“హేయ్… ఏం చేస్తున్నావ్” అంటూ నేను తన చేతులు తోసెయ్యతానికి ప్రయత్నించాను.
వేసుకున్న టాప్ లైట్ ఫాబ్రిక్ కావటం తో, నా భుజాలకి తన చేతుల వెచ్చదనం తెలుస్తోంది.
“రిలాక్స్, ఏం చెయ్యాలో నాకు తెలుసు” అంటూ ఉదయ్ తన రెండు బొటన వేళ్ళని, వెన్నెముక వైపు జరిపి గట్టిగా వత్తాడు.
“ఓహ్…” అంటూ మూలిగాను నొప్పి తో.
“మొదట కాసేపే నొప్పి గా వుంటుంది. అంతే..”
తను అన్నట్టు గానే, కాసేపటికి నొప్పి తగ్గి రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఉదయ్ వేళ్ళు ఎక్స్పర్ట్ గా నా మెడ నరాల్ని, నాట్స్, మజిల్స్ ని జంటిల్ గా మసాజ్ చేస్తున్నాయి.
“మ్.. చాలా రిలాక్సింగ్ గా వుంది” సన్న గా మూలుగుతూ మెడ వెనక్కి వాల్చాను.
ఉదయ్ నెమ్మది గా తన వెళ్ళని నా మెడ నించి భుజాల అంచుల వైపు కదుపుతూ కంటిన్యూ చేసాడు.
“ఎక్కడ నేర్చుకున్నావ్, ఇవన్నీ?”
“నా పద్ధతులు నాకున్నాయి, సీక్రెట్..” అన్నాడు గుసగుసలాడుతున్నట్టు, తన ముఖాన్ని నా చెవి దగ్గరికి తెచ్చి.
కళ్ళు తెరిచాను. మెడ వెనక్కి వాల్చి ఉండటం తో వెనకాల నిలబడ్డ తన ముఖం నా ముఖం పైన ఎదురు గా కనిపిస్తోంది, తల్లకిందులుగా. తన కళ్ళు నా కళ్ళల్లోకి సూటి గా చూస్తున్నాయి. నేనూ తన కళ్ళల్లోకి చూపు తిప్పకుండా చూస్తూ ఉండి పోయాను. తన ముఖం నా ముఖానికి చేరువగా రావటం తెలుస్తూనే వుంది, కానీ ఎందుకో నా బ్రెయిన్ పని చెయ్యటం ఆగి పోయినట్టు అనిపించింది. లేక కావాలని పట్టించుకోవటం మానేశానో తెలీదు. తన దవడలు నా బుగ్గలకి దగ్గరై తన ఊపిరి వెచ్చగా నా గడ్డం మీద తగులుతోంది. ఇంకొద్ది క్షణాల తర్వాత ఉదయ్ పెదాలు సున్నితం గా నా పెదాల మీద వాలాయి.
తన వేళ్ళు నా భుజాల మీదే వున్నాయి, తను మసాజ్ చెయ్యట ఆపేసి కొన్ని క్షణాలు అయింది. తన పెదాల స్పర్స నా పెదాల మీద తెలుస్తోంది. కాలం స్తంభించినట్టు అనిపించింది. తను నెమ్మది గా నా పెదాలని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏ మూలో నా మనసు తనని వారించమని, తోసేయ్యమని చెబుతోంది. కానీ, నా పెదాలు నా మాట వినటం మానేశాయి. నా పెదాలు అతనికి చేరువ అవటం, నేను అతని పెదాల్ని ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నించటం తలుచుకుంటే నా మీద నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ముందు తనే తేరుకున్నాడు.
“సారీ.. నువ్వు చాల అందంగా వున్నావు.”
ఏమీ అనకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయాను. తను నా వైపు నించి రియాక్షన్ కోసం చూస్తున్నట్టున్నాడు. నేను నా రియాక్షన్ ఎలా వుండాలో తెలిసే పరిస్థితి లో లేను. నా బరువైన శ్వాస, ఎగిరే గుండె చప్పుళ్ళు మాత్రమె వినిపిస్తున్నాయి.