సంగీత: అది ఎవరు రాసారు?
మదన్: ఏది?
సంగీత: ఇందాక మీరు పంపిన కవిత్వం..
మదన్: ఎవరో పంపిన msgs forward చెయ్యడం నాకిష్టముండదు..నేనే రాసాను..
సంగీత: చాలా బాగా రాసారు..
మదన్: Thank you..
సంగీత: మొన్న msg చేసినప్పుడు డ్యూటీ లో ఉన్నా అన్నారు కదా …ఏం జాబ్ చేస్తారు మీరు…
మదన్: HSBC లో జాబ్ చేస్తున్నా..మీరేం చేస్తున్నారు..?
సంగీత: ఇంజనీరింగ్ 3rd year…హైదరాబాద్ ప్రియాంక కాలేజ్
మదన్: మీ పేరు చాలా బాగుంది..నాకు చిన్నప్పట్నుంచి music అంటే ప్రాణం..కానీ పరిస్థితులు అనుకూలించక శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేకపోయాను..
సంగీత: మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు..
మదన్: నేను టెన్త్ క్లాసు వరకు తెలుగు మీడియం లో చదువుకున్నా..ఎందుకో చిన్నప్పట్నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం..
సంగీత: any way…నాకు కొంచెం పని ఉంది. Catch you later bye….
మదన్: Ok bye….
evining 8 దాటిన తర్వాత….
మదన్: still busy?
సంగీత: మూవీ చూస్తున్నా…
మదన్: ఏం మూవీ?
సంగీత: “అతడు”..నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఇప్పటికి ఈ మూవీ 10 టైమ్స్ చూసాను..
మదన్: ya its a good movie…సరే.. 10 టైమ్స్ చూసాను అంటున్నారు కాబట్టి నేనొక question అడుగుతా…
అందులో పిల్లగాలి అల్లరి సాంగ్ ఉంది కదా…ఆ పాట అర్ధం చెప్పుకోండి చూద్దాం…అందులో కాస్త సైన్స్ కూడా ఉంది…
సంగీత: ఏదో పాటలు వినేస్తాం గాని వాటి meanings గురించి పట్టించుకోం కదా…
మదన్: ఆలోచించండి..ఒకవేళ మీరు చెప్పలేకపోతే రేపు నేనే చెప్తాను…
DAY-4
సంగీత: గుడ్ మార్నింగ్…
మదన్: గుడ్ మార్నింగ్..ఏంటి అర్ధం తెలిసిందా?
సంగీత: Hmmm… నేనొకటనుకున్నాను…కానీ అది అంత కరెక్ట్ అని నాకనిపించడం లేదు..మీరే చెప్పండి…
మదన్: మూవీ లో త్రిష , మహేష్ బాబు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా అల్లరి చేస్తుంది..కొంచెం ఫొజ్ కొడుతుంది…చూస్తాడు చూస్తాడు..ఇంక ఏదొక విధంగా బుద్ది చెప్పాలనుకుంటాడు..అందుకే అందంగా లేవంటాడు..మీకు వర్షం కురిసే procedure తెలుసుగా..నీరు ఆవిరైపోయి ఆకాశం లోకి వెళ్లి కారు మేఘంగా మారుతుంది..కారు మబ్బు ఎప్పుడు కరకు తనానికి symbol…ఆ మబ్బుని చల్ల గాలి తాకినప్పుడు వర్షం కురుస్తుంది…సిరివెన్నెల గారు మహానుభావుడు..మహేష్ బాబు కారుమబ్బు..త్రిష అల్లరి చేసే పిల్ల గాలి..
ఇప్పుడు చూడండి లిరిక్స్…పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా…కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా..ఎల్లలన్ని కరిగి ఝల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ..అందమైన సిరి వాన…శ్రియ ఘోషల్ అద్భుతంగా పాడింది…
సంగీత:oh my god.. ఇంత meaning ఉందా? మీరు నిజంగా సూపర్ అసలు..
మదన్: thank you so much..అది సరే గాని మనం ఈ అండి, మీరు అని బహువచనం మానేద్దాం…కాస్త ఇబ్బందిగా ఉంది..
సంగీత: అలాగే ఇంకేంటి చెప్పు…
మదన్: ఇంకేముంది..present ఉన్న హీరోస్ లో నాకు కూడా మహేష్ బాబు అంటే ఇష్టం…నిజంగానే “పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడు..”
సంగీత: ఇంకెవరిష్టం నీకు?
మదన్: కమల హాసన్…
సంగీత: మరి హీరోయిన్?