జనం మెచ్చిన రాజు – Part 36

Posted on

సామంతరాజులు : ముందుకువస్తే మిమ్మల్నీ వివస్త్రులను చెయ్యాల్సివస్తుంది రాణులూ …….. అంటూ తల్లుల ఒంటిపై చేతులు వెయ్యబోయారు .
ఆ ఆరాచకాన్ని చూస్తూ ఇక ఊరికే ఉండలేకపోయాను – దుర్గమ్మ తల్లీ ఇక మీపైనే భారం అంటూ వెనుక నుండి మూడు బాణాలను నాలుగు వేళ్ళతో అందుకుని చెట్టు చాటునుంది బయటకువచ్చి ఒకేసారి వదిలాను .

జనం మెచ్చిన రాజు – Part 35

ఒక్కసారిగా మూడు బాణాలు వాయువేగంతో వెళ్లి ముగ్గురి సామంతరాజుల అరచేతులను చిట్లిపోయేలా చీల్చేశాయి .
ముగ్గురు తల్లుల వస్త్రాలకు ఇంచు దూరంలో భయంకరమైన నొప్పితో హాహాకారాలు ఉద్యానవనం మొత్తం వినిపించాయి .
ఆ కంగారులో సైనికులు ఎక్కుపెట్టిన బాణాలు విడుదల అవ్వడంతో పిల్లలూ పిల్లలూ …… అంటూ రాణులు గట్టిగా కేకలువేశారు .
అధిచూసి వెంటనే మరొక మూడు బాణాలను అందుకుని అంతకు రెట్టింపు వేగంతో గురిచూసి వదిలాను .
పిల్లల గుండెల్లోకి దిగడానికి కసింత దూరంలో నా బాణాలు ….. ఆ బాణాలను గురితప్పించడంతో రాణులు – తల్లులు – బంధింపబడిన తండ్రులు ఊపిరిపీల్చుకున్నారు .
సామంతరాజులు చేతులను మరొకచేతితో పట్టుకుని ఇంకా నొప్పితో కేకలువేస్తూనే ఉన్నారు .

బాణాలు వదిలినవాడు ఎవడు ? – ఎటువైపు నుండి వచ్చాయి ? అంటూ చుట్టూ చూస్తున్నారు మహారాజు – సామంతరాజులు …….
అటువైపు మహారాజా అంటూ నావైపుకు బాణాలను ఎక్కుపెట్టారు వందలమంది సైనికులు , అంతటితో ఆగకుండా మరొక వందమంది నావైపుకు కత్తులతో – ఈటెలతో నావైపుకు పరుగునవస్తున్నారు .
మహారాజు : వాడిని ఖండఖండాలుగా నరికేయ్యండి – వొంట్లోకి కనీసం వంద బాణాలైనా దిగాలి .
వీరాధివీరా జాగ్రత్త అంటూ కంగారుపడిపోయారు బుజ్జాయిలు రహస్య మార్గంలో ………
బుజ్జాయిలవైపు కన్నుకొట్టి , ఎవరు ఎవరి ఒంట్లో ధింపుతారో రండి అంటూ ధనుస్సును కిందకువదిలి చేతులతో రెండు కత్తులను అందుకుని నావైపుకు వస్తున్న వందమంది మీదకు విరుచుకుపడ్డాను , చేతులు – వేళ్ళు – చెవులు ……. తెగ నరుకుతూ నేరుగా వెళ్లి మహారాజు ముందు నిలబడ్డాను గర్వంగా ……..
గుంపులో ఎవరెవరికి ఏమేమి తేగాయో చూసుకుని హాహాకారాలతో నొప్పిని అనుభవిస్తున్నారు .
మహారాజు : ఊహించనట్లుగా నుదుటిపై చెమటతో వెనక్కు అడుగులువేసి , ఇంకా చూస్తున్నారే వీడిపై బాణాల వర్షం కురిపించండి .
రాణి అయితే కదలకుండా చూస్తూ ఉండిపోయారు .

కురిపించండి కురిపించండి ……. , ఇక్కడ నాపై బాణాల వర్షం కురిస్తే అక్కడ రాజ్యపు పొలాలలో మీ యువరాజుపై బాణాల వర్షం కురుస్తుంది .
మహారాజు : నా బిడ్డ ……. , ఆగండి అంటూ రెండుచేతులతో సైగలుచేశాడు .
అవును మీ ఒక్కగానొక్క వారసుడైన యువరాజు మా బానిసగా ఉన్నాడు .
మహారాజు : నేను నమ్మను …….
బుజ్జాయిలూ ధైర్యంగా రండి .
వీరాధివీరా వీరాధివీరా ……. అంటూ బుజ్జాయిలు పరుగున రావడం – మీరు ఉండగా మాకెందుకు భయం మీకేమీ కాలేదుకదా అంటూ నా గుండెలపైకి చేరడం ముద్దులుపెట్టడం చూసి నోటివెంట మాట రాలేదు మహారాజుకు ……..
మీరు ప్రార్థిస్తున్నారుగా నాకేమీ కాకూడదు అని నాకేమీ కాలేదు అంటూ కత్తులను కిందకువదిలి ముద్దులుపెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాను .
రాణి : బుజ్జితల్లీ – నాన్నా ……. అంటూ సంతోషంతో సంకెళ్లను తెంచుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు .
మీ అమ్మగారు కంగారుపడుతున్నట్లుగా ఉన్నారు వెళ్ళండి , వెళ్లి సంకెళ్ల నుండి విడుదల చెయ్యండి .
బుజ్జాయిలు : సంకెళ్లు తొలగించాలి కాబట్టి వెళుతున్నాము తొలగించి వచ్చేస్తాములే మీరు జాగ్రత్త అంటూ ముద్దుముద్దుమాటలతో ముద్దులుపెట్టడంతో , ఆహ్హ్ ….. అంటూ వదల్లేక కిందకు వదిలాను .
బుజ్జాయిలు : అమ్మా – అత్తయ్యా – పిన్నమ్మలూ …… అంటూ పరుగునవెళ్లి , వీరాధివీరుడు వచ్చాడుగా వీళ్ళు మనల్ని ఏమీచెయ్యలేరు అంటూ సంకెళ్లను లాగుతున్నారు – అమ్మా ….. ఏంటమ్మా వీరాధివీరుడిని అలా చూస్తున్నావు ? అమ్మా అమ్మా ……..
బుజ్జాయిలూ బుజ్జాయిలూ …….. మీకేమీ కాలేదుకదా అంటూ సంతోషంతో మోకాళ్లపైకి కూర్చుని హత్తుకున్నారు బుజ్జాయిల తల్లి .
బుజ్జాయిలు : మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన భటులనుండి వీరాధివీరుడు కాపాడారమ్మా , ఇప్పుడు మిమ్మల్ని – మన ప్రజలందరినీ కాపాడటానికి వచ్చారు .

కట్టివేసిన పిల్లలను విడుదలచేస్తూ బుజ్జాయిల సంతోషాలను అలా చూస్తుండిపోయాను .
మా చేతులనే గాయపరిచినవాడిని ఏమీచెయ్యకుండా ఊరికే ఉండిపోయారేమిటి మహారాజా అంటూ సామంతరాజులు కోపంతో రగిలిపోతున్నారు .
మహారాజు : వాడి దగ్గర నా ఒక్కగానొక్క వారసుడు బందీగా ఉన్నాడు – వాడే నా సర్వస్వం వాడికేమైనా అయితే నేను తట్టుకోలేను – ఇదంతా వాడికోసమే కదా …….
మంచి నిర్ణయం మహారాజా ……
సామంతరాజులు : మహారాజా …… ఇలాంటి అవకాశాన్ని వధులుకుoటారా , ఇలాంటి అవకాశం మళ్లీ రాదు , ఈ రాజ్యపు అదిగో ఈ కొండల్లోని వజ్రవైఢూర్యాలతో ఇంతటి సుందరీమణులతో ఒక్కరేటిమిటి వందమంది వారసులను కనవచ్చు …….
మహారాజు : నా భార్య జ్ఞాపకం వాడు – మా నాన్నగారి పేరుతో పెరిగాడు , వాడు లేని జీవితం వృధా వదిలెయ్యండి .
సామంతరాజులు : మీ చివరి నిర్ణయం ఇదేనా మహారాజా …….
మహారాజు : సైనికులారా …… ఆయుధాలను కిందకుదించండి .
సామంతరాజులు ఒక్కటైనట్లు మహారాజు వెన్నులో కత్తులను దించేశారు , మన్నించండి మహారాజా …… ఇంతటి అవకాశాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము , ఇక ఈ రాజ్యం మాదే – రాజ్య సంపద మాదే – అతిలోకసుందరీమణులైన రాణుల అందాలు మావే అంటూ మళ్లీ కత్తులతో పొడిచి చంపేశారు , సైనికులారా …… మీ మహారాజు కంటే ఎక్కువ సంపదను ఇస్తాము – మీకిష్టమైన అమ్మాయిలను చెరపట్టవచ్చు మాతో కలవండి .

నాన్నగారూ నాన్నగారూ …… అంటూ ఏడుస్తూ పరుగునవచ్చాడు యువరాజు – నాన్నగారు వీరి కపటాల గురించి ముందుగానే మన మంత్రిగారు చెప్పినా మీరు వినలేదు అంటూ కోపంతో సామంతారాజులపైపుకు ఆయుధాన్ని ఎత్తాడు .
సామంతరాజులు : భటులారా …… బంధించండి , జీవితాంతం చీకటి కారాగారంలో ఉంచి ఆనందిస్తాము .
వీరాధివీరా వీరాధివీరా …… అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు .
సామంతరాజులు : వీరాధివీరుడా ? , వీరాధివీరా …… ఇప్పుడేమి చేస్తావు ? – మమ్మల్నే గాయపరుస్తావా …… నిన్ను ఎలా హింసించి చంపుతామో చూడు , భటులారా వాడిని బంధించి మొదట వాడిచేతిని తెగ నరకండి .

అంత తొందర దేనికి వెన్నుపోటు రాజుల్లారా …… , ఇలాంటి ద్రోహాలు ఉంటాయని తెలియనివాడిని కాదు , బుజ్జాయిలూ …… మనదగ్గర ఎవరు ఉన్నారో తెలుసుకదా ………
బుజ్జాయిలు : అడవికే రాజు …….
ఇంకెందుకు ఆలస్యం పిలవండి మరి ……..
బుజ్జాయిలు : మిత్రమా మిత్రమా …… అంటూ కేకలువేశారు .
ఒక గర్జన వినిపించింది – ఆ గర్జనకే సామంతరాజులతోపాటు సైనికులంతా భయపడ్డారు , అడవికే కాదు అడవిలో ఉన్న రాజ్యాలకు కూడా నేనే రాజును అన్నట్లు సైనికుల దర్జాగా వస్తోంది – వెనుకే అంతకంటే దర్జాగా కృష్ణ రావడం బుజ్జాయిలకు చూయించి నవ్వుకున్నాము .
సైనికులంతా భయంతో పరుగులుతీస్తూ దారిని వదిలారు – సామంతరాజులు భయంతో సైన్యాధ్యక్షుల వెనుక దాక్కున్నారు .

సైన్యాధ్యక్షుడు : ఒక్క సింహం ఎంతమందిని చంపుతుంది మిగిలినవారు కురిపించే బాణాల వర్షంలో కొట్టుకుపోతుంది .
బుజ్జాయిలు చెప్పినది మీరు సరిగ్గా విన్నట్లు లేదు అక్కడ ఉన్నది ……..
బుజ్జాయిలు : అడవికే రాజు ……
అడవిరాజా …… మీరేమిచెయ్యగలరో కాస్త చూయించండి అంటూ బుజ్జాయిలను సింహంపై కూర్చోబెట్టాను .
బుజ్జాయిలు : మేము సింహంపై కూర్చున్నా భయపడటంలేదు – కంగారుపడటంలేదు ఏమిటమ్మా …….
ముసుగులోనుండే నావైపుకు వేలిని చూయించారు .
బుజ్జాయిలు : వీరాధివీరుడి గురించి మీకూ తెలిసిపోయిందన్నమాట అంటూ గాలిలో వారి తల్లికి ముద్దులువదిలారు , అత్తయ్యా – పిన్నమ్మలూ …… కంగారుపడాల్సిన అవసరమేలేదు , అమ్మ చూడండి ఎంత ధైర్యంగా ఉంది .
ఎంత ముద్దుముద్దుగా మాట్లాడుతున్నారో …… , మీరు పొగుడుతుంటే నాకు తెగ సోగ్గేస్తోంది అంటూ బుజ్జాయిలకు ముద్దులువదిలాను .
బుజ్జాయిలు : ఇంతటి వీరాధివీరుడికి సిగ్గు బాగోదు అంటూ నవ్వుకున్నారు .
ఇంతమంది వేలమంది సైనికులు వారి చేతుల్లో ఆయుధాలను చూసికూడా భయం కలగడం లేదు అంటూ సామంతరాజులు వణుకుతూనే అన్నగారి .

అడవిరాజు సైగచెయ్యడం చూసి , బుజ్జాయిలూ …… జాగ్రత్తగా పట్టుకోండి అంటూ మంజరి బుజ్జాయి భుజంపైకి చేరింది .
బుజ్జాయిలూ ……. చెవులు మూసుకోండి .
బుజ్జాయిలు : అత్తయ్యా – పిన్నమ్మలూ – అమ్మా – చెలికత్తెలూ – రాజ్య ప్రజలారా – పిల్లలూ …… వీరాధివీరుడు చెబుతున్నాడు చెవులు మూసుకోండి అనిచెప్పి మంజరిని రెండుచేతులతో సున్నితంగా అందుకుని వస్త్రంలో దాచుకుని చెవులు మూసుకున్నారు .
మిత్రుడు అయితే సింహం వెనుకే నిలబడ్డాడు తక్కువ వినిపించేలా …….
అడవిరాజు ఒక్కసారిగా ముందుపాదాలను మనిషి అంతెత్తుకు లేపి జూలువిధిలిస్తూ రాజ్యం చుట్టూ ఉన్న అడవి మొత్తం వినిపించేలా ఒక భయంకరమైన గర్జన గర్జించింది .
చెవులు మూసుకున్న వాళ్ళం తప్ప మిగతావారంతా చెవులలో రక్తం వచ్చినట్లు కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం అయిపోయినట్లు చెవులను స్పృశించుకున్నారు .

బుజ్జాయిలు : వీరాధివీరా …… చెవులు మూసుకున్నా గుండె దడదడలాడిపోయింది .
అవునా అంటూ ఇద్దరినీ ఆప్యాయంగా ఎత్తుకున్నాను .
బుజ్జాయి : మంజరి మంజరి అంటూ ఎగరేసి , ఏమీకాలేదులే వీరాధివీరా …… , మేమంటే ఎందుకంత ఇష్టం …….
ఏమో ఈ హృదయానికే తెలియాలి – మిమ్మల్ని గుండెలపై ఎత్తుకోకుండా ఒక్క క్షణమైనా ఉండలేకపోతున్నాను అంటూ ముద్దుచేసాను .
బుజ్జాయిలు : అమ్మ ప్రేమకంటే బాగుంది .
ఎదురుగా రాణిగారు హృదయంపై చేతినివేసుకున్నారు .
మన్నించండి రాణీగారూ …… , బుజ్జాయిలు ……

గర్జించింది కొద్దిసేపు భయపడ్డాము ఇంకేమిటి ? అంటూ సైన్యాధ్యక్షులు కత్తులు తీశారు .
సామంతరాజులే అనుకుంటే ధైర్యవంతులైన మీరుకూడా ఆతృతగా ఉన్నారు – కొద్దిసేపు ఆగితే మీకే తెలుస్తుంది అదిగో ……..
సముద్రం వైపునుండి తప్ప కొండపాదంగా ఉన్న కొండపైనుండి మరియు మిగిలిన రెండువైపుల నుండీ సింహం గర్జనలు – పులి చిరుతపులుల గాండ్రిoపులు – ఎలుగుబంటి – ఏనుగు – చింపాంజీలు – ఏనుగు గుర్రాలు – కోతులు – నక్కలు – జింకలు ……. ఇలా అన్నిరకాల జంతుల కేకలు వినిపించాయి , మరుక్షణంలో కోటగొడ ఎక్కివచ్చేవి కోటగొడపై మిగిలినవి సింహద్వారం బద్ధలుకొట్టుకుని లోపలికివచ్చాయి .
అందరూ ఆశ్చర్యంతో – అవాక్కై చూస్తుండటం చూసి భలేభలే అంటూ బుజ్జాయిలు చప్పట్లుకొడుతూ అడవిరాజుకు ముద్దులు కురిపిస్తున్నారు .
అంతలో మరొక సింహం వెనుకే బుజ్జి సింహాలు …… ఏనుగులు బద్ధలుకొట్టిన సింహద్వారం నుండి లోపలికివచ్చి అంతులేని సంతోషంతో నేరుగా అడవిరాజు దగ్గరికివచ్చి ప్రేమను పంచుకున్నాయి – మళ్లీ చూస్తాననుకోలేదు అన్నట్లు బుజ్జి సింహాలను ముద్దుచేస్తున్నాడు .
బుజ్జాయిలు : బుజ్జిసింహాలు భలే ముద్దుగా ఉన్నాయి వీరాధివీరా …… , అడవిరాజు బుజ్జిపిల్లలు ఇవేనన్నమాట ……..
అడవిరాజు : తీర్చుకోలేని రుణం కృతజ్ఞతలు అన్నట్లు బుజ్జి సింహాలను నోటితో కరుచుకునివచ్చి నాముందుకు వదిలాడు .
బుజ్జాయిలూ ……. ఎత్తుకోవాలని ఉందా ? అంటూ కిందకుదించాను .
బుజ్జాయిలిద్దరూ సంతోషంతో బుజ్జి సింహాలను ఎత్తుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు .
చూసి ఆనందించాను , సైన్యాధ్యక్షులారా …… ఇంకేమిటి అన్నారుకదా మరొకసారి చూయించాలా …….
అంతే ఈసారి ఏకంగా అడవిరాజుతోపాటు తన అర్ధాంగి కూడా జూలువిధిలిస్తూ గర్జించగానే , మూడువైపులా ఉన్న జంతువులన్నీ గాండ్రించాయి .
ఆ అరుపులకు రాజ్యం – అరణ్యమే దద్దరిల్లింది ఇక సైనికులెంత , ఒక్కసారిగా భయంతో తమ ఆయుధాలను కిందకువదిలేసి శరణు శరణు అంటూ మొక్కాళ్లపైకి చేరారు .

సామంతరాజులారా …… మీరేమంటారు ? .
వొళ్ళంతా చెమటతో వణుకుతూనే చుట్టూ చూసి , మన్నించండి మన్నించండి వీరాధివీరా మేము తప్పుచేసాము అంటూ నా కాళ్ళ చెంతకు చేరారు .
మిమ్మల్ని మన్నించాల్సింది నేనుకాదు ఈ రాజ్యపు బుజ్జి యువరాజు – బుజ్జి యువరాణి అంటూ బుజ్జాయిలవైపు చూయించాను .
బుజ్జి యువరాజా – బుజ్జి యువరాణీ మమ్మల్ని క్షమించి వదిలెయ్యండి ఇక ఇలాంటి తప్పులు ఎన్నటికీ చెయ్యము .
రాణులు – యువరాణులు ……. సంతోషిస్తున్నట్లు ముసుగులలోనే ఆనందబాస్పాలను తుడుచుకుంటున్నారు .
వీరాధివీరా – వీరాధివీరా …… అంటూ నా గుండెలపైకి చేరారు , ఓహో అలాగా బుజ్జి యువరాణీ …… మీ ఆజ్ఞగా చెబుతాను అంటూ ముద్దుపెట్టాను , ముందైతే మీరే స్వయంగా వెళ్లి ఈరాజ్యపు వీరులైన సైనికులను సంకెళ్ళ నుండి విముక్తులను చేసి రాజ్యపు ఆడపడచుల పాదాలపై పడండి .
వెంటనే వెంటనే చేస్తాము అంటూ పరుగునవెళ్లి సైనికులను విడుదల చేసి స్త్రీల పాదాల చెంతకు చేరారు .
అమ్మలూ – అక్కయ్యలూ …… వెంటనే క్షమించకండి అంటూ పిల్లలంతా సంతోషాలతో పరుగునవెళ్లి కోపాలతో సామంతరాజుల వేళ్ళను నలిపేశారు పాదాలతో ……. , అమ్మా – నాన్నా – అక్కయ్యలూ …… కుటుంబాలు కలిసాయి .
వారి ఆనందాలను అలా చూస్తుండిపోయాను .
బుజ్జాయిలు : వీరాధివీరా ….. నీవల్లనే ఆ ఆనందాలు అంటూ ముద్దులుపెట్టారు .
లేదు లేదు మీవల్లనే అంటూ గట్టిగా హత్తుకుని ఆనందిస్తున్నాను , సైనికులారా ….. ఇందులో మీ తప్పేమీ లేదు రాజులు ఎలాచెబితే అలా పాటించారు – ఇకనుండి మీ మహారాజు యువరాజే ……
యువరాజా యువరాజా ……. అంటూ నినాదాలు చేశారు , యువరాజా …… మీ తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలి – ఆ సామంతరాజులకు ఎలాంటి శిక్ష వేస్తారో మీఇష్టం …….
యువరాజు : సైనికులారా …… సామంతరాజులతోపాటు సైన్యాధ్యక్షులను బంధించి తీసుకెళ్లి మనరాజ్యపు కారాగారంలో పడేయ్యండి , మీ అందరినీ మనరాజ్యంలో కలుస్తాను – నాన్నగారి అంత్యక్రియలకు ఏర్పాటుచేయ్యండి .
ఆజ్ఞ మహారాజా అంటూ సామంతరాజులను బంధించి – మహారాజు మృతదేహాన్ని గౌరవంగా తీసుకునివెళ్లిపోయారు .
యువరాజు : మంత్రిగారూ …… మా తాతయ్య దగ్గరనుండి ఇప్పటివరకూ ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో సహాయం చేస్తూనే వచ్చారు – ఇకపై కూడా మమ్మల్ని ధర్మ మార్గంలో మీరే తీసుకెళ్లాలి .
మంత్రి : సంతోషం యువ …… మహారాజా ……
యువరాజు : మేము వచ్చేన్తవరకూ రాజ్యపు బాధ్యతలు మీవే ……..
మంత్రి : చిత్తం మహారాజా …….

అంతలో సముద్రం వైపు ఓడలు తీరానికి చేరినట్లు శబ్దాలు వినిపించాయి .
మంత్రి : ప్రభూ …… ఈరాజ్యపు రాజును వెంబడిస్తూ వెళ్లిన ఓడలు వచ్చినట్లున్నాయి .
అదే నిజం అన్నట్లు ఈ రాజ్యపు సైనికులను బందీలుగా పట్టుకుని సైనికులు లోపలికివచ్చారు – మంత్రి ద్వారా విషయం తెలుసుకుని యువరాజు ముందు మోకరిల్లారు , మహారాజా …… ఈ సైనికులను అడ్డుగా ఉంచి ఈరాజ్యపు రాజు – మంత్రి – సైన్యాధ్యక్షుడు పరాయిదేశం పారిపోయారు ప్రభూ , మన విలుకాళ్ళు రాజు గుండెల్లో బాణాన్ని దించారు ప్రభూ …….
బుజ్జాయిలు : ఆ రాక్షసుడు ఎంతదూరం పారిపోతే రాజ్యానికి అంత మంచిది .
సరిగ్గా చెప్పారు బుజ్జి యువరాజా …… అంటూ కష్టాలు – ఇబ్బందులుపడ్డట్లు స్త్రీలు కన్నీరు కారుస్తున్నారు , రాణీగారూ – యువరాణీ …… అంటూ వెళ్లి చుట్టూ చేరారు .
యువరాజు : సైనికులారా …… అందరినీ విడుదలచెయ్యండి , మీరు ….. మంత్రి గారితోపాటు వెళ్ళండి .
చిత్తం మహారాజా అంటూ వెళ్లిపోయారు .
సైనికులంతా వారి వారి కుటుంబాలను చేరారు .

హమ్మయ్యా …… కథ సుఖాంతం అయ్యింది .
అప్పుడేనా వీరాధివీరా వీరాధివీరా అంటూ బుజ్జాయిలు – యువరాజు ఒకేసారి అని నవ్వుకున్నారు .
ఒక్కసారిగా వీరాధివీరా వీరాధివీరా వీరాధివీరా ……. అంటూ రాజ్యంలోని పిల్లలు ఆ వెనుకే సైనికులంతా చుట్టూ చేరి , మీరు లేకపోయుంటే మేమంతా జీవితాంతం భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ బాధపడుతూనే ఉండేవాళ్ళం ……. , రాణులతోపాటు రాజ్యపు స్త్రీలందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు .
లేదు లేదు లేదు నేనేమిచేసాను మనిషిగా సాటిమనుషులకు సహాయం చేసాను అంతే , మీరు కృతఙ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఈ మీ బుజ్జి యువరాజు యువరాణీలకు , అడవిరాజుకు మరియు చుట్టూ ఉన్న అడవి జంతువులకు ఎందుకంటే ఈ బుజ్జాయిలను కలవకపోయి ఉంటే ఈరాజ్యానికి వచ్చేవాడినే కాదు అంటూ బుజ్జి సింహాలను ఎత్తుకున్న బుజ్జాయిలను ఒక్కొక్క సింహంపై కూర్చోబెట్టాను .
బుజ్జాయిలు : లేదు లేదు వీరాధివీరుడికే ……
సరిలేకానీ బుజ్జాయిలూ …… , వీరంతా వీరాధివీరా వీరాధివీరా అంటూ నినాదాలు చేస్తారని మీకెలా తెలుసు .
రాజ్యంలో ఎవరైనా గొప్ప పని చేస్తే నినాదాలతో అభినందించడం చూసాము – మీరు చేసినది మహా మహా గొప్ప పని కదా ……. అంటూ ముద్దుముద్దుగా చెప్పారు .
బుజ్జాయిలే కానీ పిడుగులు అంటూ గాలిలో ముద్దులువదిలాను .
అంతవరకూ సింహాలను చూసి భయపడుతున్న చుట్టూ ఉన్న పిల్లలకు ఏమీచెయ్యవు అంటూ పిలిచి తాకించి ఆనందిస్తున్నారు .
సైనికులారా …… నన్ను తరువాత అభినందించవచ్చు , మొదట రాజ్యంలో తాళాలువేసి బంధించిన మీ మీ కుటుంబాన్ని చేరండి .
సైనికులు : మీరు దేవుడు వీరాధివీరా అంటూ నమస్కరించి వెళ్లారు .

1314430cookie-checkజనం మెచ్చిన రాజు – Part 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *