ద్రోహం (నయ వంచన) and త్యాగం

Posted on

నేను : “నేను ఈ రోజు ఇప్పుడు ఇక్కడ లేను, రాలేదు. ఈ రోజు నువ్వు నన్ను ఇక్కడ చూడలేదు. నా కుటుంబానికి చెందిన ఎవరికైనా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే నీ సంగతి అంతే, మరి నువ్వుండవు. నీకు బాగా తెలుసు నేనేం చేయగలనో, ఏంత దూరం వెళ్ళగలనో?” అన్నాను.

అతను నిశ్శబ్దంగా తన తలని వూపాడు.

నేను: ఈ విషయం నీ భార్య చంపకు కూడా తెలియకూడదు, సరేనా?

వాచ్ మాన్ కళ్ళు అందోళనతో పెద్దవి అయ్యాయి, మళ్ళీ సరే సార్ అన్నాడు.

గేటువాచ్ మాన్: “సార్, మీ పరిస్థితి బాగా ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు ఈ స్థితిలో మీ కారును నడపగలరా?”

“నేను బాగానే ఉన్నాను, ఇవి పైపైని చర్మం వొరుసుకుపోయిన గాయాలు మాత్రమే. నా తల కొద్దిగా నొప్పిగా ఉంది, నా చేతులు కూడా కొన్ని రోజుల్లో బాగైపోతాయి. నా కారు ఆసుపత్రిలో ఉంది. నేను టాక్సీ లో వెళతాను.”

వాచ్ మాన్ తలూపుతూ రోడ్డుపైకి వచ్చి నేను వెళ్ళడానికి ఓ టాక్సీని ఆపాడు.

మరోసారి అపార్ట్మెంట్ బాల్కనీ వైపు చూడకుండా నన్ను నేను ఆపలేకపోయాను. మళ్ళీ నా కన్నీళ్ళు నా చూపును మసకబారేటట్లు చేశాయి. నాకు గుర్తున్నంతలో నా తండ్రి చనిపోయినప్పుడు నేను మొదటిసారిగా ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ రెండవసారి నేను, నా మనసుకు దెబ్బతగిలి ఏడుస్తున్నాను.

నా గురించి…..
మా నాన్న పుట్టింది, పెరిగింది ఒక పల్లెటూళ్ళో.

మా తాతకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు. మా నాన్న అందరికంటే పెద్దవారు. మా తాత ఆ ప్రాంతంలో ఓ జమీందారు. ఆయన ఒక మల్లయోదుడు, స్వాతంత్రపోరాట యోదుడు, ఆయన చేయెత్తు మనిషి, చాలా భారీగా ఉంటారు. ఇది వంశ పారపర్యంగా మా కుటుంబంలోని అందరికి వచ్చింది. మా కుటుంబంలో పుట్టిన ఆడవాళ్ళు కూడా బాగా పొడుగ్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, మా ప్రాంతంలోని మిగిలిన వారితో పోలిస్తే. మా నాన్న, మా తాతలానే ఉండేవారు, పొడుగ్గా మెలితిరిగిన కండలతో.

ఆయన పెళ్ళి మా అమ్మతో 32 ఏళ్ళ వయసులో అయ్యింది. అప్పుడు మా అమ్మకు 22 ఏళ్ళ వయసు. మా అమ్మ చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చింది, ఆ సాంప్రదాయలను ఆ వయసులోనే బాగా పాటించేది. మా అమ్మ మా తాత కుటుంబ ఆదరాభిమానాలను, నమ్మకాన్ని చాలా తొందరగానే 6-7 నెలల్లో పొందగలిగింది.

కాని ఈ పరిస్థితి చాలా తొందరగానే మారిపోయింది, కారణం పెళ్ళై మూడేళ్ళైనా తను గర్బవతి కాకపోవడంతో.

మా తాత అవ్వ, ముఖ్యంగా మా అవ్వ…మా అమ్మను చాలా అవమాన పరిచేది, ప్రతి చిన్న చిన్న విషయాలకి.
రోజులు గడిచేకొద్దీ ఆ ఇంట్లో మా అమ్మ పరిస్థితి చాలా దిగజారిపోతూ…అదీకాక ఇంట్లోని మిగిలిన తమ్ముల్లకు, చెల్లెల్లకు పిల్లలు పుట్టడంతో ఇంకా హీనంగా, దయనీయంగా తయారైంది.

పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాల్లే కారణమని తలచే రోజులు అవి. మా అమ్మ కూడా తనలోనే ఏదో లోపం ఉందని తలుస్తూ కుమిలిపోయేది.

ఆరేళ్ళు ఓపిక పట్టిన తరువాత, మా తాత మా నాన్న రెండో పెళ్ళి కోసం పిల్లను చూడ్డం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసి అమ్మను ఎంతగానో ఇష్టపడే మా నాన్న చాలా కోప్పడ్డాడు. కాని కుటుంబంలోని అందరూ మా నాన్న పై చాలా వత్తిడి తీసుకొచ్చి ఆయన్ను బుజ్జగించారు రెండో పెళ్ళి చేసుకోమని. మా నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగక చాలా ప్రతిఘటించారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ మా అమ్మ గురించి చాలా చెడుగా మాట్లాడడం వల్ల, ఆయనకు, ఆయన కూడా పుట్టినవాళ్ళకు మద్య దూరం పెరిగిపోయింది.

చివరికి మా అమ్మే మా నాన్నను రెండో పెళ్ళికి ఒప్పించగలిగింది. తను మా నాన్న పాదాల దగ్గర ఏడుస్తూ తనకు ఓ బిడ్డను కనాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ఏంత కోరిక ఉందో చెప్తూ, తను బిడ్డను కనడంలో విపలమౌవ్వడం వల్ల మా నాన్న ఇంకో పెళ్ళి తప్పక చేసుకోవాలని, ఆయన కోసం కాకపోయినా తనకోసం చేసుకోవాలని ఒప్పించింది.

ఆఖరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటూ “కాని ఆ పిల్ల ఓ పేదింటి పిల్లై ఉండాలని” షరతు పెట్టారు.

ఆ విదంగా నా మారుటమ్మతో మా నాన్నకు పెళ్ళైంది, తన ఓ పేద రైతు కూతురు. పెళ్ళైయేటప్పటికి తనకు 18 ఏళ్ళ వయసు.

173503cookie-checkద్రోహం (నయ వంచన) and త్యాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *