జనం మెచ్చిన రాజు – Part 11

Posted on

నీళ్ల చప్పుడు పెద్దగా వినిపిస్తుండటంతో దేవకన్య తియ్యనైన మాయనుండి బయటపడి కళ్ళుతెరిచాను . ఎదురుగా కాస్త దూరంలో ……. మహీ మహీ ఒకసారి అలా చూడు ……
మహి : నాకు …… నా కౌగిలి వలన కలుగుతున్న మాధుర్యం తప్ప ఏదీ అవసరంలేదు – ఎటువైపూ చూడను మ్మ్మ్ మ్మ్మ్ అంటూ మరింత గట్టిగా అల్లుకుపోతోంది .
అంతకంటే అదృష్టమా దేవకన్యా …… , నేనెక్కడికీ వెళ్లను కదా నా కౌగిలిలోనుండే ఒకసారి ఆ అందాలను చూడు మహీ …….
మహి : ఉదయం నుండీ ప్రకృతి అందాలను తనివితీరా తిలకిస్తూనే ఉన్నాము కదా ……..
ఆ అందాలన్నీ ఒకఎత్తు అయితే ఇప్పుడు చూసేది మరొక ఎత్తు మహీ …… ఒక్కసారి అటువైపు చూడు మా బుజ్జికదూ – మా బంగారం కదూ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : నా దేవుడి కౌగిలింతలోని మాధుర్యాన్ని సైతం త్యాగం చేసి చూడబోతున్నాను – అబ్బురపరిచేలా ఉండకూడదు కొరికేస్తాను అంటూ బుగ్గపై కొరికేసి నన్ను హత్తుకునే వెనక్కు తలతిప్పి చూసింది . ఎదురుగా జలపాతపు సౌందర్యాన్ని చూసి ఆహా …… అద్భుతంగా ఉంది అంటూ సంతోషంతో నానుండి జలపాతం వైపుకు తిరిగింది .

అమ్మ జలపాతం …… ఈ దేవకన్య అంత అందంగా ఉంది అంటూ కిందకుదిగి దేవకన్యను ఎత్తుకున్నాను .
మహి ……. నా మెడను చుట్టేసి అమ్మ జలపాతమే అందంగా ఉంది అంటూ నా బుగ్గపై ముద్దులుపెడుతూ కనులారా తిలకిస్తోంది . దేవుడా …… మనం అడవిలోపలికి కదా ప్రయాణించింది చివరికి నదీ అమ్మను ఇంత అందమైన జలపాతాన్ని ఎలా చేరాము .
బహుశా ……. నదీప్రవాహం మలుపులుతిరుగుతూ అడవి అంతా పచ్చగా ఉండేలా చూసుకుంటోంది కాబోలు …….
మహి : అయితే అడవిలో ఎటువైపు వెళ్లినా నదీ అమ్మను చేరుకుంటాము అన్నమాట – ఇంకా ఒడ్డునే ఆగిపోయారే సౌందర్యమైన జలపాతపు అమ్మ దగ్గరికి తీసుకెళ్లరే ……..

జలపాతం దగ్గరికి వెళ్లడం లేదు …….
మహి : ఎందుకు ఎందుకు …… అమ్మదగ్గరికి అమ్మదగ్గరికి అంటూ నా గుండెలపై ప్రేమతో కొడుతూ గింజుకుంటోంది .
ఎందుకా …… నువ్వు మిట్ట మధ్యాహ్నం నావైపుకు తిరిగి అలా కౌగిలించుకున్నావా ఇద్దరమూ అడవినే మైమరిచిపోయాము మళ్లీ స్పృహలోకివచ్చినది సూర్యాస్తమయానికే …… చీకటిపడేలోపు యువరాణీగారు యువరాణీ వారి మందిరంలో ఉండాలికదా …… , నదీ ప్రవాహం వెంబడి ప్రయాణించామంటే చీకటిపడేలోపు చేరుకోవచ్చు – మన మిత్రుడి అసలుసిసలైన వేగాన్ని చూడవచ్చు యువరాణీ గారు అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : మ్మ్మ్ …… మరి జలపాతంలో అమ్మఒడిలో జలకాలాట ……..
రేపు సూర్యోదయ సమయానికల్లా జలపాతం దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నీ వీరాధివీరుడిది ……..
మహి : ఈరోజు సూర్యాస్తమయం నుండి రేపు సూర్యోదయం వరకూ ఆగాలా …… నావల్ల కాదు , తల్లీ – మహీ తల్లీ – బంగారూ ……. తొందరగా నీ దేవుడితోపాటు నా ఒడిలోకి రా అంటూ అమ్మ ప్రేమతో పిలుస్తోంది వినిపించడం లేదా ? .
పెదాలపై చిరునవ్వుతో దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను – అదికాదు మహీ ….. చీకటిపడేలోపు చేరుకోవాలికదా – ప్రవాహం వెంబడి అంటే చుట్టు తిరిగివెళ్లాలి ఆలస్యం అవుతుంది .
మహి : నదీ అమ్మ ఒడిలో చేరకుండా నేను రానంటే రాను – ఒక్కసారి ఓకేఒక్కసారి దేవుడా అంటూ ముద్దులుపెడుతోంది .
ఇంత మధురమైన ముద్దులుపెడితే ……..
మహి : ఉమ్మా ఉమ్మా ఉమ్మా దేవుడా అంటూ కిందకుదిగి నాచేతిని అందుకుని జలపాతం వైపుకు లాగుతోంది .
అదిగో చీకటిపడుతోంది అంటే సూర్యాస్తమయం అయిపోయి చాలసేపే అయ్యిందన్నమాట ……..
మహి : నాకదంతా తెలియదు , ఇప్పుడైతే ఆలస్యం చేస్తున్నది తమరే …….
నిజమే ……. తొలిసారి కోరిక కోరినప్పుడే అమ్మఒడిలోకి చేరి ఉంటే ఈపాటికి బయలుదేరిపోయేవాళ్ళము .
మహి నవ్వుకుని నాచేతిని లాగుతోంది .

మహీ మహీ …… అలాచూడు అలాచూడు రంగురంగుల అందమైన రామచిలుక మనవైపుకే ఎగురుకుంటూ వస్తున్నట్లు అనిపిస్తోంది .
మహి : అనిపించడం ఏమిటి దేవుడా మనవైపుకే వస్తోంది – మంజరీ ……. అంటూ చేతివేలుని చూయిస్తూ చేతిని పైకెత్తింది .
ఆశ్చర్యంగా మాదగ్గరికే వచ్చి మహి వేలుపై కాకుండా తలపై ముక్కుతో పొడిచి నేరుగా నా భుజంపైకి చేరింది . మరింత ఆశ్చర్యంగా నా బుగ్గపై ముద్దుకూడాపెట్టింది .
సంతోషంతో చిలుకను సున్నితంగా స్పృశించి వేలుపైకి తీసుకున్నాను – చిలుకా ….. నీ అంత అందమైన చిలుకను నేను నా ప్రయాణంలో దాటిన ఏ అడవిలోనూ చూడలేదు ముద్దొచ్చేస్తున్నావు నా దేవకన్యలా అంటూ తియ్యనైనకోపంతో రుసరుసలాడుతున్న దేవకన్యకు గాలిలో ముద్దు వదిలి చిలుకకు ముద్దుపెట్టాను .

ధన్యవాదాలు చాలా సంతోషం వీరాధివీరా – దేవుడా – ప్రభూ …… అంటూ రామచిలుక నా దేవకన్య స్వరానికి ఏమాత్రం తగ్గనంతలా తియ్యనైన పలుకులు పలికింది .
మరింత ఆశ్చర్యపోయి కన్నార్పకుండా అలా చూస్తుండిపోయాను .
దేవకన్య తియ్యదనంతో నవ్వుతూ వచ్చి నా గుండెలపైకి చేరింది .
చిలుక : దేవుడా దేవుడా ……. అంటూ మళ్లీ నాభుజం మీదకు చేరి బుగ్గపై ముద్దులుపెడుతోంది .
తేరుకుని చిలుకా …… స్వరంలో నా దేవకన్యతో పోటీపడుతున్నావు తెలుసా ? .
చిలుక : పలుకులు నేర్చుకున్నదే మీ దేవకన్యతో దేవుడా ……
ఓహో అర్థమైంది అర్థమైంది మంజరీ అని పిలిచింది కదూ ……. , మంజరీ …… అంటూ చేతివేలిపైకి తీసుకుని మళ్లీ ముద్దుపెట్టాను , క్షమించు మంజరీ …… నిన్ను – దేవకన్యను చూస్తూ ముద్దులుపెట్టకుండా ఉండలేను అంటూ దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను .
చిలుక : మా అదృష్టం దేవుడా …… , కానీ మీ దేవకన్య గురించి నాతో మాట్లాడకండి .

మహి : నేనేమి చేసాను మంజరీ అంటూ ముద్దుపెట్టబోతే ఎగిరి నా మరొక భుజంపైకి చేరింది .
చిలుక : ఎందుకా ……. , నీ కలల రాకుమారుడి గురించి ప్రతీ విషయం నాతోనేకదా మాట్లాడేదానివి …….
మహి : అవును కదా …….
చిలుక : మరి నీ దేవుడిని జాతరలో చూసిన విషయం చెప్పావా ? లేదు – మన దేవుడికోసం నువ్వు జ్వరంతో విలవిలలాడిపోతుంటే ప్రేమతో చూసుకున్నది ఎవరు ? నేను – అలాంటిది నీ దేవుడు రాగానే ప్రక్కనే ఉన్న నన్ను రమ్మని కూడా పిలవకుండా పరుగునవెళ్లిపోయావు , సరేలే స్నేహితురాలు పిలవాల్సిన అవసరం లేదు అని వీలైనంత తగ్గి నేనే ఉద్యానవనంలోకి వచ్చాను – నన్ను మన దేవుడికి పరిచయం చేయకపోగా కనీసం నావైపు కన్నెత్తి కూడా చూడలేదు ……. , ఏళ్లుగా కలవరిస్తున్న దేవుడు కనిపించారు కాబట్టి దేవుడి కౌగిలిలో మైమరిచిపోయావు సరే భోజనం చేసేటప్పుడు – పడుకునేటప్పుడు అయినా మంజరీ అంటూ పిలిచి దేవుడికి పరిచయం చేస్తావేమో అని ఆశపడ్డాను , దేవుడు రూపొందించిన పూలపాన్పుపై హాయిగా పడుకుండిపోయావు , అదికూడా సరే కనీసం ఉదయమైనా గుర్తొచ్చానా అప్పుడు కూడా పరిచయం చెయ్యలేదు ……..
మహి నవ్వులు ఆగడం లేదు ……..
చిలుక : అందుకే ఇక లాభం లేదనుకుని నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను – ఇకనుండీ నీ ప్రాణం కంటే ఎక్కువైన ఈ దేవుడే నా దేవుడు – నా సేవలన్నీ ఇక మన దేవుడికే ……..
మహి : అంతకంటే సంతోషం ఏముంటుందే మంజరీ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వేలితో స్పృశించబోతే కొరికేసింది .
చిలుక : నాకోపం చల్లారేవరకూ ఇంతే – నా ముద్దులన్నీ మన దేవుడికి మాత్రమే సొంతం ……..

మంజరీ …….
చిలుక : దేవుడా …… మీరేమి చెప్పబోతున్నారో నాకు తెలుసు – దయచేసి కాసేపు బెట్టు చెయ్యనివ్వoడి …….
అలా అయితే అలాగే మంజరీ అంటూ ముద్దుపెట్టి , దేవకన్యను ప్రేమతో హత్తుకున్నాను .
చిలుక : ముందు పరిచయం – నా పేరు …… మీ దేవకన్య చెప్పేసిందిగా అంటూ ఎగురుతూ వెళ్లి దేవకన్య పెదవిపై కొరికేసింది . ( స్స్స్ …… ) నా పేరు మంజరి – ఈ ముద్దుపేరు పెట్టినది మీ అందమైన దేవకన్యనే …….
ముద్దు ముద్దు పేరు మంజరీ అంటూ దేవకన్య పెదాలపై నేనుకూడా కొరికేసాను .
మహి : స్స్స్ స్స్స్ …….
మంజరి సంతోషంతో అటూ ఇటూ ఎగిరి మళ్లీ భుజంపైకి చేరింది . నా బుగ్గపై ముద్దుపెట్టింది .
దేవకన్య …… మాఇద్దరివైపు తియ్యనైనకోపంతో చూస్తోంది – మిమ్మల్నీ అంటూ నా పెదవిపైకొరికేసి నవ్వుతోంది .
స్స్స్ ……. నొప్పి తియ్యగా ఉంది మహీ అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .

మంజరి : దేవుడా …… నిన్న సాయంత్రం నుండీ చూస్తున్నాను , ఈ దేవకన్య …… మిమ్మల్ని ప్రేమతో వీరాధివీరా – దేవుడా – ప్రభూ …… అంటూ పిలుస్తోంది మీ పేరు ఏమిటి అంటూ ముద్దుముద్దుగా అడిగింది .
మహి : అవును నిజమే నా దేవుడి పేరు తెలుసుకోవడమే మరిచిపోయాను – అందుకే మంజరి ఎప్పుడూ నా ప్రక్కన ఉండాల్సిందే అంటూ గాలిలో ముద్దులు వదిలింది .
మంజరి : దీనికేమీ తక్కువలేదు …….
మహి : నవ్వుకుని , దేవుడా …… మీ నామధేయం ? .
నా అందమైన దేవకన్య నామధేయమే ……. , ” ఆ లోకమాత పరమేశ్వరి నామధేయం మహేశ్వరి నా దేవకన్య అయితే ……. ”
మహి : ” కోరిన వరాలను కటాక్షించే ఆ పరమశివుడి నామధేయం మహేశ్వరుడు …… నా దేవుడు ” అన్నమాట అంటూ నాకళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ హత్తుకుని సంతోషం పట్టలేక హృదయంపై ముద్దులుకురిపిస్తోంది .
అవును మహేశ్వరీ అంటూ అంతే సంతోషంతో నుదుటిపై పెదాలను తాకించాను .
మంజరి : “మహేశ్వరి – మహేశ్వరుడు ” ముద్దుగా ” మహి – మహేష్ ” అన్నమాట ఒకరికోసమేఒకరు పుట్టారన్నమాట అంటూ మా ఇద్దరి ఆనందంతో మా బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోతోంది .
ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరం ప్రాణంలా చూసుకుని , మంజరికి ఒకేసారి ముద్దుపెట్టాము .

దేవకన్య మహీ – దేవుడా మహేష్ , దేవకన్య మహీ – దేవుడా మహేష్ …… అంటూ కలవరిస్తూ గాలికూడా దూరనంతలా కౌగిలించుకుని మళ్లీ ప్రపంచాన్నే మరిచిపోయాము .
ఎంతసేపు అయ్యిందో ఏమిటో పూర్తిగా చీకటిపడిపోయింది – ఇద్దరమూ ఒకేసారి స్పృహలోకివచ్చి పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టుకుని , మంజరీ – మంజరీ …… ఇంతదూరం మాకోసం వచ్చావు అంటూ ప్రేమతో స్పృశిస్తున్నాము .
మంజరి : కారణం ఉంది దేవుడా …….
మహికి అర్థమైపోయినట్లు వెంటనే మంజరి పాదాలకు కట్టిన వర్తమానాన్ని అందుకుని చదివి , పట్టరాని ఆనందంతో నా పెదాలపై ముద్దులుకురిపించి ఏకంగా నన్నే ఎత్తడానికి ప్రయత్నిస్తోంది – వీలుకాక అందమైన సిగ్గుతో నా గుండెలపైకి చేరి మిక్కిలి సంతోషంతో కేకలువేస్తోంది .
దేవకన్య సంతోషం చూసి మంజరి కూడా మాచుట్టూ ఎగురుతోంది .

మహీ …… ఈ అందమైన అంతులేని సంతోషానికి కారణం ? అంటూ నుదుటిపై పెదాలను తాకించాను .
తలెత్తి నా కళ్ళల్లోకే అంతులేనిప్రేమతో చూస్తూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి వర్తమానాన్ని నా చేతికి అందించి మురిసిపోతోంది .

” ప్రభూ ……. మీరు మీ దేవకన్యను చీకటిపడేలోపు తీసుకురావాల్సిన అవసరం లేదు – స్వయంవరం రోజు ఉదయం వరకూ ప్రకృతి ఒడిలోనే ఆనందంగా గడపవచ్చు – యువరాణీ స్థానంలో యువరాణీ వస్త్రాలలో చెలికత్తె మందాకిని పూజమందిరంలో భక్తితో పూజచేసుకోవడం చూసి , రాజమాత భంగం కలిగించకుండా యువరాణీ కోరిక ప్రకారం స్వయంవరం వరకూ దేవుడి సన్నిధిలోనే ఉండనివ్వండి అని సంతోషంగా చెప్పి వెళ్లిపోయారు . కాబట్టి మహీ …… స్వయంవరం వరకూ అంటే రాబోవు మూడు రాత్రులూ మీ ప్రియాతిప్రియమైన దేవుడి సన్నిధిలోనే ప్రేమను పొందగలరు – ఇట్లు మీ చామంతి ??? ”

ఆనందపు పరవళ్లు తొక్కుతున్న దేవకన్య నుదుటిపై అంతే సంతోషంతో ముద్దుపెట్టాను – చివరికి దేవకన్య కోరికనే తీరబోతోంది – ఓకేఒక్కసారి కాదు మహీ ……. నీ తనివితీరేంతవరకూ జలపాతపు అమ్మ ఒడిలో సేదతీరుదాము .
మహి : నిజమా ప్రభూ ……. ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులవర్షం కురిపిస్తోంది .
మంజరీ ……. మన దేవకన్యతోపాటు జలకాలాటకు సిద్ధమా ? .
మంజరి : అంతకంటే అదృష్టమా ప్రభూ …… కానీ ఈ సమాచారం మీకు చేర్చానో లేదో అని చామంతి తెగ కంగారుపడిపోతూ ఉంటుంది , నేను ఇప్పుడు వెళ్లి ఉదయపు సమాచారంతో వచ్చేస్తాను – ఖచ్చితంగా వెళ్ళాలి అనుమతి ఇవ్వండి ప్రభూ ……
మంజరీ …… ఈ చీకటిలో వెళ్ళనివ్వను అంటూ గుండెలపై హత్తుకున్నాను .
మహి …… నా బుగ్గపై ముద్దుపెట్టి మంజరిని స్పృశిస్తోంది.
మంజరి : ఈ ప్రేమ చాలు ప్రభూ ……. అదృష్టవంతురాలిని – జాగ్రత్తగా వెళతాను కదా ……. , వెళ్ళాలి లేకపోయుంటే మా దేవుడిని వదిలి వెళ్లగలనా చెప్పండి .
మంజరీ …… ప్రవాహం మీదనే వెళ్ళాలి – ప్రవాహాన్ని తప్పించి ప్రక్కకు వెల్లనేకూడదు సరేనా ……. , అమ్మా …… జాగ్రత్తగా రాజ్యం చేర్చండి అంటూ దేవకన్యతోపాటు నీళ్ళల్లోకి చేరాము – దోసిల్లోకి నీళ్లు తీసుకుని తాగించాను .
మహి : ఆనందించి , దేవుడా ఒక్కనిమిషం అంటూ ఒడ్డున ఉన్న కృష్ణదగ్గరికివెళ్లి సంచీలోనుండి బుజ్జి జింకల చిత్రపట్టాన్ని తీసుకొచ్చి మంజరి పాదంపై ఉంచి , ప్రవాహం మీదుగానే వెళ్లు మంజరీ అంటూ ముద్దుపెట్టింది .
అలాగే అన్నట్లు మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి సంతోషంతో ఎగిరివెళ్లిపోతోంది .

చీకటిలోనే అల్లంతదూరంలో మంజరి ఎగురుకుంటూ వెళ్లిపోవడం చూసి , కంగారుపడకండి దేవుడా ……. అది పెరిగిందే అడవిలో జాగ్రత్తగా వెళుతుందిలే అంటూ నామీదకు జంప్ చేసి మంజరివైపే చూస్తున్న కళ్ళవైపు ముద్దులుపెట్టింది మహి .
నా దేవకన్యను చేరేముందు అడవిలోనే అన్నమాట అయితే కంగారుపడాల్సిన అవసరం లేదు , అడవి తల్లి – నదీ అమ్మ జాగ్రత్తగా రాజ్యం చేరుస్తారు అంటూ పెదాలపై చిరునవ్వుతో దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : ఇక రాజ్యానికి వెళ్లాలన్న హడావిడి లేదు కదా దేవుడా …… ? .
లేనేలేదు – నా ముద్దుల దేవకన్య ఇష్టం వచ్చినంతసేపు జలపాతపు అమ్మ ఒడిలో జలకాలాడవచ్చు .
మహి : మరి ఇంకా ఇక్కడే ఆగిపోయారే అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి తీసుకెళ్లండి అంటూ గోలగోలచేస్తోంది .

నవ్వుకుని , నోరూరుస్తున్న దేవకన్య పెదాలపై లేలేత ముద్దులు కురిపిస్తూ నడుములోతులో ఉన్న నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్లి రాళ్లపైకి చేరి అందమైన చిన్న జలపాతం కిందకు చేరుకున్నాము .
క్షణక్షణానికీ చల్లగా మారిపోతున్న వాతావరణానికి తోడు అంతకంటే చల్లనైన నీళ్లు ఒంటిపై పడగానే ఇద్దరమూ ఒకేసారి నిట్టూర్చుతూ వెచ్చదనం కోసం ఏకమయ్యేలా అల్లుకుపోయాము – ఇద్దరి పెదాలు అయితే శ్వాసపీల్చుకోవడం కూడా మరిచిపోయినట్లు ఏకమైపోయాయి .

1309550cookie-checkజనం మెచ్చిన రాజు – Part 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *