కార్ లో 30 నిముషాల్లో సూర్య ఆఫీస్ కి చేరుకుంది .అదే ఫస్ట్ టైం సూర్య ఆఫీస్ కి వెళ్లడం .ఆ వచ్చిన ఎగ్జిక్యూటివ్ సరాసరి MD గది దగ్గరికి తీసుకు పోయాడు .లోపల కూర్చోండి సార్ ఒక 5 నిముషాల్లో వస్తారు అని చెప్పాడు .
ఆ గది చాలా రిచ్ గా వుంది . ఆ టేబుల్స్ ,కూర్చీలు , గోడ పైన పెయింటింగ్స్ ,చల్లటి AC గాలి కి కొంచెం వణుకు వస్తుంది .
కొద్దిసేపటికి ఠీవి గా నడుచుకుంటూ వచ్చాడు ధర్మా సార్ .
లేచి నిలబడి నమస్కారం చేసింది హేమ .
కూర్చోమని కళ్ళ తో నే చెప్పాడు తాను సీట్ లో కూర్చుంటూ . ధర్మ కి పెద్ద వయసేమే కాదు .
జిమ్ బాడీ ఏమో అనుకుంది హేమ మనసులో .
ధర్మ మాట్లాడుతూ : చూడండి హేమ , మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్పే ముందు మీ భర్త గురించి ఎమన్నా విషయాలు మీకు తెలుసా?
తెలియదనట్టు గా తల ఊపింది హేమ .
ఒకే , మీ భర్త ఈ కంపెనీ అకౌంట్ నుండి 25 లక్షలు దొంగతనం చేసాడు .
(ఈ మాట వినగానే కాళ్ళ కింద భూమి కంపిస్తుంది )
యా ..నిజం. ఇది మీకు తెలియదన్న సంగతి కూడా మాకు తెలుసు . ఎంక్వయిరీ చేస్తే మీ భర్త ఒక పిచ్చి బాబా ని కలిసి మాయ లో ఆ డబ్బు ఇచ్చాడని తెలిసింది.
(ఈ మధ్య ఆ బాబా గురించిన మాటలు ఇంట్లో వింది )
కానీ మా కంపెనీ కి ఇవన్నీ సంబంధం లేదు కావలిసింది డబ్బు . నువ్వు కానీ నీ భర్త కానీ ఆ డబ్బు ని 3 డేస్ లోగా కట్టాలి .లేకుంటే పోలీస్ లకి , మా స్పెషల్ రికవరీ టీమ్ కి చెప్పవలసి ఉంటుంది .
హేమ కి కన్నీళ్లు ఆగట్లేదు . శరీరం అంతా వణికిపోతోంది . ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు. తల తిరుగుతున్నది .
అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చాడు ఆ కంపెనీ మరో MD రాజీవ్ .
హేమ రాజీవ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది . ఇతను నా డిగ్రీ క్లాసుమేట్ రాజీవ్ అవునా కాదా అనుకుంటూ .
రాజీవ్ హేమ ని చూసి , తాను కూడా ఎక్కడో చూసినట్టు గా నువ్వు హేమ కదూ అన్నాడు
అవును అంది కళ్ళు తుడుచుకుంటూ .
( రాజీవ్ హేమ కి ట్రై చేసేవాడు కాలేజీ టైం లో , కానీ హేమ తన బావ అయిన సూర్య తో లవ్ వల్ల accept చెయ్యలేదు సరికదా రాజీవ్ ని అవమానించింది . రోజీ మాడం తో రాజీవ్ కి వున్న సంబంధాన్ని బయటపెట్టింది )