ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Posted on

మెల్లిగా మొదలయి ఒక ప్రవాహంలా సాగిపోయిన అతని మాటలతో అతని వ్యక్తితంపై గౌరవం కలిగింది. అతను తన తల్లితండ్రుల మనోభావాల్ని పుస్తకం చదివినట్టు చెప్పడంతో అతని ఆలోచనా విధానం బాగా నచ్చింది. చాలా మంది మగవారు అమ్మాయి ఎంత బాగున్నా, వివాహం ద్వారా తాము ఎంత సుఖపెడతామా అని ఆలోచిస్తారు. అందులో తప్పేమి లేదు వారికి కావలిసినట్టు దొరికితే. అందరికి భిన్నంగా చేసుకునే అమ్మాయి కష్ట సుఖాలు, తాను అమ్మాయికి ఏమి ఇవ్వగలను అన్న అతని ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చింది. కాని ఆ పరిస్థితిలో ఏమి మాట్లాడిన ప్రయోజనం ఉండదని గ్రహించి,”థాంక్స్ అండి. మీ ఆలోచన విధానం బాగుంది. తర్వాత మాట్లాడదాం”, అంది ఇంకా సంబంధానికి తెరపడలేదని తెలియచేస్తూ.

అప్పటికే కాఫీ అవడంతో, ఇంకా సంభాషణ పొడిగించడం ఇష్టం లేక,”వెళదామండి. కింద ఎదురు చూస్తుంటారు”అని తనే దారి తీసాడు.

మాట్లాడకుండా గంభీరంగా వస్తున్న ఇద్దరినీ చూసి ఏమయి ఉంటుందా అనిపించింది రాజారావు దంపతులకు. కొంచెం వెనకగా వస్తున్న కూతురి వేపు చూసాడు ఏమైనా హింట్ ఇస్తుందేమోనని. చెయ్యి చూపించి తరువాత చెబుతా అన్నట్టు సైగ చేసింది కావ్య ప్రసన్నంగా. దాంతో కొంచెం సర్దుకొన్నాడు రాజారావు.

“రా బాబు కూర్చో. ఏమిటి ఇవ్వాళ్ళ నీ ప్లాన్”అన్నాడు మెల్లిగా అతని దగ్గర నుంచి ఏమైనా లాగుదామని.

“ఇక్కడ గాంధీ నగర్లో నా ఫ్రెండ్ పేరెంట్స్ ఉండాలి. వాళ్ళని కలిసి సాయంత్రం దుర్గ దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా. ఇప్పటికే చాలా సేపు అయ్యింది”, అన్నాడు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టు.

“నీ బిజినెస్ కార్డు ఏమైనా ఉంటే ఇవ్వు బాబు.”అన్నాడు తన కార్డు అందచేస్తూ.
శ్రీరామ్ ఇచ్చిన కార్డు తీసుకోని కావ్యకు ఇస్తూ, శ్రీరామ్ కి ఒక మిస్సెడ్ కాల్ ఇవ్వు అంటూ, “నీకు విజయవాడలో ఏమైనా అవసరం పడితే అమ్మాయికి గాని నాకు గాని ఫోన్ చెయ్యి బాబు.”
“అలాగే అంకుల్. మీ ఇల్లు చాలా బాగుంది. నైస్ మీటింగ్ యు”, అంటూ అందరికి నమస్కారం చేసి బయటకు నడిచాడు.

బయటకు వచ్చి కార్ ఎక్కి రివర్స్ చేసి వెళ్ళ బోతూ పోర్టికో కేసి చూసాడు. అక్కడ కావ్య కనిపించడంతో సభ్యతగా ఉండదని అద్దం కిందకు దించి బై అంటూ చెయ్యి ఊపాడు. ప్రతిగా తను చెయ్యి ఊపింది నవ్వుతూ.

ఆ నవ్వుకు అర్ధం ఏమై ఉంటుందా అన్న సందిగ్తతో గేర్ మార్చి ముందుకు పోనిచ్చాడు కార్ ను.

175742cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *