ఈ రోజు దాన్ని కనీసం దగ్గరికి రానివ్వకూడదు అని నిర్ణయం తీస్కొని టిఫిన్ చేసి బస్టాండ్ కి వెళ్ళాను, అక్కడ ఒక అమ్మాయి పలకరించింది, ఓయ్ నువ్వు పాపారావు మావయ్య కొడుకే కదా అని, నేను హా అన్నాను, నేను నువ్వెవరు అని అడిగా. ఓయ్ ఏంటి నన్ను గుర్తు పట్లేదా నేను అనూష ని అన్నది. ఏ అనూష అన్నాను. నీ ఎంకమ్మ నేను నీ కావేరి అత్త కూతుర్ని అన్నది. అప్పుడు గుర్తొచ్చింది తను మా పెద్దత్త తోడికోడలు కూతురు అని.
నా కంటే చిన్నదే. ఎప్పుడో చూసాను మళ్ళీ ఇప్పుడే చూద్దాం బాగా ఎదిగిపోయావు అస్సలు గుర్తుపట్టలేదు అన్నాను. హ్మ్మ్ పోన్లే బావా ఇప్పటికైనా గుర్తు పట్టావ్ అన్నది. సరే ఎక్కడికి వెళ్తున్నావ్ అన్నాను, ఎక్కడికి ఏంటి మా అమ్మమ్మధీ ఏ ఊరే గా, సెలవులకు వచ్చా, ఇప్పుడు మా ఊరు వెళ్తున్నా అన్నది. నేను ఓహో అన్నాను. అవును మీ ఊరి రాయుడు గారు మనకి ఏం అవుతారు అని అడిగా, నాకు పెదనాన్న నీకు మావయ్య అని టక్కున అంది. వాళ్లకు పిల్లలెంతమంది అని అడిగా, ఇద్దరు ఆడపిల్లలు ఒకామె సునీత రాజమండ్రి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.
ఇక రెండవది నా క్లాస్మేట్ వినీల అని అన్నది. ఓహో అన్నాను, తను ఎందుకు అడిగావ్ అంటే, సునీత గారు మా కాలేజీ లో నే పని చేస్తున్నారు అన్నాను. వెంటనే తను ఏంటి నువ్వు గోదావరి కాలేజీ లో జాయిన్ అయ్యవా నేను మళ్ళీ ఏడాది అక్కడే జాయిన్ అవుతాను అన్నది, నేను ఓహో మంచిగా చదువు సీట్ వస్తుంది లే అన్నాను. ఇంతలో బస్సు వచ్చింది , ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. బస్సు పూతవరం చేరేంతవరకు అనూష లొడాలొడా వాగుతూనే ఉంది.