జనం మెచ్చిన రాజు – Part 8

Posted on

ఒక్కనిమిషం ఒక్కనిముషం దేవుడా అంటూ నా పెదాలపై చిరుముద్దుపెట్టి కిందకుదిగింది – చామంతీ చామంతీ …… మన రెండవ వీరాధివీరుడికి ఆహారం తీసుకొచ్చారా లేదా ……
చామంతి : తీసుకురాకుండా ఎలా ఉండగలం మహీ …… , ఉద్యానవనంలో తాజాగడ్డి ఉంది , ఇప్పుడు మొక్కజొన్న గింజలు – శనగ గింజలు – ఉలవలు తీసుకొచ్చాము .
మహి : మా మంచి చామంతి అంటూ ప్రక్కనుండి చుట్టేసి వదిలి , పరుగునవచ్చి నా మీదకు చేరింది .
అమ్మో ……. అంటూ గుండెలపై హత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ మిత్రుడి దగ్గరికి చేరుకున్నాము .

మహి …… నాబుగ్గను కొరికేసి కిందకుదిగివెళ్లి , మిత్రమా …… మీ నుండి మీ మిత్రుడిని చాలసేపే దూరం చేసాను మన్నించు ……..
నాకూ ఇష్టమే అన్నట్లు మహిని నా కౌగిలిలోకి తోసాడు .
మహి సంతోషంతో కృష్ణను ఆప్యాయంగా నిమిరి , కృష్ణ ముందు అన్నిరకాల ధాన్యాలను ఆహారంగా ఉంచింది .
మహి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , ఒక పాత్రలో వంటలను వడ్డించుకుని తినిపించాను .
మహి : ఊహూ …… ముందు నా దేవుడు అంటూ పాత్రను చేతిలోకి తీసుకుని ప్రేమతో తినిపించింది – దేవుడా తిను ……. ఒకరోజంతా మీరుకూడా తినలేదని నాకు తెలుసులే ……
ఎలా తెలిసింది మహీ …….
మహి : ఒకరోజంతా తినకపోతే హృదయస్పందన ఎలా ఉంటుందో నాకు తెలిసింది కదా …… , పాత్రను కింద ఉంచి తన చేతిని ….. నా హృదయంపై – నా చేతిని అందుకుని తన హృదయంపై వేసుకుని ఓకేవిధంగా ఉంది కదా అంటూ నవ్వుతూ చెప్పింది .
మహి నుదుటిపై ముద్దుపెట్టి , అవును నిజమే ……. యువరాణి త్వరగా కోలుకోవాలని ఉదయం నుండీ …… , ఎంతైనా దేవకన్య కదా పసిగట్టేసింది .

ఒక్కసారిగా కళ్ళల్లో తియ్యనైనకోపంతో నా ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి , అలక చెందినట్లు ఎదురుగావెళ్లి గడ్డిపై కూర్చుంది .
నవ్వుకుని , కింద ఉంచిన భోజన పాత్ర అందుకునివెళ్లి మహి ముందు కూర్చున్నాను – మహీ …… ఆకలేస్తోంది .
మహి వెంటనే పాత్ర అందుకుని అలకతోనే తినిపించింది .
తిని , మహికి తినిపించి ఈ అందమైన అలకకు కారణం ఏమిటో …….
మహి : యువరాణి యువరాణి యువరాణి …… , ఒక్క స్పర్శతో మీ వొళ్ళంతా జలదరింపులు వేడిసెగలు పుట్టించిన నాపై ఎటువంటి ప్రేమా లేదు …….
అమ్మాయిలు అమ్మాయిలకు ఈర్ష్య అసూయలు ఉంటాయని విన్నాను కానీ , ఈ దేవకన్యపై దేవకన్యనే అసూయపడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే – అలకలోకూడా ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా ఉమ్మా …….
మహి పెదాలపై అందమైన నవ్వులు …… , ఏకంగా నామీదకు ఎగబ్రాకి ఒడిలో కూర్చుని , తింటూ ప్రేమతో తినిపించింది .
మహీ …… మీ స్నేహితులను కూడా తినమని చెప్పు ……
మహి : ఇకపై నాకు – వారికి రాజు మీరే , మీరే చెప్పండి ప్రభూ …….
” రాజు ” – ” ప్రభువు ” ……. అంటూ ఆనందబాస్పాలతో మహివైపే ప్రాణంలా చూస్తున్నాను .

మహి : అతిత్వరలో నాకు మాత్రమే కాదు ప్రజలందరికీ ప్రభువు కాబోతున్నారు – గురువుగారి కోరికను తీర్చబోతున్నారు .
నీ మాటలు వింటుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది యువరాణీ …….
మహి : అయితే …….
అయితే ……..
మహి : అయితే …… అంటూ నా ఎడమ చేతిని ఎడమచేతితో అందుకుని నాకళ్ళల్లోకే శృంగారం ఒలకబోస్తూ చూస్తూ వేళ్లపై ఒక్కొక్క ముద్దుపెడుతోంది .
ఆఅహ్హ్ ….. అలా చూడకు దేవకన్యా , వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది అంటూ నుదుటితో నుదుటిపై తాకించాను .
మహి : స్స్స్ …….
చిరునవ్వులు చిందిస్తూ ముద్దలు తినిపించాను .

తృప్తిగా తిన్నాము – దేవుడా …… ఉద్యానవనం అంటే ఇష్టం అన్నారుకదా చుట్టూ చూయిస్తాను రండి …….
అంతకంటే ఆనందమా మహీ …… అంటూ ఎత్తుకోబోయాను .
మహి : యే యే ….. ఉమ్మా ఉమ్మా ….. ఇప్పుడు వద్దులే దేవుడా , నా దేవుడి చేతిని చుట్టేసి నడవాలని ఆశకలిగే ఉద్యానవనం చూయించాలనుకున్నాను అంటూ రెండుచేతులతో నాచేతిని చుట్టేసి భుజంపై తలవాల్చింది .
మహి కురులపై ముద్దుపెట్టి ఉద్యానవనంలో నడిచాము .
ఉద్యానవనం అందాలు – చిన్నప్పటి నుండీ ఉద్యానవనంలో అనుభూతులను చెబుతుంటే …….
మహి సంతోషాన్ని హృదయమంతా నింపుకుంటున్నాను .
మహి : నేను చెప్పేది వినడం లేదు అంటూ మళ్లీ అందమైన అలక …….
అలకలోకూడా ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను – నా దేవకన్య సంతోషంలో …… వినడం కాదు కళ్లారా తిలకించాను – అత్యద్భుతం అంటూ అమాంతం ఎత్తుకున్నాను .
మహి : అయ్యో …… అనవసరంగా కోప్పడ్డానే , పెద్ద శిక్షనే పడాలి వంద ముద్దులు అంటూ ముఖమంతా కురిపిస్తోంది మధ్యమధ్యలో బుగ్గలను కొరికేస్తోంది .
ఈ శిక్షలో నాకూ భాగం అన్నమాట అంటూ నవ్వుకున్నాము .

చెలికత్తెలు : మహీ …… మాకు నిద్రవస్తోంది మేమువెళ్లి పడుకుంటాము .
మహి : వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్లిపోండి .
చెలికత్తెలు : ఇన్నిరోజులూ …… మీ కలల రాకుమారుడిని కలవరిస్తూ మమ్మల్ని నలిపేసేవారు ఇప్పుడైతే ఏకంగా దేవుడే దిగివచ్చారు కదా ఇక మాతో పని ఏముంది ……..
మహి ముసిముసినవ్వులు నవ్వుతోంది .

ఇంత అందమైన – సుగుణాల రాశి యువరాణీగా ఉండటం ఈ రాజ్యం అదృష్టం , ఆ అదృష్టం మొత్తం నా సొంతమవడం …… అంటూ మురిసిపోతూ ప్రాణంలా హత్తుకున్నాను . చామంతీ చామంతీ …… ఆగండి ఆగండి ఒక్క నిముషం , మహీ ……. నాకు ప్రకృతిలో పడుకోవడం అలవాటు …….
మహి : అంటే వెళ్లిపోతారా అంటూ భద్రకాళీ కళ్ళతో చూస్తోంది .
భయపడి , లేదు లేదు లేదు ఉద్యానవనంలోనే పడుకుంటాను అని చెప్పబోతున్నాను మహీ …….
మహి : అలా అయితే సంతోషమే ……. , ఉద్యానవంలో పడుకోవడం కోసం వాళ్ళను ఎందుకు ఆపడం , మనకు అడ్డు కదా …….
చెలికత్తెలు : అంతేలే మహీ …… అంటూ నవ్వుకుంటున్నారు .
అధికాదు మహీ …… నువ్వుకూడా ……
మహి : నేను కూడా …….
అదే అదే నువ్వుకూడా వెళ్లి లోపల మెత్తనైన పాన్పుపై హాయిగా పడుకో , నేనిక్కడ ……..
మాటలు కూడా పూర్తికాకముందే దెబ్బలవర్షం కురుస్తోంది – కళ్ళల్లో చెమ్మ ……. , దేవుడా చెప్పానుకదా ఇకనుండీ మీరే …… నా సర్వస్వం , కష్టసుఖాలన్నీ మీతోనే అనిచెప్పానుకదా …… , నా దేవుడి గుండెలపై హాయిగా నిద్రపోతానని ఇంతకుముందే చెప్పానుకదా ……. , మీరు వెళ్లండే …….
మన్నించు మన్నించు యువరాణీ …… , నా దేవకన్య కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా నా ప్రాణం …….
మహి ….. నా నోటిని మూసేసి ఊహూ అంటూ వదలనంతలా అల్లుకుపోయింది .
ఆనందించి , ఒక్క నిమిషం కిందకుదిగు మహీ …….
మహి : ఊహూ ఊహూ …… అంటూ మరింత గట్టిగా చుట్టేసింది – భుజంపై కొరికేస్తోంది .
స్స్స్ స్స్స్ …… నవ్వుకున్నాను , పంపించడానికి కాదు మహీ , ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం అంటూ చామంతి చెంతకు చేర్చాను . నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , పూలవనం దగ్గరికివెళ్లి పూలన్నీ సమకూరుస్తున్నాను .
నన్నుచూసి మహి – చెలికత్తెలు వచ్చి , ఎందుకు ఏమిటి అని అడగకుండా పెద్దమొత్తంలో పూలు కోశారు .
బుట్టలలో పూలను తీసుకునివెళ్లి పూలవనం మధ్యలోని గడ్డిపై పూలతో పాన్పును తయారుచేసాను .
మహికి ఎందుకో అర్థమై చామంతిని చుట్టేసి ప్రేమతో నావైపే చూస్తోంది .
మహీ మహీ …… అంటూ చెలికత్తెలంతా ఆశ్చర్యపోయారు .

దివినుండి దిగివచ్చిన దేవకన్యా ……. అంటూ చేతిని చాపాను .
మహి : ఇక మీరు వెళ్లండే అంటూ తోసేసి , క్షణంలో నా కౌగిలిలోకి చేరిపోయింది .
సుకుమారంగా పెరిగిన యువరాణీని నేలపై పడుకోనిస్తానా అంటూ కురులపై ముద్దుపెట్టి హత్తుకున్నాను .
అప్పటికే కృష్ణ దూరంగా పడుకోవడం చూసి ఆనందించి , ఇద్దరమూ పూలపాన్పుపైకి చేరాము .
మహి : దేవుడా ……. వొళ్ళంతా సీతాకోకచిలుకలు ఎగురుతున్నంత సంతోషం కలుగుతోంది అంటూ అంతులేని ఆనందంతో పులకించిపోతూ నా గుండెలపైకి చేరింది . దేవుడా …… మీ చిన్నప్పటి సంగతులు వింటూ నిద్రపోవాలని ఉంది .
యువరాణి ఆజ్ఞ వెయ్యడం – నేను చెప్పకపోవడమూనా అంటూ రెండుచేతులతో చుట్టేసి ముద్దులుపెడుతూ నవ్వుకుంటూ హాయిగా నిద్రలోకిజారుకున్నాము …………..

1309130cookie-checkజనం మెచ్చిన రాజు – Part 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *