శ్రావణసమీరాలు

Posted on

నేను విసురుగా చూపుని వాడి వైపు నుండి పక్కకు తిప్పాను. కాసేపటికి ఆర్డర్ చేసిన ఐస్ క్రీం వచ్చింది. నేను ఏమి మాట్లాడకుండా తింటున్నాను. బావ నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు.
“అలా చూడకు దిష్టి తగులుతుంది” అన్నాను.
దాంతో బావ నావైపు నుండి చూపుని పక్కకు తప్పించాడు. నేను చిన్నగా నవ్వుకుని తింటున్నాను. కాసేపటికి తినేసి ఇద్దరం బయటికి వచ్చేశాం. అలా నడుచుకుంటూ నేనుండే హాస్టల్ దాకా వచ్చేశాం.
“సరే బై సమీర” అన్నాడు బావ.

“బై బావ” అని బావ చేతిలోని నా శారీ ఉన్న కవర్ ని తీసుకుని లోపలికి వెళ్లిపోయాను.
నేనుండేది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చి బాల్కనీ లోంచి నా రూంలోకి వెళ్తూ బయటికి చూడగానే బావ నన్ను చూసి నవ్వుతూ చేయి ఊపుతున్నాడు. నేను కూడా చేయి ఊపాను. బావ అక్కడ నుండి వెళ్లిపోయాడు. నేను కూడా నా రూంలోకి వెళ్లిపోయాను. కాసేపటికి వెళ్లి తినేసి బావ తిన్నాడో లేదో అడగాలనిపించింది. వెంటనే బావకు కాల్ చేశాను.
“చెప్పు” అన్నాడు కాల్ లిఫ్ట్ చేసి.

“తిన్నావా?” అని అడిగాను.
“హా….నువ్వు?” అని అడిగాడు.
“ఇప్పుడే తినేశా” అన్నాను.
“సరే వెళ్లి పడుకో. పొద్దున్నే కాలేజ్ కి వెళ్లాలి” అన్నాడు.
“గుడ్ నైట్” అని చెప్పాను.
“ఓకే” అంటూ ఫోన్ పెట్టేశాడు.
నేను దుప్పటి కప్పుకుని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నా. బావ ఏడవడం గుర్తొచ్చింది. ఆ ఏడుపుకు సంబంధించిన గతంలోకి జారుకున్నాను.

149530cookie-checkశ్రావణసమీరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *