ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Posted on

“నేనే ఫోన్ చేసి కనుక్కుంటా”, అంటూ మొబైల్ తీసాడు.

“ఒక్క నిముషం. రేపు ఎలాగూ శనివారం. ఆయనకు కాలేజీ ఉండదేమో. మన పురుషోత్తమ రావు గార్ని పంపించి కనుక్కుంటే బాగుంటుంది కదా. ఆయన చెప్పిందాన్ని బట్టి అప్పుడు మీరు మాట్లాడొచ్చు.”

మధ్యవర్తి ద్వారా కనుక్కునే మంచి ఆలోచన తనకి ఇచ్చినందుకు అభినందనగా ఆమె చెయ్యి మృదువుగా నొక్కి, వెంటనే మధ్యవర్తికి ఫోన్ చేసి కాకినాడ వెళ్లి కనుక్కొని ఫోన్ చేయండని చెప్పాడు. అలాగే వాళ్ళ సంభందం అంటే తమకు బాగా ఇష్టంగా ఉందని కూడా నొక్కి చెప్పమన్నాడు.

అక్కడ ప్రసాద్ రావు దంపతులు కూడా రాజారావు దగ్గర్నుంచి కాని మధ్యవర్తి దగ్గరనుంచి ఫోన్ రాకపోతే కొంచెం ఆదుర్దా పడ్డారు. తనే చెబుతానన్నాడు, మరి వాళ్ళు తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అని ఒక డౌట్. పోనీ తనే చేద్దామా అని అనుకొన్నాడు ప్రసాద్ రావు. కాని కొడుక్కి ఇచ్చిన మాటతో ఆగిపోయాడు.

శనివారం సాయంత్రం మధ్యవర్తి వచ్చేసరికి ఇద్దరూ తేలిక పడ్డారు. అమ్మాయి వాళ్లు తమ సంభందం అంటే ఇష్టం ఉన్నట్టు చెప్పడంతో ఆనంద పడ్డారు. ఇంకో సారి అబ్బాయితో మాట్లాడి నేనే ఫోన్ చేసి చెప్తా అని మధ్యవర్తికి చెప్పడంతో, అతను సెలవు తీసుకోని, వెంటనే ఆ విషయాన్ని ఫోన్ లో చేరవేసాడు. అబ్బాయి తల్లితండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారని చెప్పడంతో హాయిగా నిద్రపోయాడు రాజారావు ఆ రాత్రి.

ఆదివారం ఉదయం ప్రసాద్ రావు ఫోన్ చేసి చెప్పాడు, “నేనే మీకు ఆదివారం చేద్దామనుకుంటున్నాను, ఖాళీగా ఉంటారు కదా అని. ఈ లోపులే మధ్యవర్తి వచ్చారు”అంటూ తన ఆలస్యానికి వివరణ ఇచ్చుకున్నాడు.

“పరవాలేదు. మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు”అన్నాడు కాబోయే వియ్యంకుడికి మరింత స్వేచ్ఛ, చనువు ఇస్తూ.

“మా వాడికి అన్ని చెప్పాము. మధ్యలో నేనెందుకు. మీరే మా వాడితో మాట్లాడి తేదీ, సమయం ఫిక్స్ చెయ్యండి.”అన్నాడు రాజారావు డైరెక్ట్ మాట్లాడితే శ్రీరామ్ కూడా అడ్డు చెప్పకుండా వెళతాడని.

“తప్పకుండా. ఇప్పుడే మాట్లాడతాను. మీరు అబ్బాయి నెంబర్ మెసేజ్ చెయ్యండి”, అంటూ ఫోన్ పెట్టి భార్యకు అప్డేట్ ఇచ్చాడు, కావ్య వినేలాగా.

ప్రసాద్ రావు దగ్గర నుంచి sms రాగానే శ్రీరామ్ కి ఫోన్ చేసి వచ్చే శనివారం ఉదయం పది తర్వాత వాళ్ళింటిలోనే కలుసుకునేట్టు ఫిక్స్ చేయారు. తమ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని రాజారావు ఆఫర్ చేసిన సున్నితంగా తిరస్కరించి అన్ని తాను చూసుకొంటానని చెప్పాడు. కాల్ అయిన వెంటనే తన కార్ లో వెడదామని డిసైడ్ అయ్యి, శుక్రవారం రాత్రికి హోటల్ క్వాలిటీ DV Manor హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు.

డేట్ ఫిక్స్ కావడంతో శనివారం కోసం ఎదురు చూడసాగారు అందరూ.

అబ్బాయికి, కావ్యకి నచ్చితే ఇక ఫిక్స్ చేయడమే తరువాయి కాబట్టి ఎందుకైనా మంచిదని రాజారావు హైదరాబాద్ లో ఉన్న తన క్లోజ్ కాంటాక్ట్స్ ఇద్దరికీ ఫోన్ చేసి శ్రీరామ్ వివరాలు చెప్పి జాగ్రత్తగా వాకబు చేయమన్నాడు. వాళ్ళ దగ్గరనుంచి కూడా అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో ఆ వివరాలన్నీ భార్య, కూతుళ్ళకి చెబుతూ తాను మనసులో ఆ సంభందం మీద ఫిక్స్ అయిపోయాడు.

వాళ్ళ పేరెంట్స్ వచ్చినపుడు సాంప్రదాయంగా తయారైన తను శ్రీరామ్ వచ్చినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచించింది. చివరకు చీర, జాకెట్ అయితే మంచిదని అమ్మతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చింది. తల్లి కూతుళ్లిద్దరూ కాచి వడపోసి ఒక చీర డిసైడ్ చేశారు. మొదట వీపంతా కనిపించే స్లీవ్ లెస్ డిజైనర్ జాకెట్ వేసుకొందామని అనుకొన్నా, మొదటి సారి అది ఎక్కువవుతోందేమో అని షార్ట్ స్లీవ్స్ కేవలం వీపు మధ్యలో నాలుగంగుళాల వృత్త భాగం మేర మాత్రమే కనిపించే జాకెట్ సెలెక్ట్ చేసింది.

మొదట స్నేహితుణ్ని తీసుకెళదామా అనుకొన్నా, తను సీరియస్ కాదు కాబట్టి ఒంటరిగా వెళ్ళటానికి ఫిక్స్ అయ్యాడు శ్రీరామ్. మొదట్లో ఈజీగా తీసుకున్న, అతనికి మొదటి పెళ్లి చూపులవ్వడం, పైగా తాను ఒక్కడే వెళ్లాల్సి రావడంతో విజయవాడకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందో అని టెన్షన్ గా అనిపించినా, తాను ఫార్మాలిటీ కోసం వెళుతున్నానని అనుకోడంతో నార్మల్ అయ్యాడు. పెళ్లి చూపుల తర్వాత విజయవాడలో ఏమి చెయ్యాలా అని ఆలోచించుకుంటూ హోటల్ గదిలో నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి రెండు సార్లు అనుభవం ఉండటంతో నార్మల్ గానే ఉంది కావ్య. కాకపొతే తల్లితండ్రులు ఈ సంభందం మీద బాగా ఆశ పెట్టుకొన్నారు. అబ్బాయి ఎలాంటివాడో అన్న ఆలోచనలతో నిద్దురలోకి జారుకొంది.

**************

అనుకున్నట్టుగానే మరుసటి రోజూ రాజారావు ఇచ్చిన అడ్రస్ ద్వారా వాళ్ళ ఇంటికి చేరుకొన్నాడు. ఇంటి బయట రాజారావు, జానకి అన్న పేర్లు లేకపోతె తాను తప్పు అడ్రస్ కి వచ్చానా అని అనుకొనేవాడే. తండ్రి ఇల్లు బాగా ఉందని చెప్పినా అంతపెద్దదని ఊహించలేదు. ముందుగానే చెప్పి ఉంచడంతో గేట్ తీసాడు సెక్యూరిటీ వాడు కార్ లో ఉన్న శ్రీరామ్ ని చూసి. లోపల పార్కింగ్ లో తన కార్ పార్క్ చేసి బయటికి దిగిన శ్రీరామ్ కి అక్కడ పోర్టికోలో ఉన్న బెంజ్, BMW లగ్జరీ కార్స్ చూసి, తన హుండాయ్ వెర్నా చూస్తే నవ్వు వచ్చింది. ఈ సంభందం తమ రేంజ్ కాదని ఆ క్షణమే ఫిక్స్ అయ్యాడు. పనివాడి ద్వారా అతని రాకను తెలుసుకున్న రాజారావు బయటకు వచ్చి సాదరంగా ఆహ్వానించాడు.

లోపలికి వెళ్లే సరికి అక్కడే ఉన్న జానకి, కావ్య లను పరిచయం చేసాడు. తమ ఇంట్లో చెల్లి పెళ్లి చూపుల తంతు అలవాటయిన శ్రీరామ్, కొంచెం సేపు అయిన తర్వాత కావ్యను పిలుస్తారని అనుకొన్నాడు. కాని అలా ఇన్ఫార్మల్ గా పరిచయం చేయడం నచ్చింది. ప్రతి నమస్కారాలు అయిన తరువాత కూర్చున్నారు.

తరువాత సంభాషణ ఎక్కువ రాజారావు నడిపించాడు. చదువు, హాబీలు, జాబ్ గురించి అడుగుతుంటే చాలా విపులంగా జవాబులు చెప్పాడు. ముఖ్యంగా తన ఉద్యోగం గురించి చెప్పేటప్పుడు, టెక్నికల్ మాటలు వాడకుండా సాధ్యమైనంత వరకు వాళ్లకు వివరించిన తీరు కావ్యకు బాగా నచ్చింది. అంతేకాకుండా మాట్లాడుతున్నంత సేపు తన తండ్రి వేపే చూస్తూ మాట్లాటడం గమనించింది. కొంత సేపు అలా మాటలు సాగిన తరువాత భార్య సైగ చేయడంతో కూతురి వేపు తిరిగి, “కావ్య, శ్రీరామ్ కి నీ గది చూపించు”అన్నాడు.

అస్సలు అది ఊహించని శ్రీరామ్ కి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయ్యింది. ఇక్కడే మాట్లాడదాం అందామనుకొనేలోగా కావ్య లేచి నిలబడటంతో గత్యంతరం లేక తను లేచి ఆమె వెనకాలే నడిచాడు. ఆ ఇంటి లోపల పరిసరాల్ని గమనిస్తూ ఆమె వెనక నడవసాగాడు. మెట్లు ఎక్కగానే అక్కడ ఒక గోడకి నిలువెత్తు అద్దం ఉంది. ముందుంగా మెట్లెక్కిన కావ్య కొంచెం పక్కకు జరిగి అద్దంలో తన వెనక వస్తున్న శ్రీరామ్ కేసి చూసింది.

175742cookie-checkఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *