దోపిడీ – Part 4

Posted on

చారి నుంచి ఫోన్ వచ్చాక అందరూ తల్లలు పట్టుకొని కూర్చున్నారు అసలు ఏమీ చేయాలో అర్థం కావడం లేదు ఎవరికి దాంతో రామిరెడ్డి ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ బ్రాంచ్ లో నుంచి ఈ అకౌంటు లు పెట్టారు మొత్తం లిస్ట్ తీస్తే కడప నుంచి అనంతపురం వరకు మొత్తం 110 బ్రాంచ్ లో ఒక్కొక్కడు నాలుగు అకౌంట్లు దాచి పెట్టారు దాంతో ఒక విజిలెన్స్ టీం నీ తయారు చేశాడు రామిరెడ్డి తనతో పాటు ఈ స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంటు వివరాలు ఇచ్చి ఆ అకౌంటు గురించి అసలు ప్రూఫ్ లేకుండా చేయమని చెప్పాడు దాంతో అందరూ కలిసి ఆ బ్రాంచ్ లకి వెళ్లి ఉన్న ప్రతి అకౌంటు నీ చూసి ఆ అకౌంటు తాలూకు detail నీ నాశనం చేయడం మొదలు పెట్టారు.

ఇది ఇలా ఉంటే సిరి పని చేస్తున్న ఊరు లో చందు చిన్నపిల్లలకు చదువు చెప్తూ టైమ్ పాస్ చేయడం మొదలు పెట్టాడు అలా ఒక ఆవిడ తన కూతురు నీ తీసుకొని వచ్చి “ఇదిగో బాబు మా అమ్మి నోట్లో నాలుక లేని పిల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకో అప్ప” అని చెప్పి ఆ పాప నీ అక్కడే వదిలేసి వెళ్లింది చందు ఆ పాప తో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆ పాప ఏమీ మాట్లాడలేదు రెండు రోజులు అదే పరిస్థితి మూడో రోజు వాళ్ల అమ్మ నీ పిలిపించి మాట్లాడాడు అప్పుడే సిరి కూడా అక్కడికి వచ్చింది లోన్ రికవరీ కోసం “ఎంది అమ్మ మీ పాప అసలు మాట్లాడడం లేదు” అని కొంచెం కోపం గా అడిగాడు “చెప్పుండా కదా అప్ప మా అమ్మి కీ నోట్లో నాలుక లేదు అని” అని చెప్పింది అప్పుడు ఆలోచిస్తే అర్థం అయ్యింది చందు కీ ఆ పిల్ల మూగది అని దాంతో అది విన్న సిరి, శిరీష గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది అది చూసి చందు, వినోద్ పరువు పోయింది అని అక్కడి నుంచి బిత్తరి చూపులు చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత బ్యాంక్ కీ విజిలెన్స్ వాళ్లు వచ్చారు అని తెలిసి అక్కడ ఉన్న ప్రతి అకౌంటు చెక్ చేసి వాళ్లకు కావాల్సిన అకౌంటు నీ తీసుకొని దాని చించి పడేసి వెళ్లిపోయారు.

ఆ మరుసటి రోజు చందు తన బర్త్ డే అని చెప్పి సిరి నీ శిరీష నీ పార్టీ ఉంది రమ్మని చెప్పాడు ఆ తర్వాత శిరీష ఒక గంట సేపు బ్రతిమాలితే ఒప్పుకుంది సిరి ఆ తర్వాత అందరూ వినోద్ కార్ లో సిటీ లోకి వెళ్లి రెస్టారెంట్ లో కుమ్మి పడేశారు అప్పుడు వినోద్ శిరీష బాగా మీద మీద పడి మాట్లాడుతూ ఉంటే ఎవరూ చూడకూడదో వాడే చూశాడు శిరీష కాబోయే భర్త చూశాడు దాంతో వెళ్లి శిరీష నీ తిట్టాడు దాంతో శిరీష తన సిఎం middle finger చూపించింది దాంతో వాడు engagement రింగ్ తీసి శిరీష మీద విసిరేసి వెళ్లిపోయాడు, ఆ తర్వాత వినోద్ షాక్ లో మొత్తం చూశాడు ఆ తరువాత అందరూ పార్కింగ్ లో కార్ దగ్గరికి వెళ్లితే అక్కడ రాజేష్ భార్య శృతి ఎవరితోనో కార్ ఎక్కి వెళ్లడం చూసి ఆ కార్ నీ ఫాలో అవ్వడం మొదలు పెట్టారు ఆ తర్వాత శృతి తన ఇంట్లో ఉన్న డ్రస్ డాక్యుమెంట్స్ అని తీసుకొని కార్ లో వెళ్లి పోయింది దాంతో వినోద్ నీ ఆ కార్ నీ ఫాలో చేయమని చెప్పి చందు, సిరి ఆ ఇంట్లోకి వెళ్లారు అక్కడ ఏమీ క్లూ దొరకలేదు దాంతో ఇద్దరు బయటకు వచ్చారు కార్ మిస్ అయ్యింది అని వినోద్ ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత సిరి బ్యాంక్ లో dustbin లో చించి పడేసిన కొన్ని పేపర్ లో తన తండ్రి సంతకం చూసి షాక్ అయ్యి ఆ పేపర్ లు మొత్తం తీసి అతికించి చూసింది అగ్రికల్చర్ లోన్, animal husbandry లోన్ ఇలా రెండు లోన్ ల పైన తన తండ్రి సంతకం చూసిన సిరి షాక్ అయ్యింది అయిన కర్నూల్ లో పని చేసే తన తండ్రి 200 km దూరం ఉన్న బ్రాంచ్ లో లోన్ ఎందుకు తీసుకొని ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంది సిరి.

తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని ఇంటికి వెళ్లి డేవిడ్ కీ ఫోన్ చేసి మొత్తం చెప్పింది దానికి డేవిడ్ కూడా సిరి తో వాళ్ల బ్యాంక్ లో కూడా ఇలాగే కొన్ని డాక్యుమెంట్స్ చించి వెళ్లారు అని చెప్పాడు ఆ తర్వాత కొన్ని బ్యాంక్ లో మేనేజర్ లు రైతులకు లోన్ ఇచ్చిన దాంట్లో ఆ మొత్తం వచ్చిన లోన్ డబ్బు లో ఒక 5 శాతం ఇన్సూరెన్స్ కింద కట్ చేసి పెడతారు కానీ చాలా మంది దాంట్లో 25 శాతం కట్ చేసి 5 శాతం రికార్డు లో రాసి మిగిలిన వాటిని తమ అకౌంటు లో వేసుకుంటున్న స్కామ్ గురించి చెప్పాడు ఇవి అని విన్న సిరి ఎలాగైనా ఈ విషయం చైర్మన్ దాకా తీసుకొని వెళ్లాలి అని నిర్ణయం తీసుకొని చైర్మన్ కీ ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది ఆయన ఆ డీటైల్స్ అని తీసుకొని కడప లో ఒక హోటల్ లో సీక్రెట్ గా కలుదాం అని చెప్పాడు దాంతో సిరి వెంటనే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లు తీసుకొని వెళ్లింది ఆ తర్వాత చైర్మన్ చెప్పిన హోటల్ లో రూమ్ లో ఎదురుచూస్తు కూర్చుంది ఆ తర్వాత ఒక అర గంటకు చైర్మన్ వచ్చాడు అప్పుడు సిరి దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని తన లైటర్ తో మొత్తం తగలబెట్టాడు అప్పుడే లోపలికి వచ్చాడు రామిరెడ్డి.

అలా రామిరెడ్డి నీ చూసి షాక్ అలాగే ఉంది సిరి ఆ తర్వాత రామిరెడ్డి నవ్వుతూ “ఎంది అక్కయ్య ఆట చూస్తాండావు ఈ మొత్తం బ్యాంక్ వ్యవస్థ లో నను దాటిన తరువాత నే ఏదైన అయ్యేది అయిన మేము ఇంత జాగ్రత్తగా మా తప్పులు తుడుపుకుంటా ఉంటే నువ్వు ఎంది అక్కయ మా దారికి అడ్డంగా ఉంటివి మీ నాయన కూడా ఇటనే మా దారికి అడ్డంగా ఉండా ఏమైపాయా పరువు పాయ మనిషి మధ్యలో నీకు యాలా అమ్మి ఈ తలకాయ నొప్పి”అని చైర్మన్ కీ సైగ చేస్తే అతను వెళ్లిపోయాడు ఆ తర్వాత రామిరెడ్డి సిరి మీదకు వస్తూ “ఏం ఉండావే ఇప్పుడే కాసిన బనగానపల్లె మామిడి కాయ లేక నిన్ను పిసికి రసం జుర్రుకుంటాంటే వస్తాదే మజా “అని సిరి నడుము పట్టుకొని మీదకు లాగి ముద్దు పెట్ట పొత్తుంటే రూమ్ బెల్ కొట్టారు ఎవ్వరూ అని అడిగితే రూమ్ సర్విస్ అని అన్నాడు వద్దు అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి లోపలికి వచ్చాడు రాగానే రామిరెడ్డి మొహం కీ టవల్ వేసి లాగి గోడకి వేసి కొట్టాడు చందు.

చందు కొట్టిన దెబ్బకు తల తిరిగి పోయింది రామిరెడ్డి కీ ఆ గ్యాప్ లో చందు సిరి హెడ్ ఫోన్స్ తీసుకొని వాడి మెడ నుంచి బిగించి రెండు చేతులకు ముడి వేసి ఆ హెడ్ ఫోన్స్ పిన్ నీ తన ఫోన్ తీసి రామిరెడ్డి షర్ట్ లోపల పెట్టి దానికి లింకు వేసి పెట్టి కట్టెసాడు ఆ తర్వాత ఎదురుగా ఉన్న కూర్చి లో కాలు మీద కాలు వేసుకుంటు రామిరెడ్డి మొహం పైన షూ తో కొట్టి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు చందు “బాబాయ్ ఇప్పుడు నాకూ చాన టైమ్ ఉండాది నీకు 5 నిమిషాలు మాత్రమే ఉండాది కాబట్టి ఆ అమ్మి కీ కావల్సిన ఇవ్వరాళ్లు ఇచ్చుండావు అనుకో నీ కట్లు ఇప్పి పెద్ద ఆసుపత్రిలో చేర్పించి మరి పోతా” అని ఆఫర్ ఇచ్చాడు దాంతో రామిరెడ్డి మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు.

రెండు సంవత్సరాల క్రితం సిరి వాళ్ల నాన్న కృష్ణమూర్తి యూనియన్ ఎన్నికలు అప్పుడు వాళ్లకు పొట్టి గా రాజేష్ నీ నిలబెడితే ఎలాగైనా తనే గేలవాలి అని ఆలోచిస్తూ ఉన్న టైమ్ లో చారి అతనికి ఫోన్ చేసి ఉన్న బ్యాంక్ వాళ్లు అంతా రాజేష్ కీ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి కాస్ట్ యూనియన్ ల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు చీల్చమని చెప్పాడు ఆ తర్వాత రామిరెడ్డి గెలిచిన తర్వాత తన కింద పని చేస్తున్న ప్రతి ఒకరిని జేత చేసి ఇలా illegal లోన్ లు మొదలు పెట్టారు దానికి కృష్ణమూర్తి లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ సంతకాలు అని కలెక్ట్ చేసి వాటిని digitalize చేసి అవసరమైన లోన్ లకు వాడుకున్నారు ఇలా ఒక సంవత్సరం లోనే డబల్ లోన్ లు పెరగడంతో NABARD వాళ్లు సెంట్రల్ లెవల్ లో ఉన్న కొని గ్రామీణ బ్యాంక్ ల పైన విజిలెన్స్ పెట్టింది అప్పుడు స్కామ్ గురించి బయటకు వస్తుంది అని బయటపడిన చారి రాజేష్ నీ చంపి పారిపోయాడు పైగా ఈ స్కామ్ కీ సంబంధించిన ప్రతీది చారి ఫోన్ ద్వారా తప్ప పర్సనల్ గా ఎప్పుడు involve అవ్వలేదు.

ఇంత పెద్ద స్కామ్ గురించి తెలుసుకున్న సిరి కీ చారి బ్రతికే ఉన్నాడు అన్న విషయం ఇంకా షాక్ ఇచ్చింది ఆ తర్వాత చందు సిరి బయటికి వచ్చాక చందు సిరి తో “మరి వెళ్లదామ గోవా కీ” అని అడిగాడు, దానికి సిరి అక్కడికి ఎందుకు అని అడిగింది శృతి నీ చారి నీ పట్టుకోవడానికి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు చందు.