నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 13

Posted on

శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి తన మాటలను కొనసాగించాడు. “నువ్వు కఠినమైన వాడివి. అందులో సందేహం ఏమీ లేదు. యు ఆర్ సో స్ట్రాంగ్ అండ్ స్టబర్న్! అందుకే, నిన్ను టచ్ చేయటానికి కూడా ఎవరూ సాహసించరు. అయితే ఆ కఠినమైన పొర వెనక అతి సున్నితమైన, స్వచ్ఛమైన హృదయం ఒకటి దాగి వుందని… ఎవరికీ… ఎవరి వరకో ఎందుకు? పాపం… నీకే తెలీదు,” అని అజయ్ కళ్ళలోకి చూస్తూ, “ఈరోజు ఆ అమ్మాయి… సౌమ్య — ఆ విషయాన్ని నీకు తెలియజేసింది. నీ లోపలున్న ఆ మనిషిని వెలికితీసి నీకు తెలీని నిన్ను నీకు పరిచయం చేసింది. అందుకే…(అంటూ అజయ్ ఛాతీని తడుతూ) నీకు ఆ ప్రదేశం అంతా చాలా అల్లకల్లోలంగా మారింది—”
అజయ్ వింతగా శిరీష్ వైపు చూసి తలని అడ్డంగా వూపుతూ—
“చాలు గురూ… ఏదో అడిగావ్ కదాని జరిగిందంతా చెప్పాను. అంతదానికి ఇంత ఫిలాసఫీయా? నాలోంచి మరో మనిషిని వెలికితీయటం ఏమిటి గురూ… క్వారీలోంచి బొగ్గు తీసినట్టూ…! నువ్వు కనీసం ఆ అమ్మాయిని చూడనయినా లేదు. ఆమె గురించి ఏమీ తెలీదు. మళ్ళా నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందని అనేస్తున్నావ్…!” అన్నాడు.
శిరీష్ నిర్మలంగా నవ్వి, “చూసానుగా అజయ్… తన స్వభావాన్ని నీ మాటల్లో, తన పేరు పలుకుతున్నప్పుడు నీ కళ్ళల్లో కదలాడిన భావాలలో ఆమె నాకు ప్రస్ఫుటంగా కనపడింది!” అన్నాడు.
“ఎనఫ్… టాపిక్ మరీ ఓవర్ గా పోతోంది. నువ్వు ఇప్పటివరకూ చెప్పిన మొత్తం మేటర్ లో నాది గిల్టీ ఫీలింగ్ అని అన్నావే అది ఒక్కటే నిజం. ‘అంతకుమించి’ అంటూ నువ్వు చెప్పినవన్నీ వేస్టే… ఇక ఈ విషయం గురించి డిస్కషన్ ని ఆపేద్దాం గురూ…” అంటూ జేబులోంచి మరో సిగరెట్ తీసి వెలిగించబోయాడు. శిరీష్ ఇంకా ఏదో చెప్పేబోయేంతలో అజయ్ కి కాల్ వచ్చింది.
పాణీ ఫోన్ చేస్తున్నాడు.
అజయ్ కాల్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని, “హా… చెప్పు సౌమ్య! ఏఁ—” అంటూ వెంటనే నాలిక్కరుచుకున్నాడు.
“స్—సార్?” అవాక్కయ్యాడు పాణీ.
అజయ్ షాక్ కొట్టినవాడిలా అలా నిలబడిపోయాడు. మనసులో చూడకూడదు… చూడకూడదు అనుకుంటూ క్రీగంట శిరీష్ ని చూశాడు.
కోల్గేట్ యాడ్ లో సచిన్ లా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతున్నాడు శిరీష్. అతని మొహం లక్ష కేండిల్స్ వెలిగించినట్టుగా వెలిగిపోతోంది. అజయ్ తన వంక చూడ్డంతో కళ్ళెగరేసి సరదాగా నవ్వాడు.
ఇంతలో— “సార్…?” అంటూ పాణీ పిలుపు విన్పించడంతో అజయ్ కాస్త తడబడుతూ తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని, “హా… పా-పాణీ.. పాణి… చెప్పు! ఏంటి విషయం?” అని అడిగాడు. పాపని కిడ్నాప్ చేసినవాళ్ళు మళ్ళా ఫోన్ చేసి కొన్ని డిమాండ్స్ వినిపించారని పాణీ అజయ్ కి చెప్పాడు. అజయ్ ఓ ప్రక్క పాణీ చెబుతున్నది వింటున్నా మరో ప్రక్క అతని మనసులో చిన్న డిబేట్ నడుస్తోంది.
‘ఆమె పేరు తన నోటి వెంట ఎలా….ఎందుకు… వచ్చింది.? కొంపదీసి గురూ చెప్పినట్లు తను నిజంగా ఆమెను ప్రే-మ—? ఛ…ఛ… అదేమయి వుండదు. ఇంతసేపూ తాము ఈ టాపిక్కే మాట్లాడుకున్నందున అలా వచ్చేసుంటాది. అంతే! మరింకేం కాదు… కావటానికి వీల్లేదంతే!!’ అని తనని తాను సమాధానపర్చుకున్నాడు. మారధాన్ లో పాల్గొన్నట్టుగా తన గుండె వేగంగా కొట్టుకోవడం అతను గమనించకపోలేదు. బలంగా ఒకట్రెండుసార్లు ఊపిరి తీసుకుని వదిలాడు.
ఆనక, పాణీ చెప్పింది విని తదుపరి ఏమేం చెయ్యాలన్న సూచనలని అతనికి వివరించాడు అజయ్. అలాగే తాను ప్రొద్దున్న కోర్టులో సేకరించిన వివరాలను ఒకసారి పునఃపరిశీలించమని చెప్పాడు.
అజయ్ ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపూ శిరీష్ ఎక్స్-రే స్కాన్ చేసినట్టుగా పరీక్షగా అజయ్ నే చూడసాగాడు. ఎందుకో… ఆ చూపు అజయ్ ని బాగా ఇబ్బంది పెట్టేయటంతో అతడు మరో వైపుకి తిరిగాడు. ఓ పది నిముషాలు గడిచాక కాల్ ని కట్ చేసి ఫోన్ ని తిరిగి జేబులో పెట్టుకుంటూండగా—
“హ్మ్… సౌమ్యా—?? పేరు సౌమ్యంగా వున్నా ఆమె ప్రభావం మాత్రం నీపై చాలా తీవ్రంగా వున్నట్టు కనపడుతోంది అజయ్!” అన్నాడు శిరీష్ కొంటెగా.
అజయ్ ఠక్కున శిరీష్ వైపు తిరిగాడు. శిరీష్ చిద్విలాసంగా పిట్టగోడ మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు.
అజయ్ కాస్త తడబడుతూ, “అ-అదేం లేదు గురూ… ఏదో పొర-బాటుగా అలా వచ్చేసిందంతే…!” అన్నాడు మెల్లిగా.
అప్పుడే, గట్టి గట్టిగా అడుగుల చప్పుడు వినిపించడంతో తల త్రిప్పి మెట్ల వంక చూసారిద్దరూ. వాణీ వచ్చింది.
“అక్క మిమ్మల్ని భోజనానికి రమ్మందిహో!” అని చాటింపు వేసి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా క్రిందకి వెళ్ళిపోయింది తను.
శిరీష్ లేచి నిల్చొని, “హా… పదరా వెళ్దాం!” అని అక్కడున్న టీ గ్లాసులను పట్టుకుని మెట్లవైపు నడిచాడు. అజయ్ మౌనంగా అతన్ని అనుసరించాడు.

★★★

నాస్మిన్ ఇంటిలోపలికి అడుగుపెడ్తూ హాల్లో తన అన్న… కాదు కాదు… ‘ప్రియుడు’ సామిర్ ని చూసి వెర్రి ఆనందంతో దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. అతన్ని చూసిన సంతోషంలో ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి.
సామిర్ ని ఇంకా అలా పట్టుకునే కొంటెగా అతని మొహంలోకి తొంగిచూసింది. ఆర్నెళ్ళుగా ఆమెలో దాగివున్న కోరిక ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది సామిర్ కి. చప్పున తన మొహాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆనాడు తన చెల్లితో అనుకోకుండా ఏదో తప్పు జరిగిపోయిందనీ, మరలా అలా చెయ్యకూడదు అని అతను భావిస్తున్నాడు. ఆమె కౌగిలిని విడిపించుకుని, “ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్?” అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు.
నాస్మిన్ అతని ప్రవర్తన చూసి విస్తుపోయి, “మ్… బ్-బానే ప్రిపేర్ ఔతున్నా…!” అంది తత్తరపడుతూ.
అప్పుడే తన గదిలోంచి బయటికి వచ్చిన వాళ్ళ అమ్మ నాస్మిన్ ని చూసి, “హ్మ్… నాస్మిన్, వచ్చావా…! ఇంత ఆలస్యమైపోయిందేఁ…?” అని అడిగింది.
“అఁ… ప్-ప్రిన్సిపాల్ గారు హ్-హాల్ టికెట్లు ఈవేళ వచ్-చ్చేస్తాయి అని చెప్పడంతో ఇంతసేపూ ఎదురు చూసాను అమ్మీ… కానీ, చివరికి రేపు పొద్దున్న ఇస్తాను అని ఆవిడ అనేసరికి ఇంక తిరిగొచ్చేశాను,” అని తడబడుతూ అంది నాస్మిన్.
“హ్మ్… ఠీకే… భయ్యా వచ్చాడు కదాని వూరికే ఊసులేసుకోకుండా నీకేమైనా డౌట్లుంటే తన దగ్గర చెప్పించుకో!” అంది.
నాస్మిన్ నవ్వుమొహంతో తలాడించింది, సామిర్ ని ఓరకంట చూస్తూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *