జనం మెచ్చిన రాజు – Part 2

Posted on

పోటీల రోజున శిష్యులందరూ పోటీలకోసం సిద్ధమవడానికి వ్యాయామాలు చేస్తుంటే యువరాజులు మాత్రం గురుకుల ద్వారం వైపుకే చూస్తున్నారు .
సరిగ్గా పోటీలు ప్రారంభమయ్యే సమయానికి చుట్టుప్రక్కల రాజులందరూ గురుకులం చేరుకున్నారు . నేరుగా గురువుగారి దగ్గరకువెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు .
గురువుగారు : మీ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అంటూ దీవించారు – సరైన సమయానికే వచ్చారు మీ వారసుల పోటీలను ఆసక్తికరంగా వీక్షించండి – చిన్న గురువులు శిష్యులకు ఆ ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు .
రాజులు : చాలా సంతోషం గురువుగారూ …….. , మీకోరిక ప్రకారం పోటీలను వీక్షించాలంటే మా అందరి నుండి ఒక మనవి – మీకు తెలపకుండా ఆకస్మికంగా ఇక్కడకు రావడానికి కారణం కారణం ……….
రాజులందరూ …… గురువుగారిపై గౌరవంతో వచ్చిన కారణం చెప్పడానికి సంసయిస్తుండటం – యువరాజులు తమ అభిలాష తీరబోతోందన్న సంతోషంతో గుసగుసలాడుకోవడం చూసిన గురువుగారికి విషయం మొత్తం అవగతమైపోయింది .

గురువుగారు : ఈ ఆకస్మిక సందర్శన వెనుక కారణం ఇప్పుడే అర్థమైంది , ఒక్కవిషయం అడుగుతాను జవాబివ్వండి – మీ వారసులు బలహీనమైన రాజులుగా ఉండాలని ఆశపడుతున్నారా ? .
రాజులు : గురువుగారూ గురువుగారూ …….
గురువుగారు : మీరు ఇలానే కోరుకుంటే మీ ఇష్టం – ఈ పోటీలు మా శిష్యుడైన మహేష్ గొప్పతనం కోసం నిర్వహిస్తున్నవి కావు – ఒక్కటి మాత్రం సత్యం ఇక్కడ విధ్యనభ్యసించిన యువరాజులంతా గొప్ప రాజులు కాబోతున్నారు , మీ రాజ్యాలకు గొప్పతనం తీసుకురాబోతున్నారు – ఒకవిషయం గుర్తుపెట్టుకోండి ఒక వీరుడిని తలదన్నేవాడు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాడు అదే జీవన పయనం – అలాంటి వీరుడే నా శిష్యుడు మహేష్ , అతడితో పోటీపడి విజయం సాధించినా – చివరిదాకా పోరాడి ఓడినా ఒక మంచి గుణపాఠం యువరాజులకు బోధపడుతుంది , భవిష్యత్తులో ఎప్పుడైనా రాజ్యానికి అలాంటి అపాయం ఎదురైనప్పుడు ఈ పోటీ ఒక విశ్వాసాన్ని కలిగించి దైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుందన్నదే ఉద్దేశ్యం , ఈ పోటీలు మహేష్ కోసం కాదు యువరాజుల శక్తిసామర్ధ్యాలను తెలుసుకోవడం కోసం , చివరగా ఒకటి ఈ గురుకులంలో రాజు పేద అని తేడాలేకుండా అందరికీ ఓకేవిధమైన విద్యను నేర్పించబడుతుందని మీకు తెలిసిందే – ఈ పోటీలలోనే కాదు మహేష్ ను ఓడించే వీరుడు ఈ ప్రపంచంలోనే లేడు …….

రాజులంతా ఆగ్రహానికి లోనై వారి యువరాజులవైపు చూసారు .
అదే నిజం అన్నట్లు యువరాజులంతా వ్యక్తపరచడం – గురువుగారు చెప్పినది అక్షర సత్యం కాబట్టి తమను తాము తమాయించుకున్నారు .
గురువుగారు : ఇలాంటి వీరుడితో పోటీపడి గెలవడం అసాధ్యం కానీ యువరాజులంతా ఒక ఆత్మవిశ్వాసంతో రాజ్యానికి చేరుతారు అనిమాత్రం ఖచ్చితంగా చెప్పగలను .
రాజులు : గురువుగారూ …… మీరు చెప్పారంటే అది నిజం – గురువుగారు ఇలా పొగడటం మేమిప్పటివరకూ చూడలేదు – వీరుడా నీజన్మ ధన్యం ……. , కానీ గురువుగారూ ……. ఒక అనామకుడితో మా యువరాజులు ఓడిపోయి రాజ్యానికి చేరడం భావ్యం కాదు – అయినా ఇప్పటివరకూ గురుకులంలో యువరాజులతో ఒక యువరాజు మాత్రమే పోటీపడుతూ …….
గురువుగారు : రాజా ……
రాజు : గురువుగారూ తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ దయచేసి మాట్లాడనివ్వండి , తరతరాలుగా మిమ్మల్ని కాదని ఏరాజు ముందుకువెళ్లలేదు ఈ ఒక్కసారికి మా కోరిక మన్నించండి – యువరాజులకు మాత్రమే పోటీలు నిర్వహించండి , తోటి యువరాజులతో గెలిచినా ఓడినా మాకు గౌరవమే ……. , యువరాజుల కింద భ్రతకాల్సిన ఒకడి చేతిలో ఓడిపోవడం మేము జీర్ణించుకోలేము , మీరు మన్నిస్తున్నారు మాటిస్తున్నారు ……..
గురువుగారు మౌనంగా ఉండిపోయారు .

యువరాజులంతా సంబరాలు చేసుకుంటున్నారు – అందరూ వెళ్లి తమ తమ రాజులను కౌగిలించుకున్నారు – మాదగ్గరికివచ్చారు .
రేయ్ మహేష్ …… యువరాజులతో పోటీపడటానికి ఒక అర్హత కావాలి . తండ్రి ఎవరో తల్లి ఎవరో ఏ ఊరో కూడా తెలియదు నదిలో ప్రవాహానికి కొట్టుకొచ్చిన నువ్వు మాతో పోటీపడగలవని ఎలా అనుకున్నావు , మేము రాజులం అయ్యాక నీ సంగతి చెబుతాము నిన్ను మా పాదాలకింద తొక్కేస్తాము ఎంతటి వీరుడివో అప్పుడు తెలుస్తుంది అంటూ ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతున్నారు .
రాజులు : యువరాజులూ ……. మేమొచ్చిన పని ముగిసింది , మీ తోటి యువరాజులతో సంతోషంగా పోటీలు ఆస్వాదించండి త్వరలోనే గురువుగారికి గురుదక్షిణ సమర్పించి మిమ్మల్ని ఘనంగా రాజ్యానికి తీసుకెళతాము అనిచెప్పి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు .

గురువుగారు : మహేష్ ……..
గురువుగారూ అంటూ పరుగునవెళ్ళాను .
గురువుగారు : క్షమి …….
గురువుగారూ …… మీ నోటి నుండి ఆ మాట ఎన్నటికీ రాకూడదు , నాకైతే అస్సలు రాకూడదు అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : లేపి కన్నీళ్లను తుడుచుకున్నారు , వెళ్లు మహేష్ వెళ్లు వెళ్లి నదీ దేవతతో బాధను పంచుకో ……
బాధనా …… లేనేలేదు గురువుగారూ , మా గురువుగారి మాటే నాకు వేదం , సంతోషంగా పోటీలలో నా వంతు సహాయం చేస్తాను ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ అంటూ నవ్వుతున్నాను .
గురువుగారు : నిన్ను చూసి గర్వపడుతున్నాను మహేష్ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గురువుగారూ …… , గురువుగారే స్వయంగా గర్వపడుతున్నాను అనడం – మురిసిపోతూ కౌగిలించుకోవడం , ఒక శిష్యుడికి ఇంతకంటే ఏమికావాలి , సమయం మించిపోతోంది ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ ……..
గురువుగారి పెదాలపై చిరునవ్వు చూసి సంతోషంతో గురువుల దగ్గరికివెళ్లి యువరాజుల పోటీలలో నావంతు సహాయం చేస్తూనే నా మనసులో పోటీలను ఆస్వాధిస్తున్నాను . ఆ విషయాన్ని గురువుగారు గమనించకపోలేదు మధ్యమధ్యలో నావైపు చూసి నవ్వడం తెలుస్తూనే ఉంది .
వారం రోజులపాటు అట్టహాసంగా జరిగిన పోటీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యాయి .

గెలుపొందిన యువరాజులు సంతోషంతో – ఓడిన యువరాజులు బాధతో గురువుగారి దగ్గరకు చేరుకున్నారు .
గురువుగారు జయాపజయాల గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చి జీవితంలో అందరూ తమ తమ రాజ్యాలను గొప్పగా పరిపాలించాలని చెప్పారు , రేపే మీ మీ రాజ్యాలకు ప్రయాణం కావున ఆ ఏర్పాట్లు చేసుకోవాలని పంపించారు .

గురువుగారు విశ్రాంతి తీసుకోవడానికి కుటీరంలో ఏర్పాటుచేస్తున్నాను .
గురువుగారు వచ్చి మహేష్ …… అన్నీ పోటీలలో అందరినీ గెలిచేశావుకదూ ……
గురువుగారితో ఏదీ దాచను కాబట్టి అవునన్నట్లు సిగ్గుపడి , మోకాళ్లపై కూర్చుని గురువుగారి పాదాలను వొత్తుతున్నాను .
ఒక్కొక్క పోటీ ఎన్ని క్షణాలలో గెలిచేసావో కూడా నేను చెబుతాను అంటూ చాలాసేపు సంతోషంతో ముచ్చటించాము .
మహేష్ మహేష్ …… పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్లాలికదా …..
గురువుగారు : ఇక చాలు మహేష్ , తోటి స్నేహితులు పిలుస్తున్నారు కదా వెళ్లు …..
అలాగే గురువుగారూ …… ఆహారం తీసుకొచ్చి మా గురువుగారిని సేవించుకుంటాను అనిచెప్పి బయటకువెళ్ళాను .

బయటకువెళ్ళిచూస్తే యువరాజులు ……. , స్నేహితులకోసం చుట్టూ చూస్తున్నాను.
యువరాజులు : వీరాధివీరా పిలిచింది మేమే …….
ఆహారం తీసుకురావడానికే కదా పదండి స్నేహితులూ …….
యువరాజులు : స్నేహితులా ……. అంటూ నవ్వుతున్నారు , మేము కాబోయే రాజులం – నువ్వు మా కాబోయే బానిస , నేటితో మా గురుకులం పూర్తయ్యింది , మేము అరణ్యం వెళ్లి ఆహారం తీసుకురావడం ఏమిటి …… , చూశావా నిన్ను పోటీల నుండి ఎలా తప్పించామో …… అదీ మా అధికారం , మమ్మల్ని గెలిచే ఏ వీరుడూ ఈ భువిపై ప్రాణాలతో ఉండడు , మేము రాజులం అయిన వెంటనే ఇక్కడికి వస్తాము గురువుగారి ఆశీర్వాదం తీసుకోవడానికి కాదు నిన్ను బానిసగా లాక్కెళ్లడానికి , మా అధికారానికి గురువుగారు కూడా అడ్డురాలేరు అదీ మా అధికారం ……. , ఉన్న ఈ కొన్నిరోజుల మీ గురువుగారిని భక్తిశ్రద్ధలతో పూజించుకో ……. , ఆ కొన్నిరోజులు ఎందుకంటే ఈరోజు నుండి పదిహేనవ రోజున ఈ భువిపైననే అందమైన అతిలోకసుందరి స్వయంవరం జరగబోతోంది – ఆమె అందాన్ని వర్ణించడం కవులకు కూడా సాధ్యం కావడం లేదట – స్వయంవరం వరకూ ఆమె గురించిన ఆలోచనలు తప్ప మరొకదానికి ఆస్కారం ఇవ్వడం మాకిష్టం లేదు , స్వయంవరానికి కేవలం యువరాజులు మాత్రమే అర్హులు – నువ్వు మాకంటే ఎంత వీరాధివీరుడైనా సరే నిన్ను రాజ్యంలోకి కూడా అడుగుపెట్టనివ్వరు కాబట్టి ఎవరి అర్హతలో వాళ్ళు బ్రతకాలి ……. , నువ్వెప్పుడూ మా కాళ్ళ క్రిందనే అంటూ రాక్షసానందం పొంది హెచ్చరించి వెళ్లారు .

మహేష్ భయం వేస్తోందా అంటూ అప్పటివరకూ జరిగిన సంభాషణ విన్నట్లు చిన్న గురువులు వచ్చి అడిగారు .
భయపడటం అన్నది గురువుగారు ఎన్నడూ నేర్పించలేదు – భయపడితే గిడితే గురువుగారికి మాత్రమే భయపడతాను – గురువుగారిని సేవించుకోవడం నుండి దూరం చెయ్యడం ఒక్కటే నన్ను బాధపెడుతుంది భయపెడుతుంది …….
చిన్న గురువులు : అధికాదు మహేష్ …… , రేపు యువరాజులు తమ తండ్రుల సమక్షంలో గురుదక్షిణ సమర్పించిన తరువాత గురువుగారిని కోరిక కోరడం సంప్రదాయం , ఈసారి ఖచ్చితంగా నిన్ను బానిసగా తీసుకెళతామని కోరిక కోరతారు – కాదు అంటే రాజులంతా కలిసి గురుకులాన్ని లేకుండా చేస్తారు .
అలా జరగనేకూడదు – వేలాది మందికి విద్యాభ్యాసం చేస్తున్న ఈ గురుకులం నా ఒక్కడి వలన – నేను సంతోషంగా వెళతాను – గురువుగారి మాట నెగ్గాలి .
చిన్న గురువులు : మరి గురువుగారిని వదిలి ……..
అంతే నా కళ్లల్లో చెమ్మ …….
మహేష్ మహేష్ అంటూ అందరూ ఉద్వేగానికి లోనయ్యారు .
గురువులూ గురువులూ …… ష్ ష్ ష్ గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు భంగం కలిగించకూడదు అంటూ దూరం తీసుకెళ్లబోయాను .

మహేష్ అందరూ ……. లోపలికి రండి అంటూ కుటీరం గుమ్మం దగ్గరనుండి గురువుగారు పిలిచారు .
వెంటనే కన్నీళ్లను తుడుచుకుని గురువులూ …… ఈ విషయం గురువుగారికి తెలియకూడదు బాధపడతారు అంటూ అందరితోపాటు లోపలికివెళ్ళాను .
మహేష్ …… నువ్వు నిజంగా మహేశ్వరుడివే అంటూ కౌగిలించుకున్నారు గురువుగారు .
గురువుగారూ …… ఏమిటీ సంతోషం ……
గురువుగారు : సంతోషం కాదు మహేష్ ప్రియమైన శిష్యుడిపై మమకారం , ఇక నటించకు నీతో ….. యువరాజుల మాటలన్నీ విన్నాను – నువ్వు …… గురువులతో మాట్లాడిన మాటలు విన్నాను , నా జీవితకాలంలో నీలాంటి గొప్ప శిష్యుడిని చూడలేదు , ఈ గురువునే గర్వపడేలా చేసావు – మీ గురువులు చెప్పినది నిజమే యువరాజులు కోరితే నిన్ను పంపించడం కంటే మరొక మార్గం లేదు .
గురువుగారితోపాటు నా కళ్లల్లో చెమ్మ …… తుడుచుకుని , సంతోషంగా వెళతాను గురువుగారూ ……
గురువుగారు : ఏమిచ్చి ఈ శిష్యుడి …….
గురువుగారూ …… అంటూ పాదాలను స్పృశించాను – నేనెప్పటికీ మీ సేవకుడినే , నా జీవితాంతం మిమ్మల్ని సేవించుకున్నా రుణం తీరదు , అంత ఇష్టంతో ఈ శిష్యుడిని ఇంతటివాడిని చేశారు .

మహేష్ అంటూ లేపి హత్తుకుని ఉద్వేగానికి లోనౌతున్నారు గురువుగారు .
చిన్న గురువులు : గురువుగారూ ……. వేరొక ఉపాయం లేదంటారా ? , ఇంతటి వీరాధి వీరుడు – శివుడి వరప్రసాదం …… ఈ యువరాజుల కింద బానిసగా ఉండాల్సిందేనా ……. ? .
గురువుగారు : అలా ఎన్నటికీ జరగనివ్వను అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు . రాజులు – యువరాజులు అన్న అధికారబలంతోనే కదా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు , మన మహేష్ …… వాళ్ళకంటే గొప్ప రాజు అయితే అప్పుడు వీళ్లే బానిసలు అవుతారు . ఈ గురుకులం ఈ రాజులకు తరతరాలుగా మంచి గుణాలు నేర్పి పంపుతుంటే ఒక్కసారి రాజులు అయ్యాక అధికారమదంతో ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు – ఇలా జనం నుండి రాజు అయితే ప్రజలు సంతోషాలతో జీవిస్తారు .
చిన్న గురువులు : వాళ్ళ కంటే గొప్ప రాజు …… ? ఎలా గురువుగారూ ? .
గురువుగారు : వాళ్ళ నుయ్యి వారే తవ్వుకున్నట్లు స్వయంవరం గురించి యువరాజులే చెప్పారుకదా అలా ……..
చిన్న గురువులు : స్వయంవరం జరిగే రాజ్యం ఇక్కడికి వేల మైళ్ళ దూరంలో కదా గురువుగారూ …….. , మహేష్ ఇప్పటివరకూ గురుకులం కూడా దాటి వెల్లనేలేదు ఎలా సాధ్యం …….
గురువుగారు : అదే మార్గం అని మీరు నమ్ముతున్నారు అదే సంతోషం ……
లేదు లేదు గురువుగారూ …… మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనంటే వెళ్లను , గురువుల పాదసేవ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు , నేను వెళితే ఆగ్రహించి మిమ్మల్ని ఏమైనా చేస్తారు …… నేను ఒప్పుకోనే ఒప్పుకోను .
గురువుగారు : వయసు మళ్ళిన నాకు ఏమైతే ఏమిటి మహేష్ – ఒక మనిషి రెండు జీవితాలు చూసేంత చూసేసాను , నన్ను చూసుకోవడానికి ఇంతమంది గురువులు శిష్యులు ఉండనే ఉన్నారు – నీ గమ్యం ఈ గురుకులంతో ఆగిపోకూడదు – నువ్వు గొప్పవాడివి కావాలి – వీలైనంత మందికి సంతోషాలను పంచాలి నాయకుడవ్వాలి – ఇక బయట ప్రపంచం గురించి మనం తెలియచేద్దాము .
గురువుగారూ ……..
గురువుగారు : ఇదే శిష్యుడిగా ….. ఈ గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ , నా కోరిక తీరుస్తావా మహేష్ ……..
గురువుగారూ అంటూ మోకాళ్లపై చేరాను – మీరు అర్థించడం ఏమిటి ఆజ్ఞ వెయ్యండి .

గురువులందరిలో సంతోషం – గురువుగారూ …… మహేష్ ను రాజ్యంలోపలికే అడుగుపెట్టనివ్వరు ఇక స్వయంవరానికి ఎలా ? .
గురువుగారు : లోకాకళ్యాణం కోసం ఏమిచేసినా తప్పులేదు – మహేష్ అర్థమైంది కదా – నీకు ఎల్లప్పుడూ మన దైవం పరమ శివుడు మరియు ఈ గురువుల ఆశీస్సులు వెన్నంటనే ఉంటాయి దైర్యంగా ముందుకువెళ్లు , మూడురోజులలో నీ ప్రయాణం – ఈ మూడురోజులు మనకు నిద్రాహారాలు లేవు , ఇప్పటివరకూ ఎవ్వరికీ నేర్పించని యుద్ధ వ్యూహాలు – బహుబాణ సంధింపు నైపుణ్యం ……. లాంటివన్నీ నీకు నేర్పుతాను – బయటి ప్రపంచం గురించి తెలియజేస్తాము , ఈ రాత్రికి సాధనను అరణ్యంలోని రహస్యమైన గుహలోకి మార్పు చెయ్యమని గురువులకు ఆదేశాలిచ్చారు , స్వయంవరం పూర్తయ్యేంతవరకూ మహేష్ గురించి పట్టించుకోము అన్నారుకదా , ఆ అతిలోకసుందరి మనసు గెలిచి ఆ రాజ్యానికి రాజై గురుకులానికి చేరిన మన శిష్యుడిని చూసి ఈ రాజులంతా బెదిరిపోవాలి – అది చూసి నేను ఆనందించాలి , ఇదే నువ్విచ్చే గురుదక్షిణ మహేష్ …….
నా దైవమైన గురువుగారి కోరిక తీర్చడం కంటే అదృష్టం మరొకటి ఏముంటుంది గురువుగారూ అంటూ పాదాలను స్పృశించాను .
సంతోషంగా ఆశీర్వదించి ఆయుధాలతోపాటు నన్ను గుహలోకి తీసుకెళ్లి రాత్రంతా నిద్రపోకుండా కష్టతరమైన విద్యలను నేర్పించారు .

సూర్యోదయ సమయానికి ఏమీజరగనట్లు నదికి చేరుకుని సూర్యవందనం – స్నానమాచరించి గురుకులానికి చేరుకున్నాము .
యువరాజులను సాంప్రదాయంగా తీసుకెళ్లడానికి రాజులు రావడం – నావైపు అవహేళన చేస్తూనే యువరాజులు గురుదక్షిణ కార్యక్రమం పూర్తిచేయ్యడం – చివరగా అనుకున్నట్లుగానే చుట్టుప్రక్కల రాజ్యాలలో పెద్ద రాజ్యం రాజు …… నన్ను తమ రాజ్యంలో భటుడిగా పంపమని గురువుగారిని కోరారు .
ప్రణాళిక ప్రకారం గురువుగారు ఏ అనుమానం రాకుండా ఒప్పుకున్నట్లు నటించారు – ఇలాంటి తప్పుడు కోరికలకు మూల్యం త్వరలోనే అనుభవిస్తారు అంటూ మనసులో అనుకున్నారు .
రాజు : మా యువరాజు ఒక స్వయంవరానికి వెళ్లి వచ్చిన తరువాత వచ్చి తీసుకెళతాము – మహేష్ …… భటుడిగా బాధ్యతలు నిర్వర్తించడం స్వయంగా చూడాలని ఆశపడుతున్నాడు .
గురువుగారు : ఊ అన్నారు .

గురుదక్షిణ పూర్తిచేసుకుని మేళ తాళాలతో యువరాజులు వెళుతూ నాదగ్గర ఆగి , పదిహేను రోజుల్లో కలుస్తాము , నీ వలన మేమిక్కడ ఎంత ఇబ్బందిపడ్డామో అంతకుమించి నిన్ను ……. వద్దులే ఇప్పుడే చెబితే బాగోదు .
యువరాజులూ …… నేను మొదటనుండీ మిమ్మల్ని స్నేహితులుగానే చూసాను .
యువరాజులు : అదే నువ్వు చేసిన తప్పు – నువ్వు స్నేహితుడివి ఏమిటి – మేము మేము యువరాజులు మాత్రమే స్నేహితులం , నువ్వు ఎప్పటికీ మా బానిసవే అంటూ కోపంతో నేల తల్లిపైకి తోసేసి అహంకారంతో వెళ్లిపోయారు .
మహేష్ మహేష్ …… అంటూ వచ్చి చిన్న గురువులు వచ్చారు .
గురువుగారు వచ్చి ఇక రెండు రోజులే , ఏ ఒక్క నిమిషం కూడా వృధా కానివ్వరాదు అంటూ రెండు రోజులపాటు నిర్విరామంగా శిక్షణ కొనసాగింది .
గురువుగారు గర్వంగా భుజం తట్టడం చూసి , మహేష్ …… ఒక శిష్యుడు ఈ విద్యలలో నైపుణ్యం సంపాదించడానికి ఏళ్ళు పడుతుంది నువ్వు మూడురోజుల్లో నేర్చుకున్నావు అంటూ ఆనందించారు .
అంతా గురువుగారి ఆశీర్వాదం అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : మహేష్ ……. రేపు సూర్య వందనం కాగానే అటునుండి ఆటే నీ ప్రయాణం .
గురువుగారూ అంటూ బాధతో హత్తుకున్నాను .
గురువుగారు : నీ గురించి నాకు తెలియదా మహేష్ – పదిహేను రోజులే కదా ……
గురువుగారూ …… ఈరాత్రంతా మీ పాదసేవలోనే తరించనివ్వండి .
గురువుగారు మురిసిపోయారు , నీ ప్రాణ స్నేహితుడు కృష్ణ ఉండగా నీకు – నువ్వు ఉండగా కృష్ణకు , మేమిక్కడ దైర్యంగా ఉండవచ్చు . బయట ప్రపంచంలో అన్నిరకాల మనుషులు – రాక్షసులు ఉంటారు కాబట్టి నీ ఆయుధాలన్నింటినీ ఇప్పుడే రెడీ చేసుకో ……. , ఏ రాజ్యం కంటపడకుండా ప్రయాణం సాగించాలి .
మీ ఆశీర్వాదం గురువుగారూ ……..
*************

1308390cookie-checkజనం మెచ్చిన రాజు – Part 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *