మహితోపాటు నీళ్లపైకి లేచాను .
దేవుడా …… మీకేమి జరిగిందోనని ఎంత భయపడ్డానో , మీరు లేని జీవితం నాకెందుకు అంటూ మహి మరింత గట్టిగా చుట్టేసి హృదయంపై తలవాల్చింది .
అందం అమాయకత్వం కలగలసిన అంతులేని ప్రేమను పంచుతున్న మహిని ప్రేమతో చూస్తూనే , ఆహా ……. వెయ్యికోయిలల మధురమైన పలుకు – అమరకాంతుల మయూర అందం – దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్య సౌందర్యం …….
మహి : ఆగండాగండి దేవుడా …… , మీరిక పొగడాల్సిన అవసరం లేదు – నా జీవితం మీ పాదాక్రాంతం , ముందు మీరు పైకిరండి , గాయానికి తడి తగలనేరాదు .
నా గురించి తరువాత ముందు నువ్వు నీళ్ళల్లో తడవకూడదు అంటూ అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పైకిచేర్చి , పైకెక్కాను .
అవునవును ఇద్దరూ తడవకూడదు అంటూ అమ్మాయిలు కంగారుపడుతున్నారు .
మహి : ఇంకా నొప్పిగానే ఉందా దేవుడా ……. , నేను చూడొచ్చా …… అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది .
బాధపడకు మహీ …… , గాయాలన్నీ మానిపోయాయిలే అంటూ చూయించాను .
కంగారుపడుతూనే చూసి స్పృశించి , అమ్మా దుర్గమ్మా ….. అంటూ ప్రార్థించి సంతోషంతో మళ్లీ గుండెలపైకి చేరిపోయింది . ఈ ప్రియురాలికోసమే వచ్చారా …. ? చాలా చాలా సంతోషం వేస్తోంది అంటూ హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్ ……. అంటూ మళ్లీ మహితోపాటు నీళ్ళల్లోకి పడిపోయాను .
అమ్మాయిల నవ్వులు ఆగడం లేదు .
వెంటనే లేచి మహిని పైకిచేర్చబోతే …… , ఊహూ …… అంటూ ముసిముసినవ్వులతో వదలకుండా చుట్టేయ్యడంతో నీళ్ళల్లోనే మరొకవైపుకు నడుచుకుంటూ వెళ్లి మెట్లమార్గంలో పైకివచ్చాను .
మహి ముత్యాలురాలేలా అందంగా నవ్వుతూనే ఈ ప్రియురాలి కోసమే వచ్చారని చెబితే మరింత ఆనందిస్తాను .
చెలికత్తె చామంతివైపు కళ్ళతో సైగచేసి , లేదు లేదు మహీ …… నేను వచ్చినది నీకోసం కాదు – నానుండి కిందకు దిగితే వారిని వెళ్లి కలుస్తాను .
మహి : ఎవరికోసం అంటూ చెమ్మతో అడిగింది .
నేను వచ్చినది ఈ భువిపైననే అతిలోకసుందరి అయిన ఈ రాజ్యం యువరాణిని కలవడానికి , తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడానికే ఇక్కడకు ప్రయాణం సాగించాను , అనుకోకుండా అంత అందాలరాశి కాకపోయినా అందమైన నిన్ను కాపాడాను .
చామంతి ముసిముసినవ్వులు నవ్వుతోంది .
మహీ మహీ …… తొందరగా కిందకు దిగితే మంచిది , ఇలా మనిద్దరినీ యువరాణి చూసిందంటే మొదటికే మోసం వస్తుంది అని లోలోపలే నవ్వుకుంటున్నాను , యువరాణి …… దేనిపైననో ఆశతో జ్వరంతో బాధపడుతున్నారని – వైద్యుల మందులు పనిచేయడం లేదని , చాలా చాలా మంచివారైన యువరాణి త్వరగా కోలుకోవాలని ప్రార్థించడం – రాజ్యంలోని వైద్యుల మందులు పనిచెయ్యడం లేదని తెలిసి నా మిత్రుడి దగ్గరున్న మూలికలు చేర్చడానికి వచ్చాను . మిత్రమా …… మూలికలు – ఆయుధాలు ఎక్కడ ? .
ఒక భవనం వైపు సైగచేశాడు కృష్ణ ……..
చామంతి : నేనొకదానిని ……. , రెండురోజులుగా అటువైపు సైగలుచేస్తూనే ఉన్నా నేనే పట్టించుకోలేదు , క్షమించు క్షమించు అంటూ చెలికత్తెలందరితోపాటువెళ్లి తీసుకొచ్చింది .
మహీ ……. మూలికలను యువరాణికి చేర్చాలి కాబట్టి …….
మహి : చిరుకోపంతో కాబట్టి …….
కాబట్టి కిందకుదిగితే అంటూ నవ్వుకుంటున్నాను .
మహి : అంటే నేనే యువరాణినని ఈ దేవుడికి తెలియదా ? .
ఊహూ …….
మహి : మీరు అపద్ధం చెప్పినా హృదయమంతా నేనే నిండిన మీ హృదయం చెప్పకనే చెబుతోందిలే అంటూ మళ్లీ హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ……. ఈసారి నీళ్ళల్లోకి పడిపోకుండా మిత్రుడు అడ్డుకున్నాడు .
మిత్రమా …… మంచిపనిచేశావు – మహి ఇన్నిసార్లు తడవకూడదు .
మహి నవ్వుకుని , ఎందుకు తడవకూడదు ? .
జ్వరం వచ్చిందికదా ……. , ( మహి నవ్వడం – వీరాధివీరా అంటూ చామంతి ముందుకురావడం ) అయ్యో దొరికిపోయానే …….
మహి తియ్యనైనకోపంతో మెడను చుట్టేసిన చేతులతో ప్రేమతో దెబ్బలవర్షం కురిపించింది .
ఆఅహ్హ్ …… హ్హ్హ్ …… దెబ్బలను అమితమైన ఆనందంతో ఆస్వాదిస్తూనే క్షమించు క్షమించు యువరాణీ గారూ ……
మహి : యువరాణి కాదు నీ మహి – నీ పాదదాసి అంటూ సంతోషంతో కేకలువేస్తూ ఏకమయ్యేలా చుట్టేసింది .
ఇక కానివ్వండే ఇంకా చూస్తున్నారే అంటూ చామంతి సైగచెయ్యగానే , చుట్టూ చెలికత్తెలు మాపై పూలవర్షం కురిపిస్తూనే ఆకాశంలోకి తారాజువ్వలను వదలడంతో ఆ అద్భుతాన్ని వీక్షించి సంబరపడిపోతూ నా బుగ్గపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టింది .
అద్భుతం యువ ……. మహీ ……. , ముద్దుపెట్టవచ్చా ? .
కోపంతో దెబ్బలవర్షం – దెబ్బలపై అంతులేని ముద్దులు …….
అలాగే అలాగే , నా మనసులోని మధురమైన మాట చెబుతాను – ఎప్పుడైతే జాతరలో నిన్ను స్పృశించానో ……. ఆ క్షణమే నా జీవితం నువ్వైపోయావు మహీ , నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాను .
మహి : తియ్యనైన జలదరింపుకు లోనైనట్లు కళ్ళతోనే వ్యక్తపరిచి , అంతులేని సంతోషంతో నానుండి కిందకుదిగి ఆఅహ్హ్ ……. అంటూ నన్ను చుట్టేసి అందమైన నవ్వులతో హృదయంపై ముద్దులుపెడుతూనే నీళ్ళల్లోకి పడిపోయింది .
వెంటనే లేచి , అయ్యో అయ్యో జ్వరం అదికూడా పెద్ద జ్వరం …… ఈ సౌందర్యరాశి ఏమో పదేపదే నీళ్ళల్లో తడుస్తోంది అంటూ వదలకపోవడంతో ఎత్తుకునే పైకిచేరాను . నిన్నూ …… అంటూ నుదుటితో ప్రేమగా నుదుటిని స్పృశించాను , చామంతీ …… మూలికల కషాయం సిద్ధమా ? .
చామంతి : ఎప్పుడో వీరాధివీరా …….
మహి : నాకిక ఏ కషాయం అవసరం లేదు , నా దేవుడి కౌగిలే మందు అంటూ మరింత గట్టిగా కౌగిలించుకుంది .
చామంతి : అవును వీరాధివీరా …… , అప్పటివరకూ ఏడుస్తూ కలవరిస్తూ మంచంపై అటూ ఇటూ కదలటం కూడా వీలుకాలేదు – మీరు వచ్చారని తెలపగానే విశ్వమంత శక్తితో లేచి ఎలా పరుగులుతీసిందో మీరే చూశారుకదా ….. , మీ అంతులేని ప్రేమ చాలు ……..
చాలా సంతోషం మహీ …… అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాను . చామంతీ ….. కనీసం తడిని అయినా తుడవండి .
చామంతి : అలాగే వీరాధివీరా అంటూ పరుగునవెళ్లి తువాళ్ళు తీసుకొచ్చారు .
మహీ …… వదిలితే తుడుస్తారు లేకపోతే మరింత అపాయం ……
మహి : ఊహూ …… జీవితాంతం వదలనే వదలను , నా దేవుడి కౌగిలిలో అపాయమా అంటూ వొళ్ళంతా జలదరించేలా ముద్దుపెట్టింది . ఆఅహ్హ్ …… అంటూ తొలిసారి మహితోపాటు ఏకమయ్యేలా కౌగిలించుకున్నాను .
సిగ్గుతో చెలికత్తెలందరూ అటువైపుకు తిరిగారు – నా మిత్రుడైతే ఎప్పుడో ……..
చామంతీ …… ఆ తువాళ్ళు నాకివ్వు – మహీ …… నేనైనా తుడవనా ? , నీకు జ్వరంతోపాటు జలుబుచేస్తే ఈ హృదయంతోపాటు రాజ్యంలోని ప్రజలంతా బాధపడతారు .
తలెత్తి నాకళ్ళల్లోకే తియ్యనైనకోపంతో చూస్తూ దెబ్బలవర్షం కురిపిస్తోంది .
చామంతి : వీరాధివీరా …… తెలిసే దెబ్బలు తింటున్నారు కదా …… ఆనందించండి ఆనందించండి అంటూ సంతోషంతో ఇచ్చి వెళ్ళిపోయింది .
దేవకన్యలాంటి మహి దెబ్బలు తినాలన్నా అదృష్టం ఉండాలి .
మహి : అందమైన సిగ్గుతో దెబ్బలు కురిపించిన చోట ముద్దులు కురిపిస్తూ ఏకమయ్యేలా అల్లుకుపోయింది .
జలపాతం లాంటి మహి కురులను మరియు ముఖాన్ని సున్నితంగా తుడిచాను – మహీ ….. బట్టలుకూడా మార్చుకోవాలికదా చూడు పూర్తిగా తడిచిపోయావు .
మహి : కొద్దిసేపైనా ఇలా ఉండనివ్వు , మీరేమి చెప్పినా వదలనంటే వదలను అంతే అంటూ ఛాతీపై ప్రేమతో కొరికేసింది .
ఆవ్ …….
చామంతీ …… మీ యువరాణి చాలా చాలా మంచిదని నువ్వు – ప్రజలంతా అంటున్నారు , నాకైతే అలా అనిపించడం లేదు నువ్వే చూస్తున్నావుకదా చూడు కొడుతోంది – కోరుకుతోంది …….
మహి : గిల్లుతాను కూడా …… , ఇకనుండీ నా సర్వస్వం మీరే , గిళ్లడం మాత్రమే కాదు నాకోరికలన్నీ తీచుకుంటాను అంటూ మళ్లీ చిలిపిగా కొరికింది .
స్స్స్ ……..
మహితోపాటు చెలికత్తెలందరూ నవ్వుకుంటున్నారు . వీరాధివీరా …… ఇలాంటి మహి గురించి చిన్నప్పటి నుండీ తోడుగా ఉంటున్న మాకు కూడా తెలియదు , ప్రాణమైన దేవుడు కనిపించగానే …….. అంటూ ఆనందిస్తున్నారు . మహీ …… నీ దేవుడు కూడా తడిచిపోయాడు కదా ……
వద్దు వద్దు వద్దు గుర్తుచెయ్యకు చామంతీ మళ్లీ దెబ్బలు మొదలుపెడుతుంది .
మహి : అవునన్నట్లు తలఊపుతూ మురిసిపోతోంది . బట్టలు మార్చుకోవాలనుకుంటే నన్ను ఎత్తుకునే యువరాణీ మందిరానికి తీసుకెళ్లమను ……. , వెళ్లు నా దేవుడికి వస్త్రాలు రెడీ చెయ్యి ……
అలాగే మహీ ……..
యువరాణీ ఆజ్ఞ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అమాంతం రెండుచేతులతో ఎత్తుకున్నాను .
మహి : ఒక్క క్షణం ఒక్క క్షణం అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , కిందకుదిగి కృష్ణ దగ్గరికివెళ్ళింది . కృష్ణను ఆప్యాయంగా నిమురుతూ లోపలికి రమ్మని ఆహ్వానించింది .
కృష్ణ : ఊహూ …… నాకు ఇక్కడే ఉద్యానవనంలోనే బాగుంది అంటూ గెంతులువేస్తోంది .
చామంతి : మహీ …… రెండురోజులనుండీ ఎంత లోపలికి రమ్మన్నా రావడం లేదు .
మహీ …… కృష్ణకు పచ్చదనం అంటేనే ఇష్టం .
మహి : నాకుకూడా ……. , నేనుకూడా ఇకనుండీ ప్రేమతో కృష్ణ అని పిలవచ్చా ? .
సంతోషంతో గెంతులువేశాడు .
మహి సంతోషంతో నాచేతిని చుట్టేసి , కృష్ణా …… ఈ ఉద్యానవనం మొత్తం నీదే – నీ ఇష్టం వచ్చినదగ్గరికి వెళ్లు ఆనందించు ……..
కృష్ణ సంతోషంతో ఉద్యానవనం చుట్టూ పరిగెత్తుతోంది . అదిచూసి మహి సంతోషంతో కేకలువేసి నా బుగ్గపై చేతితో ముద్దులు కురిపిస్తోంది – ఊ ….. చూస్తున్నారే ఎత్తుకోండి అంటూ చేతులను విశాలంగా చాపింది .
బరువున్నావు మహీ …….
అంతే కళ్ళల్లో మధురమైన కోపం …….
లేదు లేదు లేదులే అంటూ కళ్లపై చేతులతో ముద్దులుపెట్టి , ప్రేమతో ఎత్తుకున్నాను.
మహి : యాహూ …… అంటూ నా మెడను చుట్టేసి బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉంది , పాతికమంది రాక్షసులను అవలీలగా ఎత్తిన నా దేవుడికి నేను బరువునా అంటూ చిలిపికోపంతో బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ……. , ప్చ్ ప్చ్ …… చిన్నప్పటినుండీ నా దైవమైన గురువుగారు కూడా ఒక్క దెబ్బ కొట్టలేదు , కొన్ని ఘడియాల్లోనే …….
మహి : నేను చెబుతాను నేను చెబుతాను , కొట్టాను – కొరికాను – గిల్లాను …… ఇక రక్కేసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను , ఇంతటి వీరాధివీరుడు చెంత ఉంటే ఒక అమ్మాయికి ఇలానే అనిపిస్తుంది – అప్పుడే అయిపోలేదు ముందు ముందు ఇంకా చూస్తారుగా …… అంటూ నవ్వుతోంది , దేవుడా ……. ఇకనుండీ నాకుకూడా గురువుగారు …… దైవంతో సమానం – గురువుగారూ …… మీ శిష్యుడిని నా ప్రియమైన దేవుడిని కోరికే అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ……..
అమ్మో అమ్మో ……. ఇలాంటి కృతజ్ఞతల గురించి నేనెక్కడా విననేలేదు …….
మహి నవ్వులు ఆగడంలేదు …….
మహీ ……. జీవితాంతం ఇలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది అంటూ నుదుటిపై పెదాలు తాకించి ప్రాణంలా హత్తుకున్నాను .
ముద్దులుపెట్టడం ఆపి దారిని చూయించు మహీ ……..
మహి : నవ్వుకుని , ముద్దులతోనే చూయిస్తాను దేవుడా …… , నుదుటిపై ముద్దుపెడితే నేరుగా వెళ్ళండి – కుడిఎడమ బుగ్గలపై ముద్దులుపెడితే …….
అర్థమైంది రాణీ గారూ ముద్దుకు ముద్దు ……..
మహి ముద్దులకు అనుగుణంగా యువరాణీ మందిరంలోకి అడుగుపెట్టాను , గ్రంథాలలో చదివినట్లు ఇంద్రభవనంలా ఎటుచూసినా బంగారువర్ణమై విలాసవంతంగా ఉంది – మహీ …… ఇలాంటి భవనంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి …….
భవనం లోపల చెలికత్తెలు ……. ముందుకుముందుకువెళ్లి కాపలాకాస్తున్న భటులను అక్కడనుండి పంపించేస్తున్నారు .
మహి : చివరిసారి అయితే కాబోదు దేవుడా ……. , ఇకనుండీ నా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బంగారువర్ణపు అతిపెద్ద ద్వారం చెలికత్తెల ద్వారా తెరుచుకోవడంతో లోపలికి నడిచాను .
మహి : ఇదే మన విలాసవంతమైన మందిరం దేవుడా …… నచ్చిందా ? .
చుట్టూ చూసి , సంభ్రమాశ్చర్యాలతో మహి బుగ్గలపై ముద్దులు కురిపించాను .
మహి : యాహూ ……. నా ముద్దుల దేవుడికి నచ్చింది , ఒక్కొక్క ముద్దుకాదు ముద్దులు కురిపిస్తున్నారు అంటూ అల్లుకుపోయింది – ఆ పరుపుపైననే పడుకోబోయేది .
నచ్చింది కానీ నాకు ఇలాంటి మెత్తని పరువుపై పడుకోలేను – రాతిపరుపు అంటేనే ……..
మహి : ఇంతకుముందే చెప్పానుకదా దేవుడా …… నాదేవుడి ఇష్టమే నా ఇష్టo , అయినా ఇకనుండీ నేను పడుకోబోయేది నా దేవుడి గుండెలపైననే కదా …….
మహి నుదుటిపై ముద్దుపెట్టాను .
మహీ – వీరాధివీరా …… వస్త్రాలు అంటూ ఇచ్చివెళ్లింది .
మహీ …… కిందకుదిగితే మార్చుకోవచ్చు , నువ్వు ఎక్కడ మార్చుకుంటావు – నన్ను ఎక్కడ మార్చుకోమంటావు ? .
మహి : మీగురించి నాకు తెలియదు – నేనైతే నా దేవుడిముందే సిగ్గుపడుతూ మార్చుకుంటాను .
అంతే మహితోపాటు బెడ్ పైకి చేరిపోయాను .
మహి : దేవుడా దేవుడా …… అంటూ చిలిపినవ్వులతో ప్రక్కకువాలి , నా గుండెలపై తలవాల్చి నిలువునా వాలిపోయింది .
మహి : మొదట నన్నుచూసి మైమరిచిపోయి ఈతకొలనులోకి పడిపోయారు – తరువాత కౌగిలింతకు పడిపోయారు – ఆ తరువాత చిన్న ముద్దుకే మళ్లీ ……. నేనంటే అంత ఇష్టమా దేవుడా అంటూ జలదరింపుకు లోనయ్యేలా హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ……. , అవన్నీ నా జీవితంలో తొలి మాధురాతి మధురమైన అనుభూతులు మహీ , వాటన్నింటినీ నా అందాల సౌందర్యరాశి దేవకన్యతో పొందటం నా అదృష్టం ……. అంటూ ప్రాణంలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : అపద్ధం …… ఆరోజు జాతరలో ? .
అదే తొలి స్పర్శ మహీ ……. , ఆ చిరు స్పర్శకే రోజంతా ఎలా విలవిలలాడిపోయానో మన మిత్రుడిని అడిగి తెలుసుకో ……. , రెండురోజులపాటు ఏడుస్తూ బాధపడిన ఈ దేవకన్య అందానికే ఇలా ముగ్ధుడినయ్యాను ఇక నిన్ననే జాతరలో ఏ దేవకన్య అందాన్ని చూసి ఉంటే ఏమైపోయేవాన్నో ఏమో – అంతా మనమంచికే అనుకోవాలి.
మహి : పో దేవుడా సిగ్గేస్తోంది అంటూ పులకించిపోతోంది .
అయితే వెళ్లిపోనా ……. మహీ ……
మహి : అంతకంటే నా ప్రాణం వదిలే ……..
మహీ ……. అంటూ చేతులు మహిని చుట్టేయ్యటంలో తలమునకలై ఉండటంతో ఏమిచెయ్యాలో తెలియక నాకు తెలియకుండానే పెదాలతో …… మహి పెదాలను తాకీ తాకనట్లుగా స్పృశించాను .
ఆ చిరుముద్దుకే మహి తియ్యదనంతో జలదరించి , అమితమైన ఆనందంతో అందమైన సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకుంది .
మహీ …… క్షమి …… అనేంతలో …….
మహి కూడా అలాంటి ముద్దునే నా పెదాలపై ఉంచి ఊహూ …… నాకిష్టమే ఎప్పుడు ఇలా ముద్దుపెడతావా అని మనసు తెగ ఉరకలువెయ్యసాగింది అంటూ తెగ మురిసిపోతూ అల్లుకుపోయింది .
అమితమైన ఆనందంతో మహి తడిచిన కురులపై పెదాలను తాకించాను .
ఇందులో తప్పంతా …… పరదా చాటున విని ఆనందిస్తున్న మీ స్నేహితులదే మహీ …….
మేమా లేదు లేదు వీరాధివీరా అంటూ మాముందుకువచ్చి , దొరికిపోయినట్లు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . తప్పు మాదే అయి ఉంటుంది క్షమించండి వీరా ……..
మహి నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరమూ లేచి కూర్చున్నాము . చామంతీ …… జాతరలో నా దేవకన్యను రక్షించినప్పుడు – మహీ మహీ అనికాకుండా యువరాణీ అని పిలిచి ఉంటే ……. పరిస్థితులు వేరేగా ఉండేవి .
చామంతి : అవునవును నిజమే తప్పంతా మాదే మాదే …… క్షమించండి క్షమించండి .
లేదు లేదు చామంతీ …… , నేను మాటవరసకు అన్నాను – ఆ పిలుపులో మీరెంత స్నేహితులో అర్థమైపోతోంది – చిన్నప్పటినుండీ ప్రాణస్నేహితులు కదా ……
మహి : ఊహతెలిసినప్పటి నుండీ ప్రాణస్నేహితులం , కలిసే ఆడుకున్నాము – కలిసే ఒకే గురుకులంలో చదువుకున్నాము – కలిసే ఇలా పెరిగాము .
చామంతి : మా బాగోగులతోపాటు మా కుటుంబాలను కూడా ఏలోటూ లేకుండా చూసుకుంటోంది .
మహి : ఊరుకోండే మీరు మరీనూ …… స్నేహితులుగా ఆమాత్రం చేయకపోతే ఎలా …….
ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా ……. , జాతరలో నాకంటే ముందు మహిని రక్షించడం కోసం చుట్టూ నిలబడటానికి ప్రయత్నించారు చూడండీ , స్వచ్ఛమైన స్నేహం ……..
చామంతి : సమయానికి మీరు రాకపోయుంటే ……. ఏమిజరిగేదో ఏమిటో …….
ఏనుగును నియంత్రణలోకి తీసుకురావడంలో నా వీరత్వాన్ని చూసి యువరాణీ గారు కదలకుండా ఉండిపోయారు కదా – అంటే నా వీరత్వం చూసి ప్రేమించావన్నమాట అలా జరగకపోయుంటే లేదు కదా మహీ అంటూ చామంతివైపు మళ్లీ సైగచేసాను .
మహి కళ్ళల్లో చెమ్మ – నావైపు ఆరాధనతో చూస్తోంది .
చామంతి : వీరాధివీరా ……..
తెలుసులే చామంతీ ……. , అమ్మమ్మా …… దేవకన్య లాంటి సౌందర్యరాశి కళ్ళల్లో ఆనందం తప్ప ఇలా కన్నీళ్లు రాకూడదు , తప్పు నాదే గుంజీలు తియ్యనా ……
మహి : చేతులను తీసేసి ప్రాణంలా చుట్టేసింది .
ఏనుగు బారినుండి పిల్లలను రక్షించే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే నా దేవకన్య మహి చూపులు నా వీపుని స్పృశించడం నాకు తెలియదనుకున్నావా ? నువ్వు చెబితే నమ్మను అనుకున్నావా ? కళ్ళల్లో చెమ్మ చేర్చావు అంటూ కళ్లపై చెరొకముద్దుపెట్టాను .
చామంతి : ఆ క్షణం మీరు చుట్టూ తిరిగిచూడటం మహి గమనించింది వీరాధివీరా ……..
మహీ ……. తొలిచూపులోనేనా ? – ఎలా అనిపించింది ? .
మహి అందంగా సిగ్గుపడుతోంది . చామంతీ చెప్పవే …….
చామంతి : వీరాధివీరా …… మీరు ఎలాగైతే మీ దేవకన్యను చూడగానే నీళ్ళల్లోకి పడిపోయారో అలా మిమ్మల్ని చూడగానే నేలపై పడిపోయేదే , సమయానికి వెనుకే మేంఉన్నాము కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బలు తగిలేవే అంటూ నవ్వుకుంటున్నారు .
యాహూ ……. అంటూ కేకలువెయ్యబోయి వెంటనే నోటిని చేతితో మూసేసుకున్నాను .
మహి : ఎందుకు ఆపుకున్నారు – భటులకు వినిపిస్తుందనా నేనున్నానుకదా ……..
అధికాదు మహీ …… నాగురించి – నా ప్రయాణం గురించి – నేనిక్కడకు వచ్చిన కర్తవ్యం గురించి నీకు వెంటనే తెలియాలి అంటూ జరిగినది మొత్తం వివరించాను .
మహి : అంటే యువరాణీ స్వయంవరానికి వచ్చారన్నమాట – అంటే నాకొసమే – ఒకవేళ జాతరలో కలవకపోయినా ఇక్కడ స్వయంవరంలో కలిసేవాళ్ళము యే యే యే అంటూ ముద్దులు కురిపిస్తోంది .
చామంతి : అసలు మహికి స్వయంవరమే ఇష్టం లేదు – తన తండ్రి రాజుకు ఇంతచెప్పినా వినలేదు – తన తండ్రికి పెద్దరికం పరువు తప్ప మరొక ఆలోచనలేదు – మహీ ……. నీకు జ్వరం కనుక ఈరోజుకు తగ్గకపోతే స్వయంవరం రద్దుచేయాలన్న ఆలోచనలో ఉన్నారు .
మహి : అలా జరగనేకూడదు , రద్దుచేసేముందు ఒకసారి వచ్చి కలుస్తారుకదా నన్ను చూశాక విరమించుకుంటారులే , ఎలా నా వీరాధివీరుడు స్వయంవరంలో ఏ పోటీ అయినా అవలీలగా గెలుస్తారు – నన్ను చేబడతారు .
అధికాదు మహీ ……..
మహి : అవును నిజమే , నాన్నగారు …… యువరాజులను మాత్రమే ఇప్పుడెలా నాకు భయమేస్తోంది అంటూ గట్టిగా చుట్టేస్తోంది .
నేనున్నాను కదా మహీ ……. , మీ తల్లిదండ్రుల ప్రేమను దూరం చెయ్యకుండా నిన్ను నా దానిని చేసుకుంటాను , ఇది నా మాట …….
అంతే చెలికత్తెలు ఈలలు – చప్పట్లు కొడుతున్నారు .
మహి : నా మంచి దేవుడు అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
ఉమ్మా ….. , మహీ …… ముద్దులతో ఆకలితీరదు కదా – తిని రెండు రోజులయ్యిందా ….. ? నిన్నూ …… నాకేమీ కాదని కృష్ణ చెప్పలేదా ? .
చామంతి : మమ్మల్ని అతిజాగ్రత్తగా ఇక్కడకు తీసుకొచ్చి , పదేపదే చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు , మాకే అర్థం కాలేదు వీరా …….. , మీరు వస్త్రాలు మార్చుకోండి అంతలోపు వేడివేడిగా ఆహారం తీసుకొస్తాము అంటూ పరుగులుతీశారు .
మహి ……. నాపెదాలపై లేతగా ముద్దుపెట్టి మంచం దిగింది . బట్టలు అందుకుని దేవుడా …… ఈదూరంలో మార్చుకుంటే మీకు ఆనందమే కదా …….
అంతే మళ్లీ పరుపుపైకి పడిపోయాను .
మహి : ప్చ్ ప్చ్ …… దేవుడా అంటూ ప్రక్కన చేరి ఆనందిస్తోంది – గుండెలపై ప్రేమతో కొడుతోంది – ఇన్నేళ్ళుగా ఈ సౌందర్యాన్ని నేనొక్కదానినే …….
మహీ మహీ …….
మహి : నా ప్రియమైన దేవుడు చూడాలనుకోవడం తప్పా – ఆ అదృష్టం నాకు …..
మహీ మహీ …… ఇలాంటి విషయాలలో పసిపిల్లాడిని తెలుసుకదా అంటూ పెదాలను తడుముకున్నాను , పూర్తి వస్త్రాలలో ఉన్న నా దేవకన్య అందాలను చూసే మైమరిచిపోయాను ఇక అలా అంటే …….
మహి : అంటే చూడరా …….
చూడను అంటే ఇప్పుడే చూడను – మెల్లమెల్లగా …… మహీ మహీ ఈ అభాగ్యుడిని కాస్త కరుణించు దయ చూయించు …….
మహి తియ్యదనంతో నవ్వుకుంది – సరే ప్రస్తుతానికి బలవంతపెట్టను మీరు ఇక్కడ మార్చుకోండి – నేను ఆ గదిలో మార్చుకుంటాను .
ఉమ్మా ఉమ్మా ….. మా మంచి మహి .
మహి : మా మంచి దేవుడు అంటూ ప్రేమతో కౌగిలించుకుని , నా వస్త్రాలు అందించి గదిలోకివెళ్లింది – తలుపులు కూడా వేసుకోలేదు .