సందర్బంలో నేను “ఎందుకు నువ్వు నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని పట్టుబట్టావు” అన్న ప్రశ్నకు జవాబిస్తూ అమ్మ పై మాటలంది.

నే వెళ్తున్న టాక్సీ అకశ్మాత్తుగా ఆగడంతో నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను.

నేను: ఎందుకు బండి ఆపావు తమ్ముడూ?

టాక్సీ డ్రైవర్: మనము స్టార్ ల్యాబ్ ఆల్రెడీ చేరుకున్నామన్నా.

అతనికి టాక్సీ కిరాయి చెల్లించి టాక్సీ లోనుంచి దిగాను స్టార్ ల్యాబ్ ముందు.

నేరుగా స్టార్ ల్యాబ్ మూడో అంతస్తుకు వెళ్ళాను.

ఇక్కడ నేను నా చిన్ననాటి ఆప్తమిత్రురాలైన డాక్టర్ రజియా సుల్తానాను కలుసుకోవడానికొచ్చాను. మేమిద్దరం ఒకటో తరగతినుంచే మంచి స్నేహితులం.

తనతో చెప్పి నా ఈ బరువును దించుకోవాలి, ప్రస్తుతం స్నేహితులే మిగిలారు నా బాధలు పంచుకోవడానికి. నాకు బందువులంటూ ఎవరూ మిగలలేదు, ఇందాక చూసిన సంఘటనతో.

రజియా సుల్తానా పేషంట్లను చూసే సమయం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు తను ఖాళీగానే ఉండాలి.

కాని నన్ను ఈ సమయంలో చూసి నిజంగానే అశ్చర్యపోవచ్చు చెప్పాపెట్టక వచ్చినందుకు…నా ఈ అవతారం చూసి తను కంగారుపడొచ్చు ఏమయ్యిందోనని.

బాధను పంచుకోవడం:

మూడో అంతస్తులో రిసెప్షనిస్టుని చూసి ” హాయ్ రహీం, ఎలా ఉన్నావు? రజియా ఉందా, తను ఇప్పుడు ఖాళీయేనా?” అన్నా

రహీం: నేను చాలా బావున్నాను అర్జున్ అన్నా. మేడం లోపలున్నారు. తన ఆఖరి పేషంట్ ఇప్పుడే కొంతసేపటీ క్రితమే వెళ్ళిపోయింది. మీరు బావున్నారు కదా? ఏదో సమస్యలో ఉన్నట్లున్నారు?”

నేను: థాంక్ యు, నేను బావున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది. అదేమీ మరీ పెద్ద విషయం కాదు.

నేను వరండాలోనుంచి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ రజియా సుల్తానా, గైనకాలజిస్ట్ అని రాసున్న తలుపు తట్టాను.

లోపలికి వెళ్ళగానే రజియాను పలకరించాను….

నేను: హేయ్ రజి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు ఇవాళ?

రజియా: నేను బావున్నాను, కాని నువ్వే ఏదో ట్రైను కింద పడ్డ వాడిలా ఉన్నావు. రా, కూర్చో, మంచి నీళ్ళు తాగు.

కూర్చుని, నీళ్ళు తాగుతూ

నేను: ఇవేమంత పెద్ద సమస్య కావు, కొద్దిగా పైపైన చర్మం ఒరసుకు పోయిన గాయాలు మాత్రమే.

రజియా: పైపైని ఒరసుకుపోయిన గాయాలైతే మరి నీ తలకు, చేతులకు అంత పెద్ద కట్లేమిటి? అసలు ఏం జరిగింది? ఎలా తగిలాయి ఈ దెబ్బలు?

నేను: ఏం లేదు. ఓ తెలివితక్కువ కుర్రాడు హెడ్ ఫోన్ తగిలించుకుని తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు పక్కని ఫుట్ పాత్ పై నడుస్తున్నాడు. నేను అప్పుడే నా కార్లో ఎక్కబోతున్నా. అదేసమయంలో ఓ ట్రక్కు రోడ్డు వదిలేసి ఆ కుర్రాడు వెళుతూన్న దిశలోనే ఫుట్ పాత్ వైపు దూసుకొస్తోంది. నేను గట్టిగా అరిచి చెప్పాను చూసుకోమని, ఆ ట్రక్కు డ్రైవర్ కూడా గట్టిగా హారన్ కొడుతున్నాడు, కాని ఇవేవీ ఆ కుర్రోడి చెవిలో పడలేదు. ఇక చేసేదేమీ లేక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడ్ని ఆ ట్రక్కు ముందునుంచి లాగేసాను, కాని ఆ విసురుకు నేను తప్పించుకోలేక కిందపడిపోయా. నా తలకు తగిలిన దెబ్బనుంచి రక్తం కారుతోంది, చేతులు దోక్కు పోయాయి. జనాలు మా చుట్టూ గుమికూడారు. ఆ కుర్రాడ్ని, ఆ డ్రైవర్ని తిడదామంటే, ఆ కుర్రాడేమో నాకు రెండడుగుల దూరంలో పడున్నాడు, ఆ డ్రైవర్ పరిస్థితి కూడా నాకంటే మోసంగా ఉంది. వాళ్ళకు రక్తం ఎక్కువగా కారుతోంది. వాళ్ళిద్దర్నీ నా కార్లో పడుకోబెట్టమని అక్కడ ఉన్నవాళ్ళని రిక్వెస్ట్ చేసా, వీలైంత త్వరగా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దామని. అక్కడే ఉన్న ఓ కాలేజి కుర్రోడు మీకూ దెబ్బలు తగిలాయి కదా, మీరు కారు డ్రైవ్ చేయ గలరా అన్నాడు. నాకంత ఎక్కువగా దెబ్బలు తగలలేదు, అయినా ఆసుపత్రి అక్కడినుంచి ఓ 5 నిముషాల దూరంలోనే ఉంది. ఆ కుర్రాడితో మరేం పరవాలేదని చెప్పా. ఆ కుర్రాడు నేను కార్లో కూర్చోవడానికి, కారు వరకూ వెళ్ళడానికి సహాయం చేసాడు. ఆసుపత్రిలో డాక్టర్లు మా ముగ్గురికి ట్రీట్ మెంట్ ఇచ్చి, ఇదిగో నువ్వు ఇప్పుడు చూస్తున్న కట్లు కట్టారు. వాళ్ళిద్దరు కూడా బానే ఉన్నారు. వాళ్ళ ఫోన్లోనుంచే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కాల్ చేసి ఆ ప్రమాదం గురించి చెప్పా.

రజియా: ఓరి దేవుడో, నీకేం కానందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. నువ్వు మంచివాడవని నాకు తెలుసు. ఇప్పుడే ఒకరి జీవితాన్ని కాపాడి ఇప్పుడు హీరోవైపోయావు. ఇటువంటివి సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. సూపర్ మాన్ అర్జున్ కాపాడడానికి వస్తున్నాడహో…హా..హా..హా..

నేను: ఆపు రజియా, నీకిది నవ్వులాటగా ఉందా (నా మాటల్లో కొద్దిగా చిరాకు ధ్వనించింది)

రజియా కొద్దిగా గాబరా పడుతూ

రజియా: లేదు, లేదు, నువ్వు చెప్పు మొత్తమంతా ఇంతేనా లేక ఇంకా ఏమన్నా ఉందా? ఇవాళ నువ్వు నువ్వులా కనపడటం లేదు. నీ కళ్ళెదుట ఏదో హత్య జరిగినట్లు, భయంకరమైన ఘోరం చూసినట్లు, ఎవరో బాగా కావలసిన వాళ్ళు చనిపోవడం [b]చూసినట్లు చాలా బాధగా ఉంది నీ మొహం. అర్జున్ నువ్వు నా ఆత్మీయస్నేహితుడివి. నువ్వు నిన్ను బాదిస్తున్నదేమైనా, ఏమున్నా నాతో చేప్పొచ్చు.[/b]

నేను: సరిగ్గా వూహించి చెప్పావు, ఇవాళ నాకళ్ళముందు ఒక విషయం చనిపోవడం చూసా

రజియా: ఒక…విషయం?

173503cookie-checkద్రోహం (నయ వంచన) and త్యాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *